ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
సాక్షి, కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, వెంటనే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇందిరా చౌక్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నగర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల అవుతాయని, 10 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళిత బంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. గొర్రెలు, బర్రెలు, దళిత బంధు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, నిధులు రావాలంటే ఉప ఎన్నిక రావాలన్నారు.
హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ ఇవన్నీ వస్తున్నాయని తెలిపారు. ఉపఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తారని, టీఆర్‌ఎస్ నాయకులకు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, ఎస్‌ఏ.మోసిన్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పరి రవి, చర్ల పద్మ, అబ్దుల్ రెహమాన్, మామిడి సత్యనారాయణరెడ్డి, కొమ్ము సునీల్, కమ్రుద్దీన్, కొరవి అరుణ్ కుమార్, కొలిపాక సందీప్, బోనాల శ్రీనివాస్, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ఇర్ఫాన్, సలీమొద్దీన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment