తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం | to be sucess the tirang trip: BJP | Sakshi
Sakshi News home page

తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం

Published Mon, Aug 15 2016 1:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం - Sakshi

తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తిరంగా యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఆదివారం పార్టీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్మరించుకునేందుకు.. ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఆగస్టు 16 నుంచి 21 వరకు జిల్లాల వారీగా రౌండ్‌టేబుల్ సమావేశాలు.. వర్క్‌షాపులు నిర్వహించాలని నిర్ణయించారు.

అలాగే సెప్టెంబర్ 1నుంచి 14 వరకు ముఖ్య పట్టణాలలో బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే తిరంగా యాత్ర ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. అందుకోసం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలని తీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement