
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికి సిరా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా పెట్టిన సంగతి తెల్సిందే. అప్పుడు పెట్టిన సిరా వేలిపై ఇంకా తొలగిపోకపోవడంతో అయోమయానికి గురికాకుండా ఉండేందుకు మధ్య వేలికి సిరా గుర్తును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే.