సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో ప్రజలు 15 రోజులు తనకు కేటాయించి గెలిపిస్తే. ఐదేళ్లు వారికి సేవ చేసుకుంటానన్నారు.
దానం నాగేందర్‌లాగా తనకు చిల్లర రాజకీయాలు చేయడం రాదని చెప్పారు. ఆయనలా తాను భూ కబ్జాలు, దందాలు చేయలేదన్నారు. ఒక డ్రైవర్‌గా ఉన్న దానం దందాలు, రాజీకీయాలు చేసి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. దానం నాగేందర్ పీజేఆర్‌ను మానసికంగా హింసించి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు. దానం అంటేనే దందాలు, దౌర్జన్యాలు, దళాలు అని ఎద్దేవా చేశారు. దానం ఎన్ని కుట్రలు చేసినా ఖైరతాబాద్‌లో తానే గెలుస్తానని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment