
హైదరాబాద్: మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ దళితులకు క్షమాపణ చెప్పాలని.. సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ.. ఇప్పటికైన ఈటల దళితుల నుంచి అక్రమంగా లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయాలని లేకుంటే ఆ భూముల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకానికి మద్దతుగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈటల చేస్తున్న మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీన ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment