dasoju sravan kumar
-
‘గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తిరస్కరణ’.. దాసోజు శ్రవణ్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా -
రైతుబంధు నిలిపేయాలనడం కాంగ్రెస్ వైఖరికి నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ మనస్తత్వంతో నడిచే కాంగ్రెస్ పార్టీ ఈ లేఖ ద్వారా తన కర్కశ, రైతు, పేదల వ్యతిరేక వైఖరిని నిస్సిగ్గుగా బయట పెట్టుకుందని విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన రైతుబంధు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిస్తోందని, రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసమే చూస్తోందని దాసోజు విమర్శించారు. ఎన్నికలు వస్తూ పోతుండటం సహజమని, వాటి కోసం రైతులు వ్యవసాయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాల కోసం సమాజం కోసం నిస్వార్ధంగా కష్టపడే రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, భవిష్యత్తు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కాకూడదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉంటూ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులను వేధించకూడదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు అర్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి జాలి, దయ లేకుండా ఈసీకి రాసిన క్రూరమైన లేఖను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని దాసోజు డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ స్ట్రాటజీ.. ఎమ్మెల్సీగా దాసోజు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ సైతం ఆయన పేరును మీడియా ముందు ప్రస్తావించారు కూడా. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కానుండటంతో.. ఖైరతాబాద్ నేతల మధ్య పోటీ చల్లబడినట్లయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఖైరతాబాద్ నుంచి దానం మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండకు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్.. వక్తగా, సబ్జెక్ట్‌పై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. ప్రజా రాజ్యం పార్టీ, టీ(బీ)ఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పని చేసిన శ్రవణ్.. తిరిగి బీఆర్ఎస్లో చేరికతో ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టీ(బీ)ఆర్ఎస్ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా & కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (తెలంగాణ) అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
బీజేపీకి షాక్.. టీఆర్ఎస్లోకి దాసోజు శ్రవణ్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు నెలలు తిరగకముందే పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు దాసోజు శ్రవణ్. బీజేపీకి షాక్ ఇస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు.. గులాబీ గూటికి ఆయన చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలుస్తోంది. మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందంటూ లేఖలో దాసోజు పేర్కొన్నారు. దశ దిశ లేని రాజకీయ పరిణామాలకు బీజేపీ వేదిక అవుతోందని తన లేఖలో దాసోజు ఘాటుగా విమర్శించినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో కాంగ్రెస్‌ను వీడి.. తరుణ్ చుగ్, కిషన్‌రెడ్డి, పలువురు కీలక నేతల సమక్షంలో బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. ఆ సమయంలో తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దాసోజు శ్రవణ్ పేరుతో వైరల్ అవుతున్న లేఖ -
దాసోజు బాటలో మరికొందరు.. కమలం వైపు మొగ్గు?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడడం నగర కాంగ్రెస్‌లో ఒకింత కలవరం రేపిందని చెప్పాలి. టీఆర్ఎస్ నేత, కార్పొరేటర్ విజయారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కినుక వహించిన శ్రవణ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనతో కనీసం సంప్రదించకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. కాగా, దాసోజు కమలం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే నగరానికి రథసారధి లేక కేడర్ కొట్టుమిట్టాడుతుండగా, ఉన్న ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరు జారుకోవడం హస్తం పార్టీని మరింత బలహీనపరుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌కు గ్రేటర్‌పై దృష్టి కేంద్రీకరించడం లేదన్న అపవాదును ఇప్పటికే ఎదుర్కొంటోంది. రాష్ట్ర రాజధానిగా..రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం కరువైంది. మరోవైపు రెండేళ్లుగా కమిటీ లేని హైదరాబాద్ నగర కాంగ్రెస్‌ను మూడు జిల్లాలుగా విభజించి కమిటీలు వేయాలన్న ఏఐసీసీ నిర్ణయం సైతం అటకెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నగరంలో చతకిలపడిన పార్టీలో జవసత్వాలు నింపే ప్రయత్నం సాధ్యం కానీ పరిస్ధితి నెలకొంది. వాస్తవంగా స్థానికంగా కూడా నాయకత్వం కరువైంది. చదవండి: పార్టీలో చేరికలపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు వరుస ఓటములతో.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం వరుస ఓటములతో పార్టీ కుదేలైంది. సంస్థాగతంగా కూడా బలహీన పడింది. గతంలో గ్రేటర్ నేతలు అనునిత్యం ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉండేవారు. శివారు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు అధికార పారీ్టలో చేరిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ నగర అధ్యక్షుడు తన బాధ్యతలకు రాజీనామా చేయడంతో సారధి లేకుండా పోయారు. మరోవైపు పార్టీ సంస్థాగతంగా కూడా బలహీనపడింది. తాజాగా పార్టీ కీలక నేతలు మరికొందరు జారుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. దాసోజు బాటలో మరికొందరు.. కమలం ఆకఆపరేషన్‌లో భాగంగా మరికొందరు దాసోజు బాటలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ ముఖ్య నేతలపై కూడా వల విసరడంలో కమలనాధులు సఫలీకృతమైతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దాసోజు ఆపరేషన్ విజయవంతమైంది. మిగిలిన అసంతృప్త వాదులను పారీ్టలో చేర్చుకునేందుకు తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. నగరం నడిఒడ్డులో గల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పలుమార్లు బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ ముఖ్యనేత పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
అందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నా: దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి తన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఒక మాఫియాగా నడిపిస్తున్నారని, కేవలం వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలోనే మండిపడ్డారాయన. ► ‘‘రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని ఫ్రాంచైజీలా తెచ్చుకున్నారు. ప్రతి నియోజవర్గంలో ముగ్గురు లేదంటే నలుగురిని ప్రోత్సహిస్తూ సొంత ముఠా తయారు చేసుకుంటున్నారు. ఏదో ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్లా పార్టీని నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కులం, ధనంతోనే పార్టీలో రాజకీయం నడుస్తోంది. రేవంత్ వద్ద ఎల్1, ఎల్2 దర్శనాలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్రకులాల దురహంకారం నడుస్తోంది. సగటు కాంగ్రెస్ కార్యకర్తల ఆశలను రేవంత్ నీరుగారుస్తున్నారు. ► అహంకారపూరిత రాజకీయాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు దూరం అవుతున్నారు. రేవంత్ నేతృత్వంలో పార్టీలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. ఏఐసీసీ నేతలు సైతం రేవంత్ అరాచకాలను అడ్డుకోవడం లేదు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, సునీల్ కనుగలు కుమ్మక్కు అయ్యారు. ఈ ముగ్గురు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. సర్వే ల పేరు మీద తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ► పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని రాజకీయాల్లోకి వచ్చా. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశా. అమరవీరుల బలిదానాన్ని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. అందుకే కాంగ్రెస్‌లో చేరా. కానీ, టీఆర్ఎస్కు ప్రత్యాహ్నాయంగా కాంగ్రెస్ ఎదగలేకపోతోంది. సొంత ముఠాతో కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించే వాళ్లపై ఏఐసీసీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేసే మమ్మల్నే అణచివేశారు. ఏడాది కాలంలో నన్ను పార్టీ లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే బాధతో కాంగ్రెస్‌ను వీడుతున్నా అని ప్రకటించారు దాసోజు శ్రవణ్. ఇదీ చదవండి: తూచ్.. నేను అలా అనలేదు- బండి సంజయ్ -
తెలంగాణ: కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్‌గోపాల్‌రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే.. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా?. కాంగ్రెస్ పార్టీకి వీడేందుకు ముఖ్యనేత దాసోజు శ్రవణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్.. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే.. పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి.. తన రాజీనామా నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మునుగోడు పోరు రసవత్తరం.. కాంగ్రెస్‌లో చేరిన చెరుకు సుధాకర్ -
ధర్నాలు చేస్తే రైతులను ఆదుకునేదెవరు?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తే రైతుల ధాన్యం కొనేదెవరని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టు’ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా సాగిందని, అది దొంగదీక్ష అని, రైతులను దగా చేసే కుట్రతో కేసీఆర్ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ధర్నాలో సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడితే రైతుల ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారమవుతుందా అని మధుయాష్కీ ప్రశ్నించారు. పన్ను నొప్పి పేరుతో వారం రోజులు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ మొక్కుబడి దీక్ష చేశారని, ఢిల్లీలోని స్టార్ హోటళ్లలో టీఆర్ఎస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి: దాసోజు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగం పేరుతో అధికార టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన సర్వేలో ప్రభుత్వంపై నిరుద్యోగులు, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతోనే అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారే తప్ప నిరుద్యోగులపై ప్రేమతో కాదని విమర్శించారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అలాంటప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా శిక్షణ ఎందుకు ఇప్పిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో చెప్పిన రోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయని కేసీఆర్ చెప్పారని, కానీ నేటికీ ఒక్క నోటిఫికేషన్ రాలేదని మండిపడ్డారు. అన్ని ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేసి, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏం మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు కత్తులు పట్టుకు తిరుగుతున్నట్లు అనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యా ఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగడం సరైంది కాదన్నారు. నాలుకలు కోస్తామని టీఆర్ఎస్ నేతలు అంటు న్నారని, మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా? అని శ్రవణ్ ప్రశ్నించారు. -
వరద సాయం ఎప్పుడిస్తారు?
సాక్షి,హైదరాబాద్: గతేడాది సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ వాసులకు వరద సాయం ఎప్పుడిస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే బ్యాంకు ఖాతాల్లో రూ.10వేల నగదు సాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదో జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ‘రాత్ గయి బాత్ గయి’తరహాలో రూ.10వేలు నగదు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత బాధితులను గాలికొదిలేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. వరద సాయం పొందిన వారి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టి పారదర్శకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని దాదాపు 5 లక్షల మంది గతేడాది అక్టోబర్ నుంచి వరదసాయం కోసం ఎదురుచూస్తున్నారని, దీన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు రూ.200 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయని, ఈ పరిహారాన్ని కూడా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. 8 నెలల క్రితమే వరదలు ముంచెత్తి నష్టాన్ని కలిగించినా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు వరద సాయం ఎందుకు ఇవ్వలేదో, ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆ లేఖలో కోరారు. డ్రైనేజీ వ్యవస్థ, నాలాల విస్తరణ, మ్యాన్‌హోల్స్, ఓపెన్‌నాలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారు
సాక్షి, హైదరాబాద్: కృష్టా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ఆంధ్రాకు తాకట్టు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గురువారం టీజేయూ, తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యం లో ‘కృష్టా జలాల సాధన కోసం మర్లబడుదాం రండి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లా డారు. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కృష్టా జలాలను వినియోగించుకోవటంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ప్రాజెక్టుల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన అరకొర పనులు ఏడేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సూచించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. -
‘ఈటలను బలి పశువుని చేస్తున్న కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ కబ్జాలకు పాల్పడితే తప్పకుండా శిక్షించాలని, కానీ అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో శిక్షపడాల్సిన వారు చాలా మందే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాకపోతే కేసీఆర్ తనపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఈటలను బలిపశువుని చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈటలను తప్పించాలనేది కేసీఆర్ పన్నాగమని ఆరోపించారు. అలాగే, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్లపై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై బండి సంజయ్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు మల్లారెడ్డితో పాటు కేటీఆర్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. సీఎం వ్యతిరేక వర్గంపై ఆరోపణలు వస్తే విచారణకు ఆదేశించడం, అనుకూల వర్గాన్ని వదిలేయడం కాకుండా మంత్రి ఈటల రాజేందర్ కోరినట్లు అవినీతి ఆరోపణలున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నాకనీసం స్పందించని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? -
ఆ విషయంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం తండ్రి కేసీఆర్ మాదిరిగానే కొలువుల భర్తీ విషయంలో అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగా లను భర్తీ చేసిందని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు శ్రవణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల స్థూపం ‘గన్‌పార్క్’ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు ప్రతి సవాల్ చేశారు. మీడియా ఎదుట శాంతియుతంగా జరిగే చర్చకు కేటీఆర్ హాజరైతే శాలువా, పూలదండతో సత్కరించి చర్చకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ కేటీఆర్, ఇతర నాయకులు చర్చకు రాకపోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు... కేటీఆర్ కోసం వేసిన కుర్చీకి చెప్పుల దండ వేయడంతోపాటు కేటీఆర్‌కు పసుపు, కుంకుమ, చీర, గాజులను సమర్పించారు. అపాయింట్మెంట్ లెటర్లు కావాలి... ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లా డుతూ యువతను గందరగోళానికి గురిచేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ కేటీఆర్ లేఖలు రాయడాన్ని తప్పుబట్టారు. రాత్రిపూట ఇంట్లో కూర్చొని రాసుకొనే లవ్ లెటర్స్ తమకు అక్కరలేదని, కొలువుల భర్తీ కోసం యువతకు అపాయింట్మెంట్ లెటర్లు కావాలని చురకలం టించారు. 2014లో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో ప్రకటిం చారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన బిశ్వాల్ కమిటీ సైతం లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉద్యోగాలు ఉంటే సరిపోదని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 47% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ మాట్లాడటాన్ని ఖండించారు. తెలంగాణ వ్యతిరేకి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి లక్షా పది వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. కాంట్రాక్టు పదాన్నే లేకుండా చేస్తామన్న కేటీఆర్... ఎందుకు కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్స హిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ నేతలు మందడి అనీల్ కుమార్, ఇందిరా శోభన్, రవీందర్, డాక్టర్ మురళీ మనోహర్, మెట్టు సాయి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘వరద సాయం పేరుతో వైట్ కాలర్ దోపిడీ’
సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సహాయ పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. దొంగలు దొంగలు కలసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వార్డ్లీడర్లు, జీహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయనిధి దోచుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైట్‌కాలర్ క్రైమ్‌కి పాల్పడ్డారు’’ అని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. వరద సహాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడతూ... వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్నారు. వరదల్లో లక్షలమంది నష్టపోయారు. కొందరు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. నష్టపోయిన ప్రతి ఇంటికి యాబై వేల రూపాయిలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ ఎంగిలి మెతుకులు వేసినట్లుగా పదివేల రూపాయిలే ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, కూలిపోయిన ఇంటికి లక్ష రుపాయిలే ఇస్తాం, పాక్షికంగా కూలిపోయిన ఇంటికి రూ.50 వేలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా వ్యవహరించిందని విమర్శించారు. ‘‘ఈ సాయమన్నా ప్రజలందరికీ చేరవేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూశాం. కానీ దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వార్టు లీడర్లు, జీహెచ్ఏంసీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయనిధి దోచుకున్నారు. అడ్డగోలుగా వరద సాయాన్ని జేబులో వేసుకున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘వరద సాయం ఇస్తున్నట్లు వ్యవహరించి మరో పక్క జీహెచ్ఎంసి ఎన్నికలని ప్రజలపై రుద్దే కుట్ర జరుగుతుంది. వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్‌కి నోటిఫికేషన్ రావడం అందులో భాగమే' అని మండిపడ్డారు. చాలా మంది ప్రజలకు అసలు పైసా సాయం కూడా అందలేదు. వరద సహాయనిధిని టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. కొన్ని చోట్ల రూ.10వేలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ దాని నుండి టీఆర్ఎస్ కమీషన్ ఏజెంట్లు కమీషన్లు గుంజుకుంటున్నారు. ఇలా దోపిడీ జరుగుతుంది. టీఆర్ఎస్ నేతలు అధికారం అడ్డుపెట్టుకొని నీచమైన అవినీతికి పాల్పడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోర్టును కోరాం. డబ్బుల వితరణపై లెక్కా పత్రం లేదు. టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని లీడర్లు డబ్బులు పంచుతున్నారు. ఈ డబ్బు ఎవరిది? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కేసీఆర్ జాగీరా ? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పబ్లిక్ మనీ. సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బు వస్తే అది కేసీఆర్ మొఖం చూసి ఇచ్చింది కాదు. సీఎం రిలీఫ్ ఫండ్‌లో డబ్బు.. ఆ కుర్చీలో కూర్చున్నది ఎవరైనా సరే ప్రజలను ఆదుకోవడమే లక్ష్యం. అందులో ఉన్న ప్రతి పైసాకి అకౌంటబిలిటీ వుండాలి. ఆడిట్ వుండాలి’’ అన్నారు. అలాంటిది టీఆర్ఎస్ లీడర్లు ఆ డబ్బుని అడ్డగోలుగా ఎలా డ్రా చేశారు ? పార్టీ కండువాలు కప్పుకొని బాబుగారి సొత్తు అన్నట్టు ఎలా పైసలు అడ్డగోలుగా పంచారు. అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? జీహెచ్ఎంసీ కమీషనర్ వున్నారా ? ఎంతో నిబద్దత గల వృత్తుల్లో వున్న ఐఏఎస్ అధికారులు కూడా టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారిపోయి దొంగచేతిలో తాళాలు పెట్టినట్లు వాళ్లకు డబ్బులు ఇస్తారా? వాళ్ళతో సాయం పంపిణీ చేయిస్తారా? అర్హులైన బాధితులకు సాయం అందకుండా నిస్సిగ్గుగా టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పక్కదారి పట్టిస్తుంటే.. ఈ చిల్లర రాజకీయాల్ని అధికారులు దగ్గర వుండి ప్రోత్సహించడం దారుణం. ప్రజలు కూడా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. కేసీఆర్ సర్కార్‌కు అసలు స్పృహ లేదని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. కానీ ఈ వరదల్లో కూడా బురద రాజకీయాలు మానుకోలేదు కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకూ ఎంత నష్టం కలిగిందనే అంశంపై కేసీఆర్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, పైగా సాయం అందించడంలో కూడా రాజకీయాల్ని తీసుకొచ్చి రోజుకో లెక్క చెబుతున్నారని’’ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 550 కోట్లు ప్రకటించి, దీనిపై రోజుకో మాట వినిపిస్తుందన్నారు. ‘‘ఒకరోజు రూ. 300 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇంకో రోజు రూ. 350 కోట్లు, ఈ రోజు రూ.389 కోట్లు ఖర్చుపెట్టామని అంటున్నారు. మిగతాది తర్వాత పంచుతారని అంటున్నారు. ఇదో కుట్ర. 13వ తేది తర్వాత జీహెచ్ఏంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో ఈ వరద సాయాన్ని పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. కేసీఆర్ వరదలతో బురద రాజకీయలు చేస్తున్నారు. సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదు. ముంపుకు గురికాని ప్రాంతాల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పంచుతున్న డబ్బులకు ఎకౌంటబిలిటీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇదో వైట్‌కాలర్ క్రైమ్. ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తూ, గులాబి ఏజెంట్లుగా మారి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న హేయమైన స్కామ్ ఇది. ఇంత చిల్లర రాజకీయం ప్రపంచంలో ఎక్కడా జరగదు. వరద సహాయాలు అందించేటప్పుడు రూ.100 చెక్కు రూపంలో ఇస్తామని, సొమ్ము చేతికిచ్చే దాఖలాలు ఎక్కడా లేవన్నారు. టీఆర్ఎస్ చిల్లర నాయకులు మాత్రం ప్రజల సొమ్ముని చేతిలోకి తీసుకున్నారని, వేల రూపాయిలు జేబులో వేసుకున్నారు. అసలు ఆ డబ్బు చేతిలోకి ఎలా వచ్చింది ? ప్రజల సొమ్ముని ముట్టుకునే అధికారం ఏ రాజ్యంగం వీరికి కల్పించింది? ఒకొక్క కార్పొరేటర్, ఒకొక్క వార్డు లీడర్ ఐదు, పది లక్షల రూపాయిలు దండుకున్నారన్నారు. ఇంత దోపిడీ, దుర్మార్గం ఎక్కడా లేదని, దీన్ని అంత సులువుగా వదలమని, ఈ దోపిడీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అధికారం అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకుతింటున్న వారికి శిక్ష పడాలంటే న్యాయవ్యవస్థ ముందుకు వచ్చి రక్షించాల్సిన అవసరం ఉంది. లేకపొతే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సన్నగిల్లుతుంది’’ అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై కూడా దాసోజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఎన్నికల కమిషన్ కూడా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారిందని, వరదలతో రాష్ట్రం మునిగిన పరిస్థితి ఉంటే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్టోరల్ రోల్స్ అని ఎలా ముందుకు వస్తారన్నారు. మీకు ఏ మాత్రం బాధ్యత ఉన్న ప్రజలు ఈ పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత ఎలక్టోరల్ రోల్స్ వార్డుల వారీగా ఫైనలైజ్ చేయాలని ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమీషన్‌ను కూడా డిమాండ్ చేశారు. అయితే బాధల్లో ఉన్న ప్రజలకు సాయం నిపిలివేసి మరీ ఎలక్టోరల్ రోల్స్‌ని ఎలా ఫైనల్ చేస్తారు? ఏం పాలన ఇది? ఇది కేసీఆర్ ఎన్నికల కమీషనా? రాష్ట్ర ఎన్నికల కమీషనా? అసలు ఎన్నికల కమీషన్ రాజ్యంగబద్ద సంస్థయేనా? అని ప్రశ్నించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి యుద్దప్రాతిపదికన రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘‘యుద్దప్రాతిపదికన బాధితులకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. నష్టానికి సంబంధించిన అంచనాలను సర్వే చేయాలి. ఇప్పటి వరకూ ఎలాంటి జాబితా ప్రిపేర్ చేయలేదు. బాదితులు ఎవరు? ఎంతమందికి సాయం చేశారు ? ఎవరు సాయం పొందారు ఇలాంటి వివరాలు ఏమీలేవు. వార్డులవారీగా జాబితాని ప్రచురించాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ జేబులో సొమ్ము కాదు. అధికారులని, మిగతా సంస్థలని, ప్రజా సంఘాలని, స్వచ్చంద సంస్థలని కలుపుకొని వాళ్ళ ద్వారా డబ్బుల వితరణ చేయాలి. పూర్తి స్థాయిలో వరద సాహాయ నిధి ప్రజలకు చేరిన తర్వాత వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్ జరగాలి'' అని దాసోజ్ శ్రవణ్ డిమాండ్ చేశారు. -
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్‌కుమార్ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందడంతో గల్ఫ్ వలస కార్మికుల జీవిన విధానం మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. అదే విధంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళలతో సహా తెలంగాణ నుండి 12-15 లక్షలకు పైగా వలస కార్మికులు ఉన్నట్లు తెలిపారు. ఈ గల్ఫ్ కార్మికుల నుంచి దాదాపు ప్రతి నెల రూ .1500 కోట్ల విలువైన విదేశీ మారకం తెలంగాణ రాష్ట్రానికి పంపబడుతుందని అంచనా అని తెలిపారు. (విదేశాల నుంచి స్వదేశానికి : టికెట్లు ధరలు ఇవే) అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయని, కరోనా వైరస్ కారణంగా ఒకేసారిగా కుప్పకూలిన చమురు ధరల వల్ల అరబ్, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయిందన్నారు. దీని కారణంగా వారి వ్యాపార కార్యకలాపాల పరిధి కూడా ఒక్కసారి తగ్గడంతో ఫలితంగా చాలా మంది కార్మికులను విధుల, ఉపాధి నుంచి తొలగించారని లేఖలో తెలిపారు. అలాగే కరోనా మహమ్మారి కొంత వరకు తగ్గినప్పటికీ, చమురు ధరలు ఒక్కసారి తగ్గడం ద్వారా తీవ్రమైన వ్యాపార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, గల్ఫ్ వలస కార్మికులు వారి ఉపాధిని మరియు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని కూడ కూడా పేర్కొన్నారు. ఫలితంగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలలో ఉన్న కార్మికులు వారి జీవనోపాధిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఎప్పటికీ తేలదు! వారిలో చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి సరైన జీవనోపాధి పొందడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్య సంరక్షణ కూడా వారికీ లేదని, చాలా ప్రమాదకర పరిస్థితులలో గల్ఫ్ కార్మికులు జీవించవలసి వస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్య సహకారంతో సమన్వయం చేసుకొని, గల్ఫ్‌లో ఉన్నటువంటి కార్మికులు భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారో వారిని ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల, ప్రాంతాలలో ఉన్న కార్మికులను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల సౌకర్యాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి విమాన ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయడం సరికాదని శ్రావన్ అన్నారు. కార్మికులు ప్రస్తుత పరిస్థితులలో వారికీ ఎలాంటి ఉపాధి, ఆదాయం లేకుండా ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుండి విమానాల ద్వారా హైదరాబాదుకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వమే కార్మికుల విమాన ఛార్జీలు చెల్లించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. అంతేగాక హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆయా గ్రామాలకు స్థానిక రవాణా ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణకు తిరిగి వచ్చిన తరువాత, ఆ కార్మికులకు గౌరవంగా మంచి జీవన ప్రమాణాలతో వారి స్వస్థలాలలో స్థిరపడటానికి వారికి పునరావాసం, పునర్వవస్థీకరణము ప్యాకేజీని ఇవ్వాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకరించిన గల్ఫ్ కార్మికుల కోసం మనం చేయగలిగిన అతి చిన్న సహాయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. -
'ఆయనను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయండి'
సాక్షి, హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి మున్సిపల్ టికెట్ల కోసం కోట్లు వసూలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకోవడం అవినీతి అన్న విషయం తెలియదా అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న శ్రవణ్ మాట్లాడుతూ.. ఏసిబి దీనిని సుమోటోగా ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. చిన్న ఉద్యోగులు లంచాలు తీసుకుంటే జైల్లో పెట్టే ఈ ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటున్న మల్లారెడ్డిపైఘే విధమైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శించారు. (కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు) మల్లారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యవహారంపై పోలీసులతో పాటు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అవినీతీకి పాల్పడితే సొంత కొడుకైనా సరే జైల్లో పెడతా అని పలికిన కేసీఆర్‌కు మల్లారెడ్డి వ్యవహారం తెలియడం లేదా అని పేర్కొన్నారు. ఓట్లు ఎవరికి వేస్తున్నారో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎలా తెలుస్తోంది.. వెంటనే ఎన్నికల కమీషన్ ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని దుయ్యబట్టారు. -
సచివాలయానికి రాని ఏకైక వ్యక్తి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణాలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. మంగళవారం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోవడంపై గాంధీభవన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆచరణకు నోచుకోని సంక్షేమ పథకాలతో జనాన్ని బురిడీ కొట్టించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. మాయమాటలతో మభ్యపెడుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన చరిత్ర ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా పరంగా చూస్తే మొదటి ఏడాది అంతా పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. వడ్డీలు కట్టడమే సరిపోతుంది.. ఇక అభివృద్ధి ఏం చేస్తారు.. రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఇప్పటి దాకా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకు వచ్చారని, వీటికి వడ్డీలు కట్టడంతోనే సరిపోతోందన్నారు. ఏకంగా రుణాల కోసం ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టిందన్నారు. అంతే కాకుండా ఈ అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయా రుణ మంజూరు సంస్థలకు పూచీకత్తుగా ఉంటుందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకువచ్చారని ఆరోపించారు. మ్యానిఫెస్టోలోని హామీలను నెరవేర్చడంలో విఫలం.. అంచనాలను పెంచి అడ్డగోలుగా ప్రాజెక్టులకు కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతున్న ఒక్క మద్యం ద్వారా దాదాపు రూ. 20వేల కోట్లు ఆదాయం గడించిన ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ తప్ప మిగతా ఏ రంగాలపై దృష్టి సారించలేదని విమర్శించారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఖాళీలను భర్తీ చేయడం లేదా కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలను ప్రభుత్వం నిర్వహించడంలో విఫలమైందని ఆయన తెలిపారు. అక్షరాస్యత పరంగా ఇండియాలో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని, ఈ విషయాన్ని 2011 జనగణన సూచించిందని పేర్కొన్నారు. బడ్జెట్ పరంగా చూస్తే అమలులో దేశంలో 31వ ర్యాంక్ లో ఉందని ఆర్బీఐ పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యంలో మిగతా రాష్ట్రాలు మెరుగైన సేవలందిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పట్టించుకోవడం లేదని వివరించారు. మొత్తం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం 3.50 శాతం మాత్రమే కేటాయించినందని గుర్తుచేశారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని దుయ్యబట్టారు. -
‘కేసీఆర్‌పై ప్రకృతి కూడా పగ పట్టింది’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గురువారం బహిరంగసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనకు ప్రకృతి కూడా అడ్డుపడిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కుండపోతగా వర్షం కురవడం ద్వారా దేవుడు హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ను రావద్దని ఆదేశించాడని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో గురువారం శ్రవణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ తీరు పట్ల ప్రకృతి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉందని, నిరంకుశ విధానాలకు ప్రకృతి ప్రకోపించిందని, అందుకే హుజూర్నగర్ బహిరంగసభకు కేసీఆర్ హెలికాఫ్టర్ ద్వారా కూడా రాలేనంతగా ప్రకృతి శపించిందన్నారు. దీని ఫలితంగాకే కేసీఆర్ బహిరంగసభను రద్దు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ఈ విధంగా దేవుడే వాతావరణం రూపంలో వచ్చి కేసీఆర్‌ను అడ్డుకున్నాడని వ్యాఖ్యానించారు. అసత్యాలతో చేయని వాటిని కూడా చేశామంటూ తప్పుడు హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ వస్తున్నాడని తెలుసుకునే దేవుడు అతి భారీ వర్షం రూపంలో అడ్డుకున్నాడని అన్నారు. ప్రభుత్వ నిర్వాకాలకు వ్యతిరేకంగా ప్రజలే కాదు దేవుడు కూడా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. భారీ వర్షాల ద్వారా దేవుడు ఇక్కడి ప్రజల్ని రక్షించాడని, రెండు సార్లు భారీ వర్షం కురవడంతో ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని, కేసీఆర్‌ను రానీయకుండా చేసిన వరుణదేవుడిన్ని జనం సైతం కొనియాడుతున్నారని దాసోజు శ్రవణ్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంతలా పాలన సాగిస్తున్నారని, నిరుద్యోగుల ఆశల్ని అడియాశలు చేశారని, అందుకే కేసీఆర్‌ను హుజూర్నగర్ రాకుండా కుండపోత వర్షం ద్వారా దేవుడు మోకాలడ్డాడని ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకేమీ పట్టనట్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని, కేసీఆర్ నియంత అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదని ఆయన విమర్శించారు. పని చేసిన కాలానికి జీతాలు ఇవ్వకుండా ఆరీస్టీ ఉద్యోగులను దసరా పండుగ సమయంలో ఇబ్బందులకు గురిచేసిన పాపం ఊరికేపోదని వ్యాఖ్యానించారు. కే సీఆర్ పతనానికి ఇదే నాంధి అని, కేసీఆర్ పతనం ప్రారంభం అయిందని, ప్రజలు అన్నీ మరిచిపోయి ఎప్పుడూ తమ వెంటే ఉంటారని భావించవద్దని హెచ్చరించారు. ప్రజల నుంచి గుణపాఠం కేసీఆర్‌కు ఉంటుదని శాపాలు పెట్టారు. -
‘టీఎన్జీవోలు కేసీఆర్‌కు మద్దతులో ఆంతర్యమేమిటో’
హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీవో), తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో) నేతలతో సీఎం కేసీఆర్ భేటీని కాంగ్రెస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఖండించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు 50 వేల మంది సమ్మెలోకి దిగి రోడ్లెక్కితే (టీఎన్జీవో), (టీజీవో) ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో సమావేశాన్ని నిర్వహించడం ద్వారా ఉద్యోగుల హక్కుల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఎంతో సమావేశం వెనుక ఏ ఉద్ధేశం ఉందో టీఎన్జీవో, టీజీవో నేతలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు మద్దతు అంశంపై సీపీఐ పునరాలోచన చేయాలని సూచించారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విక్టరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నుంచి ఆర్థికంగా మిగులుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రూ.2.70 లక్షల కోట్ల అప్పులున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రైతుబంధు, ఇతర కీలక పథకాలకు నిధుల లేమి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఆధారంగా ఓట్లు అడగడం లేదని, డబ్బుల పంపిణీ, మద్యం పారించడం ద్వారా హుజూర్‌నగర్‌లో గెలుపొందాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకుల్ని పోలీసులు వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. పోలీసుల వాహనాల్లో టీఆర్ఎస్ పార్టీ పెద్ద మొత్తంలో డబ్బుల్ని తీసుకొచ్చిందని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు సస్పెండ్ అయ్యారని తెలిపారు. ఇప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. -
మంత్రి మాట్లాడరు.. ముఖ్యమంత్రి కనబడరు
న్యూఢిల్లీ : ఇంటర్ బోర్డ్‌లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ బోర్డ్ తప్పిదం వల్ల 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని, వేలాది మంది రొడ్డెకినా కనీసం భరోసం కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధకరమన్నారు. ఒక కమిటీ వేసి నిమ్మకు నిరెత్తనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని గ్లోబరెనా అనే సంస్థ మూలంగా వేలాదిమంది విద్యార్థుల జీవితాలు అందకారంలోకి నెట్టబడ్డాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరెనా సంస్థకు మూల్యాంకనం బాధ్యతలు ఇచ్చిన విధానంపై న్యాయవిచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అశోక్ అనే అధికారిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాధికారికత లేని కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లా విద్యాశాఖమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంబర్‌బోర్డ్ అవకతవకలపై మంత్రి మాట్లాడరని, ముఖ్యమంత్రి కనబరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజల గోడు వినేవాడు ఎవరులేరని, విద్య, వైద్యం వంటి కీలక శాఖలపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలకులకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. -
ఆర్థికమంత్రి లేకుండా పరిపాలన ఎలా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 164(ఎ) ప్రకారం మంత్రుల సంఖ్య 15 శాతం మించకూడదన్నారు. మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ ఉండకూడదన్న విషయాన్ని అటు సీఎం కానీ, ఇటు గవర్నర్ కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి మండలి సూచనల మేరకు గవర్నర్ చేయాలన్నారు. ఆర్థిక మంత్రి లేకుండా పరిపాలన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు మంచి రోజుల రాబోతున్నాయి తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారని దోసోజ్ శ్రవణ్ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులనే టీఆర్ఎస్లో చేర్చుకొని విజయం సాధించారని ఆరోపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని సాధించేల పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు మంచిరోజులు రాబోతున్నాయని.. దానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అవకతవకలకి పాల్పడిందన్న ఆరోపణలకి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఊతం ఇచ్చాయన్నారు. ప్రజారస్వామ్యంపై గౌరవం పోకముందే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరారు. -
రిటర్నింగ్ అధికారులు,పోలీసులు కుమ్మక్కయ్యారు
-
శ్రవణ్ విజయాన్ని ఆపలేరు: మాజీ క్రికెటర్ సిద్ధూ
మాజీ స్టార్ క్రికెటర్లు, కాంగ్రెస్ నేతలు శుక్రవారం నగర రాజకీయాలను వేడెక్కించారు. పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఖైరతాబాద్ ప్రజాఫ్రంట్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచార ర్యాలీ తీయగా, మరో క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్‌రెడ్డి తరఫున ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌లలో ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే మాటల తూటాలు పేల్చారు. ఖైరతాబాద్: హిమాలయాలను ఎలా కదిలించలేరో.. భూమిని ఎలా ఎత్తలేరో.. సముద్రాన్ని ఎలా ఎండగట్టలేరో.. సూర్యుడి తాపాన్ని ఎలా ఆపలేరో అలాగే ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్ విజయాన్ని ఆపలేరని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ప్రజాఫ్రంట్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారలో పాల్గొన్న ఆయన సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. మిలుగు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో మార్పు అవసరమని, ఇదే అవకాశంగా సిక్స్ కొట్టి చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభ్యర్థి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. అవినీతికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందని, వాగ్దానాలు అమలు చేయమంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే పార్టీలను నమ్మొద్దన్నారు. తనను గెలిపిస్తే ఖైరతాబాద్‌లో ప్రతి గల్లీకి ఓ ఎమ్మెల్యేను తయారు చేసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. ఖైరతాబాద్‌లో కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి హాస్పిటల్ బిల్డింగ్ నిర్మిస్తే సిబ్బందిని, కనీస వసతులు కల్పించలేని నాయకులకు మరోసారి అవకాశం ఇవ్వవద్దన్నారు. చింతల రామచంద్రారెడ్డి టోకెన్లతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఓట్లు దండుకొని బానిసలుగా మార్చే వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు. ఈ రోడ్‌షోలో కూటమి నాయకులు బి.ఎన్.రెడ్డి, రోహిన్‌రెడ్డి, మహేష్‌యాదవ్, ఎస్.కె.షరీఫ్, మధుకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు శ్రవణ్‌కు మద్దతు తెలిపారు. -
దానం అంటేనే దందాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప తనకు ఏ గూండాయిజం తెలియదని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. దానం నాగేందర్ అంటేనే దళారితనం, దందాలు, కబ్జాలని ఆరోపించారు. దానంకు ఖైరతాబాద్‌లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. దాంతోనే ఎవరికో డబ్బులు ఇచ్చి తనకు టికెట్ ఇప్పించానని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్ లో మధుకర్‌యాదవ్, నిరంజన్, మహేశ్యాదవ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు 15 రోజులు తన కోసం వెచ్చిస్తే జీవితాంతం నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని చెప్పారు. -
‘ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టినా నాదే విజయం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో ప్రజలు 15 రోజులు తనకు కేటాయించి గెలిపిస్తే. ఐదేళ్లు వారికి సేవ చేసుకుంటానన్నారు. దానం నాగేందర్‌లాగా తనకు చిల్లర రాజకీయాలు చేయడం రాదని చెప్పారు. ఆయనలా తాను భూ కబ్జాలు, దందాలు చేయలేదన్నారు. ఒక డ్రైవర్‌గా ఉన్న దానం దందాలు, రాజీకీయాలు చేసి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. దానం నాగేందర్ పీజేఆర్‌ను మానసికంగా హింసించి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు. దానం అంటేనే దందాలు, దౌర్జన్యాలు, దళాలు అని ఎద్దేవా చేశారు. దానం ఎన్ని కుట్రలు చేసినా ఖైరతాబాద్‌లో తానే గెలుస్తానని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. -
సొంతపార్టీలోనే శ్రవణ్‌పై తిరుగుబాటు
సాక్షి, హైదారాబాద్ : కాంగ్రెస్‌లో అసమ్మతి మంటలు ఇంకా చల్లారడం లేదు. మొదటి జాబితాలో పేరు లేని వాళ్లు రెండో జాబితాకోసం ఎదురు చూశారు. బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ తమ పేర్లు లేకపోవడంతో టికెట్‌పై ఆశ పెట్టుకున్న నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కాదని టికెట్ దక్కలేదని పలువురు నేతలు ఆందోళనకు దిగారు. తమ నేతకు టికెట్ ఇవ్వకుండా మరో నేతకు ఇచ్చారని కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖైరతాబాద్ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌కు కేటాయించడం పట్ల స్థానిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్న రోహిణ్ రెడ్డిని కాదని దాసోజ్ శ్రవణ్‌కు ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ముషిరాబాద్లో తనకు ఓటేయండని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న శ్రవణ్‌కు ఖైరతాబాద్ ఎలా ఇస్తారని రోహిణ్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఖైరతాబాద్ టికెట్ కాంగ్రెస్‌కు ఇవ్వడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్‌ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలంటూ ఎన్టీఆర్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ ఓ కార్యకర్త కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపారు. రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు జనగామలో ఆందోళనకు దిగారు. టికెట్ ఇవ్వకుండా బీసీ నేతను అవమానిస్తారా అంటూ పొన్నాల అనుచరులు మండిపడుతున్నారు. పొన్నాలకు టికెట్ ప్రకటించనందుకు నిరసనగా జనగామలోని 14మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టికెట్లను అమ్ముకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గొల్ల కురుమ సామాజిక వర్గానికి చెందిన తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల,కురుమలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు. -
ఈసీకి గులాబీ రంగు రోగం సోకింది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పత్తి పంటలకు సోకిన గులాబీ రంగు రోగం ఇప్పుడు ఎన్నికల కమిషన్ (ఈసీ)కు సోకినట్టుందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడినా గులాబీ మత్తులో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారడం సరైంది కాదన్నారు. కమిషన్ వ్యవహారశైలి చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు కల్పించడం లేదనే అనుమానం కలుగుతోందన్నారు. టీఆర్ఎస్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడల్లా తాము ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవనడానికి ఈ నెల 26న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మెమో నం:1,605 సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. 9 లక్షల ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ముద్రించాలని ఈ ఉత్తర్వుల్లో ఉందని, అధికార పార్టీకి చెందిన గులాబీ రంగులో బ్యాలెట్ పత్రాలను ఎలా ముద్రిస్తారని ఆయన ప్రశ్నించారు. వేరే రంగే లేదా? ప్రపంచంలో వేరే రంగే లేనట్టు, ఎన్నికల బూత్‌లకు, బ్యాలెట్ పేపర్లకు గులాబీ రంగు వాడుతుంటే అసలు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని శ్రవణ్ ప్రశ్నించారు. ప్రజల వద్దకే ఎన్నికల కమిషన్ వెళ్లి టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నా, కాంగ్రెస్ నేతలు ఎటు వెళుతున్నారు, ఏం మాట్లాడుతున్నారనే అంశాలపై ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేస్తున్నా కమిషన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ నేతల వాహనాలు ఆపుతూ తనిఖీల పేరిట వేధిస్తున్నారని, పాత కేసులు తిరగదోడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యథారాజా తథా ప్రజా అన్నట్లు ఇప్పుడు జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ కూడా మీడియాను బెదిరిస్తున్నారని, ఇది సరైంది కాదని దాసోజు వ్యాఖ్యానించారు. -
అభ్యంతరం లేని రంగు వాడాలి: దాసోజు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పోలింగ్ బూత్‌లకు అభ్యంతరం లేని రంగు వాడాలని కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. మహిళా ఓటర్లను చైతన్య పరిచి, ఎన్నికల్లో వారి ఓట్ల శాతం పెంచే నెపంతో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే కుట్ర పూరిత విధానానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచడం మంచిదే అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ జెండా రంగు అయిన గులాబీని పోలింగ్ కేంద్రాలకు వాడటం సరికాదన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను తక్షణమే నిలిపే సి, అభ్యంతరం లేని మరో రంగును పోలింగ్ బూత్‌లకు వాడాలని దాసోజు కోరారు. పోలింగ్ బూత్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ రంగును వాడొద్దని ఇప్పటికే ఎన్నికల సంఘానికి విన్నవించామని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. పొత్తులపై కోర్ కమిటీకి ఉత్తమ్ నివేదన సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా కూటమి పొత్తులపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ కోర్ కమిటీలో కీలక నేత గులాం నబీ ఆజాద్‌కు ఇక్క డ నివేదించారు. మంగళవారం ఆజాద్‌తో సమావేశమైన ఉత్తమ్ ప్రజా కూటమిలో టీడీపీ, టీజే ఎస్, సీపీఐ కోరుతున్న సీట్ల సంఖ్యపై చర్చిం చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాకూటమి ముందుకు సాగడంలో టీడీపీ సయోధ్యతో ఉం దని, గెలిచే సీట్లపైనే ఆ పార్టీ దృష్టి సారించిందని తెలిపినట్లు సమాచారం. కోర్ కమిటీ ఈ పొత్తులను ఆమోదిస్తే తదుపరి అభ్యర్థుల జాబితా ప్రకటనపై, ప్రచారంపై దృష్టి పెట్టొచ్చని ఉత్తమ్ కోరినట్టు సమాచారం. కూటమి గెలుపునకు సానుకూల వాతావరణం ఏర్పడిందని, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏడెనిమిది రోజుల పాటు ఇక్కడ ప్రచారంలో ఉండేలా చొరవ తీసుకోవాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. స్క్రీనింగ్ కమిటీతోనూ సమావేశం.. తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్‌తోనూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల అభిప్రాయాల సేకరణ అనంతరం సామాజిక వర్గాల కూర్పుపై ఉత్తమ్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
-
అది తెలంగాణ రౌడీల పార్టీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని, తెలంగాణ ద్రోహుల అడ్డా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలం గాణ అమరుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్లో ఎవరికీ లేదన్నారు. అమరుల ఆత్మలు క్షోభించే విధంగా తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులతో అందలమెక్కించారని దుయ్యబట్టారు. మంగళవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మదన్‌మోహన్‌రావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలే శరణ్యమనే విధంగా భావోద్వేగాలకు గురిచేసి ఆత్మ బలిదానాలకు కారకులైన హంతకులు టీఆర్ఎస్ నేతలని దుయ్యబట్టారు. సుమారు 1,500 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కనీసం 400 మంది అమరుల కుటుంబాలకు కూడా ఆర్థిక చేయూత అందించలేకపోయారని విమర్శించారు. టీఆర్ఎస్ జాతి, నీతి లేని పార్టీ అని ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే తెలంగాణ ద్రోహులు మహేందర్‌రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్.. పొలిటికల్ శాడిస్ట్ అని, కేటీఆర్.. చార్లెస్ శోభరాజ్‌ను తలపిస్తున్నారని విమర్శిం చారు. టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే నైతికం, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే అనైతికమా? అని దాసోజు ప్రశ్నించారు. తమది ప్రజల కూటమి అని, టీఆర్ఎస్ది దొంగల కూటమి అని అన్నారు. నోరుజారితే తరుముతాం: దయాకర్ కాంగ్రెస్‌పై కేసీఆర్, కేటీఆర్ నోరుజారితే వెంటపడి తరుముతామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హెచ్చరించారు. నోరు జారడం మీకే కాదు మాకు కూడా వచ్చన్నారు. తామిచ్చిన తెలంగాణను పాలిస్తూ, తామిచ్చిన మెట్రోను, ఇళ్లను ప్రారంభించి తానేదో సాధించినట్టు టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుం టోందని విమర్శించారు. దొంగల ముఠాకు నాయకుడు ప్రధాని మోదీ అయితే.. మోదీకి కేసీఆర్ ఏజెంట్ అని అభివర్ణించారు. ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఎవరి వీపు చింతపండు అవుతుందో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు: పొన్నం సాక్షి, హైదరాబాద్: ఎవరి వీపు చింతపండు అవుతుందో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వీపు చింతపండు అవుతుందనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ కుటుంబానికి వ్యక్తిత్వం లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కుటుంబానిదన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌పై కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. సిరిసిల్ల సభలో ఒక్క ఓటుతోనైనా తనను గెలిపించాలని కేటీఆర్ కోరింది కూడా ఆ భయంతోనేనని, ఓటమి భయం కేటీఆర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో పొన్నం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సిరిసిల్ల నియోజకవర్గంలో జరగని అక్రమాలు లేవని, పైనుంచి కింద వరకు కమీషన్లు అందితేనే పనులు జరుగుతున్నాయని అక్కడి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. అక్కడ జరిగిన మరుగుదొడ్ల కుంభకోణం ఎక్కడా జరగలేదని, సిరిసిల్లలో ఏ వాగు చూసినా ఇసుక స్కామే కనిపిస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లి చూసినా స్థానిక సమస్యలు పరిష్కారం కాలేదని, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని, రైతు బంధు విషయంలో విమర్శలున్నాయని చెప్పారు. తమ హయాంలో పింఛన్లు ఠంఛనుగా ఒకటో తేదీనే ఇచ్చేవారమని, ఇప్పుడు ఎప్పుడొస్తాయో తెలియక వృద్ధులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని దుయ్యబట్టారు. ముందే కాడి ఎందుకు ఎత్తేశారో..! మహాకూటమి ఫెయిల్యూర్ పేరని పొన్నం అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఏర్పాటు చేస్తోంది మహాకూటమి కాదని, ప్రజా కూటమి’అన్నారు. ప్రజాకూటమికి ఎప్పుడూ ఓటమి ఉండదని చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని అనే హక్కు కేటీఆర్కుగానీ, టీఆర్ఎస్కుగానీ లేదన్నారు. తెలంగాణ ఇచ్చాక కేసీఆర్ కుటుంబం సోనియాకు ధన్యవాదాలు చెప్పి కాళ్లు మొక్కి రాకపోతే ఆ హక్కు ఉండేదన్నారు. తెలంగాణ ప్రజలకు పాలన చేతకాదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, తాము నంబర్ వన్‌గా పాలిస్తున్నామని పలుమార్లు చెప్పిన కేసీఆర్, 9 నెలల ముందే కాడి ఎందు కు ఎత్తేశారని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్ బలంగా ఉందని, అక్కడ కూడా స్వీప్ చేస్తామని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. తనకు కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీచేయడంపైనే ఆసక్తి ఉందని, కానీ పార్టీదే తుది నిర్ణయమని చెప్పారు. -
కాంగ్రెస్ నేతలపై వరుస కేసులు..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, కోదండరెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తనపై కూడా కేసు బనాయించారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. ‘నాపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానందా, మరికొంతమంది టీఆర్ఎస్ నేతల ప్రోద్భలంతో కేసు పెట్టారు. సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలపై వరుస కేసులు..! మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాస్‌పోర్ట్ కేసు, గండ్ర వెంకటరమణపై అక్రమ ఆయుధాల కేసు, కూన శ్రీశైలంగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ హౌసింగ్ కేసు.. ఇలా వరుస కేసులతో కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఉన్న పాత కేసులను తిరగదోడతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కై ప్రజాస్వామిక వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ప్రజాస్వామిక పద్ధతిలో అసెంబ్లీ సఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీజీపీని వారు కోరారు. -
‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు. గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు షేవింగ్ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. నాయి బ్రాహ్మణుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 250 కోట్లతో నాయి బ్రాహ్మణుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. నిధి ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాగ్దానం చేస్తే రాజముద్రగా ఉండాలి కానీ.. కేసీఆర్ వాగ్దానాలు చెట్ల మీద విస్తరాకుల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడ్రస్ సెలూన్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీచర్స్ ట్రాన్స్ఫర్లలోనూ అవినీతి: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్, లెక్చరర్స్ బదిలీల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖరాశారు. విద్యాబుద్దులు నేర్పి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన విద్యాశాఖలో కూడా అవినీతి జరగడం దారుణమన్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత కూడా భార్యాభర్తల కు సంబంధించిన అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 2018 జూన్ 6 న మొదలుపెట్టి నెలరోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్‌తో విజయవంతంగా ముగించామని చెప్పుకుంటున్నారని, కానీ అంతర్జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశాలేంటో అర్ధం కావడం లేదన్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదు’ అన్నట్లుగా ఓ వైపు ప్రభుత్వం జీవో విడుదలచేసినా విద్యాశాఖ ఎందుకు అంతర్జిల్లా బదిలీలను చేపట్ట లేకపోయిందో సమాధానం చెప్పాలని సీఎంను ప్రశ్నించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ట్రాన్స్ ఫర్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారని ప్రశ్నించారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలను భర్తీచేయకుండా గెస్ట్ లెక్చరర్ల పేరిట కళాశాలలను నడుపుతున్నారని, ఇలా పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్ లేకుండా ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందో చెప్పాలని నిలదీశారు. -
రైతు రాబందు ప్రభుత్వమిది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రాబందు ప్రభుత్వమని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. 42 లక్షల మంది రైతులకు రూ.26 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కేవలం 35 లక్షల మందికి సంబంధించిన రూ.17 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసిందని విమర్శించారు. నాలుగు విడతల్లో అమలు చేయడంతో ఒక్కో రైతుపై రూ.12 వేల భారం పడిందని పేర్కొన్నారు. ఒక్కో రైతుకు కేవలం రూ.48 వేల ప్రయోజనం మాత్రమే కలిగిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించడం లేదని, కరువు రైతులకు కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్లను ఆంధ్రా కాంట్రాక్టర్లకు చెల్లించారని ఆరోపించారు. నష్ట పరిహారం కోరిన రైతులపై లాఠీచార్జి చేశారని, అలాంటి ప్రభుత్వం రైతుబంధు ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి కాదు.. గిట్టుబాటు ధర కావాలన్నారు. రైతుబంధు పేరుతో భూస్వాములకు డబ్బులిస్తున్నారని, రోగం ఒకటైతే మందొకటి వేసినట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఒక్కో పంటకు ఒక్కోలా రుణమిస్తున్నాయని, సగం పెట్టుబడి అవసరాలు కూడా తీరక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ‘రైతు ప్రగతి సదస్సు’జరిగింది. కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భం గా దాసోజు శ్రవణ్‌కుమార్ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాం లో చేపట్టిన భూసంస్కరణల నుంచి, హరిత విప్లవం, ఆహార భద్రత చట్టం, బ్యాంకుల జాతీయంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న వ్యవసాయ విధానాలను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.3,400 కోట్లు, మొక్కజొన్న రైతుకు రూ.28 వేల కోట్లు, వరి రైతుకు రూ.13 వేల కోట్లు, పత్తి రైతుకు 33,600 కోట్ల పంట నష్టం చెల్లించలేదని, ఇలా పంటలన్నింటికీ కలిపి మొత్తం లక్ష కోట్లకుపైగా రాష్ట్ర రైతాంగానికి నష్టం చేసిందని తన ప్రజెంటేషన్‌లో వివరించారు. 4 వేల మంది ఆత్మహత్య: ఉత్తమ్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో రూ.6.75 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారని, రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని వివరించారు. కానీ మార్కెట్ స్థిరీకరణ కోసం రూ.1000 కోట్లు బడ్జెట్లో కేటాయించలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతుబంధు ప్రచారం కోసం మాత్రం రూ.100 కోట్లతో దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకున్నారని విమర్శించారు. రైతుకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచే ఎందుకు బోనస్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, రూ.5 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సంక్షోభాన్ని తొలగించాలంటే మద్దతు ధర కల్పించడమే మార్గమని స్వామినాథన్ ఎప్పుడో సూచించారన్నారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.4 వేలు రైతుకు ఏమూలకూ సరిపోవని పేర్కొన్నారు. రైతులేమైనా బిచ్చగాళ్లా.. వారికి ముష్టి వేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి సీఎం ఎందుకు వెళ్లరని కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. సదస్సులో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఫెడరల్ ఫ్రంట్‌పై విరుచుకుపడ్డ దాసోజు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది బ్రాంతి అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అసమర్థతకు కేసీఆర్ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతుంటే.. కేసీఆర్ అణచివేత పాలన కొనసాగిస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నాటకం అడుతున్నారని అన్నారు. బీజేపీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ వ్యవహారశైలిని ఎండగడుతూ ఫ్రంట్‌లో భాగంగా ఆయన్ని కలిసిన నేతలందరికీ లేఖలు రాశామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రజల దృష్టి మళ్లీంచడానికే ఫెడరల్ ఫ్రంట్ నాటకమాడుతున్నారని లేఖలో వారికి వివరించినట్టు చెప్పారు. ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ ఇకముందు ఎవరిని కలిసిన వారికి ఇలాగే లేఖలు రాస్తామని పేర్కొన్నారు. -
ఒక్క హామీ నెరవేర్చలేదు!: దాసోజు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చలేదం టూ సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ విరుచుకుపడ్డారు. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా? దళిత, గిరిజను లకు మూడెకరాల భూమి ఇచ్చారా? గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా? నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలిచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించారా? నిజాం చక్కెర కర్మాగారం, సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లును తెరిపించారా? ఇవేమీ చేయకుండానే అన్నీ చేసేశామని కేసీఆర్ అండ్ కంపెనీ ప్రగల్భాలు పలుకుతోంది. కట్టని డబుల్ బెడ్రూం ఇండ్లు కనబడటం లేదా? అని ప్లీనరీలో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండానే 100 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. స్కిజోఫ్రినియా వ్యాధి ముదిరి భ్రాంతిలో బతుకుతున్న టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలను కూడా భ్రాంతిలోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
విచారణకు భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: డాక్యుమెంట్లు, ఆధారాలతోసహా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీల బాగోతాలు, అవినీతి అంశాలను తాము బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందించకుండా బినామీ సైదిరెడ్డితో ప్రకటనలు ఇప్పించారని, జగదీశ్వర్‌రెడ్డి అవినీతిపై ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని నిలదీశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కుడకుడ గ్రామంలో సర్వే నంబర్ 301, 302లో ఉన్న సాయి డెవలపర్స్‌కు చెందిన ప్రైవేట్ భూమిని రూ.18 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సూచించారని, ఆయన సూచన మేరకే కొనుగోలు చేశామని కలెక్టర్ ప్రొసీడింగ్స్‌లో (లెటర్ నంబర్ ఇ1–143–2017, తేదీ 02–08–2017) పేర్కొన్నారని, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రమేయం ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా సీఎం కేసీఆర్ దృష్టికి ఎందుకు రావడం లేదో తమకు అర్థంకావడం లేదని, జగదీశ్వర్‌రెడ్డి అంటే కేసీఆర్‌కు గారాబం ఎందుకని ఎద్దేవా చేశారు. దళితుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీదనే కేసీఆర్ తన ప్రతాపాన్ని చూపారని, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రెడ్డిల అవినీతిపై తాము ఆధారాలతో మాట్లాడినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే సైదిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డికి బినామీ అయితే, జగదీశ్వర్‌రెడ్డి కేసీఆర్ బినామీనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అలా కాకపోతే విచారణ జరిపేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయంపైనా మంత్రి కేటీఆర్ ట్వీటర్లో స్పందిస్తారని, కానీ జగదీశ్వర్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. ఇది పక్కాగా క్విడ్‌ప్రోకో తరహాలో ఉందని, సైదిరెడ్డికి హుజూర్నగర్ టికెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన ద్వారా కోట్ల రూపాయలు జగదీశ్వర్‌రెడ్డికి ముడుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో తాము చీఫ్ విజిలెన్స్ కమిషనర్, లోకాయుక్తకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్టు శ్రవణ్ వెల్లడించారు. -
భజన కోసమే అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు భజన చేసేందుకే నిర్వహించారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా కల్వకుంట్ల రాజ్యంలో దుర్యోధనుడి స్ఫూర్తితో సభ నడిపించారని అన్నారు. రాష్ట్ర సంపదను పెంచామని అసెంబ్లీలో చెబుతున్న కేసీఆర్.. రాష్ట్ర అప్పులను కూడా పెంచామని చెబితే బాగుండేదని పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ రంగానికి ఎంత కేటాయించామో, ఎంత ఖర్చు చేశామో చెప్ప కుండా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పెద్ద బోగస్ అని, దీన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు గత బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మళ్లీ ఇప్పుడు రూ.2,000 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రైతులకు వ్యవసాయభూమి, ఇళ్లు, ఉచిత విద్య అందిస్తామన్న హామీలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల విషయంలో తాము అందరికీ ఇస్తామని చెప్పలేదని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెబు తున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గిరిజన, మైనార్టీలకు రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం విషయంలో ప్రజలను కేసీఆర్ మోసగిస్తున్నారని ఆరోపించారు. -
మిడతల్లా మాడిపోతారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న దానిపై ప్రజలు వాస్తవం గ్రహిస్తే కేసీఆర్, ఆ పార్టీ నేతలు ప్రజల ఆగ్రహానికి మిడతల్లా మాడిపోతారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినవి రైతు సమన్వయ సమితులు కావని, రాజకీయ సమన్వయ సమితులని పేర్కొన్నారు. అసమర్థతతో రైతులకు మద్దతు కల్పించకుండా ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. రైతు సమస్యలు, ఆత్మహత్యల గురించి మాట్లాడకుండా జాతీయ రాజకీయాలు తెరమీదకి తెచ్చి హంగామా చేయడం మీకు అలవాటని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. -
'ఆ మంత్రికి నీతి, జాతి లేదు'
హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు నీతి, జాతి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిథి దాసోజు శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో.. ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. హిమాన్షు మోటార్ పై కేటీఆర్ చెప్పినవి పచ్చి అబద్దాలు అని చెప్పారు. తనకు సంబంధం లేదన్న కేటీఆర్.. మొన్న ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో చూపింది నిజం కాదా అని ఈ సందర్భంగా శ్రావణ్ ప్రశ్నించారు. టెండర్లు లేకుండా వెంకయ్య నాయుడు కుమారుడికి చెందిన టొయోటా కంపెనీకి ఇన్నోవాలను కొన్నది నిజం కాదా సూటిగా అడిగారు. ఐటీ అవకతవకలకు పాల్పడుతున్న స్వర్ణ భారతి ట్రస్టుకు ఎందుకు రాయితీలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయతీ ఉంటే స్వర్ణ భారతి, హిమాన్షు, సాండ్ మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేనిపక్షంలో గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలంటూ కేటీఆర్ కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ సవాల్ విసిరారు. -
ఆ వెబ్‌సైట్‌ను ఎప్పటిలోపు పునరుద్ధరిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచే వెబ్‌సైట్‌ను ఎప్పటిలోపు పునరుద్దరిస్తారో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను తెలంగాణ సర్కార్ మూసివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెబ్‌సైట్‌ను గతంలో వలే అందరూ ఉపయోగించుకునేందుకు వీలుగా పునరుద్దరించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, గతంలో ఈ వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉండేదని, తద్వారా ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలందరికీ ఉండేదన్నారు. అయితే ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే గత నెల నుంచి వెబ్‌సైట్‌ను మూసివేసిందని, దీని వల్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండాపోయిందని ఆయన వివరించారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రభుత్వ పాలన గురించి, అది జారీ చేసే ఉత్తర్వుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను మూసివేయడం ద్వారా పారదర్శకతకు ప్రభుత్వం పాతరేసినట్లయిందన్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను తెలుసుకునే అవకాశం లేకుండా చేయడం రాజ్యాంగంలోని అధికరణ 19(1)కి, సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఏం చెబుతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి ఐటీశాఖ తరఫు న్యాయవాది నజీబ్‌ఖాన్ బదులిస్తూ, వెబ్‌సైట్‌ను మూసివేయలేదని, కొంత కాలం వరకు మాత్రమే అది ప్రజలకు అందుబాటులో ఉండదన్నారు. వెబ్‌సైట్‌ను క్రమబద్ధం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు తగిన మార్గదర్శకాలు జారీ చేశామని ఆయన వివరించారు. లోపాలను సరిదిద్దిన తరువాత వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఎప్పటిలోపు వెబ్‌సైట్‌ను పునరుద్దరిస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.