Tamilisai Sundararajan
-
‘గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తిరస్కరణ’.. దాసోజు శ్రవణ్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా -
లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు.. బీజేపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. తొలుత శుక్రవారమే కలిసి వినతిపత్రం సమర్పించాలని భావించినా, గవర్నర్ అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో కార్యక్రమాన్ని 18వ తేదీకి మార్చారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని పార్టీ అభిప్రాయపడింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. లీకేజీ వ్యవహారంపై బీజేపీ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ గురువారం రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ అధ్యక్షతన సమావేశమమైంది. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలని, కమిషన్ చైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని కమిటీ డిమాండ్ చేసింది. గ్రూప్–1, ఏఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైనట్లు ప్రాథమికంగా అంచనా వేసిన కమిటీ.. మిగిలిన పేపర్ల లీకేజీ సంబంధిత అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్‌కు లింకులున్నాయా? లీకేజీకి సంబంధించిన పలు అంశాలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించింది. ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయి? దీని వెనుక ఎవరున్నారు? చైర్మన్‌పై ఏమైనా ఒత్తిడి ఉందా? కింది స్థాయి సిబ్బందికి నేరుగా ప్రగతి భవన్‌తో లింకులున్నాయా? తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. కాగా కేంద్రం 2011లో చేసిన ఐటీ చట్ట సవరణ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే అన్ని శాఖల్లోని ఐటీ విభాగాలు తప్పనిసరిగా కేంద్రం నియమించిన థర్డ్ పార్టీ నిర్వహించే సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వ శాఖ వెబ్‌సైట్‌కూ ఆడిట్ సర్టిఫికెట్ లేదనే విషయం పలువురు సభ్యులు ప్రస్తావించారు. నష్టపోయే విద్యార్థులకు పరిహారంపై ఒత్తిడి పరీక్షల రద్దుతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్న నేపథ్యంలో వారందరికీ రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కమిటీ నిర్ణయించింది. అయితే గత షెడ్యూల్ మేరకు ఆయా పరీక్షలన్నీ నిర్వహించి ఉద్యోగ నియామకాలను పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కూడా తీర్మానించింది. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ కన్వీనర్ సీహెచ్.విఠల్, సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చంద్రవదన్, టి.క్రిష్ణప్రసాద్, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఎస్.కుమార్, కరుణా గోపాల్ పాల్గొన్నారు. అక్రమాలపై న్యాయపోరాటం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు ధరణి స్కాం, జీహెచ్ఎంసీ నకిలీ సర్టిఫికెట్ల స్కాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెల్లింపుల స్కాం సహా ఇరిగేషన్ శాఖలో భారీగా కుంభకోణాలు జరుగుతున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికంతటికీ ఐటీ శాఖ పరిధిలో ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తున్న లోపాలే కారణమని అంచనాకు వచ్చారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం న్యాయపోరాటం చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. -
రాజ్‌భవన్.. నివురుగప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు. నాడు రామ్‌లాల్ నుంచి.. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్‌తో కుముద్‌బెన్ కోల్డ్‌వార్ సాగింది. నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
భారత్ బలాన్ని చాటేలా.. పరిశోధనలుండాలి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి సహా చాలా మంది ప్రముఖులను ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి అందించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో నేటి తరం పాత్ర కీలకమని ఉద్బోధించారు. భారత్ బలాన్ని ప్రపంచానికి చాటే దిశగా యువత పరిశోధనలు ఉండాలని ఆకాంక్షించారు. బుధవా రం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వెలుగులు విరజిమ్ముతోందని కీర్తించారు. వైఎస్ జగన్, కేసీఆర్‌తో విశ్వవిద్యాలయానికున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగానికెదిగిన ప్రముఖులను ప్రస్తావించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి, పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఐహెచ్ లతీఫ్, క్రీడాకారిణి సానియా మీర్జా అనేక మంది వర్సిటీ పూర్వ విద్యార్థులే అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ సైతం పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. పరిశోధనల కేంద్రం దేశ ఆయుధాగారంలో ప్రధాన క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఉస్మానియా యూనివర్సిటీ లేబొరేటరీలతో కలసి నిర్వహించడం గర్వించదగ్గ పరిణామమని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్‌లో భారత్ పురోభివృద్ధిలో ఉందన్నారు. రొబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, వేగవంతమైన సమాచార వ్యవస్థను భారత్ సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఏ దేశ బలానికైనా ఆర్థిక, సాంకేతిక అంశాలే కొలమానమని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయికి ఎదగాలి ఉస్మానియాలో చదివిన విద్యార్థులు దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జీవితానికి విజయ సూచిక అని పేర్కొన్నారు. వర్సిటీని వీడి వాస్తవ జీవితంలోకి వెళ్తున్న విద్యార్థులకు సమాజమే ప్రయోగశాల అని చెప్పారు. ఓయూ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వించేలా ఉండాలని సూచించారు. పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలను చేపట్టాలన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. మీ జీవితాలు తెల్లకాగితం లాంటివి అందులో ఎలా రాసుకుంటే అలా భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కెమిస్ట్రీలో 5బంగారు పతకాలు సాధించిన ఎస్.సుశాంత్, 4 బంగారు పతకాలు సాధించిన మహేష్కర్, గోల్డ్‌మెడల్స్ సాధించిన ఇతరులను అభినందించి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
మణికొండ: మన పండుగలు, సంస్కృతి, తెలుగుభాష, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని ఓం కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న తెలుగు సంగమం సంక్రాంతి మూడవ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ, తమిళిసై ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు, సినీగేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. -
స్కాట్స్ అండ్ గైడ్స్ సేవాధృక్పదాన్ని కొనియాడిన గవర్నర్
-
అక్రమ తవ్వకాలపై కోర్టును ఆశ్రయిస్తాం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నింబంధనను తొలగించటాన్ని అడ్డుకోవాలని గవర్నర్ తమిళిసైను బీజేపీ నాయకులు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి కలిశారు. అనంతరం కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ మైనింగ్‌పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. రెండు విషయాలపై గవర్నర్‌ను కలిసినట్లు, గ్రానైట్‌పై జరుపుతున్న అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 2008 నుంచి 2011 నాటికి ఎనిమిది క్వారీలలో అనుమతులు ఇచ్చినప్పటికీ అధికారులు అంతకుమించి తవ్వకాలు జరిపారని ఎంపీ విమర్శించారు. ఈ విషయంపై రానున్న రోజుల్లో కోర్ట్‌ను సైతం ఆశ్రయిస్తామని, అక్రమ మైనింగ్ సంబంధించి వేసిన ఫైన్ రూ. 749 కోట్లు బకాయిలు కట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మైనింగ్ తవ్వకాలు చేస్తూ.. కార్మికుల ఇవ్వాల్సిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని, గ్రానైట్, మైనింగ్ విషయంలో గతంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. మైనింగ్ పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. -
‘అమితా’నందం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాక కమలనాథుల్లో ఉత్సాహం నింపింది. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన తమ అధినేతకు బ్రహ్మరథం పట్టారు. అమిత్ షాతో పీఎంకే నేత అన్భుమణి రాందాసు, ఐజేకే నేత పచ్చముత్తు పారివేందర్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దృష్టి పెట్టారు. ఇది వరకు అనధికారిక పర్యటనతో చెన్నైకి వచ్చారు. అధికారిక పర్యటనగా శనివారం తమిళనాట అడుగు పెట్టారు. కేరళ పర్యటనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం చెన్నైలోకి అడుగు పెట్టిన తమ అధినేతకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, జాతీయ నేతలు మురళీధరరావు, ఇల గణేషన్, హెచ్.రాజ తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అమి త్ షా కాసేపు గిండిలోని ఓ హోటల్లో బస చేశారు. మిత్రులతో భేటీ పీఎంకే అధినేత రాందాసు తనయుడు, ఎంపీ అన్భుమణి రాందాసు, ఆ పార్టీ సీనియర్ నేత ఏకే.మూర్తి తదితరులు అమిత్ షాను కలుసుకున్నారు. అలాగే ఐజేకే నేత పచ్చముత్తు పారివేందర్, పుదియనిధి కట్చి నేత ఏసీ షణ్ముగం భేటీ అయ్యారు. అన్భుమణి మీడియాతో మాట్లాడుతూ తమిళులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అమిత్ షా దృష్టికి తెచ్చేందుకు వచ్చామన్నారు. జాలర్లపై దాడులు, కావేరి, ముల్లై పెరియార్ వివాదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరామన్నారు. బలమైన శక్తిగా అవతరిద్దాం మరై మలైనగర్ వేదికగా శనివారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా యూపీఏ పాలనను ఎండగట్టారు. ఆరు నెలల తమ పాలన గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, మరి పదేళ్లు వాళ్లేమి చేశారోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోడీ దూతగా ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామగ్రామాన తిరిగి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని, మార్చి మార్చి అధికారం అప్పగించే పద్ధతిని వీడాలని కోరారు. తమిళులు గౌరవప్రదంగా జీవిం చాలన్నా, తమిళ ఖ్యాతిని చాటే విధంగా ముందుకు సాగాలన్నా బీజేపీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించేందుకు ప్రతి కార్యకర్తా శ్రమించాలని పిలుపు నిచ్చారు. సినీ గ్లామర్ నటి గాయత్రీ రఘురాం, సంగీత దర్శకుడు గంగై అమరన్, నటి కుట్టి పద్మినిలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. డీఎంకే నుంచి బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ బీజేపీలో చేరనున్నట్లు తమిళ పత్రికల్లో ప్రకటనలు వెలువడ్డాయి. అయితే సభలో ఆయన కనిపించలేదు. నెపోలియన్ ఆదివారం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. చెన్నైలోని కమలాలయంలో అమిత్ షా ఆదివారం తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. చివరగా పార్టీ జిల్లాల కార్యదర్శులతో భేటీ కానున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ ప్రక్రియకు శ్రీకారం చుడతారు.