
ఆయన చలవతోనే ప్రత్యేక రాష్ర్టం
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తె లంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూల మా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రా ష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్క ర్ ఆ రోజుల్లోనే చెప్పి రాజ్యంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచినట్లు తెలిపారు. అంబేద్క ర్ స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు.
హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఫౌండర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కోట్లకిషోర్, బెక్కంజనార్ధన్, పట్టణ మాజీ అద్యక్షుడు కృష్ణముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శివరాజు, సురేందర్‌రెడ్డి, శివన్న, పల్లెరవి,శ్యాం,మన్నాన్ పాల్గొన్నారు.