Tirangaa trip
-
రేపు రాష్ట్రానికి అమిత్ షా
వరంగల్ సభకు హాజరుకానున్న బీజేపీ అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకరోజు పర్యటన కోసం శనివారం రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక తిరంగా యాత్రలో భాగంగా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన ఉత్సవాలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 70 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి 22 వరకు తిరంగా యాత్రను నిర్వహించింది. అయితే రాష్ట్రంతోపాటు నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహా రాష్ట్రలోని 5, కర్ణాటకలోని మూడు జిల్లాల్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు యాత్రను జరుపుతోంది. రాష్ట్రంలో యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో జరగ నున్న బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హజరవుతారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి 2 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుం టారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్‌కు వెళ్లి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు. పర్యటన సందర్భంగా పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదివారం ఉదయమే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరాటానికి ప్రాధాన్యమున్న ఒకటి, రెండు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించి నిజాం వ్యతిరేక పోరాట అమరులకు నివాళి అర్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర నేతలు తొలుత భావించారు. అయితే సమయం సరిపోకపోవడంతో బహిరంగ సభకే పరిమితం చేశారు. -
‘తిరంగా’కు మతం రంగు వద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన అంశాల గురించి తిరంగాయాత్ర ద్వారా బీజేపీ కార్యక్రమాల ను చేపడుతుంటే, అధికార టీఆర్ఎస్ నేతలు.. వాటికి మతం రంగుపులిమి, చరిత్ర ను వక్రీకరిస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలనకోసం నాడు నిజాం రాచరిక వ్యవస్థపై ఇక్కడి ప్రజలు పోరాటం చేశారన్నారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నాడు తెలంగాణ విమోచన కోసం పోరాడిన వారి త్యాగాలు స్మరించుకొనే వీలులేకుండా పో యిందన్నారు. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17పై తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వ ద్వంద్వ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలపై తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రజాకార్ల వారసత్వంగా వచ్చిన ఎంఐఎంతో అంటకాగుతోందన్నారు. తిరంగాయాత్ర సందర్భంగా భైంసాలో తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని, రామగుండంలోనూ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. గోల్కొండలో నిర్వహించాలి... గోల్కొండ కోటలో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. కేంద్రం కూడా ఈ ఉత్సవాలను అధికారికం గా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ స్టేట్‌ను పాకిస్తాన్లో కలపాలని నాడు నిజాం చేసిన ప్రయత్నాలను కేసీఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తెలంగాణ విమోచనకు 70 ఏళ్లు నిండుతున్నందున ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది వరకు ఉత్సవాలను నిర్వహించేలా కమిటీ వేయాలన్నారు. -
నేడు కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు, దేశ స్వాతంత్య్రంతో పాటు హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించేందుకు కృషి చేసిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6.30కి కేబీఆర్ పార్కు వద్ద నిర్వహిస్తున్న ఈ యాత్రకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేబీఆర్ పార్కు చుట్టూ 5.2 కి.మీ. పరిధిలో యాత్ర నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ప్రముఖులు పద్మనాభయ్య, బీవీఆర్ మోహన్‌రెడ్డి, డివి మనోహర్, పార్టీ నేతలు పి. మురళీధర్‌రావు, డా.కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి ఎన్.రామచందర్‌రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని చెప్పారు. -
తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తిరంగా యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఆదివారం పార్టీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్మరించుకునేందుకు.. ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఆగస్టు 16 నుంచి 21 వరకు జిల్లాల వారీగా రౌండ్‌టేబుల్ సమావేశాలు.. వర్క్‌షాపులు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 1నుంచి 14 వరకు ముఖ్య పట్టణాలలో బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే తిరంగా యాత్ర ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. అందుకోసం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలని తీర్మానించారు.