Congress Leader Sarvey Sathyanarayana Praises KCR Over Dalita Bandhu - Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రశంసలు

Published Thu, Aug 12 2021 7:47 PM | Last Updated on Fri, Aug 13 2021 8:49 AM

Congress Leader Sarvey Sathyanarayana Praises KCR Over Dalita Bandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు కురిపిస్తుండగా.. మరోపక్క హస్తం పార్టీ ముఖ్య నేత ఒకరు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చిన దళితబంధు గొప్ప పథకమంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఒకరు ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు.

ఆ వివరాలు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ.. సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. దళిత బంధు చాలా గొప్ప పథకం అన్నారు సర్వే సత్యనారాయణ. దళితులు బాగుపడటానికి మంచి పథకం తీసుకొచ్చారని కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురపించారు. ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందంటూ అభినందించారు. ఓవైపు కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌పై కారాలుమిరయాలు నూరుతుంటే.. సర్వే మాత్రం ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే సర్వే కారు ఎక్కుతారా ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక సర్వే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సర్వే సత్యనారాయణను రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కలిశారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే సర్వే మాత్రం అధికారికంగా ఎక్కడా బీజేపీలో చేరలేదు. నిజానికి బీజేపీ నుంచి ఆయన రాజ్యసభ సీటు ఆశించారని... కానీ అందుకు హామీ లభించకపోవడంతోనే ఆ పార్టీలో చేరలేదనే ప్రచారం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement