సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు కేటీఆర్‌ను రాజకీయ వారసుడిగా చేసేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ డ్రామా కు తెరలేపారని టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపిం చారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలనే ఎత్తుగడలో భాగమే థర్డ్‌ఫ్రంట్ అని విమర్శించారు.
బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రం ట్ ఏర్పాటు నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకోవడం వెనుక కేటీఆర్ రాజకీయ భవిష్యత్తే కీలకమని ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఉనికి ఉండబోదని, ఎవరూ గుర్తించే స్థాయిలో కూడా ఆయన రాజకీయ ఎత్తుగడలు లేవని, నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు వత్తాసుపలికి ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు చేస్తే మద్దతు ఇచ్చేయడానికి ప్రజలేమీ అమాయకులు కాదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment