panchayath election
-
పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యున్ని దుండగులు హత్య చేశారు. ఇది అధికార టీఎంసీ పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు. కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతా ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి బామ్మర్థి శంభు దాస్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శంభు దాస్ కోడలు విసాఖా దాస్ కిస్మాత్ దాస్‌గ్రామ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. శంభుదాస్‌ను రాత్రి సమయంలో దుండగులు ఇంటి నుంచి బయటకు పిలిచి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాల్డా జిల్లాలో టీఎంసీ కార్యకర్తను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు కారకులు కాంగ్రెస్ కార్యకర్తలేనని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతున్ని ముస్తఫా షేక్‌గా గుర్తించారు. ఈ ఘటన మరవక ముందే దిన్హంతా ప్రాంతంలో తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య జరగడం గమనార్హం. కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతాలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు టీఎంసీ మద్దతుదారులు చించేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితీష్ ప్రమాణిక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. టీఎంసీ గుండాలు బీజేపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ప్రమాణిక్ ఆరోపించారు. నామినేషన్‌కు వచ్చిన అభ్యర్థులపైన రాళ్లు రువ్వారని, బాంబులు వేశారని చెప్పారు. నామినేషన్ వేళ అల్లర్లు.. జులై 8న బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్‌కు గురువారం చివరి తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. నామినేషన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే అల్లర్లలో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులు బాంబులు విసురుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
ఫిబ్రవరి 1న ఉత్తరాంద్రలో పర్యటించనున్న నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాల్లో భాగంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. రేపు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఫిబ్రవరి 1న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న నిమ్మగడ్డ.. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ రోజు రాత్రికి విశాఖలోనే బస చేసి, మరుసటి రోజు కాకినాడ, ఏలూరు పట్టణాల్లో ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రానికి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. -
'ఎస్ఈసీ పిటిషన్ ఆమోదయోగ్యంగా లేదు'
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ తన వాదన వినిపించారు. 'రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ అప్పీల్ విచారణకు ఆమోదయోగ్యమైనది కాదు.ఎన్నికల ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.సీఎస్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది.. ఆ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ గురించి ఏజీ శ్రీరామ్ ధర్మాసనంకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రభుత్వం ముందు వ్యాక్సిన్ అందిస్తుందని పేర్కొన్నారు. -
ఏపీ స్థానిక ఎన్నికలకు హైకోర్టు అనుమతి
-
మూడో విడత పోలింగ్ ప్రారంభం.. 23 గ్రామాల్లో ఎన్నికల బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో భూపాలపల్లి జిల్లాకు చెందిన 23 పంచాయతీల్లో ఎన్నికలను నిలిపివేశారు. -
ఈసారి ఎడమ చేయి మధ్య వేలికి సిరా
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికి సిరా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా పెట్టిన సంగతి తెల్సిందే. అప్పుడు పెట్టిన సిరా వేలిపై ఇంకా తొలగిపోకపోవడంతో అయోమయానికి గురికాకుండా ఉండేందుకు మధ్య వేలికి సిరా గుర్తును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే. -
పంచాయతీ ఎన్నికలకు ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: బీసీ లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ గణనతోపాటు చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్నాయని, అందుకు విరుద్ధంగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పంచాయతీల కాల పరిమితి ముగిసిందని, అయినా ఎన్నికలు నిర్వహించకపోవడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌కు చెందిన జెడ్పీటీసీ బి.సతీశ్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. ఆ ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ బాధ్యతలను నిర్వర్తించకుండా ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 2017 ఆగస్టులోనే ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ..‘‘బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నేనే ఈ ఏడాది జూన్‌లో ఆదేశాలిచ్చాను. బీసీ జనాభా గణన ఇంకా పూర్తి కాలేదు. అలాంటప్పుడు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఎలా ఆదేశించగలను? నేను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయి. వాటిపై అప్పీల్ దాఖలు చేయలేదు. వాటిని ఎత్తివేయాలంటూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఆ ఉత్తర్వులు అమల్లో ఉండగా, వాటికి విరుద్ధంగా వెంటనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కానే కాదు. బీసీ గణన ముఖ్యం. అవి తేలితేనే రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఆ తర్వాత ఎన్నికలు జరుగతాయి’’అని స్పష్టంచేశారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పంచాయతీల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వివరించారు. ‘‘ఎన్నికలు జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్లను నియమించుకుంటే నియమించుకుంటారు. ఆ విషయంలో జోక్యం చేసుకోలేం’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్లు కోరుతున్నట్టుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
‘పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’
సాక్షి, హైదరాబాద్ : చట్ట సభలు, గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపి పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మరింత అణిచివేసే ధోరణిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దంగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేలా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52శాతం అని చెప్పి.. ఇప్పుడు 34శాతం అని తప్పుడు లెక్కలు చూపుతూ బీసీలకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నికులాల గణాంకాలను ఇంటింటికి తిరిగి మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఏ,బీ,సీ,డీ ఈ ప్రాతిపదికగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు అన్యాయం జరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా బీసీల రిజర్వేషన్ శాతాన్ని విడుదల చేయాలన్నారు. న్యాయం కోసమై బీసీ కులాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. -
వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు
తాండూరు : గ్రామ పంచాయతీ ఎన్నికలు జూలై నెలాఖరు లోపు పూర్తవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 60 గిరిజనతండాలు, అనుబంధ గ్రామాలను కొత్త జీపీలుగా ఏర్పాటు చేశామన్నారు. 200 మంది ఓటర్లున్న తండాలు, 300 నుంచి 500 మంది ఓటర్లున్న అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా గుర్తించామని స్పష్టంచేశారు. వీటన్నింటికీ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించామని తెలిపారు. గ్రామాల అభివద్ధిపై సీఎం కేసీఆర్ దష్టిసారించారన్నారు. వచ్చే నెలలో ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈనెల 26న పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారవుతాయని చెప్పారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది అన్నదాతలకు రైతుబీమా పథకం కింద రూ.12 వేల కోట్లు అందజేశామని చెప్పారు. జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నవాబ్‌పేట, యాలాల మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాండూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ రూ.50 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ఇందులో రూ.25 కోట్లతో అభివద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని త్వరలో తాండూరు మున్సిపాలిటీలో అభివద్ధి పనులు జరుగుతాయన్నారు. తాండూరు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు రానున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, టీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
సర్పంచ్ అభ్యర్థి ఖర్చు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి బాగా పెరిగింది. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే వారి ఖర్చులను భారీగా పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచినట్లు పేర్కొంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం కల్పించింది. ఇలాంటి గ్రామాల్లో వార్డు సభ్యుడు గరిష్టంగా రూ.50 వేలు ఖర్చు చేయవచ్చు. 5 వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు.. వార్డు సభ్యుడిగా బరిలో ఉన్న వారు రూ.30 వేల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. గతంలోనూ సర్పంచ్, వార్డు సభ్యుల ఖర్చు గరిష్ట పరిమితి రెండు రకాలుగా ఉండేది. ఐదు వేల జనాభా కంటే ఎక్కువున్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.80 వేలు, వార్డు సభ్యుడి పరిమితి రూ.10 వేలు ఉండేది. సాధారణ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.40 వేలు, వార్డు సభ్యుడికి రూ.6 వేలు ఉండేది. తాజా నిర్ణయంతో ఈ పరిమితులన్నీ మారాయి. లెక్క చెప్పాల్సిందే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా ఖర్చు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఖర్చు లెక్కలు సమర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు పదవులను, పోటీ చేసే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. పోటీ చేసిన వారు ఎన్నిక ముగిసిన 40 రోజుల్లోపు ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి. ఈ గడువులోపు వివరాలను సమర్పించని వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షార్ట్ నోటీసు జారీ చేస్తుంది. 20 రోజుల్లోగా వివరాలు సమర్పించాలి. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుంది. షార్ట్ నోటీసుకు స్పందించని వారిపై మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తుంది. ఎన్నికల ఖర్చు లెక్కలకు సంబంధించి ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలి. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి రోజువారీగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. -
ముందస్తు పంచాయితీ..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : వచ్చే డిసెంబర్లో లోక్‌సభతో పాటు 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు ప్రారంభించిందన్న వార్తలు ఒకవైపు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్న సంకేతాలు మరోవైపు... వెరసి రాజకీయ వర్గాల్లో ఎన్నికలపై గందరగోళం నెలకొంది. పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం జూలై నెలాఖరుతో పూర్తవుతుందన్న నేపథ్యంలో గత జనవరి నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఓటర్ల జాబితాల తయారీ మొదలు కొత్త, పాత గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి కూడా మొదలైంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లలోకి వచ్చి చేరాయి. అంతా పంచాయతీ ఎన్నికలకు సిద్ధమని భావిస్తున్న పరిస్థితుల్లో తాజాగా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, డిసెంబర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2019లో జరిగే ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరిపే అవకాశం ఉందనే కీలక సమాచారంతో పరిస్థితి తారుమారు కాబోతోంది. ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధపడితే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముందస్తుకు నేతలు సన్నద్ధం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు విపక్ష పార్టీల నేతలు కూడా ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమయ్యే ఉన్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకొ చ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇచ్చారు. ఎప్పుడు ఎన్ని కలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉపదేశించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికలు ముందస్తుగానే డిసెంబర్‌లోపే జరుగుతాయని చెబుతూ బస్సు యాత్రలు చేశారు. ఇటీవల ఉమ్మ డి ఆదిలాబాద్‌లో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తా ను పాల్గొన్న ప్రతి సభలో డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయనే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఇప్పటికే సన్నద్ధమై ఉన్నారు. ‘పంచాయితీలు’ వద్దంటున్న ఎమ్మెల్యేలు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు ఏ ర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికార పార్టీ శాసనసభ్యులు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. పంచా యతీ ఎన్నికల వల్ల గ్రామాల్లో ముఠాలు ఏర్పాటై భవిష్యత్తులో సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఇద్దరు ఎ మ్మెల్యేలు నేరుగా అధిష్టానానికే తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఎంత హడావుడి జరుగుతున్నా, ఎమ్మెల్యేలు సం యమనంతోనే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యం లో కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే అది తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం ఓట్లు రాలుస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఆమోదముద్ర పడని బీసీ ఓటర్ల జాబితా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు బీసీ ఓటర్ల జాబితానే ప్రామాణికం. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో బీసీ ఓటర్ల గణన ప్రక్రి య పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపిం చినప్పటికీ, కొన్ని జిల్లాల్లో బీసీ గణనలో తలెత్తిన ఇబ్బందులతో ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల వార్తలు రాజకీయ నాయకుల్లో కొత్త జోష్‌ను నింపుతున్నాయి. ముందస్తుకు ఎమ్మెల్యేలు సిద్ధమే కానీ... ముందస్తు ఎన్నికలకే కేంద్రం సిద్ధపడితే తమకేమీ అభ్యంతరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. కేసీఆర్ ఛరిష్మాతో పాటు రైతుబంధు పథ కం తమను ఆదుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కె ట్లు లభించే పరిస్థితి లేదనే ప్రచారంతో జిల్లాలోని నలుగురైదుగురు ఎమ్మెల్యేలలో కొంత అభద్రతా భావం చోటు చేసుకుంది. మంచిర్యాల, ఆదిలా బాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలలో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలకు స్థానచలనం కలుగుతుందని జరుగుతున్న ప్రచారం కూడా వారికి ఇబ్బందిగా మారింది. అయితే పంచాయతీ ఎన్నికల కన్నా ముందే సాధారణ ఎన్నికలు జరిగితే టెన్షన్ పోతుందనే ధోరణితో వారున్నారు. విపక్షాలు సైతం ముందస్తు ఎన్నికలకే ... అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై వచ్చే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం లేదు. ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు గ్రూపులు కాం గ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గ్రూపుగా , ఆయన వ్యతి రేక గ్రూపుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలు విడిపోయారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు కన్నా ఎక్కువగానే టిక్కెట్లు ఆశిస్తున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, చెన్నూర్, సి ర్పూర్ వంటి నియోజకవర్గాల్లో ఈ గ్రూపుల కొ ట్లాట శ్రుతిమించి పోయింది. మిగతా సార్టీలు కూ డా ముందుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలే జరగా లనే భావిస్తున్నారు. ఆయా పార్టీలకు గ్రామస్థా యిల్లో పూర్తిస్థాయి యంత్రాంగం లేకపోవడంతో సర్పంచి ఎన్నికల కన్నా శాసనసభ ఎన్నికలే బెటర్ అనే ధోరణితో ఉన్నాయి. బీజేపీ తమకు పట్టున్న నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్, ముథోల్, నిర్మల్, బెల్లంపల్లి స్థానాలపై దృష్టి పెట్టింది. ఆయా ని యోజకవర్గాల్లో పార్టీ నేతలు తమ వంతు కార్యకలాపాలు సాగిస్తున్నారు. టీడీపీ ఒకటి రెండు ని యోజకవర్గాల్లో మినహా ఉనికి కోల్పోగా, తెలంగా ణ జన సమితి ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలోకి దింపే నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ పార్టీ కూ డా స్థానిక ఎన్నికల కన్నా శాసనసభ ఎన్నికలు జరగాలని చూస్తోంది. స్థానిక ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలా... సాధారణ ఎన్నికలా అనే మీమాంసలో రాజకీయ నాయకులు ఉన్నా... వా టితో సంబంధం లేకుండా నాలుగు జిల్లాల అధి కార యంత్రాంగం తమ విధులు యథాతథంగా జరుపుకుంటూ పోతోంది. ఓటర్ల జాబితా సవరణలు పూర్తి చేసి, రిజర్వేషన్ల ప్రక్రియపై దృష్టి పె ట్టింది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాగానే, జిల్లాలో జనాభా ప్రాతిపదికన పంచాయతీలను ఆయా వ ర్గాలకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘పంచాయతీ’కి సిద్ధం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలు, నియమావళి ప్రకారం అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరింది. ఇప్పటికే పోలింగ్బాక్సులు, జిల్లా, మండల కేంద్రాలకు చేరుకున్నాయి. ఓటర్ల జాబితా సవరణ, నమోదు, తుది జాబితా ప్రకటన ఈనెల 17న వెలువడనుంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారులు కసరత్తు ముగిసినట్లే. పంచాయతీ ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జోరందుకోవడంతో రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో తలపడేందుకు సన్నద్ధమవుతున్నాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీలలో అధికారుల కసరత్తు పూర్తిదశకు చేరిన నేపథ్యంలో పంచాయతీ యంత్రాంగం, మండల అధికారులు గ్రామ పంచాయతీల వారీ గా తుది జాబితాను విడుదల చేసే పనిలో నిమగ్నం అయ్యారు. 17న ఓటర్ల ఫైనల్ జాబితా.. తుదిదశకు చేరిన కసరత్తు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సవరణ కీలకం. ఈ ప్రక్రియలో భాగంగా గతనెల 30న ఓటర్ల జాబితాను ప్రదర్శించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఈ నెల 30న గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితాపై ఈనెల 1న జిల్లాస్థాయిలో, 3న మండలస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. 1 నుంచి 8 వరకు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, 13వరకు అభ్యంతరాలను పరిష్కంచనున్నారు. మిగిలిన నాలుగురోజుల్లో అన్ని రకాలుగా పరిశీలన చేసి 17న గ్రామ పంచా యతీ, వార్డులవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈ సారి గ్రామపంచాయతీ వారీగా జాబితా సిద్ధం చేసిన తర్వాత వార్డుల వారీగా కూడా రూపొందించనున్నారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విధంగా ఈ జాబితా ఉంటుందని ఇదివరకే అధికారులు ప్రకటించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వార్డుల సంఖ్య, స్థానికంగా ఉన్న జనాభాకు అనుగుణంగా సంబంధించిన వార్డులో ఓటర్లను కేటాయిస్తారు. అదేవిధంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసేటప్పుడు ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరినీ ఒకే వార్డులోకి వచ్చేలా చేర్చి ఈ సారి జాబితాను వెల్లడించనున్నారు. ఒక ఇంటి నంబరులో ఎంత మంది ఓటర్లు ఉన్నా వారంతా ఒకటే వార్డు పరిధిలోకి తీసుకువస్తున్నారు. 329 గ్రామ పంచాయతీలు, 313 జీపీలకే ఏర్పాట్లు.. జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం ఈసారి పంచాయతీ ఎన్నికలు జరిగే 313 పంచా యతీలకు మొత్తంగా 3,65,366 మంది ఓటర్లున్నట్లు అధికారులు తేల్చారు. ఇటీవల చేపట్టిన ఓటర్ల సవరణ, చేర్పులు, మార్పులు, నమోదులో భాగంగా మరో 15 పైచిలుకు ఓటర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా విభజన తర్వాత కరీంనగర్ జిల్లాలో 276 గ్రామపంచాయతీలు మిగలగా.. కొత్తగా ఏర్పాటైన 53 పంచాయతీలను కలుపుకుని మొత్తంగా పంచాయతీల సంఖ్య 329కి పెరిగింది. ఇందులో నగర పంచాయతీలుగా ఉన్న హుజూరాబాద్, జమ్మికుంట పురపాలిక హోదాను దక్కించుకున్నాయి. వీటికి అనుబంధంగా ఉన్న ఆరు గ్రామాలు విలీనమయ్యాయి. కరీంనగర్ చుట్టు పక్కల ఉన్న మరో 8 గ్రామాలు కార్పొరేషన్ పరిధిలోకి వెళ్లడంతో మొత్తంగా మార్పులు చేర్పుల తరువాత 313 గ్రామ పంచాయతీలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో 3,283 వార్డులున్నాయి. 1,84,068 పురుష ఓటర్లు, 1,81,284 మహిళా ఓటర్లు, 14 మంది ఇతరులు కలిపి మొత్తం 3,65,366 ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల కసరత్తు తుదిదశకు చేరుతుండగా.. ఈ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు సైతం సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పంచాయ తీ పాలకవర్గాల గడువు జూలై చివరిలో ముగియనుంది. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా స్థానిక పంచాయతీల్లో ప్రతిఓటూ కీలకమని గుర్తించిన ఆయా పార్టీల నాయకులు సైతం ముందస్తుగానే తమ కదలికల్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఊరూరా అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడంతోపాటు అనర్హులను తొలగించే కార్యక్రమంలోను చురుగ్గానే పాల్గొన్నారు. తుదిదశకు కసరత్తు షెడ్యూల్ ప్రకారం మే 17న తుది జాబితా విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం నియమావళి, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్బాక్సులు కూడా వచ్చాయి. అభ్యంతరాలపై పరిశీలన అనంతరం ఫైనల్ ఓటర్ల లిస్టును ప్రకటిస్తాం. – నారాయణరారావు, డీపీవో -
పంచాయతీ పోరుకు కసరత్తు!
స్థానిక ఎన్నికల పోరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2013లో కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఆగస్టు రెండో తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లోనూ నవంబర్ 30వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలంటూ తాజాగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి ఆదేశాలు చేరాయి. అరసవల్లి: పంచాయతీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సర్కార్ ఆదేశించి.. ఎన్నికలు ఖాయమనే సంకేతాలను పంపించింది. దీంతో అధికారులు ఓటర్ల జాబితా తయారీకి సన్నద్ధమవుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (3 ఏ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ప్రస్తుత పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్ 13(2) ప్రకారం గడువుకు మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ వెసులుబాటు ఆధారంగా గడువు కంటే ముందుగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల లభ్యత మేరకు వివిధ దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం పంచాయతీలకే ఎన్నికలు నిర్వహిద్దామని, ఆ తర్వాతే మిగిలిన స్థానికఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలు నిర్వహిద్దామనేఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆ ఏడు పంచాయతీలు దూరమే..! జిల్లాలో 2013లో మొత్తం 1100 పంచాయతీలకు గాను, 1099 పంచాయతీలకు, 10,542 వార్డులకు ఎన్నికలు జరిగాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీలో నగరానికి శివారు పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పెద్దపాడు పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటికీ అక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగుతుంది. దీంతో ఈసారి మరో కీలకమైన భూసేకరణ మార్పులతో అటు రణస్థలం మండలంలో కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం కారణంగా కొవ్వాడ పంచాయతీ పూర్తిగా మెర్జ్ అయ్యింది. అలాగే తాజాగా హిరమండలం పరిధిలోని చిన్న కొల్లివలస, పెద్ద సంకిలి, శిలగాం, దుగ్గిపురం, గార్లపాడు, పాడలి తదితర 6 పంచాయతీలు కూడా వంశధార ప్రాజెక్టు భూసేకరణ కారణంగా మెర్జ్ కానున్నాయి. దీంతో ఈ ఏడు పంచాయతీలు ఈసారి ఎన్నికలకు దూరం కావచ్చనే అభిప్రాయం దిగువస్థాయి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో తాజా పరిస్థితుల ప్రకారం ఈసారి 1093 పంచాయతీల్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలాఉంటే 2013æ ఎన్నికల తర్వాత జిల్లాలో కొన్నేళ్లుగా 36 పంచాయతీల సర్పంచులు, 221 వార్డు సభ్యుల స్థానాలు వివిధ కారణాలుగా ఖాళీలుగానే ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం గత రెండేళ్లుగా వాయిదాలు వేస్తూ వచ్చింది. దీంతో ఖాళీలుగా ఉన్న స్థానాలతో పాటు ప్రస్తుత పాలకవర్గాల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. పెరగనున్న ఓటర్లు! 2013లో జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 16 లక్షల మంది ఓటర్లు నమోదు కాగా, ఈసారి సుమారు 17.50 లక్షల మంది వరకు చేరవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను నవంబర్ 30వ తేదీ నాటికి సిద్ధం చేయాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. పంచాయతీల్లో అన్ని వార్డుల్లోనూ సమానంగా ఓటర్లను విభజించాల్సి ఉంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా వార్డుకో పోలింగ్ బూత్ ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవి సెలవులు పూర్తయ్యేలోగానే ఎన్నికలు తంతు ముగించాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ కారణంగానే నవంబర్ నెలాఖరుకు పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించడం, 2018 మార్చి 15 నాటికి ముద్రణ పనులు పూర్తి చేయాలని తాజాగా వచ్చిన ఆదేశాల్లో పీఆర్ కమిషనర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 16వ తేదీ లోగా రిజర్వేషన్లు ఖరారు! వచ్చే ఏడాది ఏప్రిల్ 16వ తేదీలోగా రిజర్వేషన్లను డివిజనల్ ఎన్నికల అధికారులైన ఆర్డీవోలు ఖరారు చేస్తారు. చట్ట ప్రకారం 50 శాతం పంచాయతీలు, వార్డులను మహిళలకు, అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఏప్రిల్ 17వ తేదీలోగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు పూర్తి చేసి జూన్ నుంచి జూలైలోగా ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణను ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. -
'అబ్బే.. అలాంటివారికి చోటివ్వం, సీట్లివ్వం'
లక్నో: ప్రజలను అవమానించేవారికి, వారిని బాధ పెట్టేవారికి తమ పార్టీలో చోటు ఉండదని, సీట్లు అంతకంటే ఇవ్వబోమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లలో ఉన్నారో తెలియజేయాలంటూ పార్టీ నేతలను ప్రశ్నించారు. 'పంచాయతీ ఎన్నికల సీట్ల కోసం చాలా పెద్ద క్యూ ఉంది. అంతకంటే ముందు ఈ క్యూలో ఉన్నవారంతా తాము మంచివారిమని నిరూపించుకోవాలి. ఏ మచ్చ లేకుండా కనిపించాలి. ఎందుకంటే ఈ క్యూలో ఉన్నవారిలో కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా ప్రజలను అవమానించేవారే. ఇబ్బందులు పెట్టేవారే. అందుకే మేం వీరికి సీట్లు ఇవ్వం' అని ములాయం చెప్పారు. తమ పార్టీ, ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్‌లో సరైన స్పందన రాలేదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నేతలు సమర్థంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 9, డిసెంబర్ 15న జరగనున్నాయి.