ప్రకాశ్ అంబేడ్కర్‌కు బుద్ధుని ప్రతిమను అందిస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో, వ్యవస్థలో, దేశంలో మార్పు కోసం భారతీయులు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకా శ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్ర హాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.
‘‘చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఏకమై సమాజంలో మా ర్పుకోసం పోరాటం చేయాలని అంబేడ్కర్ ఉద్భో దించారు. దేశంలో ఆర్థిక అంతరాలు, ఆర్థిక దోపిడీ ల గురించి అప్పట్లోనే ‘ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ అనే పుస్తకం రాశారు. దళితబంధు పథకం ద్వారా రూ పాయి రూపాన్ని మార్చేందుకు కేసీఆర్ ప్రయతి్నస్తున్నారు. దేశ ఆర్థిక దుర్భలతపై ఎలా పోరాడాలో చెప్పడంతోపాటు దళిత బంధు ద్వారా పేదరిక ని ర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అని ప్రకాశ్ పేర్కొన్నారు.
రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం
దేశంలో కేవలం మతపరమైన మైనారిటీలే కాకుండా కమ్యూనిటీ మైనారిటీలు కూడా ఉన్నారని అంబేడ్కర్ అప్పట్లోనే స్పష్టం చేశారని ప్రకాశ్ గుర్తు చేశారు. ధర్మం, జాతి పేరిట రాజకీయాలు జరిగే దేశంలో సహజ నాయకులు ఉండరని కూడా చెప్పారని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి తర్వాత అసలైన జాతీయ నాయకుడెవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం వస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు.
తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందని, దేశానికి మోడల్‌గా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని అంబేడ్కర్ చెప్పారని.. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉందని ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఈ డిమాండ్ నెరవేరాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం ఆతిథ్యం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచి్చన బాబాసాహెబ్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న ప్రకాశ్ అంబేడ్కర్‌ని కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. శాలువాతో సత్కరించి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్నా ధోంగే, సిద్దోజీరావు తదితరులున్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రకాశ్ అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: తమ తాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుషుల్లో సమానత్వం–ప్రకృతి సమతుల్యత కోసం పరితపించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఆయన జయంతి రోజున ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని బేగంపేటలో మొక్కలు నాటారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఒక మొక్క ను నాటాకే తన వద్దకు రావాలని కోరుకున్నారని ఆయన మనుమడు ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ తాత అంబేడ్కర్‌కు మొక్కలు నాటడం పట్ల అమితమైన ఆసక్తి ఉండేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చూస్తున్నామని పేర్కొన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు. ‘గ్రీన్ చాలెంజ్’లిమ్కాబుక్‌లో చేరడం తనకు ఆనందాన్ని కలిగించిందని, సంతోష్ కృషికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘దళితబంధు’ దేశానికే మార్గదర్శి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం దేశానికే మార్గదర్శి అని, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయాలని అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో దళితబంధు పథకం యూనిట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, విప్ బాల్క సుమన్ ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన హుజూరాబాద్ చేరుకున్న అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
దళితబంధు యూనిట్లను పరిశీలించిన అనంతరం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుంది. ఇది దేశంలోనే సరికొత్త పథకం. ప్రజలకు విద్యతోపాటు ఆర్థిక సాయం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం అభినందనీయం. మొన్నటిదాకా కూలీలుగా బతికిన వారంతా ఈ పథకం వల్ల ఇప్పుడు ఓనర్లుగా మారారు.
లబి్ధదారులతో మాట్లాడాను. ఇంత తక్కువ సమయంలో ఈ పథకం లబ్ధిదారులకు అందేలా శ్రమించిన సీఎం కేసీఆర్, జిల్లా అధికారులకు ధన్యవాదాలు. 70 ఏళ్లుగా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును నేను స్వయంగా చూశాను. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలి. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమైన ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. దేశంలో 30 శాతం వరకు ఉన్న అట్టడుగు వర్గాల వారికి సైతం ఈ పథకం వర్తింపజేయాలి. ఈ విషయాన్ని నేను సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తాను’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment