
ఫైల్ ఫొటో
సాక్షి, వరంగల్: టీఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని అన్నారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చని తెలిపారు.
దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయం అంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment