సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 164(ఎ) ప్రకారం మంత్రుల సంఖ్య 15 శాతం మించకూడదన్నారు. మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ ఉండకూడదన్న విషయాన్ని అటు సీఎం కానీ, ఇటు గవర్నర్ కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి మండలి సూచనల మేరకు గవర్నర్ చేయాలన్నారు. ఆర్థిక మంత్రి లేకుండా పరిపాలన ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు మంచి రోజుల రాబోతున్నాయి
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారని దోసోజ్ శ్రవణ్ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులనే టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని విజయం సాధించారని ఆరోపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని సాధించేల పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు మంచిరోజులు రాబోతున్నాయని.. దానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అవకతవకలకి పాల్పడిందన్న ఆరోపణలకి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఊతం ఇచ్చాయన్నారు. ప్రజారస్వామ్యంపై గౌరవం పోకముందే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment