2019లో కేసీఆర్‌కి ఓటు వస్తే బీజేపీకి వేసినట్లే ? | Komatireddy Venkat Reddy Criticize On KCR | Sakshi
Sakshi News home page

2019లో కేసీఆర్‌కి ఓటు వస్తే బీజేపీకి వేసినట్లే ?

Published Sun, Jun 10 2018 10:23 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Komatireddy Venkat Reddy Criticize On KCR - Sakshi

సాక్షి, నల్గొండ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే థర్డ్‌ ఫ్రంట్ మొదలు పెట్టారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఆయన  శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో కేసీఆర్‌కి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. కేసీఆర్‌ మళ్ళీ అధికారంలోకి రావడానికే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తాని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు.

ముస్లింలకు ఇళ్లు, స్థాలాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో 40 వేల మంది ముస్లింలు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రంజాన్‌ దుస్తులు ఇవ్వడమేమిటని  ప్రశ్నించారు. దుస్తుల పేర్లతో ముస్లింలను మోసం చేస్తున్నారని కోమిటి రెడ్డి వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement