సాక్షి, వీణవంక(హుజురాబాద్): మక్కల కొనుగోలు ప్రారంభోత్సవంలో భౌతిక దూరం పాటించలేదని, అక్రమంగా కేసు పెట్టారని మనోవేదనకు గురవుతూ వీణవంక మండలం హిమత్‌నగర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గెల్లు మల్లయ్య తన ఇంటిలో మౌన దీక్షకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా ఇందులో వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయం కలెక్టర్ శశాంక దృష్టికి వెళ్లడంతో భౌతిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో బెన్ షాలోమ్‌ను ఆదేశించారు. (బిజినెస్ మీటింగ్ కోసం వెళ్లి...చిక్కుల్లో)
అయితే సింగిల్ విండో డైరెక్టర్ గెల్లు మల్లయ్యపైనే కేసు నమోదు చేసి మిగతావారిపై కేసులు పెట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత వ్యవసాయాధికారి భౌతిక దూరంపై అవగాహన కల్పించాలని, కానీ తనపై ఏఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఈ విషయం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని వాపోయాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో తనతోపాటు ఉన్న మిగతావారిపై కేసులు పెట్టకుండా కేవలం తనపైనే కేసు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని, న్యాయం జరిగే వరకు మౌన దీక్షలో ఉంటానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment