trs party leaders
-
ఏం మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు కత్తులు పట్టుకు తిరుగుతున్నట్లు అనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యా ఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగడం సరైంది కాదన్నారు. నాలుకలు కోస్తామని టీఆర్ఎస్ నేతలు అంటు న్నారని, మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా? అని శ్రవణ్ ప్రశ్నించారు. -
అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను సమన్వయపరిచి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసే విధంగా పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. శనివారమిక్కడ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో ఆయన భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులు, డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి ప్రభుత్వ పథకాలను మరోసారి గుర్తు చేస్తే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాజిరెడ్డి గోవర్ధన్, హరిప్రియ నాయక్, నన్నపనేని నరేందర్, రాములు నాయక్, దివాకర్ రావు, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పాల్గొన్నారు. -
నామినేషన్ల జోరు
సాక్షి, నిజామాబాద్: నామినేషన్ల పర్వం జోరందుకుంది. మూడో రోజు జిల్లావ్యాప్తంగా 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం మంచి రోజు కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బాన్సువాడ స్థానానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ స్థానానికి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ స్థానానికి బిగాల గణేశ్‌గుప్తా, ఆర్మూర్ స్థానానికి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోచారం ఉదయం సరస్వతి మాత మందిరం, అయ్యప్పస్వామి మందిరాల్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. మాతృమూర్తి పాపమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ గుర్తు అంబాసిడర్ కారులో బాన్సువాడ తహసీల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి లింబాద్రి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బాల్కొండ తహసీల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. భీంగల్ చర్చిలో ఫాదర్ ఆశీర్వాదం తీసుకున్నారు. బిగాల గణేశ్‌గుప్తా నిజామాబాద్ నగరంలో అయ్యప్పస్వామి, వాసవీకన్యకాపరమేశ్వరి మాత, విఠలేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అంబాసిడర్ కారును నడుపుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి కూడా టీఆర్ఎస్ పేరుమీద నామినేషన్ వేశారు. ఆర్మూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ ఆశించిన వెల్తుర్ల మల్యాద్రిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానానికి బహుజన సమాజ్‌పార్టీ అభ్యర్థిగా రమేష్ రాశమల్లు, బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా హెచ్ఎం ఇస్మాయిల్ మొహమ్మద్ నామినేషన్లు వేశారు. బోధన్ స్థానానికి శివసేన అభ్యర్థిగా పాసులోటి గోపికృష్ణ, ఆర్మూర్ స్థానానికి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగాఎస్ చరణ్‌కుమార్ నామినేషన్లు వేశారు. నేడు ఎంపీ కవితతో కలిసి.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ స్థానాలకు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు గురువారం మరోమారు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో.. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ రెండుసెట్లు వేశారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక నామినేషన్ దాఖలయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరపున ఆయన బంధువులు, పార్టీ నేతలు నామినేషన్ వేశారు. జుక్కల్ నియోకజ వర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థులుగా సౌదాగర్ గంగారాం, ఆయన భార్య సావిత్రి నామినేషనన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా శోభావతి షింధే, ఇండిపెండెంట్‌గా ప్రకాశ్‌నాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 12న మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. 19 వరకు కొనసాగనుంది. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని విషయం తెలిసిందే.. రెండో రోజు రెండు నామినేషన్లు రాగా.. మూడో రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. -
గులాబీ గుబాళింపు
2014 అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొట్ట తొలి ఎన్నికలు ఇవి. అలాగే, ఓ ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఎలక్షన్లు కూడా ఇవే. స్వరాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. కారు వేగానికి రాజకీయ ఉద్దండులెందరో ఓడిపోయారు. సీనియర్ నేతలు డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి తదితరులు పరాజయం మూటగట్టుకున్నారు. బాన్సువాడ.. ఐదోసారి పోచారం బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. 2009, 2011, 2014 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండోæ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. 1967, 1972, 78 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం.శ్రీనివాస్‌రావు హ్యాట్రిక్ సాధించిన తొలి ఎమ్మెల్యే కాగా, రెండో ఎమ్మెల్యే పోచారం. నియోజకవర్గంలో మొత్తం 1,79,416 మంది ఓటర్లు ఉండగా, 1,38,854 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాసుల బాల్‌రాజ్, టీడీపీ తరఫున బద్యానాయక్ రాథోడ్‌లు బరిలో నిలిచారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 65,868 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కాసుల బాల్‌రాజ్‌కు 41,938 ఓట్లు, బద్యానాయక్ రాథోడ్‌కు 19,692 ఓట్లు వచ్చాయి. 1313 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. 23,930 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పోచారం.. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ పోచారం మరోమారు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 65,868 కాసుల బాల్‌రాజ్ 41,938 మెజారిటీ 23,930 హ్యాట్రిక్ కొట్టిన ఏనుగు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లమడు గు సురేందర్, బీజేపీ నుంచి బాణాల లక్ష్మా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిద్ధార్థరెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థులుగా భట్టి నాగభూషణం, చిట్యాల సాయన్న పోటీ చేశా రు. ఏనుగు రవీందర్‌రెడ్డికి 70,760 ఓట్లు, నల్లమడుగు సురేందర్‌కు 46,751 బాణాల లక్ష్మారెడ్డికి 33,359 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాం గ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌పై 24,009 ఓ ట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డి 2009, 2010, 2014 వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి 70,760 నల్లమడుగు సురేందర్ 46,751 మెజారిటీ 24,009 రూరల్.. బాజిరెడ్డి డిచ్పల్లి: 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి డాక్టర్ భూపతిరెడ్డికి టికెట్ ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ సీఎం కేసీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికే, ఎన్నికల ప్రచారంలో మునిగిన భూపతిరెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. 2004లో కేశ్‌పల్లి గంగారెడ్డి కారణంగా ఎమ్మెల్యే టికెట్ దూరమైందని, ఇప్పుడు మరోసారి తనను కాదని బాజిరెడ్డికి ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో అసంతృప్తి వీడిన భూపతిరెడ్డి ఎన్నికల్లో బాజిరెడ్డికి సహకరించారు. ఆ ఎన్నికల్లో బాజిరెడ్డికి 78,107 ఓట్లు రాగా, డీఎస్‌కు 51,560 ఓట్లు పోలయ్యాయి. 26,547 ఓట్ల మెజారిటీతో బాజిరెడ్డి విజయం సాధించారు. తర్వాతి కాలంలో బాజిరెడ్డికి, భూపతిరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భూపతిరెడ్డి ఇటీవల రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్ సంపాదించి బాజిరెడ్డిపై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ 78,107 డి.శ్రీనివాస్ 51,560 మెజారిటీ 26,547 బాల్కొండలో భారీ మెజారిటీ మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన టీఆర్ఎస్కు 2014 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. ‘ప్రత్యేక’ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డికి 69,145 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్‌కు 32,897 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోనే 36,248 ఓట్ల భారీ మెజారిటీతో ప్రశాంత్‌రెడ్డి ఘన విజయం సాధించారు. నియోజకవర్గం ఆవిర్బవించిన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ రావడం ప్రశాంత్రెడ్డికే దక్కింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఈరవత్రి అనిల్ రెండో సారి పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేశారు. ఆయనకు కూడా ఇవే తొలి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి, ఓటమి పాలైన మల్లికార్జున్‌రెడ్డిలు బావ, బావమరిది కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ప్రశాంత్‌రెడ్డి రికార్డు సృష్టించారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ప్రశాంత్‌రెడ్డికి పేరుంది. ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి లభించింది. ఆయనకు నామినేటెడ్ పోస్టును కట్టబెట్టినా కేబినేట్ హోదా కల్పించి మంత్రిమండలి సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం మరో విశేషం. తాజా ఎన్నికల్లోనూ బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రశాంత్‌రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ప్రశాంత్‌రెడ్డి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రశాంత్‌రెడ్డి 69,145 ఈరవత్రి అనిల్ 32,897 మెజారిటీ 36,248 సింధే.. రెండోసారి నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటా పడేవి. అయితే, 2014లో తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. సెంటిమెంట్ కలిసి రావడంతో కారు జోరుకు ‘సైకిల్’ పంక్చర్ పడింది. కాంగ్రెస్ పార్టీ పరాజయం మూటగట్టుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మంత్ సింధే బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం పోటీ చేశారు. హన్మంత్ సింధేకు 72,901 ఓట్లు రాగా, గంగారాంకు 37,394 ఓట్లు వచ్చాయి. 35,501 ఓట్ల మెజారిటీతో సింధే ఘన విజయం సాదించారు. జుక్కల్ నియోజకవర్గ చరిత్రలో తెలుగుదేశం పార్టీ తరఫున మొదటిసారి, టీఆర్ఎస్ తరఫున రెండోసారి అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా సింధే రికార్డు సృష్టించాడు. హన్మంత్ సింధే 72,901 గంగారాం 37,394 మెజారిటీ 35,501 బోధన్.. మహ్మద్ షకీల్ బోధన్: 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ విజయం సాధించారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన షకీల్‌కు 67,427 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి 51,543, టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి 26,558 ఓట్లు వచ్చాయి. 15,884 ఓట్ల మెజారిటీతో షకీల్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొన్నా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. బోధన్‌లోని ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన షకీల్ 2001 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ çచేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్లో చేరిన ఆయన మహా కూటమి తరఫున టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన షకీల్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి చేతిలో అతి స్వల్ప (1,275) ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో షకీల్.. సుదర్శన్‌రెడ్డిని ఓడించి పైచేయి సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. మహ్మద్ షకీల్ 67,427 సుదర్శన్‌రెడ్డి 51,543 మెజారిటీ 15,884 కామారెడ్డి.. గంప గోవర్ధన్ కామారెడ్డి క్రైం: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉద్యమ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరిన గంప గోవర్ధన్‌కే నియోజకవర్గ ప్రజలు వరుసగా నాలుగో సారి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గంపకు ఈ ఎన్నికల్లో 71,961 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి 63,278 ఓట్లు వచ్చాయి. 6,683 ఓట్ల మెజారిటీతో గంప గోవర్ధన్ విజయం సాధించారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆయన ప్రభుత్వ విప్ అయ్యారు. అసెంబ్లీ రద్దు వరకు ఆయన ప్రభుత్వ విప్‌గా కొనసాగారు. గంప గోవర్ధన్ 71,961 షబ్బీర్ అలీ 63,278 మెజారిటీ 8,683 అర్బన్‌లో.. టీఆర్ఎస్ పాగా నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తొలిసారిగా పాగా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్ తరఫున బిగాల గణేష్‌గుప్తా, కాంగ్రెస్ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంఐఎం తరపున మీర్మజాజ్అలీ, బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తాకు 42,148 ఓట్లు రాగా, అనూహ్యంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి మీర్మజాజ్అలీకి 31,840 ఓట్లు సాధించి రెండో స్థానం నిలిచారు. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 10,308 ఓట్ల మెజారిటీతో గణేష్‌గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. గంప గోవర్ధన్ 71,961 షబ్బీర్ అలీ 63,278 మెజారిటీ 8,683 ఆర్మూర్‌లో.. జీవన్‌రెడ్డి ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై 13,964 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జీవన్‌రెడ్డికి 67,555 ఓట్లు రాగా, సురేష్ర్డెకి 53,591 పోలయ్యాయి. న్యాయవాదిగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటూ వచ్చారు. 2008లో ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నల గిట్టుబాటు ధర గురించి తలెత్తిన వివాదంలో రైతుల తరఫున అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, మంచి గుర్తింపు పొందారు. టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి కుటుంబం ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో స్థిరపడింది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ టీఆర్ఎస్ తరఫున మొట్టమొదటి టికెట్‌ను జీవన్‌రెడ్డికే కేటాయించారు. అప్పటి ఎ న్నికల్లో ఘన విజయం సాధించిన జీవన్‌రెడ్డి.. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జీవన్‌రెడ్డి 67,555 సురేశ్‌రెడ్డి 53,591 మెజారిటీ 13,964 -
అవినీతి నిరూపిస్తే రాజీనామా
ఖమ్మంఅర్బన్ : అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పాపాలాల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొన్ని రాజకీయ పక్షాలు పనికట్టుకుని పసలేని ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, తన హయాంలోనే ఖమ్మం రూపురేఖలు ఎలా మారాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మంజూరు చేయిం చామని, ఇందులో అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాగితాలపై రచించిన ఖమ్మం అభివృద్ధి పనుల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. తొలివిడతగా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం వద్ద 216 డబుల్ బెడ్రూం నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. పదేళ్ల క్రితం పట్టాలకే పరిమితం చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కూడా అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. నగరంలో రహదారులు, లకారం చెరువు అభివృద్ధి, కొత్త షాదీఖానా మంజూరు, గోళ్లపాడు చానల్ అభివృద్ధి, తాగునీటి పథకం ఇలా అనేక పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. 9న నలుగురు మంత్రుల రాక.. ఈనెల 9న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సలు చేసేందుకు మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుని.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పట్టాల పంపిణీ, కూరగాయల మార్కెట్, రోడ్ల విస్తరణ, డ్రెయినేజీ, షాదీఖానా, జిమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. టీటీడీసీ భవనంలో కార్పొరేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మధిర పర్యటనకు వెళ్లి.. సాయంత్రం 7 గంటలకు మమత మెడికల్ కళాశాల 20 ఏళ్ల సంబరాల వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, కొత్తపల్లి నీరజ, కర్నాటి కృష్ణ, మందడపు మనోహర్, కూరాకుల వలరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మందడపు సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందడపు నరసింహారావు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం, జెడ్పీటీసీ వీరూనాయక్ పాల్గొన్నారు. -
‘నామినేటెడ్’ నామమాత్రమే
నిరాశలో గులాబీ శ్రేణులు అవకాశం కోసం సీనియర్ల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: గులాబీ శ్రేణులు ఇంకా నిరాశలోనే మునిగి ఉన్నాయి. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్లకు చివరకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. వివిధ కార్పొరేషన్లు, మార్కెట్, దేవాదాయ, గ్రంథాలయ సంస్థల వంటి పదవులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కలిపి సుమారు 4 వేలకు పైగానే భర్తీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇంకా ఆచరణ రూపం దాల్చలేదు. టీఆర్ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా భర్తీ చేసిన రాష్ట్రస్థాయి పదవులు కనీసం ఇరవై కూడా లేవు. మరోవైపు ఇప్పటి దాకా భర్తీ అయిన పదవుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళ లేరు. దీనికితోడు దసరా సందర్భంగా ఒకేసారి 9 కార్పొరేషన్లను భర్తీ చేసిన సీఎం కేసీఆర్ మరికొన్ని సంస్థల గురించి ఇంకా దృష్టి పెట్టలేదని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల పాలక మండళ్ల భర్తీ ప్రక్రియ మొదలైనా చాలా చోట్ల ఎంపికలే జరగలేదు. అలాగే జిల్లా స్థాయిలోనే ఉండే దేవాదాయ కమిటీలకు నోటిఫికేషన్ జారీ అయినా ఇప్పటికీ భర్తీ ప్రకియ మొదలు కాలేదు. వేములవాడ, యాదాద్రి వంటి ఆలయాల పాలక మండళ్లకూ అతీగతీలేదు. దీంతో పదవుల కోసం ఎదురు చూస్తున్న పార్టీ సీనియర్లు, ఇతర ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. మరోవైపు పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమితులై కోర్టు తీర్పుతో ఆ పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర స్థాయి పదవులను ఆశించే వారి జాబితాలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండటంతో పదవులు ఎప్పుడు దక్కుతాయా అని ఎదురుచూస్తున్నారు. దీపావళికి పదవులు దక్కేనా? పార్టీ వర్గాల సమాచారం మేరకు దీపావళికల్లా మరికొన్ని కార్పొరేషన్ల పదవులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ విడతలో మిహ ళలు, ముస్లింలు, యువతకు అవకాశం దక్కుతుందని ఆ వర్గాలు పేర్కొం టున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్, స్త్రీ, శిశు సంక్షేమ రీజనల్ కమిటీలు, వక్ఫ్ బోర్డు, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ, వికలాంగ కార్పొరేషన్లు, హార్టీకల్చర్ కార్పొరేషన్, హుడా, హౌసింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఇంకా పాలక మండళ్ల భర్తీకి నోచుకోలేదు. దీంతో ఈసారి వీటిలో కనీసం కొన్నైనా భర్తీ అవుతాయని, మహిళలకు అవకాశం ఉంటుందంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్టీ 15వ ప్లీనరీ సందర్భంగా ఆర్టీసీ, మిషన్ భగీరథ వంటి సంస్థలకు ఇద్దరు ఎమ్మెల్యేలను అధినాయకత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్టును భర్తీ చేశాక, దసరా కానుకగా తొమ్మిది కార్పొరేషన్లను భర్తీ చేయడంతో కొందరు సీనియర్లను పదవులు వరించాయి. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు ద్వారా సభ్యులుగా ఇద్దరికి (పార్టీతో సంబంధంలేని తటస్థునికే చైర్మన్ పదవి లభించింది) అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్లు మరికొన్ని కార్పొరేషన్ల పదవులను దీపావళికి భర్తీ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. -
ఆయన చలవతోనే ప్రత్యేక రాష్ర్టం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తె లంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పూల మా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రా ష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్క ర్ ఆ రోజుల్లోనే చెప్పి రాజ్యంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచినట్లు తెలిపారు. అంబేద్క ర్ స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫౌండర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కోట్లకిషోర్, బెక్కంజనార్ధన్, పట్టణ మాజీ అద్యక్షుడు కృష్ణముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శివరాజు, సురేందర్‌రెడ్డి, శివన్న, పల్లెరవి,శ్యాం,మన్నాన్ పాల్గొన్నారు. -
'ఓటర్లను మభ్యపెడుతున్న టీఆర్ఎస్'
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌లోని ఓటర్లను మభ్యపెట్టేలా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని టీడీపీ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. అందులోభాగంగానే విద్యుత్, వాటర్ బిల్లు బకాయిలు రద్దు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుందని రావుల గురువారం హైదరాబాద్‌లో విమర్శించారు. ఓటర్లను ఆశపెట్టి ఆకట్టుకుంటున్నారని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులపై రావుల చంద్రశేఖరరెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్కబారిందని రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. -
పార్టీ నాయకులపై కేసీఆర్ సీరియస్
-
న్యాయం జరగకుంటే విషం తాగి చస్తాం
తూప్రాన్ : ‘నా పరువు ఎలా పోయిందో.. ఎంపీపీ పరువు కూడా అలాగే పోవాలి.. లేకుంటే విషం తీసుకుని కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటాం’ అని బాధితురాలు అంగన్వాడీ కార్యకర్త మనీల డిమాండ్ చేసింది. పంచాయతీ పరిధిలోని ఆబోతుపల్లిలో బాధితురాలు మనీల కుటుంబాన్ని బుధవారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ మనీల తన పట్ల ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఫోన్లోని సంభాషణలను వాట్స్ప్, ఇంటర్నెట్లో పెట్టి తన పరువు తీస్తున్నాడని కంటతడి పెట్టింది. చిన్నపిల్లల నుంచి పెద్దలు తనను చూసి హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తన భర్త నిలదీస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. రేషన్‌కార్డు, తన అత్త పింఛన్ తొలగిస్తానాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. దీంతో మనోవేదనకు గురై ఎస్పీ సుమతిని కలిసి తన గోడును వెలబుచ్చానని తెలిపింది. అయితే పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేశారని ఆరోపించింది. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రెండు నెలలుగా ఈ వ్యవహారంలో స్పందించని పోలీసులు అధికారుల పట్ల మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంపీపీ వ్యవహారంతో తమ పార్టీ పరువు పోతుందని కేసును నీరుగార్చే ప్రయత్నిలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత మహిళ, అంగన్వాడీ కార్యకర్త పట్ల అసభ్యంగా ప్రవర్తించి అవమానాలకు గురిచేసిన ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించి వెంటనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రానున్న నేపథ్యంలో మహిళలతో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే తమ పార్టీలోని దళిత వర్గానికి చెందిన మోత్కుపల్లి నరసింహులు, మహిళల ఉద్యమ నాయకురాలు విమలక్క, దళిత సంఘాలతో కలిసి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతాప్‌రెడ్డి వెంట నాయకులు విరాసత్ అలీ, పార్టీ మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీటీసీ ఎక్కల్‌దేవ్ వెంకటేష్ యాదవ్, పట్టణశాఖ అధ్యక్షుడు ఉపేందర్, ఆర్ అంజగౌడ్, మల్లేష్, సిద్దిరాంలు తదితరులు పాల్గొన్నారు. -
మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు
హైదరాబాద్: మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఇసుక, అక్రమ సారా మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లోనే ఉన్నారని ఆయన విమర్శించారు. బెల్ట్ షాపులపై వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పెంచడానికే కేసీఆర్ హెలికాప్టర్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేస్తామని... అలాగే 5వ తేదీన సమీక్ష నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి వివరించారు.