
రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్‌గోపాల్‌రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే.. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా?. కాంగ్రెస్ పార్టీకి వీడేందుకు ముఖ్యనేత దాసోజు శ్రవణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్.. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే..
పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి.. తన రాజీనామా నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మునుగోడు పోరు రసవత్తరం.. కాంగ్రెస్‌లో చేరిన చెరుకు సుధాకర్