ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన ఎస్టీ బిల్లును, ముస్లిం రిజ ర్వేషన్ల బిల్లులను కలిపి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకే బిల్లుగా అసెంబ్లీలో పెట్టేందుకు నిర్ణయించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోం దన్నారు.
ముస్లిం రిజర్వేషన్ల కల్పన బిల్లును హైకోర్టు రెండు సార్లు కొట్టేసిందని, అయినా ఈ రిజర్వేషన్లపెంపునకు ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని, దీనిపై కోర్టులో వాదనలు వినిపించాల్సిన సందర్భంలో బిల్లును తీసుకురావడం ఏమిటని నిలదీశారు. శనివారం బీఏసీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, దానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.