
సాక్షి, హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్నులు వేసి ప్రజలను వేధించడంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు రూ.68, రూ.53 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు బ్యారెల్ ధర 79 డాలర్లకు తగ్గినప్పుడు రూ.84, రూ.74కు ఎందుకు పెరిగాయో చెప్పాలని నిలదీశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 22 రాష్ట్రాల కన్నా ఎక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. 16 నుంచి 18 శాతం వరకు ఇతర రాష్ట్రాల్లో పన్నులుంటే తెలంగాణలో పెట్రోల్‌పై 35.02 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్నులను విధించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment