
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం (కేబీఆర్) వాకర్లు, సందర్శకులకు అటవీ శాఖ అధికారులకు న్యూ ఇయర్‌గా గిఫ్ట్‌గా ఎంట్రీ ఫీజును పెంచారు. ప్రతియేటా ప్రవేశ రుసుము పెరుగుతుండగా ఆ మేరకు పార్కు లోపల సౌకర్యాలు పెంచడంలో మాత్రం అధికారులు విఫమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇవేమీ పట్టని అధికారులు పార్కు ప్రవేశ రుసుమును ఇష్టానుసారంగా పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి కేబీఆర్ పార్కుకు వెళ్లాలంటే పెద్దలకు రూ.50 (ప్రస్తుతం రూ.45 ఉంది), పిల్లలకు రూ.30 (ప్రస్తుతం రూ.25 ఉంది)కి పెంచారు. అలాగే నెలవారీ పాస్ ప్రస్తుతం రూ.850 ఉండగా, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రూ.1000కి పెంచారు. జనవరి 1వ తేదీ నుంచి ప్రవేశ రుసుము పెంచుతున్నట్లుగా ప్రధాన గేటు వద్ద నోటీసులు అతికించారు.
Comments
Please login to add a commentAdd a comment