
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు.
గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే.