సాక్షి, హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌కు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ వర్తింపజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలన్నీ విజయవంతం అవుతున్నాయన్న ఆయన... ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతీ ఒక్కరు తమకు మద్దతు తెలపాలని కోరారు.
‘‘స్వపరిపాలన- ఆత్మగౌవరంతో బతకాలని, వనరులు అందరికీ అందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేశారో అవి నెరవేరడం లేదు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకునేలా చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా కేసీఆర్ సర్కారు ఖర్చు పెట్టడం లేదు. నిధులు ఖర్చు కాకపోతే.. క్యారీపార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అది కూడా జరగడం లేదు. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ నాంది పలికింది’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment