సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్‌ల వల్లనే ముస్లిం కుటుంబాల్లో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ‘హర్ దిల్ మే వైఎస్సార్ ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుందరాచార్యుల వీధిలోని రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి కేహెచ్‌ఎం స్ట్రీట్ మీదుగా భారీ జనసందోహం మధ్యన ఈ కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో పాటు పార్టీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ అబ్దుల్‌ఖాదర్‌తో, పలువురు మైనారిటీ నాయకులు వీధుల్లో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసిన మోసాలను వివరించారు. అనంతరం వన్‌టౌన్ సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి గుండెలో వైఎస్సార్ ఉన్నారు అనే నినాదంతో ముస్లిం పెద్దలు మీ ముందుకు వచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేక మోసాలకుపాల్పడిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మైనా రిటీల సభలో విస్మరించిన హామీలపై నంద్యాల యువకులు ప్ల కార్డులు ప్రదర్శిస్తే వారిని పోలీసులతో చంద్రబాబు కొట్టించారన్నారు.చంద్రబాబుకు మైనారిటీల పట్ల ప్రేమ లేదన్నారు.
మైనా రిటీలపై అభిమానంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 4 శాతం రిజర్వేషన్ అమలు చేశారని, వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయంటే అది కేవలం వైఎస్ వల్లనే అని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ పెద్దలు వైఎస్ జగన్‌ను అడుగగా.. ముస్లింల అభిమానాన్ని పోగొట్టుకోలేనని చెప్పారన్నారు. బెదిరించినా, జైల్లో పెట్టినా ఫరవాలేదని, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న మీ పార్టీకి మద్దతు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పిన నాయకుడు జగన్ అని అన్నారు. ముస్లింల పట్ల తండ్రీ కొడుకులకు ఉన్న అపారమైన ప్రేమ ఇది అని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం టీడీపీ ఎన్నికల డ్రామా అని ఎమ్మె ల్యే చెప్పారు. నాలుగున్నరేళ్లు బీజేపీ ప్రభుత్వంలో కొనసాగి ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో కాంగ్రెస్‌తో బాబు జతకట్టారన్నారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మైనారిటీల అభిమానంతోనే వైఎస్సార్‌సీపీకి ఎక్కువ స్థానాలు
రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారంటే అం దుకు ముస్లింల అభిమానమే కారణమని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రొద్దుటూరులోని ప్రతి వార్డులో ముస్లింలు తనను ఆదరించారన్నారు. అల్లా దయవల్ల వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ముస్లిం కుటుం బాల్లో ఉన్న పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని టీటీపీ నాయకులు ఇతరులకు కేటాయిస్తే తాను మాత్రం ముస్లిం అయిన ముక్తియార్‌ను ప్రతిపాదించామన్నారు. ఇందు కోసం రూ. 4–5 కోట్లు ఖర్చు కూడా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినా ముక్తియార్ మమ్మల్ని కాదని టీడీపీలోకి వెళ్లారన్నారు. ఇది న్యాయమా అని ఎమ్మెల్యే ప్రజలను అడిగారు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్‌బాషా, కార్యదర్శి గౌస్‌లాజం ఎమ్మెల్యే రాచమల్లుకు మెమొంటోను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ లాజం, పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మైనారిటీ నాయకులు ఆయిల్‌మిల్లు ఖాజా, పులివెందుల రఫి, పెన్నానగర్ అక్బర్,మార్కెట్ దాదాపీర్, షెక్షావల్లి, అబ్దుల్లా, టైలర్ నజీర్, జహింగీర్, అల్లాబకాష్, జమాల్‌వల్లి, రఫిక్, అన్సర్, షాపీర్, వైఎస్సార్‌సీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, పార్టీ మండల కన్వీనర్లు ఎస్‌ఏ నారాయణరెడ్డి, దేవీప్రసాద్‌రెడ్డి, దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, సుబ్రమణ్యం, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment