దాసోజు శ్రవణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : చట్ట సభలు, గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపి పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మరింత అణిచివేసే ధోరణిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దంగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేలా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52శాతం అని చెప్పి.. ఇప్పుడు 34శాతం అని తప్పుడు లెక్కలు చూపుతూ బీసీలకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నికులాల గణాంకాలను ఇంటింటికి తిరిగి మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఏ,బీ,సీ,డీ ఈ ప్రాతిపదికగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు అన్యాయం జరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా బీసీల రిజర్వేషన్ శాతాన్ని విడుదల చేయాలన్నారు. న్యాయం కోసమై బీసీ కులాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment