
ఒరిజనల్ టీఆర్ఎస్ నేతలు తిరగబడితే..
హైదరాబాద్: టీఆర్ఎస్ లో ఎంతో కాలంగా ఉండి పార్టీకి సేవ చేస్తున్న ఒరిజనల్ నేతలు తిరగబడితేనే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు దక్కకుండా ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డి శ్రీనివాస్(డీఎస్)ను ఉద్దేశిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శనాస్త్రాలు గుప్పించారు. డీఎస్ తన ఆత్మను నమ్ముకుని టీఆర్ఎస్ లో చేరబోతున్నారని మండిపడ్డారు.
ఒరిజనల్ టీఆర్ఎస్ నేతలు తిరబడితేనే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగ నేతలకు పదవులు దక్కకుండా ఉంటాయన్నారు. డీఎస్ ఒక కోవర్టు.. ఆయన కాంగ్రెస్ ను వీడటం సంతోషంగా ఉందన్నారు. బీసీల కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాని డీఎస్ చెప్పడం ఆత్మవంచనేనన్నారు. టీఆర్ఎస్ నష్టపోయింది బీసీలేని శ్రవణ్ పేర్కొన్నారు.