
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్‌ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు కత్తులు పట్టుకు తిరుగుతున్నట్లు అనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యా ఖ్యానించారు.
బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగడం సరైంది కాదన్నారు. నాలుకలు కోస్తామని టీఆర్‌ఎస్ నేతలు అంటు న్నారని, మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా? అని శ్రవణ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment