సాక్షి,హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి మంగళవారం(ఏప్రిల్23) ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు చేసిన అనతంరం బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సీఈవో వికాస్‌రాజ్‌కు అందించాం. ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు దొరలే..
Comments
Please login to add a commentAdd a comment