మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు
హైదరాబాద్: మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్రెడ్డి గురువారం హైదరాబాద్లో ఆరోపించారు. ఇసుక, అక్రమ సారా మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లోనే ఉన్నారని ఆయన విమర్శించారు. బెల్ట్ షాపులపై వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పెంచడానికే కేసీఆర్ హెలికాప్టర్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేస్తామని... అలాగే 5వ తేదీన సమీక్ష నిర్వహిస్తామని కిషన్రెడ్డి వివరించారు.