సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శనివారం ప్రకటిచారు. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలని సీఎం సూచించారు. దళితబంధు అమలు వేగవంతం చేయాని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలతో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని చూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు ఆమెదించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment