
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో భూపాలపల్లి జిల్లాకు చెందిన 23 పంచాయతీల్లో ఎన్నికలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment