పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యున్ని దుండగులు హత్య చేశారు. ఇది అధికార టీఎంసీ పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు.
కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతా ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి బామ్మర్థి శంభు దాస్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శంభు దాస్ కోడలు విసాఖా దాస్ కిస్మాత్ దాస్‌గ్రామ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. శంభుదాస్‌ను రాత్రి సమయంలో దుండగులు ఇంటి నుంచి బయటకు పిలిచి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మాల్డా జిల్లాలో టీఎంసీ కార్యకర్తను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు కారకులు కాంగ్రెస్ కార్యకర్తలేనని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతున్ని ముస్తఫా షేక్గా గుర్తించారు. ఈ ఘటన మరవక ముందే దిన్హంతా ప్రాంతంలో తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య జరగడం గమనార్హం.
కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతాలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు టీఎంసీ మద్దతుదారులు చించేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితీష్ ప్రమాణిక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. టీఎంసీ గుండాలు బీజేపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ప్రమాణిక్ ఆరోపించారు. నామినేషన్‌కు వచ్చిన అభ్యర్థులపైన రాళ్లు రువ్వారని, బాంబులు వేశారని చెప్పారు.
నామినేషన్ వేళ అల్లర్లు..
జులై 8న బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్‌కు గురువారం చివరి తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. నామినేషన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే అల్లర్లలో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులు బాంబులు విసురుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు
Comments
Please login to add a commentAdd a comment