తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్‌ పోలింగ్‌ 65.67 శాతం | Lok Sabha Polling Percentages In Telangana Records 64.93 Per Cent Voter Turnout, Details Inside | Sakshi
Sakshi News home page

Polling Percentage In TS Constituencies: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్‌ పోలింగ్‌ 65.67 శాతం

Published Tue, May 14 2024 9:55 PM | Last Updated on Wed, May 15 2024 1:01 PM

Loksabha Polling Percentages In Telangana

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్‌ శాతం 65.67గా ఎన్నికల కమిషన్‌ మంగళవారం(మే14) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 2 కోట్ల 20 లక్షల 24 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక కోటి 11 లక్షల 91 వేల మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కోటిమంది పోలింగ్‌కు దూరంగా ఉన్నా గతంతో పోల్చితే 3 శాతం పోలింగ్‌ పెరగడం గమనార్హం. అతి తక్కువగా హైదరాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 48.8 శాతం ఓటింగ్‌ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 76.78శాతం పోలింగ్‌ జరిగింది.

నియోజకవర్గాల వారిగా పోలింగ్‌ ఇలా.. 
ఆదిలాబాద్- 74.03 
పెద్దపల్లి        67.87 
కరీంనగర్-     72.54 
నిజామాబాద్- 71.92 
జహీరాబాద్-  74.63 
మెదక్-            75.09 
మల్కాజ్‌గిరి-  50.78 
సికింద్రాబాద్- 49.04 
హైదరాబాద్-   48.48 
చేవెళ్ల-              56.50 
మహబూబ్‌నగర్- 72.43 
నాగర్ కర్నూల్- 69.46 
నల్గొండ-        74.02 
భువనగిరి-     76.78 
వరంగల్-      68.86 
మహబూబాద్-71.85 
ఖమ్మం -        76.09
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement