సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు, దేశ స్వాతంత్య్రంతో పాటు హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించేందుకు కృషి చేసిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6.30కి కేబీఆర్ పార్కు వద్ద నిర్వహిస్తున్న ఈ యాత్రకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేబీఆర్ పార్కు చుట్టూ 5.2 కి.మీ. పరిధిలో యాత్ర నిర్వహిస్తామన్నారు.
కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ప్రముఖులు పద్మనాభయ్య, బీవీఆర్ మోహన్‌రెడ్డి, డివి మనోహర్, పార్టీ నేతలు పి. మురళీధర్‌రావు, డా.కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి ఎన్.రామచందర్‌రావు, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని చెప్పారు.
నేడు కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర
Published Sat, Sep 3 2016 2:50 AM | Last Updated on Tue, Oct 30 2018 4:19 PM
Advertisement
Advertisement