
‘మాఫియాతో రాజధానికి చెడ్డపేరు'
హైదరాబాద్: మద్యం, డ్రగ్స్ మాఫియాతో రాజధాని నగరానికి చెడ్డ పేరు వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. చెడ్డపేరు రాకుండా చూడటం బీజేపీ యువతతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో కొందరు చేసే ఆగడాలతో మొత్తం పరిశ్రమకే చెడ్డపేరు వస్తోందన్నారు. మూడేళ్ల కేసీఆర్ పాలనతో జనం విసిగి పోయారని చెప్పారు. నరేంద్రమోదీ పాలనపై ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని అన్నారు. పాత బస్తీ ఎంఐఎం ఆగడాలకు అడ్డాగా మారుతోందని ఆయన ఆరోపించారు.