సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పోలింగ్ బూత్‌లకు అభ్యంతరం లేని రంగు వాడాలని కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. మహిళా ఓటర్లను చైతన్య పరిచి, ఎన్నికల్లో వారి ఓట్ల శాతం పెంచే నెపంతో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే కుట్ర పూరిత విధానానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచడం మంచిదే అయినప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీ జెండా రంగు అయిన గులాబీని పోలింగ్ కేంద్రాలకు వాడటం సరికాదన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను తక్షణమే నిలిపే సి, అభ్యంతరం లేని మరో రంగును పోలింగ్ బూత్‌లకు వాడాలని దాసోజు కోరారు. పోలింగ్ బూత్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ రంగును వాడొద్దని ఇప్పటికే ఎన్నికల సంఘానికి విన్నవించామని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు.
పొత్తులపై కోర్ కమిటీకి ఉత్తమ్ నివేదన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా కూటమి పొత్తులపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ కోర్ కమిటీలో కీలక నేత గులాం నబీ ఆజాద్‌కు ఇక్క డ నివేదించారు. మంగళవారం ఆజాద్‌తో సమావేశమైన ఉత్తమ్ ప్రజా కూటమిలో టీడీపీ, టీజే ఎస్, సీపీఐ కోరుతున్న సీట్ల సంఖ్యపై చర్చిం చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రజాకూటమి ముందుకు సాగడంలో టీడీపీ సయోధ్యతో ఉం దని, గెలిచే సీట్లపైనే ఆ పార్టీ దృష్టి సారించిందని తెలిపినట్లు సమాచారం. కోర్ కమిటీ ఈ పొత్తులను ఆమోదిస్తే తదుపరి అభ్యర్థుల జాబితా ప్రకటనపై, ప్రచారంపై దృష్టి పెట్టొచ్చని ఉత్తమ్ కోరినట్టు సమాచారం. కూటమి గెలుపునకు సానుకూల వాతావరణం ఏర్పడిందని, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏడెనిమిది రోజుల పాటు ఇక్కడ ప్రచారంలో ఉండేలా చొరవ తీసుకోవాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
స్క్రీనింగ్ కమిటీతోనూ సమావేశం..
తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్‌తోనూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల అభిప్రాయాల సేకరణ అనంతరం సామాజిక వర్గాల కూర్పుపై ఉత్తమ్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment