
సాక్షి, హైదరాబాద్: ‘దళిత బంధు’ పథకంపై ధాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్పష్టం చేశారు. లిస్ట్ ప్రకారమే విచారణ జరుపుతామని, అప్పటి వరకు ఆగాలని పిటిషనర్కు సూచించారు. కాగా హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదితరులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. అదే విధంగా అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారించాలని కోరారు. అయితే, సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా.. హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment