Muslim Reservations Bill
-
కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
ఒకే ఒక్క నిర్ణయం...ఇంతమంది జీవితాల్లో ఇంత అద్భుతమైన మార్పు తెస్తుందని ఎవరూ ఊహించరు...దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ పేదరికంలో ఉన్న ముస్లింల వేదనలకు చలించిపోయి, వారి ఎదుగుదలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు...అంతే..ఆ ఒక్క నిర్ణయం ముస్లిం సమాజంలో విద్యావంతులను అమాంతంగా పెంచింది... వారిలో అనేకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదుగుతున్నారు.ఇతరత్రా అనేక ఉపాధి కోర్సుల్లో ముస్లిం యువత ప్రతిభను చూపించి, మున్ముందుకు దూసుకుపోతోంది...ఒక సాధారణ టీవీ మెకానిక్ తన ఇద్దరు కుమార్తెలను, ఒక కుమారుణ్ని డాక్టర్లను చేశారంటే అది వారికి లభించిన రిజర్వేషన్ ఫలితమే... మరెన్నో ముస్లిం పేద కుటుంబాల్లో యువతీయువకులు నేడు ఉన్నత విద్యావంతులై... తమ కుటుంబాలకు..సమాజానికి గుర్తింపును తెస్తున్నారు.. ఇలాంటి మంచి వాతావరణాన్ని కలుషితం చేసేలా బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లను తొలగిస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించడం ఆ సమాజంలో అలజడి రేపుతోంది... రేపటి తమ భవిష్యత్తును తలచుకుని ముస్లింలు తల్లడిల్లుతున్నారు.. యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి: కడపలో డాక్టర్ నూరీ పర్వీన్ పేరు తెలియని వారుండరు. కడప పెద దర్గా సెంటర్లో కేవలం రూ.10కే వైద్య సేవలు అందించే పది రూపాయల డాక్టర్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారామె. దివంగత మహానేత వైఎస్సార్ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లతో ఎంబీబీఎస్ చదువుకున్న ఆమె ఆయన స్ఫూర్తితో పది రూపాయలకే వైద్యం చేయడం ప్రారంభించారు.ఆమెతో పాటు సోదరి రీనా పర్వీన్, తమ్ముడు బాబా మొహిద్దీన్లూ డాక్టర్లే. వీరి తండ్రి ఎండీ మక్బూల్ విజయవాడలో ఓ టీవీ మెకానిక్. తమ పేద కుటుంబం నుంచి ఏకంగా వరుసగా...ముగ్గురు డాక్టర్లుగా ఎదగడం దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ పుణ్యమేనని మక్బూల్ సంతోషంగా చెబుతారు. విజయవాడలో కనీసం సొంత ఇల్లయినా లేని మక్బూల్ టీవీ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషించడమే కష్టతరంగా ఉండేది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్ ఫలితంగా ఆయన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు 2010, 2011, 2012 సంవత్సరాల్లో వరుసగా ఎంబీబీఎస్ సీట్లు సాధించడం ఓ అరుదైన ఘనత. ...వీరే కాదు.. దివంగత మహానేత వైఎస్సార్ కల్పించిన నాలుగు శాతం (బీసీ–ఇ) రిజర్వేషన్ రాష్ట్రంలో వేలాది ముస్లిం కుటుంబాల స్థితిగతులనే మార్చేసింది. సామాజికంగా, విద్య పరంగా అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లిం సమాజాన్ని గుర్తించి వారిని ముందుకు నడిపించేందుకు వైఎస్సార్ తీసుకున్న రిజర్వేషన్ కేటాయింపు నిర్ణయం ఎన్నో ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంది. ఆ కుటుంబాల్లో యువతను విద్యాధికులను చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది ముస్లిం యువతకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఒక్క ఏపీలోనే ఈ పదేళ్లలో వైద్య విద్యా కోర్సుల్లో 6,401 మందికి అండర్ గ్రాడ్యుయేషన్, 1,164 మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశాలు దక్కడం విశేషం. వైద్య విద్యా కోర్సులతో పాటు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో అవకాశాలు దక్కినవారు లెక్కలు మిక్కిలి ఉన్నారు. విజయవాడకు చెందిన డాక్టర్ అస్మా తన్విర్రిజర్వేషన్ అవకాశంతో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 2014లో ఎంబీబీఎస్, ఆ తర్వాత 2019లో జనరల్ సర్జన్ (ఎంఎస్) వైద్య విద్య సీట్లు సాధించారు. ప్రస్తుతం డాక్టర్ వృత్తిని కొనసాగిస్తున్నారామె. ఆమె తండ్రి షేక్ కలీముద్దీన్ రిటైర్డ్ ఉద్యోగి. పిల్లల చదువులు తనకు భారమైనప్పటికీ రిజర్వేషన్ అవకాశంతో ఒక కుమార్తె డాక్టర్, ఇద్దరు కుమార్తెలు ఇంజనీరింగ్, కుమారులు వేర్వేరు కోర్సులను పూర్తి చేయడంతో ఆ కుటుంబం ఉన్నతంగా జీవిస్తోంది. వైఎస్సార్ హామీ ఇచ్చి అమలు చేశారు ముస్లిం రిజర్వేషన్లపై 2009 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే అమలు చేశారు. తొలుత ఐదు శాతం ప్రకటించినప్పటికీ 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీం కోర్టు అభ్యంతరంతో నాలుగు శాతం అమలు చేశారు. వైఎస్సార్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు. తమకు అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీరంతా తమలోని ప్రతిభను నిరూపించుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ సంతోషాన్ని హరించే కుట్రలో భాగంగా... వైఎస్సార్ కల్పించిన రిజర్వేషన్లను తొలగించడానికి కూటమి కుట్రలు చేస్తోంది. ముస్లింలలోని నిమ్న కులాల వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి. – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎంపీ వైఎస్సార్ బాటలో సీఎం వైఎస్ జగన్ రిజర్వేషన్లతో ముస్లింల తలరాతలను మార్చిన దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాన్ని అమలు చేసి అన్ని వర్గాల పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్ పేరు చెబితే ముస్లింలకు రిజర్వేషన్లు, పేదలకు ఆరోగ్య శ్రీ గుర్తుకొస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి కంటే రెండడుగులు ముందుకేసి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించిన సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను ఆధునికీకరణ చేసి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ వైద్య రంగంలో సుమారు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, వాటిలో ఐదు కాలేజీలను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు. రాష్ట్రంలోని 92 శాతం మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే వెసులుబాటు కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. –మహబూబ్ షేక్, వైద్య నిపుణుడు, విజయవాడ ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కావు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన ముస్లింలను గుర్తించి 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు కల్పించారు. 2004 ఎన్నికల్లో తానూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైఎస్సార్ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టులో కేసులు వేయించారు. 4 శాతం రిజర్వేషన్ల వల్ల ముస్లిం యువతకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. ఎంతోమంది ముస్లిం యువత ఇప్పుడు బాగా చదువుకుని ఉన్నతంగా జీవిస్తున్నారు. రిజర్వేషన్లు ముస్లిం సమాజంలో గొప్ప సానుకూల మార్పును తెచ్చాయి. –షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ -
గొంతు నొక్కేస్తున్నారు..
ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారు. కానీ వీళ్లందరూ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్లు గొంతు పట్టుకుని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు.. నా అక్కచెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులనే అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా – మంగళగిరి సభలో సీఎం జగన్నేను ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని ఎందుకు అంటానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాహాటంగా ‘‘నా..’’ అని పిలుచుకుంటూ వారిపై ప్రేమ చూపించినప్పుడు ఆయా సామాజిక వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలనే తపనతోనే మీ బిడ్డ ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు.– కడప సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, కడప: ‘మీరంతా ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే 57 నెలలకే మీ బిడ్డ గొంతు నొక్కేస్తున్నారు! వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే జగన్‌కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కి రెండు నెలలైంది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్లు నొక్కినా ఎక్కడ అక్కచెల్లెమ్మలకు డబ్బులు వెళ్లిపోతాయో, ఎక్కడ జగన్‌ను వాళ్లంతా మంచివాడు అని అనుకుంటారేమోనని అది కూడా అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ పథకాల డబ్బులు అందాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ కోర్టుకు వెళ్తున్నాడంటే ఈ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచన చేయండి. బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కట్టి మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు, వైఎస్సార్ జిల్లా కడపలోని వన్‌టౌన్ సమీపాన మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. విశ్వసనీయతతో అడుగులు..మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మరోవైపు మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. ఏ రోజూ కులమతాలు చూడలేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత 59 నెలల కాలంలో 130సార్లు బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. 1.30 లక్షల మంది నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేసే సంస్కృతికి తెర దించి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. విశ్వసనీయతకు అర్థం చెప్పాం మన మేనిఫెస్టోను గడపగడపకూ పంపించి మీరే టిక్ పెట్టాలని కోరుతూ అక్కచెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకున్నాం. మేనిఫెస్టోకి విశ్వసనీయత తెచ్చిన ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? మచ్చుకు కొన్ని గడగడా చెబుతా..మన ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలు మచ్చుకు కొన్ని గడగడా చెబుతా. ‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచి టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన లాంటి వినూత్న పథకాలు, కార్యక్రమాలు గతంలో ఉన్నాయా? ఉన్నత విద్య అభ్యసిస్తున్న 93 శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో లబ్ధి చేకూరుస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలలో భాగస్వామ్యం చేయడం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్ లాంటివి మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు కావా? ఈ రోజు ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న పిల్లవాడు 2035లో ఐబీ సర్టిఫికెట్తో పదో తరగతి పాస్ అవుతాడు. ఆ తర్వాత ఏ హార్వర్డ్ నుంచో, ఎల్ఎస్సీ, స్టాన్పర్డ్ నుంచో, ఏంఐటీ నుంచో సర్టిఫికెట్ కోర్సులతో డిగ్రీ పట్టా తీసుకుంటాడు. ఆ పిల్లవాడు అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతున్నా. పేదల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ వేస్తున్న అడుగులు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆలోచన చేయండి. విప్లవాత్మక పథకాలు, సేవలు..నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు వారి పేరిటే ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. 22లక్షల గృహ నిర్మాణాలను సైతం చేపట్టాం. అక్కచెల్లెమ్మల బాగు కోసం ఇంతగా తపించిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు అందడం గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచితంగా పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి కార్యక్రమాలు గతంలో జరిగాయా?స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లాయర్ల కోసం లా నేస్తం పథకాలను తెచ్చాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కూడా ఇస్తున్నాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యంపై ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60–70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మలకు భద్రతగా గ్రామంలోనే మహిళా పోలీసు, దిశ యాప్ లాంటివి తీసుకొచ్చాం. 14 ఏళ్ల పాటు పరిపాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ముస్లింలకు మీ జగన్ ఇస్తున్న మాట...బాగా ముదిరిపోయిన తొండ లాంటి చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో జత కట్టి ఎన్డీఏలో కొనసాగుతూ మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తున్నాడు. ఇంత మోసాలు, ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా? ఆరు నూరైనా సరే ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్, మీ వైఎస్సార్ బిడ్డ ఇస్తున్న మాట. మరి చంద్రబాబుకు ప్రధాని మోదీ సమక్షంలో ఇదే మాట చెప్పే దైర్యముందా?వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా కూడా చంద్రబాబు ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నాడు? మైనారిటీ రిజర్వేషన్లు అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అర్థం కావటానికి మీ అందరి సమక్షంలో ఒక విషయం చెబుతున్నా. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కాదు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయటం లేదు. పఠాన్లు, సయ్యద్‌లు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడటం ధర్మమేనా? రాజకీయాల కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా? ఎట్టి పరిస్థితిలోనూ ఈ 4శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగుతాయి. ఇవే కాదు.. ఎన్ఆర్సీ, సీఏఏతో సహా ఏ విషయంలోనైనా మైనారిటీల మనోభావాలు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు అండగా ఉంటాం. డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, నా మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, నా మైనారిటీ సోదరికి శాసన మండలి ఉపాధ్యక్షురాలి పదవులు ఇచ్చి గౌరవించాం. మైనారిటీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం మొదలు ప్రతి సందర్భంలోనూ సముచిత స్థానం కల్పించాం. ఆ దివంగత నేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఆయన బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి 7 ఎమ్మెల్యే స్థానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా 4శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్లయ్యింది. మన అభ్యర్థులను దీవించండిమంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాష, కడప ఎంపీగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీలతో గెలిపించాలని కోరుతున్నా. మీ బిడ్డ ఎన్నికల కోసం ఏదీ చేయలేదు..వీళ్ల దుర్మార్గాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే... అవ్వాతాతలకు మొన్నటి వరకు ఇంటికే వచ్చే పెన్షన్‌కు కూడా అడ్డుపడి రానివ్వకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు! మీ బిడ్డ చేసిందేదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏదీ ఎన్నికలకు రెండు నెలల ముందు, మూడు నెలల ముందు చేసిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా ముందే కేలండర్ ప్రకటించి ఇదిగో ఈ నెలలో రైతుభరోసా, అమ్మఒడి, చేయూత ఇస్తామని చెప్పి క్రమం తప్పకుండా ఐదేళ్లుగా అందించాడు. సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. ఛీటర్ అంటాం. దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మేనిఫెస్టో అంటూ అందమైన హామీలిచ్చి మన జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? పట్టపగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు.మంగళగిరి బీసీలదేమంగళగిరి సీటు బీసీలది.. వెనుకబడిన వర్గాలది. గతంలో నేను ఆర్కేకు ఇచ్చా. ఈసారి మాత్రం మనం ఈ సీటును త్యాగం చేయాలని ఆర్కేకు చెప్పా. మనం బీసీలకు సీటు ఇస్తే... అటువైపు∙వాళ్లంతా డబ్బు మూటలతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా చంద్రబాబు ఎక్కడా బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన దగ్గర బాగా డబ్బులున్నాయి. అందుకుని ఓటుకు రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. ఆయన డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి.అదంతా మన దగ్గర దోచేసిన సొమ్మే. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేయండి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల భవిష్యత్, తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన వైద్యం మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 2014 బాబు విఫల హామీల్లో ముఖ్యమైనవి» రూ.87,612కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? రూ.14,205కోట్ల పొదుపు రుణాల్లో ఒక్క రూపాయి మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? మంగళగిరి, నగరిలో ఎవరికైనా కనిపిసున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. » అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని చిలకలూరిపేటలో ఉన్న కళామందిర్ సెంటర్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కైకలూరులో ఉన్న తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని పిఠాపురంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV -
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
రేవంత్..! నిన్ను వాడుకుని వదిలేస్తారుసీఎం రేవంత్‌రెడ్డీ.. నా మాట వినండి.. కాంగ్రెస్ నాయకత్వం మిమ్మల్ని వాడుకుని, వదిలించుకుంటుంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సైగలతో తెలంగాణలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చేనెల 6వ తేదీన ఫలితాలు వెలువడ్డాక.. వాటిని చూసి మిమ్మల్ని కాంగ్రెస్ విడిచిపెట్టడం ఖాయం.. గుర్తుంచుకోండి.సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆసిఫాబాద్: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, మతపరమైన (ముస్లిం) రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో ఎవరూ రిజర్వేషన్లను తొలగించకుండా చూస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆర్ఆర్ (రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి) టాక్స్ వసూలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పిస్తామని నేను ఇటీవల ఓ సభలో చెప్పాను. ఆ వీడియోను ఎడిట్ చేసి మోదీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నట్టుగా ప్రజల్లో దు్రష్పచారం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రిజర్వేషన్లు తొలగించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మోదీ ఆర్టికల్ 370ను రద్దు చేశారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. రామమందిర నిర్మాణం చేశారు. ఆర్టికల్ 370ను రద్దుచేస్తే కశ్మీర్లో రక్తపుటేరులు పారుతాయని రాహుల్‌గాంధీ అడ్డుపడే ప్రయత్నం చేశారు. అది చేసి ఐదేళ్లు గడిచిపోయాయి రక్తపుటేరులు కాదు.. కనీసం రాళ్ల దాడి చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే.. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు సంతుష్టీకరణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు ఓటుబ్యాంకు కోసం రామనవమి యాత్రకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాయి. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేంద్రంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అయోధ్య సమస్యను పరిష్కరించలేదు. మోదీ ఐదేళ్లలో పరిష్కరించి, రామమందిర నిర్మాణం పూర్తి చేశారు. రామాలయ ప్రారంబొత్సవానికి ఆహ్వానించినా.. ఒకవర్గం ఓట్ల కోసమే రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే అయోధ్యకు రాలేదు. ఇండియా కూటమికి నాయకత్వమేది? ఇప్పుడు ఎన్నికల్లో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఉన్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కావాలా? 23 ఏళ్లు సీఎం, పీఎంగా ఉన్నా ఒక్క అవినీతి మరకలేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. దీపావళి నాడు కూడా సెలవు లేకుండా దేశ సైనికులతో కలసి పండుగ జరుపుకునే మోదీ ఓవైపు ఉంటే.. నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టి, ఎండ పెరగగానే బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు చెక్కేసే రాహుల్ గాంధీ మరోవైపు ఉన్నారు.. ఎవరు కావాలి? ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు? అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ఉంటారని అంటున్నారు. అలాంటి ఇండియా కూటమి భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారి ఏదైనా వస్తే కాపాడగలదా? ఆ మోదీకే ఉంది. యావత్ భారతానికి ఉచితంగా, వేగంగా వ్యాక్సినేషన్ చేయించారు. ఆ ముందు చూపుతోనే మనమంతా బతికిపోయాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసింది తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. అన్నిరకాలుగా ఆదుకుంటోంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ మోదీ ప్రభుత్వమే సంపూర్ణంగా నిధులిచ్చింది. పసుపు బోర్డు ఇచ్చింది. 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, రూ.20వేల కోట్లతో రీజనల్ రింగ్‌రోడ్డు, రూ.1,100 కోట్లతో ఎంఎంటీఎస్ మంజూరు చేశాం. పీఎంజీఎస్‌వై కింద రూ.6 వేల కోట్లు ఇచ్చాం. బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, హసన్–చర్లపల్లి ఎల్పీజీ గ్యాస్ పైప్‌లైన్, రూ.2 వేల కోట్లతో కృష్ణపట్నం–హైదరాబాద్ పెట్రోల్ పైప్‌లైన్, రూ.1,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫాక్టరీ పునఃప్రారంభం వంటి చేపట్టాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభించాం. అవినీతిమయ కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లతో మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు అందరూ ముందుకురావాలి. తెలంగాణలో 12 సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మారుస్తాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు.. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం.. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తాం. ఎంపీ అర్వింద్ వెంటపడి మరీ పసుపు బోర్డు ఏర్పాటును సాధించుకున్నారు. మరోసారి అర్వింద్‌ను గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల కారణంగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మేం వాటిని రైతుల భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో తెరిపిస్తాం. బీడీ కార్మీకుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తాం.రిజర్వేషన్లపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం: కె.లక్ష్మణ్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవబోతోందని చెప్పారు.మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ఈటల రాజేందర్ దేశం సుభిక్షంగా ఉండాలంటే.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమన్నారు. -
BJP Manifesto: అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్ రద్దు
బెంగళూరు: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, తయారీ రంగంలో పది లక్షల ఉద్యోగాలు, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్.. ఇలా కీలకమైన 16 హామీలతో బీజేపీ కర్ణాటక ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం.. ‘బీజేపీ ప్రజా ప్రణాళిక’ పేరిట బెంగళూరులో ఇవాళ(సోమవారం) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ బీఎస్ యడ్యూరప్ప సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎవరికీ బుజ్జగింపుల్లేవ్.. అందరికీ న్యాయం పేరిట విజన్‌తో బీజేపీ ముందుకు సాగుతోందని జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. అంతేకాదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు అవుతున్న ముస్లింల రిజర్వేషన్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారాయన. అంతేకాదు.. ప్రతీ వర్గానికి సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ముస్లిం రిజర్వేషన్ కోటా నుంచి 4 శాతం వెనక్కి తీసుకున్న బొమ్మై కేబినెట్.. కన్నడనాట రాజకీయంగా ప్రభావం చూపే రెండు వర్గాలకు లింగాయత్‌లకు, వొక్కలిగాస్‌కు సమానంగా పంచాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలకు దిగగా.. తాము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని జేడీఎస్ ప్రకటించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో.. రైతుల కోసం 30 వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించింది. మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు, ప్రతీ గ్రామ పంచాయితీలో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కమిటీలను ఆధునీకరించడం లాంటి హామీలు ఇచ్చింది. ► టూరిజం సెక్టార్ కోసం.. 1,500 కోట్ల ఫండ్ ప్రకటించింది. దేశంలోనే టాప్ టూరిజం హబ్‌గా కర్ణాటకకు తీర్చిదిద్దేందుకు ఈ ఫండ్‌ను ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. ► పేదలకు 10 లక్షల ఇళ్ల పట్టాలను అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవాళ్లకు.. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేత. ► పేదలకు ఉచితంగా పాలు, ఐదు కేజీల బియ్యం. ► నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో 'అటల్ ఆహార కేంద్రం’ ఏర్పాటు. ► మైసూర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ► విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించింది. ► వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇదీ చదవండి: బీజేపీ మహిళా కార్యకర్త అత్యుత్సాహం.. ప్రధాని మోదీపైకి.. -
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
వైఎస్ హయాంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి అభ్యున్నతికి బాటలు వేశారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్ భావించారని, అయితే సాంకేతిక కారణాల వల్ల 4% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. తద్వారా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు లభించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రిజర్వేషన్లను 12% పెంచాలనుకున్నా, కేంద్రం నుంచి సహకారం లేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల్లో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. చిన్నవాడైనా ఏపీ సీఎం జగన్ సమర్థవంతుడు.. ఉర్దూ టీచర్ల నియామకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టి.జీవన్‌రెడ్డి సూచించారు. ఉర్దూ టీచర్ల రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను అమలు చేయడానికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘డీ–నోటిఫై’చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉర్దూ చదువుకున్న వారు ఉండరనే ఉద్దేశంతో ఉర్దూ టీచర్ పోస్టులను జగన్ ఓపెన్ కేటగిరీలో పెట్టారని కొనియాడారు. ‘చిన్నవాడైనా సీఎంగా సమర్థవంతంగా ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ జనరల్ కేటగిరీలోకి ఉర్దూ పోస్టులు తీసుకురావాలి’ అని సూచించారు. అందుకు స్పందించిన కేటీఆర్ ‘నేను ఆ శాఖ మంత్రిని కాదు’అని చెప్పగా, కాకపోయినా చేయవచ్చని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట.. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏడేళ్లలో మైనారిటీల కోసం రూ. 6,644.26 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. సంక్షేమంతో పాటు పాతబస్తీ అభివృద్ధికి కూడా నిధులు వెచ్చించిందని చెప్పారు. ఈ అంశంపై ఎమ్మెల్సీలు ఎం.ఎస్,ప్రభాకర్ రావు, వాణీదేవి, సయ్యద్ అమీనుల్ జాఫ్రి, మీర్జా రియాజ్ అఫెండీ, డి.రాజేశ్వర్‌రావు పలు ప్రశ్నలు సంధించారు. -
ప్రతి ముస్లిం గుండెలో వైఎస్సార్
ప్రొద్దుటూరు క్రైం : దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ల వల్లనే ముస్లిం కుటుంబాల్లో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ‘హర్ దిల్ మే వైఎస్సార్ ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుందరాచార్యుల వీధిలోని రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి కేహెచ్‌ఎం స్ట్రీట్ మీదుగా భారీ జనసందోహం మధ్యన ఈ కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో పాటు పార్టీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ అబ్దుల్‌ఖాదర్‌తో, పలువురు మైనారిటీ నాయకులు వీధుల్లో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసిన మోసాలను వివరించారు. అనంతరం వన్‌టౌన్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి గుండెలో వైఎస్సార్ ఉన్నారు అనే నినాదంతో ముస్లిం పెద్దలు మీ ముందుకు వచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేక మోసాలకుపాల్పడిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మైనా రిటీల సభలో విస్మరించిన హామీలపై నంద్యాల యువకులు ప్ల కార్డులు ప్రదర్శిస్తే వారిని పోలీసులతో చంద్రబాబు కొట్టించారన్నారు.చంద్రబాబుకు మైనారిటీల పట్ల ప్రేమ లేదన్నారు. మైనా రిటీలపై అభిమానంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 4 శాతం రిజర్వేషన్ అమలు చేశారని, వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయంటే అది కేవలం వైఎస్ వల్లనే అని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ పెద్దలు వైఎస్ జగన్‌ను అడుగగా.. ముస్లింల అభిమానాన్ని పోగొట్టుకోలేనని చెప్పారన్నారు. బెదిరించినా, జైల్లో పెట్టినా ఫరవాలేదని, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న మీ పార్టీకి మద్దతు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పిన నాయకుడు జగన్ అని అన్నారు. ముస్లింల పట్ల తండ్రీ కొడుకులకు ఉన్న అపారమైన ప్రేమ ఇది అని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం టీడీపీ ఎన్నికల డ్రామా అని ఎమ్మె ల్యే చెప్పారు. నాలుగున్నరేళ్లు బీజేపీ ప్రభుత్వంలో కొనసాగి ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో కాంగ్రెస్‌తో బాబు జతకట్టారన్నారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మైనారిటీల అభిమానంతోనే వైఎస్సార్సీపీకి ఎక్కువ స్థానాలు రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారంటే అం దుకు ముస్లింల అభిమానమే కారణమని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రొద్దుటూరులోని ప్రతి వార్డులో ముస్లింలు తనను ఆదరించారన్నారు. అల్లా దయవల్ల వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ముస్లిం కుటుం బాల్లో ఉన్న పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని టీటీపీ నాయకులు ఇతరులకు కేటాయిస్తే తాను మాత్రం ముస్లిం అయిన ముక్తియార్‌ను ప్రతిపాదించామన్నారు. ఇందు కోసం రూ. 4–5 కోట్లు ఖర్చు కూడా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినా ముక్తియార్ మమ్మల్ని కాదని టీడీపీలోకి వెళ్లారన్నారు. ఇది న్యాయమా అని ఎమ్మెల్యే ప్రజలను అడిగారు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్‌బాషా, కార్యదర్శి గౌస్‌లాజం ఎమ్మెల్యే రాచమల్లుకు మెమొంటోను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ లాజం, పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మైనారిటీ నాయకులు ఆయిల్‌మిల్లు ఖాజా, పులివెందుల రఫి, పెన్నానగర్ అక్బర్,మార్కెట్ దాదాపీర్, షెక్షావల్లి, అబ్దుల్లా, టైలర్ నజీర్, జహింగీర్, అల్లాబకాష్, జమాల్‌వల్లి, రఫిక్, అన్సర్, షాపీర్, వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, పార్టీ మండల కన్వీనర్లు ఎస్ఏ నారాయణరెడ్డి, దేవీప్రసాద్‌రెడ్డి, దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, సుబ్రమణ్యం, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం కొర్రీ!
సాక్షి, హైదరాబాద్ : ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు పీటముడి పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని రెండు శాఖలు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ బిల్లును నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కేంద్ర హోం శాఖకు సూచించింది. మొత్తం రిజ ర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయంటూ డిసెంబర్ 11నే ఆఫీస్ మెమొరాండం పంపించింది. మరోవైపు ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులోని అంశాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 9.08 శాతం ఎస్టీ జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్ల తెలిపింది. మొత్తం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎస్టీల రిజర్వేషన్ 9.08 శాతానికి తగ్గకూడదంటూ డిసెంబర్ 18న కేంద్ర హోంశాఖకు ఆఫీస్ మెమోరాండం పంపింది. మొత్తంగా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్రపతికి పంపకుండా పెండింగ్‌లో పెట్టింది. పది నెలలుగా నిరీక్షణ ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, 6 శాతమున్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని దాదాపు ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఏప్రిల్ 16న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08 శాతానికి, ముస్లింల జనాభా 12.68 శాతానికి చేరిందని.. ఈ మేరకు రిజర్వేషన్లను పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 62 శాతానికి చేరినట్లయింది. సందేహాలు లేవనెత్తిన డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులోని ప్రతిపాదనలను కేంద్ర డీవోపీటీ సున్నితంగా తిరస్కరించింది. 1992లో ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4) ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని పేర్కొంది. అసాధారణ పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఇవ్వొచ్చని, అందుకు సహేతుక కారణాలు చూపాలని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం చేసిన సూచనలను ప్రస్తావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో అటువంటి కారణాలు, అసాధారణ పరిస్థితులేమీ చూపలేదని స్పష్టం చేసింది. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఓబీసీలకున్న 27 శాతం రిజర్వేషన్లలో.. మైనారిటీలకు ఉప కోటా కింద 4.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన ఎస్టీ బిల్లును, ముస్లిం రిజ ర్వేషన్ల బిల్లులను కలిపి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే బిల్లుగా అసెంబ్లీలో పెట్టేందుకు నిర్ణయించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోం దన్నారు. ముస్లిం రిజర్వేషన్ల కల్పన బిల్లును హైకోర్టు రెండు సార్లు కొట్టేసిందని, అయినా ఈ రిజర్వేషన్లపెంపునకు ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని, దీనిపై కోర్టులో వాదనలు వినిపించాల్సిన సందర్భంలో బిల్లును తీసుకురావడం ఏమిటని నిలదీశారు. శనివారం బీఏసీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, దానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.