ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. నీ ఓటు మాత్రం నాకే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : వచ్చే డిసెంబర్‌లో లోక్‌సభతో పాటు 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు ప్రారంభించిందన్న వార్తలు ఒకవైపు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్న సంకేతాలు మరోవైపు... వెరసి రాజకీయ వర్గాల్లో ఎన్నికలపై గందరగోళం నెలకొంది. పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం జూలై నెలాఖరుతో పూర్తవుతుందన్న నేపథ్యంలో గత జనవరి నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఓటర్ల జాబితాల తయారీ మొదలు కొత్త, పాత గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి కూడా మొదలైంది.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లలోకి వచ్చి చేరాయి. అంతా పంచాయతీ ఎన్నికలకు సిద్ధమని భావిస్తున్న పరిస్థితుల్లో తాజాగా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, డిసెంబర్‌లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2019లో జరిగే ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరిపే అవకాశం ఉందనే కీలక సమాచారంతో పరిస్థితి తారుమారు కాబోతోంది. ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధపడితే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ముందస్తుకు నేతలు సన్నద్ధం
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు విపక్ష పార్టీల నేతలు కూడా ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమయ్యే ఉన్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకొ చ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇచ్చారు. ఎప్పుడు ఎన్ని కలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉపదేశించారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికలు ముందస్తుగానే డిసెంబర్‌లోపే జరుగుతాయని చెబుతూ బస్సు యాత్రలు చేశారు. ఇటీవల ఉమ్మ డి ఆదిలాబాద్‌లో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తా ను పాల్గొన్న ప్రతి సభలో డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయనే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఇప్పటికే సన్నద్ధమై ఉన్నారు.
‘పంచాయితీలు’ వద్దంటున్న ఎమ్మెల్యేలు
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు ఏ ర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికార పార్టీ శాసనసభ్యులు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. పంచా యతీ ఎన్నికల వల్ల గ్రామాల్లో ముఠాలు ఏర్పాటై భవిష్యత్తులో సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఇద్దరు ఎ మ్మెల్యేలు నేరుగా అధిష్టానానికే తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఎంత హడావుడి జరుగుతున్నా, ఎమ్మెల్యేలు సం యమనంతోనే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యం లో కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే అది తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం ఓట్లు రాలుస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
ఆమోదముద్ర పడని బీసీ ఓటర్ల జాబితా
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు బీసీ ఓటర్ల జాబితానే ప్రామాణికం. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో బీసీ ఓటర్ల గణన ప్రక్రి య పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపిం చినప్పటికీ, కొన్ని జిల్లాల్లో బీసీ గణనలో తలెత్తిన ఇబ్బందులతో ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల వార్తలు రాజకీయ నాయకుల్లో కొత్త జోష్‌ను నింపుతున్నాయి.
ముందస్తుకు ఎమ్మెల్యేలు సిద్ధమే కానీ...
ముందస్తు ఎన్నికలకే కేంద్రం సిద్ధపడితే తమకేమీ అభ్యంతరం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. కేసీఆర్ ఛరిష్మాతో పాటు రైతుబంధు పథ కం తమను ఆదుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కె ట్లు లభించే పరిస్థితి లేదనే ప్రచారంతో జిల్లాలోని నలుగురైదుగురు ఎమ్మెల్యేలలో కొంత అభద్రతా భావం చోటు చేసుకుంది. మంచిర్యాల, ఆదిలా బాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలలో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలకు స్థానచలనం కలుగుతుందని జరుగుతున్న ప్రచారం కూడా వారికి ఇబ్బందిగా మారింది. అయితే పంచాయతీ ఎన్నికల కన్నా ముందే సాధారణ ఎన్నికలు జరిగితే టెన్షన్ పోతుందనే ధోరణితో వారున్నారు.
విపక్షాలు సైతం ముందస్తు ఎన్నికలకే ...
అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై వచ్చే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం లేదు. ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు గ్రూపులు కాం గ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గ్రూపుగా , ఆయన వ్యతి రేక గ్రూపుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలు విడిపోయారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు కన్నా ఎక్కువగానే టిక్కెట్లు ఆశిస్తున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, చెన్నూర్, సి ర్పూర్ వంటి నియోజకవర్గాల్లో ఈ గ్రూపుల కొ ట్లాట శ్రుతిమించి పోయింది. మిగతా సార్టీలు కూ డా ముందుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలే జరగా లనే భావిస్తున్నారు.
ఆయా పార్టీలకు గ్రామస్థా యిల్లో పూర్తిస్థాయి యంత్రాంగం లేకపోవడంతో సర్పంచి ఎన్నికల కన్నా శాసనసభ ఎన్నికలే బెటర్ అనే ధోరణితో ఉన్నాయి. బీజేపీ తమకు పట్టున్న నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్, ముథోల్, నిర్మల్, బెల్లంపల్లి స్థానాలపై దృష్టి పెట్టింది. ఆయా ని యోజకవర్గాల్లో పార్టీ నేతలు తమ వంతు కార్యకలాపాలు సాగిస్తున్నారు. టీడీపీ ఒకటి రెండు ని యోజకవర్గాల్లో మినహా ఉనికి కోల్పోగా, తెలంగా ణ జన సమితి ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలోకి దింపే నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ పార్టీ కూ డా స్థానిక ఎన్నికల కన్నా శాసనసభ ఎన్నికలు జరగాలని చూస్తోంది.
స్థానిక ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం
పంచాయతీ ఎన్నికలా... సాధారణ ఎన్నికలా అనే మీమాంసలో రాజకీయ నాయకులు ఉన్నా... వా టితో సంబంధం లేకుండా నాలుగు జిల్లాల అధి కార యంత్రాంగం తమ విధులు యథాతథంగా జరుపుకుంటూ పోతోంది. ఓటర్ల జాబితా సవరణలు పూర్తి చేసి, రిజర్వేషన్ల ప్రక్రియపై దృష్టి పె ట్టింది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాగానే, జిల్లాలో జనాభా ప్రాతిపదికన పంచాయతీలను ఆయా వ ర్గాలకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment