సంప్రదాయాలను భావితరాలకు అందించాలి | Tamili Sai Attends Telugu Sangam Sankranti Third Composition At Hyderabad | Sakshi
Sakshi News home page

సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

Published Mon, Jan 20 2020 2:10 AM | Last Updated on Mon, Jan 20 2020 2:12 AM

Tamili Sai Attends Telugu Sangam Sankranti Third Composition At Hyderabad - Sakshi

కృష్ణంరాజు దంపతులను సత్కరిస్తున్న గవర్నర్‌లు దత్తాత్రేయ, తమిళిసై. చిత్రంలో సిరివెన్నెల, మురళీధర్‌రావు తదితరులు

మణికొండ: మన పండుగలు, సంస్కృతి, తెలుగుభాష, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని ఓం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న తెలుగు సంగమం సంక్రాంతి మూడవ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ, తమిళిసై ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు, సినీగేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement