taxes
-
నిత్యావసర ధరలపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం
-
ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి వారం గడిచింది. ఈ వారంలో ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. చైనా నుండి యూరప్ వరకు, ఉక్రెయిన్ నుండి ఇరాన్ వరకు, ట్రంప్ నిర్ణయాలను విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో అమెరికన్లు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్షునిగా అధికార బాధ్యతలు చేపట్టారు. వెంటనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గడచిన వారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.చైనాతో దోస్తీ?ముందుగా చైనా విషయానికొస్తే ట్రంప్ తొలి పదవీకాలంలో, చైనా- అమెరికా మధ్య సత్సంబంధాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 శాతం వరకు భారీగా సుంకం విధిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రంప్ వారం గడిచినా ఈ విషయమై నోరు మెదపడం లేదు. పైగా ఒక ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో ఏదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోగలరా అని అడిగినప్పుడు ట్రంప్ అందుకు సిద్దమేనన్నట్లు సమాధానం చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై మారిన వైఖరిట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ యుద్ధంపై గతంలో చేసిన వాగ్దానం అమలులో వైఖరిని మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా.. రష్యాను వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ను పావుగా వాడుకుంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం మేరకు ఇది జరిగింది. నిజానికి ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం నుండి అమెరికాను దూరంగా ఉంచవచ్చు. కానీ ఇది అమెరికా భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ మద్దతు ఉంది. ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గితే, భవిష్యత్‌లో రష్యాతో చేతులు కలిపే సందర్భం వస్తే ఎటువంటి హాని ఏర్పడదని ట్రంప్ భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు.జన్మతః పౌరసత్వ చట్టండొనాల్డ్ ట్రంప్ రెండవమారు అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ట్రంప్ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుండి అమెరికాలో అమల్లోకి వస్తాయి. ఇది విదేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరికన్ పౌరసత్వం పొందాలని కలలు కంటుంటారు. అయితే ట్రంప్ నిర్ణయం వారి కలలను కల్లలు చేసింది.ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహంట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారిలో ఆయన సన్నిహితుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ట్రంప్ ఇటీవల స్టార్గేట్ పేరుతో భారీ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నారు. స్టార్గేట్లో పాల్గొన్న మూడు కంపెనీలకు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదని మస్క్ సోషల్ మీడియాలో రాశారు.గాజా శరణార్థుల పునరావాసంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గాజా శరణార్థుల పునరావాసానికి సంబంధించి ఓ ప్రతిపాదన చేశారు. గాజాలో ఉండలేకపోతున్న పాలస్తీనా వాసులు అక్కడికి పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో తాత్కాలిక పునరావాసం పొందాలని ట్రంప్ సూచించారు. గాజా ప్రాంతం నాశనమైందని, అక్కడి ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సహకరించాలని ఆయన కోరారు.ఆర్థిక సాయం నిలిపివేతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యుద్ధంలో చిక్కుకున్న ఉక్రేయిన్ కూడా ఆర్ధిక సాయం నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్లకు సైనిక బలగాల పెంపు కోసం అందించే నిధులకు మినహాయింపులు ఇవ్వడం విశేషం.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
ఇప్పటిది ఓకే.. మరి అప్పట్లో..
ప్రస్తుత కుంభమేళా కనీసం రూ.2–4 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుందన్నది ఓ అంచనా. మరి అప్పట్లో అంటే 1870లో అలహాబాద్‌లోనే బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన కుంభమేళాలో ఎంత వచ్చి ఉంటుంది? కరెక్టుగా చెప్పాలంటే.. రూ.41,824! ఇందులో పావు వంతు క్షురకుల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చినదే. అప్పటి కుంభమేళాలో భక్తజనం కోసం 2,500–3,000 మంది క్షురకులను పెట్టారు. ఇక్కడ వ్యాపారం చేసుకున్నందుకు గానూ వీరి నుంచి రూ.4 చొప్పున పన్ను వసూలు చేశారు. ఈ కుంభమేళాతో వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు.. అలాగే అల్ఫ్రెడ్ పార్క్, అలహాబాద్ మ్యూజియం, వైద్య సదుపాయాల కోసం వెచ్చించింది. తర్వాత 1882లో జరిగిన కుంభమేళాలో రూ.49,840 మేర ఆదాయం వచ్చిందట. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా?: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం(నవంబర్ 16) రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా?విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు.ఐదు నెలల్లో రూ.57వేల కోట అప్పులు చంద్రబాబు చేశారు.ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీడీపీ చెప్పిన అబద్ధాలు స్పష్టమయ్యాయి. గతంలో వైఎస్జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి రూ.11వేల కోట్లు ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్చగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక పాలసీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించేది. ఈనాడులో నిస్సిగ్గుగా వైఎస్జగన్ కుటుంబ సభ్యులపై వార్తలు రాయడం దారుణం. మనుషుల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసే విధంగా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు’అని మార్గాని భరత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం -
రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ ఆర్జన శాఖలకు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై భారం పడకుండానే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించి ఆదాయ ఆర్జన శాఖలు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి మించి అదనంగా 15 శాతం 25 శాతం వరకు పెంచాలని ఆయా శాఖల అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రాన్ని నిధులు అడగలేమని, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల ద్వారానే అమలు చేయాల్సి ఉందని ఆయన చేశారు. ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, మైనింగ్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం మేరకు సీఎం సమీక్షలో ఆదాయ ఆర్జన శాఖలకు ఆర్థిక శాఖ భారీ ఆదాయ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపు ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.8000 కోట్ల ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను భూముల విలువను పెంచాల్సిందిగా సూచించింది. దీని ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఆదాయం పెంచాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ చార్జీల పెంపుపైన కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీ ఎగవేతలను నిరోధించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాల్సిందిగా సూచించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ప్రస్తుతం రూ.4,500 కోట్లు ఆదాయం వస్తోందని, దీన్ని రూ.8000 కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థికశాఖ నిర్దేశించింది. నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ఆదాయం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాల్సిందిగా సూచించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే హామీలు అమలు చేయగలమని, ఈ నేపథ్యంలో ఆదాయ ఆర్జన శాఖలు అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. నినాదంతో ముందుకు సాగాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం పరిశ్రమలశాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌తో కలిపి ఐదు అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం ద్వారా ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని మెరుగుపరచాలని సూచించారు. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి వంతున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
గ్రానైట్ దందాకు వెల కట్టి వేలం!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి, అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తూ మార్టూరు నుంచి పాలి‹Ù్డ గ్రానైట్ పలకలను జీరో దందాతో అక్రమంగా తరలిస్తున్నారు. జీరో దందా కోసం వ్యాపారులు అధికార పార్టీ పర్చూరు ముఖ్యనేత అనుచరులకు ఒక్కో లారీకి రూ.40 వేలు చొప్పున కప్పం చెల్లిస్తున్నారు. రోజుకు 80 లారీలకుపైగా గ్రానైట్ తెలంగాణకు తరలిపోతుండగా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతోంది. పర్చూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల టీడీపీ నేతలు ఇందులో వాటాలు పంచుకుంటున్నారు. దందా నడిపిస్తున్న పర్చూరు ముఖ్యనేత, చిలకలూరిపేట నేతకు నెలకు రూ. 2.64 కోట్లు చొప్పున చెల్లిస్తుండగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నేతలు ముగ్గురికీ నెలకు రూ.2.20 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, కమర్షియల్ టాక్స్ అధికారులకు కలిపి నెలకు రూ.60 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రోజుకు ఒక్కో లారీకి రూ. 40 వేల చొప్పున 80 లారీలకు రూ.32 లక్షలు వంతున దందా నిర్వాహకులు నెలకు రూ. 9.60 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ నేతలు, అధికారులకు రూ.5.44 కోట్లు చెల్లిస్తుండగా రూ.4.17 కోట్లు దందా నిర్వాహకుల వాటాగా చెబుతున్నారు. ఖజానాకు భారీగా గండి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిష్డ్ రాయికి సేల్స్ టాక్స్ రూ.1,300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున మొత్తం రూ.2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్ కట్టాలి. రోజుకు 80 లారీలు దొడ్డి దారిన గ్రానైట్‌ను తరలిస్తుండగా నిత్యం రూ.56 లక్షలు చొప్పున నెలకు రూ.16.80 కోట్లు టాక్స్ ఎగ్గొడుతున్నారు. గ్రానైట్ పాలి‹Ù్డ రాయి అక్రమ రవాణా వ్యవహారం అధికార పార్టీలో కాక రేపుతోంది. ప్రధానంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పంచాయితీ నిర్వహించనున్నట్లు తెలిసింది. -
ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలు తగ్గవు..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో కోత విధించే అవకాశం లేదని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఈ నేపథ్యంలో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితి లేదని చెప్పారు. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతానికి దిగుమతులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ధరలు ఇప్పటికే తగ్గినప్పుడు, ఇక పన్ను తగ్గింపు ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు కోసం అడగవచ్చు, కానీ పన్నుల తగ్గింపు గురించి ఇప్పుడు ప్రశ్నించడం సరికాదు’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని చివరిసారిగా మే 2022లో తగ్గించారు. ఈ నిర్ణయం మేరకు పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు రూ.8 తగ్గింది. డీజిల్‌పై రూ.6 తగ్గించడం జరిగింది. రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం! బడ్జెట్ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శాఖ సీనియర్ అధికారి తెలిపారు. -
గ్రేటర్ వరంగల్‌లో ‘క్యూఆర్ కోడ్’తో పన్నుల చెల్లింపు... స్కాన్ అండ్ పే..
వరంగల్ అర్బన్: స్మార్ట్ సేవలు అందించడంలో గ్రేటర్ వరంగల్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో మొదటిసారిగా క్యూ ఆర్ కోడ్ సిస్టమ్‌ను వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనూతన విధానంతో ప్రజలు సులువుగా పన్నులు చెల్లించేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆస్తి, చెత్త పన్నులు, నీటి చార్జీలు ఇళ్లు, ఆఫీస్, వ్యాపార దుకాణాల్లో నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అన్ని రకాల పన్నులకు సంబంధించి కార్యకలాపాలను అనుసంధానం చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మీసేవ, ఈసేవ, అమెజాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్ను కట్టేందుకు సౌకర్యం ఉంది. ఆన్లైన్లో సొమ్ము చెల్లిస్తే నగదు సక్రమంగా జమ కాని పరిస్థితులూ ఉన్నాయి. నూతన విధానం ద్వారా పారదర్శకంగా చెల్లింపులకు వీలు కలగనుంది. నగరంలో 2,07 లక్షల అసెస్మెంట్లు(భవనాలు) ఉండగా.. 1.70 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 1.20 లక్షల అసెస్మెంట్లకు డిజిటల్ డిమాండ్ నోటీసులను పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నోటీసులను ఒకటి, రెండు రోజుల్లో అందిస్తామని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా రెండు రకాలుగా పన్నులు చెల్లించే అవకాశం ఉంది. ● ఇళ్లల్లో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో పన్నుల విభాగానికి చెందిన బిల్ కలెక్టర్లు క్యూఆర్ కోడ్‌తో కలిగి ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసుల్ని పంపిణీ చేస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పన్నులు, వడ్డీ చూపెడుతుంది. ఆసొమ్ము చెల్లిస్తే బల్దియా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. ● క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసులు అందకపోతే మరో విధానం ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పే ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే ‘ఇ మునిసిపాలిటీ తెలంగాణ’ సైట్లో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జిల్లా, ప్రాంతం, సర్కిల్, ఇంటి నంబర్ ఎంటర్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అదేవిధంగా వాటర్ చార్జీ చెల్లింపునకు క్యాన్ నంబరు డీటెయిల్స్‌పై క్లిక్ చేసి కింది భాగంలో ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేస్తే వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆస్తి, నీటి, చెత్త పన్నుల చెల్లింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లిస్తేనే నగరాభివృద్ధి జరుగుతుంది. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – షేక్ రిజ్వాన్ బాషా, బల్దియా కమిషనర్ -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు? కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ?
వాహనదారులకు త్వరలో కేంద్రం శుభవార్త చెప్పనుందా? దేశంలో భారీగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? పెట్రోల్, డీజిల్‌తో సహా మరికొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం ఉందా? అవుననే అంటున్నాయి రాయిటర్స్ కథనాలు. ఆకాశాన్ని తాకిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కొన్నింటిపై ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది. గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఆర్బీఐ కృషి చేస్తున్నాయి. ఇందలో భాగంగా గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయితే జనవరి నెల నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసరడంతో కేంద్రం, ఆర్బీఐ లెక్కలు తారుమారయ్యాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరింది. జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న దానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది. దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం మొక్కజొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే పెట్రో ధరలపై మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. దీనిపై అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, ఆర్బీఐ గానీ స్పందించలేదు. -
కొత్త పన్నుల యోచన లేదు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్తగా పన్నులు వేసే ఆలోచన లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సూచనలు చేస్తోందని చెప్పారు. జూన్ నాటికి రూ.20 వేల కోట్లను సమకూర్చుకోనున్నామని, నిరర్ధక ఆస్తులను వనరులుగా మార్చుకుంటున్నామని తెలిపారు. కే వలం భూములను అమ్మడం ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామనడం సరికాదన్నారు. బుధవారం బడ్జెట్‌పై సాధారణ చర్చ అనంతరం కాంగ్రెస్ సభా పక్షనేత భట్టి విక్రమార్క అడిగిన క్లారిఫికేషన్స్‌కు ఆయన సమాధానమిచ్చారు. పాత్రికేయులకు వెంటనే స్థలాలివ్వండి: భట్టి లిక్కర్, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని బడ్జెట్లో భారీగా చూపటం అనైతికమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వచ్చే విదేశీయులకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు వెళ్తే మాత్రం ఎందుకు అరెస్టు చేస్తోందని నిలదీశారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను అందజేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత పాత్రికేయులకు వెంటనే ఆ స్థలాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి నాలుగైదు గంటలు కూడా కరెంటు సరఫరా కావటం లేదని సభ దృష్టికి తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో చెరువు నీటిని తాగినందుకు ఓ మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించేందుకు ఆయన ప్రయత్నించగా, ముందస్తు అనుమతి తీసుకోనందున అనుమతించలేమని స్పీకర్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై.. బడ్జెట్లో నిరుద్యోగుల భృతి, స్పోర్ట్స్ పాలసీ, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తావన లేదని బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రస్తావించగా.. క్రీడా విధానంపై మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రకటన చేస్తారని, డబుల్ బెడ్రూం ఇళ్లను హడ్కో నుంచి తెచ్చే రుణం ద్వారా పూర్తి చేస్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, మూడు పెండింగ్ డీఏలను చెల్లించటంతోపాటు తక్షణమే కొత్త పీఆర్సీ కమిటీ వేయాలని, సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు సమాధానమిచ్చారు. -
ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లు ఇవ్వడం లేదని గత మూడు బడ్జెట్ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పన్నుల్లో వాటా కింద ప్రతిపాదించిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తోంది... కానీ, కేంద్రంపై ఆధారపడి ఉన్న రెండు పద్దుల కింద మాత్రం తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను చూపెట్టింది. వచ్చే ఏడాదికైనా కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతుందా అనే ఆశతో పెట్టిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ. 62,730.01 కోట్ల మేర రాబడులను ఈసారి బడ్జెట్లో చూపెట్టడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపారు. అయితే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద గత ఏడాది (2021–22) వచ్చింది కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే. 2022–23 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ. 41,001.73 కోట్లు వస్తుందని ప్రతిపాదించినా డిసెంబర్ నాటికి వచ్చింది రూ.7,770.92 కోట్లే. మిగిలిన మూడు నెలల్లో ఎంత వస్తుందనే అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద ఏకంగా రూ.30,250 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2022–23 సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది (2023–24)కి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30వేల కోట్లకు మరో రూ.11వేల కోట్లు అదనంగా ‘గ్రాంట్స్’రూపంలో రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గ్రాంట్స్ పద్దు కింద రాష్ట్రం ఆశిస్తున్న మొత్తానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో మినహా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు కాదు కదా అందులో సగం కూడా ఎప్పుడూ కేంద్రం ఇవ్వలేదు. పన్నుల్లో వాటా... పరవాలేదా? ఇక, కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో ప్రతిపాదనలు, మంజూరు గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నా కేటాయించిన మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2021–22లో రూ.18,720.54 కోట్లు కేంద్రం నుంచి రాగా, 2022–23 సవరించిన అంచనాల మేరకు రూ.19.668.15 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, తాజా బడ్జెట్లో ఈ పద్దును రూ.21,470.84 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా విభేదాలున్నప్పటికీ కేంద్రంపై నమ్మకంతో తాజా బడ్జెట్లో ఈ రెండు పద్దుల కింద రూ.62 వేల కోట్ల (దాదాపు 20 శాతం) రాబడులు చూపారు. ఇదే విషయమై ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రావాల్సిన నిధులను అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం తెలంగాణకు కూడా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కొన్నేళ్లుగా తక్కువగానే వస్తున్నా కేంద్రంపై ఆశలు పెట్టుకునే ప్రతిపాదనలు చేశామని చెప్పారు. -
విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుతోపాటు, ఎగుమతి చేసే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ ప్రాఫిట్ (గుంపగుత్త లాభాలు) పన్నును కేంద్ర సర్కారు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత దిగిరావడంతో అందుకు అనుగుణంగా పన్నులను తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.2,100గా ఉన్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్ను రూ.1,900కు తగ్గింది. ఎగుమతి చేసే ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.6.5గా ఉన్న పన్ను రూ.5కు తగ్గింది. ఏటీఎఫ్ లీటర్‌పై రూ. 4.5 నుంచి రూ.3.5కు తగ్గింది. కొత్త పన్ను రేట్లు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది చమురు ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీనివల్ల దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఇలా గుంపగుత్తగా వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును 2022 జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి జనవరి 3నాటి సమీక్షలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ పన్నును కేంద్రం పెంచింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ మేరకు తాజాగా ఉపశమనం కల్పించింది. అంతర్జాతీయ పరిణామాలు.. అంతర్జాతీయంగా చాలా దేశాలు విండ్‌ఫాల్ లాభా ల పన్నును అమల్లోకి తీసుకురావడం గమనార్హం. ఆరంభంలో కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతిపై రూ.6 చొప్పు,. లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 చొప్పున పన్ను విధించింది. దేశీయ ంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ. 23,250 పన్నును అమలు చేసింది. తదుపరి మొద టి సమీక్షలోనే పెట్రోల్‌పై ఈ పన్నును ఎత్తివేసింది. -
సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు. ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు జపాన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఫైన్ విధించింది. జపాన్ రాజధాని టోక్యో నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ అమ్మకాల్ని నిర్వహిస్తుంది. అయితే టోక్యోకి వచ్చే విదేశీయులకు యాపిల్ కంపెనీ భారీ ఎత్తున ఐఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లపై ఎలాంటి దిగుమతి సుంకం చెల్లించకుండా బల్క్‌లో ఫ్రీగా అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహించిన యాపిల్ 105 మిలియన్లు (రూ. 870 కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు క్యోడో మీడియా పలు కథనాల్ని ప్రచురించింది. క్యోడో నివేదిక ప్రకారం..జపాన్‌లో యాపిల్ సంస్థ $1,04,16,84,000 (రూ. 8,634 కోట్లు) పన్ను మినహాయింపు పొందింది. ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించకుండా సెప్టెంబర్ 2021 నుండి రెండు సంవత్సరాల పాటు విక్రయాలు సాగించినట్లు ట్యోక్యో రీజనల్ ట్యాక్సేషన్ బ్యూరో అధికారులు గుర్తించారు. యాపిల్ తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రొడక్ట్‌లపై రీసేల్ నిర్వహించినట్లు పేర్కొంది. అనైతికంగా వ్యాపారం యాపిల్ అనైతికంగా నిర్వహిస్తున్న బిజినెస్‌పై దృష్టిసారించిన ట్యాక్సేషన్ బ్యూరో గతేడాది నుంచి విచారణ చేపట్టింది. ఈ విచారణలో అసాదారణ లావేదేవీలు, యాపిల్ స్టోర్ నుంచి వందల సంఖ్యలోని యాపిల్ డివైజ్‌లను టూరిస్ట్‌లకు అమ్మినట్లు గుర్తించిందని జపాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందుకే తక్కువ సేల్స్ (underreported) నిర్వహించిన ప్రొడక్ట్‌లపై 105 మిలియన్ల అదనపు పన్ను, ట్యాక్స్ చెల్లించాల్సిన ఉత్పత్తులపై అదనపు వినియోగపు పన్నును భారీగా విధించనుంది. టూరిస్ట్‌ల ముసుగులో జపాన్‌కు వచ్చిన విదేశీయులు ఆరు నెలలలోపు కొనుగోలు చేసే వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అదే వస్తువుల్ని రీసేల్ చేస్తే.. జరిపిన విక్రయాలను బట్టి పన్ను కట్టాలి. కాబట్టే యాపిల్..ఐఫోన్లు, ఇతర ప్రొడక్ట్‌లను జపాన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు విక్రయించి.. ఆపై వాటిని విదేశాలకు భారీ ఎత్తున తరలించి పన్ను మినహాయింపు పొందేలా బిజినెస్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు ట్యాక్స్ బ్యూరో అధికారులు అనుమానిస్తున్నారు. చైనా పౌరులపై కేసులు 2020లో జపాన్ను సందర్శించేందుకు టూరిస్ట్, ఇతర వీసాలను ఉపయోగించిన ఏడుగురు చైనీయులపై కేసులు నమోదయ్యాయి. ఒసాకా ప్రాంతీయ ట్యాక్స్ బ్యూరో అధికారులు వారి కొనుగోళ్లపై సుమారు $56,58,162 (దాదాపు రూ. 46 కోట్లు)ను వసూలు చేసింది. క్యోడో నివేదించిన ప్రకారం రూ. 475 కోట్ల విలువైన లగ్జరీ బ్రాండ్ వస్తువులు. వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లతో కూడిన ఉత్పత్తులను రీసేల్ కోసం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో రీసేల్ నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్లలో కాస్మోటిక్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన సందర్భాలు వెలుగులోకి రావడంతో ట్యాక్స్ బ్యూరో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు అప్రమత్తమయ్యారు. డిపార్ట్మెంట్ స్టోర్ల యజమానులు అనైతికంగా విక్రయాలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’? -
వాహన పరిశ్రమ వృద్ధికి విఘాతం
న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు. ‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్‌యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
చమురు కంపెనీలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదల వల్ల దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలు ఆర్జిస్తున్న భారీ లాభాలపై (విండ్‌ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఎత్తివేయవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. చమురు ధరలు మోస్తరు స్థాయికి చేరుకోనుండడాన్ని ఇందుకు అనుకూలంగా ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి విండ్‌ఫాల్ పన్నును కేంద్ర సర్కారు అమల్లోకి తీసుకురావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించే, ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లపై దీన్ని విధించింది. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉత్పత్తి కంపెనీలకు ఒక్కసారిగా అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఈ ప్రయోజనాన్ని కొంత వరకు పన్నుల రూపంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తీసుకునే ప్రయతాన్ని ప్రభుత్వం చేసింది. దేశ చమురు వినియోగంలో 15 శాతం స్థానికంగా ఉత్పత్తి అవుతున్నదే ఉంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దశాబ్ద గరిష్టాలకు చేరడం తెలిసిందే. ఈ ఏడాది చివరికి బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద స్థిరపడుతుందని ఫిచ్ అంచనా వేసింది. ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు పుంజుకుంటాయని, 2022లో నష్టాలను అవి కొంత వరకు భర్తీ చేసుకుంటాయని ఫిచ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. రిఫైనింగ్ మార్జిన్లు మధ్య స్థాయికి చేరుకుంటాయని, చమురు మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ అంశాలు మెరుగుపడతాయని పేర్కొంది. -
బడ్జెట్ అంచనా 53 వేల కోట్లు.. వచ్చింది 11వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన ఆర్థిక సహకారం అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం నిధుల్లో కేవలం 20 శాతం మాత్రమే వచ్చాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద రూ.53 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.11 వేల కోట్లే రావడం గమనార్హం. మరో ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇంకా 80శాతం నిధులు రావాల్సి ఉండగా, అందులో సగం రావడం కూడా అనుమానమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుపై వివక్ష వాస్తవానికి, కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో రాష్ట్రాలకు ఆర్థిక ఆసరా అందుతుంది. ఇందులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా ఒకటైతే, వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరొకటి. ఈ రెండు పద్దులను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా కింద గత ఏడు నెలల్లో రాష్ట్రానికి రూ.5,911.06 కోట్లు (47.64 శాతం) వచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది పన్నుల్లో వాటా కింద రూ. 12,407.64 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు అయితే పూర్తిగా వివక్షకు గురవుతోంది. ఈ పద్దు కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.41,001.73 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా.. అందులో కేవలం 13.64 శాతం అంటే... రూ. 5,592.66 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొదవే లేదు తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులో కోత పెడుతున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా మంజూరు చేస్తోంది. రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా, వాటి వార్షిక బడ్జెట్ పద్దు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా 35 నుంచి 80 శాతం వరకు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఇందులో గుజరాత్‌కు అయితే దాదాపు 80 శాతం నిధులు ఇచ్చేసింది. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశా, త్రిపుర... ఇలా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి తెలంగాణ కంటే ఎక్కువగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం అందడం గమనార్హం. పన్నుల్లో వాటా కింద కూడా ఈ రాష్ట్రాలకు కేంద్రం.. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే పంపిందని కాగ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని లిజ్ ట్రస్‌పై భారత సంతతి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ విజయం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. యూగవ్ తాజాగా నిర్వహించిన గ్యాలప్ పోల్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే మళ్లీ ట్రస్‌కు ఓటేస్తామన్నారు. రిషి వైపు 55% మంది మొగ్గు చూపారు. పన్నుల్లో కోత పెట్టి, వివాదాస్పదం కావడంతో వాటిని ఉపసంహరించుకున్న లిజ్‌ట్రస్ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ ఈ సర్వే చేపట్టారు. ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని 55 శాతం మంది కోరుకుంటుంటుండగా, కొనసాగాలని 38% మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. పార్టీ గేట్ కుంభకోణంతో తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను సరైన ప్రత్యామ్నాయంగా 63 శాతం మంది పేర్కొనడం విశేషం. ప్రధానిగా జాన్సన్‌ను 32%, రిషిని 23 శాతం బలపరిచారు. తప్పులు చేశాం..క్షమించండి: లిజ్ ట్రస్ ప్రధాని లిజ్‌ట్రస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లో నెట్టాయి. సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఆర్థిక మంత్రిని నియమించాను. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం’అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీలోగా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: రష్యా కొత్త పంథా.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి -
ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థిరంగా పన్ను ఆదాయం.. కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే! -
జీఎస్టీ వసూళ్లలో తగ్గేదేలే!.. టార్గెట్ రూ.1.5 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు అక్టోబర్ నుంచి రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలలకు జీఎస్టీ ఆదాయం సగటున రూ.1.4 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వరుసగా రూ.1.5 లక్షల కోట్లు దాటి నమోదు కావడం లేదు. ఆగస్ట్ నెలకు రూ.1.43 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చింది. వార్షికంగా క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోల్చి చూసినప్పుడు 28 శాతం పెరిగింది. కానీ, జూలైలో వచ్చిన రూ.1.49 లక్షల కోట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఆ నెలకు రూ.1.67 లక్షల కోట్ల ఆదాయం నమోదైంది. సీబీఐసీ కార్యక్రమంలో భాగంగా తరుణ్ బజాజ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించేందుకు గత కొన్ని నెలలుగా తాము కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు. కొన్ని సందర్భాల్లో రూ.2,000 కోట్లు, రూ.6,000 కోట్లు తక్కువ నమోదైనట్టు తెలిపారు. కానీ, అక్టోబర్ నెలకు జీఎస్టీ ఆదాయం రూ.1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తర్వాత నుంచి స్థిరంగా రూ.1.5 లక్షల కోట్ల పైన నమోదవుతుందని అంచనా వేశారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి సైతం పాల్గొన్నారు. చదవండి: దేశంలో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ! -
భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం
న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను మెరుగుపర్చడం, ట్యాక్సేషన్‌ను సరళీకరించడం, టారిఫ్‌లపరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం మొదలైన సంస్కరణలు .. ప్రపంచ దేశాలతో భారత్ జరిపే వాణిజ్య లావాదేవీలకు కీలకమని ఒక నివేదిక పేర్కొంది. అబ్జర్వర్వ్ రీసెర్చ్ ఔండేషన్ (ఓఆర్ఎఫ్), ఓఆర్ఎఫ్ అమెరికా సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కోవిడ్ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లోకి (జీవీసీ) భారత్ ఏ విధంగా అనుసంధానం కాగలదనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని తయారు చేశాయి. నిర్దిష్ట ఉత్పత్తి తయారీలో వివిధ దేశాలు పాలుపంచుకునే ప్రక్రియను జీవీసీగా వ్యవహరిస్తారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో సరఫరా పరమైన సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఆర్థిక ప్రగతికి దివ్యౌషధంగా భావించిన జీవీసీ, ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోందని వివరించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, భారీ యంత్రాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న 200 పైచిలుకు దేశ, విదేశీ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయిదు సవాళ్లు.. ‘భారత్‌లో వ్యాపార విస్తరణకు కంపెనీలు ప్రధానంగా ఐదుఅడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటిలో ట్యాక్సేషన్ నిబంధనలు .. పాలసీలు; మౌలిక సదుపాయాల నాణ్యత (లోపాలు); వాణిజ్య.. టారిఫ్ విధానంలో అనిశ్చితి; మూలధనం (అందుబాటులో లేకపోతుండటం); ముడి వస్తువులు (కొరత) ఉన్నాయి‘ అని నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో జీవీసీలో అను సంధానానికి తోడ్పడేందుకు అత్యవసరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని వివరించింది. అలాగే కీలకమైన సరఫరా వ్యవస్థల్లోని బలహీనతలను గుర్తించడం, నియంత్రణ పరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం, లాజిస్టిక్స్.. రవాణా నిబంధనలను సమన్వయ తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించింది. మరిన్ని విశేషాలు.. ♦భారత వాణిజ్య భాగస్వామిగా అంతా ఏకగ్రీవంగా అమెరికాకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) గ్రూప్‌నకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ♦ జీవీసీలో భాగం కావడం తమకు చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 87 శాతం కంపెనీలు తెలిపాయి. మహమ్మారి అనంతరం జీవీసీల విషయంలో తమ అభిప్రాయాలు మారినట్లు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ♦ ఎక్కువగా ఇతరులపై ఆధారపడే తయారీ విధానాల వల్ల పరిశ్రమకు రిస్కులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ♦ దేశీ విధానాలు తమ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని ఆటో కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు తమపై ప్రభావం చూపుతాయని మిగతా రంగాల కంపెనీలు తెలిపాయి. ♦ జీవీసీతో అనుసంధానమయ్యేందుకు భారత్ వాణిజ్య విధానాలు చాలా ముఖ్యమని 70 శాతం సంస్థలు తెలిపాయి. వైద్య పరికరాలు, ఫార్మా పరిశ్రమలో ఈ ధోరణి మరింత స్పష్టంగా (93 శాతం) కనిపించింది. ♦ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ’ముడి వస్తువుల లభ్యత’ కీలకంగా ఉంటోందని 74 శాతం సంస్థలు వివరించాయి. నిపుణులైన సిబ్బంది అంశం తర్వాత స్థానంలో (70 శాతం కంపెనీలు) ఉంది. -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్‌ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్‌తో రూపాయి శుక్రవారం మరో ఆల్‌టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
పెట్రోల్ ‘ట్యాంక్’ ఖాళీ అవుతోంది!.. క్రూడాయిల్ లెక్కలివీ..
పెట్రోల్.. డీజిల్.. ఇవి లేనిదే బండి కదలదు.. మనుషుల బతుకూ కదలదు.. రేటు పెరిగిందంటే కలకలమే. పొద్దున ఇంటికొచ్చే పాల ప్యాకెట్ నుంచి విమాన ప్రయాణం దాకా అన్నీ ఖరీదవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికైతే బిల్లు గుండె గుభేలుమనిపిస్తుంటుంది. ఇటీవలే మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడం, కేంద్రం కాస్త తగ్గించాక ఉపశమనం ఫీలవడం అందరికీ తెలిసిందే. మరోవైపు ప్రపంచంలో చమురు నిక్షేపాలు అడుగంటుతూ ఆందోళన రేపుతున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్ ఎలా వస్తుంది? ఎక్కడ ఎక్కువగా నిల్వలున్నాయి? అసలు ధర ఎంత? మనకు చేరేది ఎంతకనే వివరాలు తెలుసుకుందాం.. లక్షల ఏళ్ల కింద సముద్రం అడుగున కూరుకుపోయిన జంతు, వృక్ష అవశేషాలు.. విపరీతమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ముడి చమురుగా మారాయి. శిలాజాల నుంచి వచ్చే ఇంధనం కాబట్టి శిలాజ ఇంధనమని పిలుస్తారు. కొన్నిచోట్ల నేచురల్ గ్యాస్ రూపంలోనూ ఉంటాయి. విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ముడి చమురు వనరులు తగ్గిపోతున్నాయి. ఇలాగే కొన సాగితే మరో 47 ఏళ్లలో భూమ్మీ ద పెట్రోలియం నిల్వలు ఖాళీ అయిపోతాయని అంచనా. వేల ఏళ్ల నుంచీ వినియోగం యూరప్, అమెరికా, మధ్యాసి యా, చైనా తదితర దేశాల్లో వేల ఏళ్ల కిందటి నుంచీ చమురు విని యోగం ఉంది. భూమి పొరల్లో పగుళ్ల నుంచి పైకి ఉబికి వచ్చే చమురును వివిధ అవసరాలకు వాడేవారు. 1850 సంవత్సరంలో ముడి చమురు నుంచి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలు, కందెన (లూబ్రికెంట్)ను వేరు చేసే పద్ధతులను కనిపెట్టడంతో.. వినియోగం పెరిగిపోయింది. కిరోసిన్, పె ట్రోల్‌తో నడిచే వాహనాలు వచ్చాయి. వీధి లైట్లు వెలిగించడం, పరిశ్రమల్లో వినియోగించడం మొదలైంది. తర్వాత అసలు పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మానవ మనుగడే ముందుకు కదలనంత గా మారిపోయింది. అంతర్జాతీయంగా ఏదైనా స మస్య ఏర్పడినా,దేశాల మధ్య యుద్ధం వచ్చినా చమురు ధరలకు రెక్కలు రావడం.. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైనే ఆధారపడిన ఇండియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రూడాయిల్ లెక్కలివీ.. ►ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన చమురు నిక్షేపాలు: 1,65,058 కోట్ల బ్యారెళ్లు ►వెనెజువెలా 18.2శాతం నిక్షేపాలతో టాప్‌లో ఉండగా.. సౌదీ (16.2%), కెనడా (10.4%), ఇరాన్ (9.5%), ఇరాక్ (8.7%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ►ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ఉత్పత్తి జరుగుతున్న దేశాలు: 127 ►మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో ఒక్క అమెరికా వాటా: 20.3% ►టాప్–10 దేశాలు వాడేస్తున్న క్రూడాయిల్: 60 శాతం ►ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 50 వేలకుపైగా చమురు బావులు ఉన్నా యి. అందులో 2–3 వేల బావుల్లోనే 95%పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ముడి చమురు ధరల లెక్క ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎడారులు, తీర ప్రాంతాల్లో, తీరానికి కాస్త దూరంగా సముద్రతలం దిగువన (డీప్ వాటర్) ముడి చమురు నిక్షేపాలను గుర్తించారు. ఇందులోనూ నేరుగా భారీగా ఉండే చమురు రిజర్వాయర్లు కొన్నికాగా.. రాతిపొరల మధ్య ఉండే (షేల్) నిక్షేపాలు మరికొన్ని. సౌదీ వంటి దేశాల్లో ఎడారుల్లో భారీ నిక్షేపాలు ఉన్నాయి. దానితో ఉత్పత్తి ధర తక్కువ. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, యూరప్ దేశాల్లో తీరప్రాంతాలకు కాస్త దూరంగా సముద్రతలం దిగువన నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీయడం కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇక షేల్ నిక్షేపాల నుంచి చమురు తీయడానికి మరింత వ్యయం అవుతుంది. ఉత్పత్తి ఖర్చు ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను బట్టి ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి. ►సగటున చూస్తే సౌదీలో ఒక్కో బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తికి కేవలం 3డాలర్లు (సుమారు రూ.230) ఖర్చయితే.. గల్ఫ్ దేశాలు, రష్యా, పలు ఆఫ్రికా దేశాల్లో సగటున 15డాలర్ల (రూ.1,160) వరకు, అమెరికా–యూరప్ దేశాల్లో 50–60 డాలర్ల (రూ. 3,800–రూ.4,600) వరకు ఖర్చవుతుంది. ►ప్రస్తుతం మార్కెట్లో బ్యారెల్ ధర సుమారు 113 డాలర్ల (రూ.8,773) వద్ద ఉంది. ►చమురును శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులకు వేర్వేరు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. ►క్రూడాయిల్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలు చాలా వరకు సొంతంగా వినియోగించుకుంటున్నాయి. అదే కేవలం ఎగుమతులను బట్టి చూస్తే.. ప్రపంచంలో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా, ఇరాక్, కెనడా, అమెరికా, నైజీరియా, కువైట్, బ్రెజిల్, కజకిస్థాన్, నార్వే ఉన్నాయి. దేశంలో సగానికిపైగా పన్నులే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ల రీటైల్ ధరల్లో సగానికిపైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే కావడం గమనార్హం. కేంద్ర పన్ను దేశవ్యాప్తంగా ఒకేలా ఉండగా, ఆయా రాష్ట్రాల్లో పన్నులు వేర్వేరుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా క్రూడాయిల్ ధరలను బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్‌ల మూల ధర సగటున సుమారు రూ.49–రూ.52 మాత్రమే. కానీ కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలిపి పెట్రోల్ ధర రూ.96 నుంచి రూ.112 మధ్య.. డీజిల్ ధర రూ.87 నుంచి రూ.99 మధ్య ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర, పన్నులు ►లీటర్ పెట్రోల్ మూల ధర: రూ.49.2 ►కేంద్ర పన్నులు: రూ.28 ►డీలర్ల కమీషన్: రూ.5.45 ►రాష్ట్ర పన్నులు: రూ.26.95 ►మొత్తంగా రీటైల్ ధర: రూ.109.7 ( మే 25 నుంచి జూన్ 3 వరకు సగటు ధరల ఆధారంగా లెక్కించారు. రవాణా వ్యయం, ఇతర అంశాల ఆధారంగా స్థానికంగా ధర మారుతుంది.) ఇండియా ఎక్కడ? ►ఇప్పటివరకు గుర్తించిన మొత్తం చమురు నిల్వలు: 472.9 కోట్ల బ్యారెళ్లు ►ప్రపంచ క్రూడాయిల్ నిల్వల్లో శాతం: 0.29 ►ఉత్పత్తిలో ర్యాంకు: 20 ►దేశంలో రోజువారీ ఉత్పత్తి: 10.16 లక్షల బ్యారెళ్లు ►రోజువారీ వినియోగం: 44.43 లక్షల బ్యారెళ్లు ►దిగుమతి చేసుకోకుండా ఇండియాలోని చమురు వనరులను మొత్తం వాడేస్తే.. కేవలం మూడేళ్లలో ఖాళీ అయిపోతాయని అంచనా. చరిత్ర ఇదీ ► ప్రపంచంలో మొదటగా చైనీయులు పెట్రోలియంను ఇంధనంగా ఉపయోగించారు. ► క్రీస్తుశకం 347వ సంవత్సరంలోనే చైనాలో చమురు బావులు తవ్వినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ►ప్రపంచంలో వాణిజ్యపరంగా 1837లో తొలి క్రూడాయిల్ రిఫైనరీని అజర్బైజాన్లో ప్రారంభించారు. అక్కడే 1846లో తొలి చమురు బావిని తవ్వారు. ►అమెరికాలో 1859లో తొలి అధునాతన ఆయిల్ బోర్వెల్ను తవ్వారు. ముడి చమురు నుంచి ఏమేం వస్తాయి? క్రూడాయిల్‌ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారె ల్ అంటే దాదాపు 159 లీటర్లు (42 గ్యాలన్లు). దీని నుంచి 73 లీటర్ల పెట్రోల్, 35 లీటర్ల వరకు డీజిల్, 15.5 లీటర్ల మేర జెట్ ఫ్యూయల్, ఒక లీటర్ కిరోసిన్ వస్తాయి. మరో 42 లీటర్ల మేర హెవీ ఫ్యూయల్ ఆయిల్స్, లూబ్రికెంట్స్, స్టిల్ గ్యాస్, ఆస్ఫాల్ట్, కోక్ వంటి ఇతర ఉత్పత్తులు వెలువడతాయి. ►ప్రస్తుతం మన కరెన్సీలో ఒక లీటర్ క్రూడాయిల్ ధర సుమారు రూ.78కాగా.. శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.49, డీజిల్ ధర రూ.52 వరకు ఉంటుంది. ►పెట్రోల్, డీజిల్ రెండూ నీళ్లలా పారదర్శకంగా ఉంటాయి. వాటిని సరిగా గుర్తించేందుకు రంగులు కలుపుతారు. ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌లో నీలం–ఆకుపచ్చ కలిసిన రంగును.. డీజిల్‌లో నారింజ రంగును కలుపుతాయి. హైపవర్, ప్రీమియం వంటి పెట్రోల్‌కు పసుపు రంగును కలుపుతుంటారు. ఖాళీ అయితే ఎలా? ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మన జీవితాన్ని ఊహించలేం. ఇంట్లో వంట చేసుకునే ఎల్పీజీ నుంచి.. బైకులు, కార్లు, బస్సులు, నౌకలు, విమానాలకు ఇంధనం దాకా.. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ వంటి ఎన్నో ఉత్పత్తులకు చమురే ఆధారం. మరి భూమిపై చమురు నిక్షేపాలన్నీ ఉన్నట్టుండి ఖాళీ అయితే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవడానికే భయం గొలుపుతుంది. అందుకే శా స్త్రవేత్తలు సౌర, పవన, ఇతర ప్రత్యా మ్నాయ విద్యుదుత్పత్తిపై, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టిపెట్టారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పన్ను బకాయా.. ‘సెటిల్మెంట్’ చేస్కోండి
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రూ. 3 వేల కోట్లకు పైగా పన్నులను రాబట్టేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్–1957, తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్–2005, సెంట్రల్ ట్యాక్స్ యాక్ట్–1956, తెలంగాణ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇన్టు లోకల్ ఏరియాస్–2001 చట్టాల పరిధిలోకి వచ్చే పన్నుల చెల్లింపునకు సంబంధించి పన్నుల శాఖతో వివాదం ఉంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. వివాదాల్లో ఉన్న పన్ను చెల్లింపులకు సంబం ధించి సాధారణ పన్నులో 60 శాతం మాఫీ కానుంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 50 శాతం, ఎంట్రీ ట్యాక్స్ 40 శాతం మాఫీ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పన్నులను 100 శాతం కట్టాల్సి ఉంటుంది. అయితే వీటిపై వేసిన జరిమానాలు, వడ్డీలు రద్దవుతాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యాపారి సదరు మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం రూ.25 లక్షల కంటే ఎక్కువుంటే 4 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశమిస్తారు. ఈ వాయిదాల వరకు వడ్డీలు ఉండవు. 4 కన్నా ఎక్కువ వాయిదాలైతే పెంచిన వాయిదాల కు బ్యాంకు వడ్డీ వర్తిస్తుంది. పథకం కింద ఈ నెల 16 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను జూలై 1 నుంచి 15 వరకు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీకి సర్కిల్ ఏసీ, డీసీ, జేసీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీదే తుది నిర్ణయం. మాఫీ పోను మిగిలిన సొమ్మును అదే నెల 16 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాలి. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై పన్ను తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై రాష్ట్రప్రభుత్వం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నును తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. పెట్రో ల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించిన కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి పెరిగిన పెట్రో ల్, డీజిల్ ధరలతో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4, డీజిల్‌పై రూ.3 చొప్పున రాష్ట్రానికి ఆదాయం వస్తోందని సోమవారం నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ భారాన్ని తగ్గించాలని, అలాగే పెంచిన కరెంటు, బస్సు చార్జీలను తగ్గిస్తేనే ప్రజ లు కేసీఆర్‌ను విశ్వసిస్తారని పేర్కొన్నారు. -
హేయ్ ఎలన్‌మస్క్ ! వెల్కమ్ టూ తెలంగాణ ? కేటీఆర్ దూకుడు
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో నిరంతరంగా ప్రయత్నించే మినిస్టర్ కేటీఆర్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. చిక్కుముళ్లు ఎదురుగా ఉన్నా అవన్ని పక్కన పెట్టి ఏకంగా టెస్లా కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఎలన్‌మస్క్‌తో టచ్‌లోకి వెళ్లారు. 2016లో మొదలు గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపి చూశారు కేటీఆర్. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్ ఎక్స్ కారుని అమెరికాలో నడిపారు. కారు బాగుందని తెలుపుతూ కొత్తగా ఆలోచించిన ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా తాజాగా పాత ట్వీట్‌ని రీట్వీట్ చేశారు కేటీఆర్. ఆ వెంటనే అందరినీ ఆశ్చర్యపరిచేలా మరో ట్వీట్ చేశారు. పని చేయలని ఉంది ఇండియాకి టెస్లా కనుక వస్తే.. మీతో కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్ మంత్రిగా తెలియజేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యాపార సంస్థలు అనేక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయంటూ ట్వీట్ చేశారు. వస్తాం.. కానీ తెలంగాణకు టెస్లా వస్తే సంతోషిస్తామంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ఎలన్ మస్క్ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, ఇంకా అనేక అంశాలపై చర్చలు కొలిక్కి రాలేదంటూ ఎలన్‌మస్క్ బదులిచ్చారు. Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr — KTR (@KTRTRS) January 14, 2022 ఎప్పుడొస్తుంది గత రెండేళ్లుగా టెస్లా కార్లను ఇండియాకి తెస్తామంటూ ఎలన్ మస్క్ ప్రకటిస్తున్నారు. అయితే పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లు ఐనందున దిగుమతి సుంకం తగ్గించాలంటూ మెలిక పెట్టారు. ఇండియాలో కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పన్ను రాయితీలపై సానుకూలంగా స్పందిస్తామని కేంద్రం బదులిచ్చింది. దీనిపై ఇటు టెస్లా, అటు కేంద్రం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో టెస్లా కనుక ఇండియాకి వస్తే తెలంగాణలో ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ ఏకంగా టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌ని అడగడం ద్వారా మంత్రి కేటీఆర్ చొరవ చూపించారు. చదవండి: ఇండియాలో టెస్లా కార్ల విడుదలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్..! -
చేనేత రంగాన్ని ఆదుకోవాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. -
నువ్వు బతికున్నావనే సంగతి మర్చిపోతుంటాను: ఎలన్ మస్క్
వాషింగ్టన్: టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్‌ని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశాడు ఎలన్ మస్క్. ఓ నువ్వు ఇంకా బతికు ఉన్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అసలు వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలయ్యింది అంటే.. కొన్ని రోజుల క్రితం ఎలన్ మస్క్ టెస్లాలో తన పేరిట ఉన్న 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నాడు. 1.2 మిలియన్ షేర్లను అమ్మేశారు. వీటి విలువ 1.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ పరోక్షంగా స్పందిస్తూ ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: Elon Musk: ఎలన్ మస్క్‌కి ఏమైంది, ఎందుకిలా?..) We must demand that the extremely wealthy pay their fair share. Period. — Bernie Sanders (@SenSanders) November 13, 2021 దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘ఓ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను.. ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. టెస్లా సీఈఓ ట్వీట్‌పై సాండర్స్ ఇంకా స్పందించలేదు. Want me to sell more stock, Bernie? Just say the word … — Elon Musk (@elonmusk) November 14, 2021 అయితే ఎలన్ మస్క్ స్టాక్ విక్రయానికి గత వారం నిర్వహించిన ట్విటర్ పోల్ ఫలితాలే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. ఇక మస్క్ ప్రస్తుతం అతను 13.3 శాతం అత్యధిక పన్ను రేటు కలిగి ఉన్న కాలిఫోర్నియాకు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్ రాష్ట్ర ఆదాయపు పన్ను లేని టెక్సాస్‌కు మారినప్పటికీ, అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఇటీవలి ట్వీట్లో అంగీకరించాడు. ఎందుకంటే అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. (చదవండి: అన్నంత పని చేసిన ఎలన్‌మస్క్.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?) బిలియనీర్ల విపరీతమైన సంపదపై పన్ను విధించడం సాండర్ విధుల్లో అతి పెద్ద భాగం. సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ఇది రాబోయే దశాబ్దంలో సుమారు 4.35 ట్రిలియన్ డాలర్లను సమీకరించగలదని.. అంతేకాక రానున్న 15 సంవత్సరాలలో బిలియనీర్ల సంపదను సగానికి తగ్గించగలదని సాండర్స్ పేర్కొన్నాడు. అధ్యక్షుడు జో బిడెన్ తీసుకువచ్చిన విస్తృత సామాజిక భద్రతా నికర ప్రణాళికకు నిధులు సమకూర్చడానికి డెమొక్రాట్లు బిలియనీర్లపై పన్ను విధించడానికి ప్రయత్నిస్తున్నారు. చదవండి: పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్.. కారణం ఇదేనా? -
ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే!
Most Expensive and Cheapest Petrol and Diesel Prices Countries: పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్ కంపెనీలు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారంతో పెట్రోలు, డీజిల్ రేట్లు లీటరకు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. కాన్నీ కొన్ని దేశాల్లో అగ్గిపెట్టె కంటే పెట్రోలు చాలా చీప్. మరి కొన్ని చోట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే సామాన్యులు మోయలేని దశకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా.. ఇంకా తమ ధరల దాహం తీరలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు సంకేతాలు పంపుతున్నాయి. కానీ ఈ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటరు పెట్రోలును కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనుజువెలా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలం. అమెరికా ఆయిల్ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనుజువెలాలో లీటరు పెట్రోలు ధర 0.02 డాలర్లు మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్ అందిస్తోంది. ఇక్కడయితే ఇంతే వెనుజువెలా తర్వాత పెట్రోలు అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్ నిలిచింది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51గా ఉంది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోలు వస్తోంది. అక్కడ మోత మోగుతోంది పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్కాంగ్ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్‌కాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్‌కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్లాండ్, ఐస్లాండ్లలో లీటరు పెట్రోలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి. ఏడాదిన్నరలో రూ.36 పెరుగుదల కరోనా సమయంలో డిమాండ్, సప్లై మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మేలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర కనివినీ ఎరుగని రీతిలో పెరిగింది. మరీ ఈ వైరుధ్యం ఏంటో ? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంటూ కేంద్రం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లుగా నమోదు అయ్యింది. అప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 దగ్గర నమోదు అవుతోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి : మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు -
ద్రవ్యలోటు రూ.3.21 లక్షల కోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే నాటికి లక్ష్యంలో 21.3 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తాజా గణాంకాలు ఇలా... - జూలై ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదా యం రూ.6.83 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 34.6%). ఇందులో రూ.5,29,189 కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1,39,960 కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.14,148 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.5,777 కోట్ల రుణ రికవరీలు, రూ.8,371 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి. - ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.10.04 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్లో 28.8 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.8,76,012 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1,28,428 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.2,25,817 కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. 1,20,069 కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 3.21 లక్షల కోట్లుగా ఉంది. 6.8 శాతం లక్ష్య సాధన కష్టమే! 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని ద్రవ్యలోటు 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్ -
టెక్స్ టైల్ ఎగుమతిదారులకు ఊరట
న్యూఢిల్లీ: జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఆర్ఓఎస్సీటీఎల్ (రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్) స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. జూలై 14న కేంద్ర క్యాబినెట్ ఈ పథకం పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. అంతర్జాతీయ పోటీకి దీటుగా... అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని పేర్కొన్నారు. స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోగాభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని అభిప్రాయపడ్డారు -
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గుర్తింపు
న్యూఢిల్లీ: జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తున్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోనూ నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి సందేశం ఇచ్చారు. ఆదాయపన్ను శాఖ విధానాలు, ప్రక్రియలను సులభతరంగా మార్చడంలోను, పారదర్శకంగా, సౌకర్యవంతమైన అనుభవాన్ని పన్ను చెల్లింపుదారులకు కల్పించే విషయంలో ఆదాయపన్ను శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించి చాలా వరకు ప్రక్రియలు, నిబంధనల అమలు ఆన్లైన్ వేదికలపైకి తీసుకురావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖలకు ప్రత్య క్షంగా రావాల్సిన అవసరం లేకుండా పోయినట్టు లేదా చాలా వరకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. పన్ను ల వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి నెలకొనడం పట్ల ఆదాయపన్ను శాఖ కృషిని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్ కూడా అభినందించారు. -
ఈ పొరపాట్లు చేయొద్దు.. ఫారం 16ని చెక్ చేయండి
ఐటీ రిటర్నులు వేస్తున్నాం.. పన్నులు కట్టేస్తున్నాం కదా అని మనలో మనం సంబరపడుతుంటాము. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో బైటపడ్డ నిజాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.. ► ఒక ఉద్యోగి ఒక సంవత్సరకాలంలో రెండు చోట్ల ఉద్యోగం చేసినప్పుడు .. ఇద్దరూ ఫారం 16 జారీ చేసి ఉంటారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఇస్తారు. ఇద్దరూ సెక్షన్ 80సి మినహాయింపులూ ఇస్తారు. కానీ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒకసారే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రాదు. స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు ఆదాయంలో మార్పు రాదు. కానీ మినహాయింపులు, సగానికి తగ్గుతాయి. ఫలితంగా పన్నుభారం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కాక పన్ను భారం పెరిగిపోయిందో అని ఆందోళన .. కాస్సేపు బాధ .. కాస్సేపు బెంగ వస్తాయి. ఇవన్నీ సర్దుకునే సరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఫారం 16ని చెక్ చేయండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సరిదిద్దుకోండి. ► కొన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకోరు. బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ, ఆన్సర్ పేపర్లు దిద్దితే వచ్చే డబ్బు, ఇన్విజిలేషన్ వల్ల వచ్చే డబ్బు, నగదు రూపంలో వచ్చే ట్యూషన్ ఫీజులు, ఇంటద్దెలు, గార్డియన్‌గా పిల్లలకు వచ్చిన ఆదాయం, జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూపించాలి. ఎటువంటి రిస్కు తీసుకోవద్దు. ► పన్ను భారం ఉండని ఆదాయాన్ని.. అంటే.. మినహాయింపు లభించే ఆదాయాలను కూడా రిటర్నులో డిక్లేర్ చేయాలి. ఇలా చేయడం వల్ల పన్ను భారం ఉండదు. భవిష్యత్తులో ‘‘సోర్స్’’ వివరణ ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ► బ్యాంకుల మీద వచ్చే వడ్డీ కేవలం 10 శాతం టీడీఎస్‌కి గురి అవుతుంది. మీ నికర ఆదాయంపై 10 శాతం, 20 శాతం లేదా 30 శాతం వర్తించవచ్చు. 20 శాతం, 30 శాతం రేటు పడినప్పుడు వడ్డీ మీద టీడీఎస్ సరిపోదు. పది శాతం పన్ను పడుతుంది. అలా తెలియగానే ఎంతో బాధ.. ఏదో తప్పు జరిగిందని ఆవేదన, ఆలోచన వస్తాయి. మిగతా మొత్తం చెల్లించక్కర్లేదు అనుకోవడం తప్పు. ► నికర ఆదాయం నిర్దేశించిన పరిమితి దాటితే స్థూల పన్ను భారంలో 10 శాతం సర్‌చార్జి పడుతుంది. సర్‌చార్జి మీద 4 శాతం సెస్సు అదనం. ముందుగా ఏ ఆదాయానికి ఆ ఆదాయం విడిగా లెక్కించి, అజాగ్రత్త వలన నికర ఆదాయం తక్కువగా అనిపించి సర్‌చార్జీని పరిగణనలోకి తీసుకోరు. కానీ అన్నీ కలిపేసరికి నికర ఆదాయం కోటి రూపాయలు దాటితే సర్‌చార్జి కరెంటు షాకులాగా తగులుతుంది. తప్పు .. తప్పని తేలకపోతే ఫర్వాలేదు. కానీ తేలితే మళ్లీ బెంగ.. భయం.. పైగా పన్నూ తప్పదు. కాబట్టి ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త వహించండి. -
అధిక పెట్రో ధరలు భారమే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న ప్రజా డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వీటి ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె అంగీకరిస్తూనే.. పన్నుల తగ్గింపు అన్నది కేంద్రం, రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. దేశంలో రాజస్తాన్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరుకోగా.. రిటైల్ ధరలో 60 శాతం కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల రూపంలో వెళుతుండడం గమనార్హం. డీజిల్ రిటైల్ ధరలో 56 శాతం పన్నుల రూపంలోనే ఉంటోంది. కరోనా కారణంగా గతేడాది అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు పడిపోయిన సమయంలో మంత్రి సీతారామన్ ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా ఆదాయ లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు ఆమె ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఈ విషయమై ఆర్థిక మంత్రి శుక్రవారం మీడియా ముఖంగా స్పందించారు. తగ్గించాల్సిన అవసరం ఉందంటూనే.. అందుకే తాను ధర్మసంకటం పదాన్ని ప్రయోగించినట్టు చెప్పారు. ‘‘ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒక్కటే పన్నులు విధించడం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేసుకుంటున్నాయి’’ అని పరిస్థితిని ఆమె వివరించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకే వెళుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువస్తే పన్నుల భారం తగ్గుతుందన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది జీఎస్టీ కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన తీసుకువెళతారా? అన్న మీడియా ప్రశ్నకు.. సమావేశానికి ముందు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కెయిర్న్ ఆర్బిట్రేషన్‌పై అప్పీల్ కెయిర్న్ ఎనర్జీకి భారత్ 1.4 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుపై అప్పీల్ చేయడం తన విధిగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమ యంత్రాంగానికి ఉన్న పన్ను విధింపు హక్కును ప్రశ్నించినప్పుడు అప్పీల్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘‘రెట్రోస్పెక్టివ్ పన్ను అంశంలో మా విధానాన్ని స్పష్టంగా వెల్లడించాము. 2014 నుంచి 2020 వరకు ఏటా దీన్నే పునరావృతం చేశాం. ఇందులో స్పష్టత లేకపోవడమేమీ కనిపించలేదు’’ అని మంత్రి చెప్పారు. ఆర్థిక ఉద్దీపనల భారాన్ని ప్రజలపై వేయం... ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆర్థిక ఉద్దీపనలకు కావాల్సిన నిధులను రుణాలు, ఆదాయాల రూపంలో సమకూర్చుకుంటామే కానీ, ప్రజలపై భారం వేయబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులపై ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా చార్జీ ఉండదన్నారు. ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందే కానీ, ప్రజల నుంచి కాదని చెప్పారు. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. -
పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించనుందా? తాజా అంచనాలు ఈ ఆశాలనే రేకెత్తిస్తున్నాయి. పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలను తాకడంతో వాహనాలను తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుందనే అంచనాలు భారీగా వ్యాపించాయి. ఈ మేరకు చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోందట. (పెట్రోలుకు తోడు మరో షాక్ ) పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేృత్వంలోని బీజేపీ సర్కార్ గత 12 నెలల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచింది. తాజాగా వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తో్ంది. అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఇంధనంపై పన్నును ఎప్పుడు తగ్గిస్తామో చెప్పలేను, కానీ, పన్ను భారంపై కేంద్ర, రాష్ట్రాలు చర్చించాలి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్యాసింజర్‌కు అస్వస్థత, కరాచీకి ఎమర్జెన్సీ మళ్లింపు టాటా మోటార్స్‌కు భారీ షాక్ -
పన్నుల విధానాన్ని సమీక్షించాలి: సునీల్ మిట్టల్
ముంబై: దేశీయ టెలికాం రంగం పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాలను సమీక్షించాలని మొబైల్ దిగ్గజం భారతి ఏయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ శుక్రవారం తెలిపారు. టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆయన వెబ్ కాన్పరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికాం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలికాం రంగం మూలధన కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. మరోవైపు టెలికాం రంగాన్ని ఆధునికరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు. -
ఉద్యోగ కల్పనలో ఏపీని ఆదర్శంగా తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య - పరిష్కరానికి చేపట్టవలసిన కార్యాచరణ అన్న ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే గ్రామ సచివాలయాలలో గ్రాడ్యుయేట్ల కోసం లక్షా 26 వేల 728 ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించిందని అన్నారు. దేశ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సవరించిన విషయం తెలిసిందే. నిబంధనలను తుంగలో తొక్కుతూ గత యూపీఏ ప్రభుత్వం వేల కోట్ల బ్యాంక్ రుణాల మంజూరీకి అనుమతించి, అంతులేని అక్రమాలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు వంటి దుస్సాహసానికి ఒడిగట్టి ఆర్థిక రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని అన్నారు.(‘కక్కుకుంటూ ఒకరు.. కెన్యాపై మరొకరు’) కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదు దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఆయన ప్రస్తావిస్తూ తాజాగా విడుదలైన పే కమిషన్ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో 38.9 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా 31 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగిందని అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో 46 శాతం, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో 47 శాతం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, సివిల్ సర్వీసుల ద్వ్రారా 2014లో 1364 పోస్టులు భర్తీ చేస్తే 2019 నాటికి ఆ సంఖ్య 896కి తగ్గిపోయిందన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని,. ఒక కేలండర్‌ను అనుసరించి వాటిని భర్తీ చేయకపోవడం వలన లక్షలాది మంది ఉద్యోగావకాశాలను కాలరాసినట్లువుతుందని అన్నారు. నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాల భర్తీతోనే పరిష్కారం కాదని సూచించారు. (కరోనాపై బాలీవుడ్ సెలబ్రిటీల సూచనలు) దేశంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రధానంగా జాతీయ రహదారులు, పట్టణ రవాణా, పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో భారీ పెట్టుబడుల ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు. పదేళ్ళు గడిచినా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇంకా డ్రాయింగ్ టేబుల్ స్థాయి నుంచి ముందుకు కదలలేదని ఉదాహరించారు. అలాగే విశాఖపట్నం నుంచి ఫార్మా, మెరైన్ ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం కార్గో సౌకర్యాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదని తెలిపారు. విశాఖపట్నం మేజర్ పోర్టు విస్తరణ ప్రణాళిక ఆచరణకు నోచుకోలేదని, ఇలాంటి కారణాల వలన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందని ఆయన విమర్శించారు. ('లేఖలు, లీకులు అందులో భాగమే') సవరించిన బడ్డెట్ అంచనాలలో భారీగా కోత ‘‘దేశ జనాభాలో కనీసం 70 శాతం గ్రామాల్లోనే ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడమే. దీనికి విరుద్ధంగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీలకు సవరించిన బడ్డెట్ అంచనాలలో భారీగా కోత పెట్టింది. సబ్సిడీలలో దాదాపు 28 శాతం కోత విధించారు. ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో గత ఏడాది కంటే 9,500 కోట్లు తగ్గించారు. దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైన, అక్కడ నిరుద్యోగ సమస్యపైన ప్రబలంగా ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిలా పనిచేస్తున్న విదేశీ ఆర్థిక పెట్టుబడులపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం దిశగా తరుముతోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం యావత్తు ఈ మహమ్మారిని ఎదుర్కొనే పోరాటంలో పాల్గొంది. ఇలాంటి సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోవాలి. ఇప్పటివరకు మాన్యుఫాక్చరింగ్ రంగంలో ముందున్న చైనాను అధిగమించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ జేఏసీ) న్యూఢిల్లీ : ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఎగుమతులపై సుంకాల మాఫీకి పథకం గురించి రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎగుమతులకు కల్పిస్తున్న రాయితీలపై ఏర్పడిన వివాదంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పేనల్ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎగుమతులపై పన్నులు, సుంకాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీవోలో నెలకొన్న వివాదం గురించి వివరించారు.(‘ఆ మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి’) పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టాం భారత్ అమలు చేస్తున్న ఎగుమతులకు సంబంధించిన పథకాలు, సుంకం చెల్లించకుండా దిగుమతులు చేసుకునే పథకంపై ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికా వివాదం లేవనెత్తింది. దీనిపై వివాద పరిష్కార ప్యానల్ తన నివేదిక సమర్పిస్తూ భారత్ ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకాలు డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా లేవని తీర్పు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. నివేదికను గత ఏడాది నవంబర్ 19 భారత్ సవాలు చేసింది. అయితే డబ్ల్యూటీవో అప్పిలేట్ వ్యవస్థ క్రియాశీలంగా లేని కారణంగా విచారణ భారత్ దాఖలు చేసిన పిటిషన్ సస్పెన్షన్‌లో ఉండిపోయిందని అన్నారు. డబ్ల్యూటీవో తీర్పు ఎగుమతులపై దుష్ప్రభావం చూపకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎగుమతి చేసే ఉత్పాదనలపై పన్నులు, సుంకాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. (మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18) న్యూఢిల్లీ : నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాలకు చెందిన వ్యక్తులు ఈ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం ప్రధాన పారిశ్రామిక రంగాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మాన్యుఫాక్చరింగ్ రంగం గణనీయమైన భాగస్వామ్యం పొందేందుకు, ప్రధాన పారిశ్రామిక రంగాల మధ్య పోటీతత్వం పెంచేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన జరుగుతుందని మంత్రి వెల్లడించారు. (కామసూత్ర నటికి కరోనా కష్టాలు) -
ఆదాయానికి ఐడియా..!
జాతీయ రహదారులపై టోల్ వసూలు తరహాలోనే ఇక గ్రానైట్ ఉత్పత్తులకూ ఇకపై రుసుము వసూలు చేయనున్నారు. అందులో భాగంగా రాయల్టీ వసూళ్లకు టెండర్ల కోసం ప్రకటన కూడా జారీ చేశారు. దీనికి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. గ్రానైట్ గనుల నుంచి పెద్ద మొత్తంలో ముడిరాయి రాయల్టీ చెల్లించకుండానే సరిహద్దు దాటిపోతోందని వివిధ రకాల నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలోనే దొంగ చేతికి తాళం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, ఒంగోలు: జిల్లాలో అన్ని రకాల ఖనిజాలకు సంబంధించి మొత్తం ఎనిమిది మైనింగ్ లీజులు, 526 క్వారీ లీజులు ఉన్నాయి. అన్ని రకాల ఖనిజాలకు సీనరేజి వసూళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల ఖనిజాలకు రాయల్టీ వసూలు కొన్ని రకాల శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలించింది. బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, బల్లాస్ట్, మొరం, గ్రావెల్ ఆర్డినరీ ఎర్త్ మినహా అన్ని రకాల మైనర్ మినరల్స్‌కు సీనరేజి రుసుం వసూలు, ఇతర చార్జీలు, పన్నుల వసూలు కోసం టోల్ వసూలు తరహా కాంట్రాక్టర్ల ఎంపికకు బిడ్స్ పిలిచింది. జిల్లా పరిధిలో 272 క్వారీలు జిల్లా పరిధిలో 272 క్వారీల నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇక సీనరేజి రుసుం వసూలు ప్రైవేటు వ్యక్తులే చేయనున్నారు. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ 141 లీజులు, బ్లాక్ గ్రానైట్ క్వారీ లీజులు 60, కలర గ్రానైట్ లీజులు 71 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా భూగర్భ గనులశాఖ ఒంగోలు ఏడీ కార్యాలయం పరిధిలో రూ.360 కోట్లు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.3 కోట్లు రాయల్టీ ద్వారా ఆదాయం వస్తోంది. వీటికి 20 శాతం అదనంగా చేర్చి టెండర్ బిడ్ పిలిచినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. జిల్లాలో అత్యధిక రాయల్టీ భూగర్భ గనుల శాఖ ఒంగోలు సహాయ సంచాలకుని కార్యాలయం పరిధిలోనే ఉంది. రాయల్టీ వసూలు ఇక ప్రైవేటు పరం కానున్న నేపథ్యంలో క్లస్టర్లను నిర్ణయించారు. ఒక వేళ జిల్లా మొత్తానికి ఒకే టెండర్ బిడ్ రాకపోతే క్లస్టర్లకు విడివిడిగా టెండర్లను పిలవడానికి వీలుగా క్లస్టర్లను నిర్ణయించారు. ఒంగోలు, మార్టూరు, మార్కాపురం, చీమకుర్తి క్లస్టర్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రానైట్ నుంచి మాత్రమే సీనరేజి వసూలు చేయాలని నిర్ణయించారు. సీనరేజితో పాటు ఆదాయపన్ను, డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్, నెట్ చార్జీలు కూడా టెండర్ దక్కించుకున్న వారే వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం పేరొందిన సంస్థలు, వ్యక్తుల నుంచి డిపార్టుమెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. ప్రకాశంలో గెలాక్సీ గ్రానైట్, కలర్, బ్లాక్ గ్రానైట్ ఖనిజాలు ఉన్నాయి. గెలాక్సీ మినహా కలర్, బ్లాక్, చిత్తూరు రెడ్ వంటి రకాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఎస్టిసిఈసిఓఎంఎంఇఆర్సిఇ డాట్ కామ్) లేదంటే డిపార్టుమెంట్ ఆప్ మైన్స్ అండ్ జియాలజి వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఐఎన్ఈఎస్ డాట్ ఏపి డాట్ జీవోవి డాట్ ఇన్)లో వివరాలు పొందు పరిచారు. బిడ్స్ దాఖలు చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంది. రూ.450 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, కనిగిరి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్ గనులు ఉన్నాయి. ఏటా ఒంగోలు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.380 కోట్ల వరకు రాయల్టీ రుసుం వసూలవుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారుల నివేదికలో రాయల్టీ రూపంలో జమవుతున్నదాని కన్నా రెట్టింపు దొడ్డిదారిన పోతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానం తరహాలోనే గ్రానైట్ రాయల్టీ రుసుం వసూలుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి రూ.450 కోట్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు నెలకున్నాయి. జిల్లాలో ఇప్పటికే డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.558 కోట్లు ఉంది. రూ.101.78 కోట్లతో 992 పనులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 55 శాతం నిధులతో కమ్యూనిటీ బెన్ఫిట్ వర్కులు, 40 శాతం నిధులతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు నిధులు కేటాయించారు. కమ్యూనిటీ బెన్ఫిట్ విభాగంలో విద్య, అంగన్వాడీ భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ విభాగానికి, ఆరోగ్యం, తాగునీటి సరఫరాకు, పారిశుద్ధ్య పనులకు నిధులను కేటాయించారు. మిగిలిన 40 శాతం నిధులతో సిమెంట్ రహదారులు, మురుగునీటి పారుదలకు కాలువల నిర్మాణానికి, నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించారు. ఇక మీదట డీఎంఎఫ్ చార్జీలు కూడా సంబంధిత కాంట్రాక్టర్లే వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో గ్రానైట్ సీనరేజి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రంగాల్లోని వ్యాపారులు సీనరేజి వసూలుకు ప్రభుత్వ మార్గదర్శకాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. -
పంచాయితీలు కార్పోరేషన్లో విలీనం
సాక్షి, అల్గునూర్: కరీంనగర్ కార్పొరేషన్ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్ కార్పొరేషన్ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటుచేశారు. హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు స్వాధీనం.. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ భవనాలకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పాలన ప్రారంభం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, మానకొండూర్ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్ పాలన మొదలైంది. పన్నులు పెరగవు.. గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్‌కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను డీసీఎంఏకు రాసి ఆన్లైన్ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్‌లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
ఆందోళన బాటపట్టిన క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు
సాక్షి, విశాఖపట్నం: మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ పేరిట భారీగా వసూళ్లు చేపట్టడాన్ని నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమరావతి కోసం ఏడాదికి 2వేల రూపాయలు లెబర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. మ్యాక్సీ క్యాబ్‌లకు పోలీసులు పార్కింగ్ సదుపాయం కల్పించకపోగా, ఫొటోలు తీసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి వాహనాలు నడుపుతున్నా.. ఆయిల్ డబ్బులు కూడా రావటం లేదని వాపోయారు. ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌లు కట్టలేక భార్యల పుస్తెలు తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాక్సీ క్యాబ్ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని అన్నారు. పలు ట్యాక్స్‌ల పేరిట, ఇన్సూరెన్స్ పేరిట ఏడాదికి సుమారు లక్ష రూపాయలు లాగేస్తుంటే.. తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. -
డిసెంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు 2018 డిసెంబర్లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. డిసెంబర్లో వసూలైన రూ.94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) పరిమాణం రూ.16,442 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.47,936 కోట్లు, సెస్సు రూ. 7,888 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 9 నెలల్లో రూ.8.71 లక్షల కోట్లు.. 2018–19 బడ్జెట్లో కేంద్రం వార్షికంగా జీఎస్టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 1.12 లక్షల కోట్లు నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే.. జీఎస్టీ వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్, అక్టోబర్‌లో మాత్రమే ఇవి రూ.1 లక్ష కోట్లు దాటాయి. కొత్త రిటర్న్ ఫారంల నోటిఫికేషన్: కాగా జీఎస్టీ విధానం కింద జూన్ 30 నాటికి వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన వార్షిక జీఎస్టీ రిటర్న్ కొత్త ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. మరోవైపు, 2017 జులై–2018 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిపై లేట్ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని సీబీఐసీ నిర్ణయించింది. అయితే, ఆయా సంస్థలు 2019 మార్చి 31 నాటికి మొత్తం 15 నెలల వ్యవధి రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. -
‘రిజర్వేషన్లు కల్పించే వరకు పన్నులు చెల్లించం’
ముంబై : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న మరాఠా నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు పన్నులు చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్ల కోసం మరాఠా నేతలు గతకొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం వివిధ మరాఠా సంఘాలకు చెందిన నేతలు లాథూర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ సభ్యుల, శాసనసభ్యుల కార్యలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రభుత్వానికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించబోమని ప్రకటించారు. రిజర్వేషన్లపై ప్రకటన చేసే వరకు ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపకూడదని నేతలు భావిస్తున్నారు. మరాఠి నేత సంజీవ్ బోర్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న మరాఠా క్రాంతి జన్ ఆందోళన్ పేరిట రహదారులపై నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. మరాఠాలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని కోరారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. గతవారం చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న మరాఠా నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారని.. వాటిని తక్షణమే ఎత్తివేయాలని మరో నేత శాంతారామ్ కుంజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఐటీ రిటర్నులను సరళీకృతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: వయోజనులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారిని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పన్ను రిటర్నుల దాఖలను సరళీకృతం చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఆన్లైన్ ద్వారానే ఈ–రిటర్నులను స్వీకరి స్తుండటంతో వృద్ధులు, కంప్యూటర్ పరిజ్ఞానం తెలియని వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా దరఖాస్తు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. మంగళవా రం ఇక్కడ జరిగిన 158వ ఆదాయ పన్ను దినో త్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదాయ పన్నుల చెల్లింపులకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న కొందరు పారిశ్రామికవేత్తలతో ఓ కన్సార్టి యాన్ని రూపొందించి, వారు చెల్లించిన పన్నుల నుంచి కొంతభాగాన్ని విద్య, వైద్య రంగాల్లో సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం తిరిగి వారికే చెల్లించాలనిగవర్నర్ ప్రతిపాదించారు. కార్యక్రమంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సీఎండీ వి.ఉదయభాస్కర్, ఏపీ, టీఎస్ హైదరాబాద్ రీజియన్ ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామ్‌ప్రసాద్ చౌదరి, ఎన్ఎండీసీ సీఎండీ ఎన్.బిజేంద్రకుమార్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లిమిటెడ్ చైర్మన్ సతీష్ కె.రెడ్డి, అమర్‌రాజా బ్యాటరీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ రాంచంద్ర ఎన్.గల్లా పాల్గొన్నారు. -
జీఎస్టీ అంటే ఆర్ఎస్ఎస్ ట్యాక్స్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని ఆర్ఎస్ఎస్ ట్యాక్స్‌గా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభివర్ణించారు. దీని కారణంగా ప్రజలపై విపరీతంగా పన్ను భారం పెరిగిందనీ, అందుకే ఇది ‘చెడుమాట’గా మారిందన్నారు. ‘అది ఒక విచిత్రమైన జంతువు లాంటిది. సగటు జీవిపై జీఎస్టీతో విపరీత భారం మోపారు. ఒకే పన్ను రేటు ఉంటే జీఎస్టీ అనొచ్చు. అనేకమార్లు పన్నులు వసూలు చేస్తుంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ అని పిలవాల్సి ఉంటుంది’ అన్నారు. అధికారులు మాత్రమే జీఎస్టీ వల్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. పరోక్ష పన్నుల విధానంలోకి పెట్రోలియం ఉత్పత్తులను కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. -
జీఎస్టీ@365
సాక్షి, మెదక్ : ఒకే దేశం ఒకే పన్ను విధానం జీఎస్టీ(వస్తు సేవల పన్ను) అమలులోకి వచ్చి నేటికి ఏడాది. జూన్ 30వ తేదీ అర్ధరాత్రి అనగా జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఆరంభంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు వ్యాపార వర్గాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండ అమలు చేసింది. జీఎస్టీకి ముందు జిల్లాలో వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అమలులో ఉండేది. దీని పరిధిలో 1,132 రకాల చెల్లింపుదారులు ఉండేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగింది. వివిధ రకాల ఉత్పత్తులపై పన్ను చెల్లించే వారి సంఖ్య 1,972కు చేరుకుంది. అదనంగా మరో 840 మంది వ్యాపారులు, వ్యాపార సంస్థలు వస్తు సేవల పన్న చెల్లింపు పరిధిలోకి వచ్చాయి. అన్ని రకాల వ్యాపారాల్లో 20 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వ్యాపారులు, వ్యాపారసంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఏడాది కాలంగా ప్రతి మూడు మాసాలకు ఒకమారు రిటర్న్‌లు ఫైల్‌చేస్తూ పన్నులు చెల్లిస్తున్నారు. వ్యాట్ అమలులో ఉన్నప్పుడు ప్రతినెలా పన్నుల రూపంలో సుమారు రూ.2 కోట్లు వచ్చేవి. అయితే జీఎస్టీ అమలు తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రతినెలా రూ.3 కోట్లకుగాపై పన్నులు వసూలు అవుతున్నాయి. దీంతో జిల్లాలో జీరో దందా తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో ఒకే పన్ను విధానం అమలు అవుతుండటంతో పన్నుఎగవేత లేకుండా పోయింది. అలాగే ప్రజలకు చాలా ఉత్పత్తులు ఒకే ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఎత్తివేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తుల రవాణా వేగం పెరిగింది. వ్యాపారులకు ట్యాక్స్ చెల్లించటం సులువైంది. ఆన్లైన్లో చెల్లింపు విధానంతో వ్యాపారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి. అయితే జీఎస్టీపై అందరి వ్యాపారులకు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీని అమలులో ఇంకా కొన్ని ఇబ్బందులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయి నెట్వర్క్ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాపారులు, వ్యాపార సంస్థలు పన్నులు సక్రమంగా చెల్లిస్తుంది లేనిదీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గతంలో మాదిరిగా పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి దాడులు నిర్వహించాలన్నా.. నిబంధన ప్రతిబంధకంగా మారుతోంది. -
బెజవాడ వాసులపై పన్నుల మోత
-
చమురు ధరలు తగ్గించడంపై కేంద్రం దృష్టి
-
అధిక పన్నుల్లో మీరే ఆదర్శం: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్నులు వేసి ప్రజలను వేధించడంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు రూ.68, రూ.53 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు బ్యారెల్ ధర 79 డాలర్లకు తగ్గినప్పుడు రూ.84, రూ.74కు ఎందుకు పెరిగాయో చెప్పాలని నిలదీశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 22 రాష్ట్రాల కన్నా ఎక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. 16 నుంచి 18 శాతం వరకు ఇతర రాష్ట్రాల్లో పన్నులుంటే తెలంగాణలో పెట్రోల్‌పై 35.02 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్నులను విధించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. -
ప్రజలకు మంట.. ప్రభుత్వాలకు పంట
సాక్షి, అమరావతి: ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. పెట్రోలు, డీజిల్ రేట్లతో ఖజానా నింపుకొంటున్నాయి. దీని కోసం ఎడా పెడా పన్నులు పెంచేస్తున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆదాయం తగ్గుతోందని పన్నులు పెంచిన ప్రభుత్వాలు ఇప్పుడు దేశీయ మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరినా ఆ పెంచిన భారాన్ని తగ్గించడం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ. 79.81, డీజిల్ రూ.72.38కు చేరుకున్నాయి. గడిచిన రెండేళ్లలో పెట్రోలు ధరలు 22 శాతం, డీజిల్ ధరలు 34 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులే. ఈ రెండేళ్లలో రెండు ప్రభుత్వాలు కలసి పెట్రోల్‌పై రూ. 11.47, డీజిల్‌పై రూ. 15.47 అదనపు పన్నులు విధించాయి. మోదీ ప్రభుత్వం సుంకాలను తొమ్మిదిసార్లు పెంచి ఒకసారి తగ్గించింది. గత అక్టోబర్‌లో కేంద్రం సుంకం రూ. 2 తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి, 2015లో లీటర్‌కు రూ. 4 అదనపు వ్యాట్‌ను విధించింది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాట్‌ను తగ్గించమని రాష్ట్రాలకు కేంద్రం చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర సరిహద్దుల్లోని బంకులు మూతపడుతున్నాయని పెట్రోలియం డీలర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖజానా గలగలలు.. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 15,000 కోట్ల ఆదాయం వస్తోంది. నేరుగా రాష్ట్రం విధించే వ్యాట్ ద్వారా గత ఏడాది రూ. 9,785.24 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 42 శాతం రాష్ట్ర వాటాను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ. 4,200 కోట్లు వస్తున్నాయి. 2015 ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధరలో రాష్ట్ర పన్నుల వాటా రూ. 13.99గా ఉంటే ఇప్పుడది సుమారు రూ. 22కు చేరింది. అదే విధంగా లీటరు డీజిల్ ధరలో పన్నుల వాట రూ. 8.86 నుంచి సుమారు రూ.16కు చేరింది. రాష్ట్రంలో ఏడాదికి సగటున పెట్రోల్ 320 కోట్ల లీటర్లు, డీజిల్ 125 కోట్ల లీటర్లు వినియోగం జరుగుతోంది. కేవలం రూ. 4 అదనపు వ్యాట్ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 5,000 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించింది. సంక్షోభంలో రవాణా రంగం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. దీంతో సరుకుల ధరలు కూడా పెరిగి సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి లీటరు డీజిల్ ధర రూ. 48 వద్ద ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 72 దాటేసిందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యాపారాలు లేక రవాణా చార్జీలు పెంచలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందన్నారు. ప్రతి కిలోమీటరు, టన్నుకు ఎంత ధర అన్నది నిర్ణయించమని ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పెడచెవినపెడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రాష్ట్ర వ్యాట్ ఆదాయం ఏడాది ఆదాయం (రూ. కోట్లలో) (జూన్–మార్చి) 2014-15 5,269.74 2015-16 8,074.71 2016-17 8,979.99 2017-18 9,785.24 నోట్: ఇది కాకుండా కేంద్రం వసూలు చేసే పన్నులో 42 శాతం రాష్ట్రానికి వస్తుంది. -
అమెజాన్‌కు షాక్: ట్రంప్ టాక్స్ వార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్‌పై మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్ల గక్కారు. పన్నులు చెల్లించకుండా భారీ ఆదాయాన్ని దండు కుంటోందంటూ తన తాజా ట్వీట్లో దాడి చేశారు. ఇటీవల మీడియా నివేదికలకు బలం చేకూరుస్తూ ట్రంప్ గురువారం మరో ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు అమెజాన్ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశా..పన్నులు చెల్లించకుండా.. పన్ను చెల్లిస్తున్న చిన్నవ్యాపారులకు తీరని నష్టం చేకూరుస్తోందంటూ అమెజాన్‌పై ఆయన ధ్వజమెత్తారు. ఇతరుల మాదిరిగా కాకుండా చాలా స్వల్పంగా లేదా అసలు పన్నులు చెల్లించకుండా వేలాదిమంది రీటైలర్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది. తమ పోస్టల్ సిస్టంను అమెజాన్ డెలీవరీ బాయ్‌గా వాడుకుంటూ అమెరికాకు తీరని నష్టాన్ని కలిగిస్తోందంటూ ట్విటర్లో మండిపడ్డారు. మరోవైపు అధ్యక్షుడి ప్రకటనకు వైట్ హౌస్ ట్రంప్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ లిండ్సే వాల్టర్స్ మద్దతు పలికారు. అమెజాన్ చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో భారతదేశంతో సహా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అమెజాన్ వ్యాపారాన్ని దెబ్బతీసేలా పటిష్టమైన ఆంక్షల తీసుకోనుందనే సంకేతాలను అందించారు. ఈ వ్యాఖ్యలు మార్కెట్లో షేరు కదలికలపై మరింతగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా యాంటీ ట్రస్ట్ చట్టాన్ని ఉపయోగించేందుకు ముమ్మరంగా చర్చలు నిర్వహించారని యాక్సోస్ అనే వెబ్సైట్ నివేదించడంతో అమెజాన్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అమెజాన్ షేరు 5శాతం నష్టపోయి 30 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూని కోల్పోయిన సంగతి తెలిసిందే. I have stated my concerns with Amazon long before the Election. Unlike others, they pay little or no taxes to state & local governments, use our Postal System as their Delivery Boy (causing tremendous loss to the U.S.), and are putting many thousands of retailers out of business! — Donald J. Trump (@realDonaldTrump) March 29, 2018 -
పన్ను ఎగవేతదారుల నుంచి భారీగా నగదు
పన్ను ఎగవేతదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగానే చుక్కలు చూపిస్తోంది. బ్యాంకు ఖాతాలకు, రెండు లక్షలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్ కార్డును తప్పనిసరి చేయడంతో, దాంతో పాటు ఆధార్ లింక్ చేయడం వంటి వాటితో పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం గండికొడుతోంది. తాజాగా అదనపు రిటర్నులలో రూ.1.7 కోట్ల ఫైల్ చేశారని, దీంతో మొత్తంగా ప్రభుత్వం డిసెంబర్ వరకు రూ.26,500 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ఇన్-హౌజ్ సమాచారంతోనే నాన్-ఫైలర్స్‌ను ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు తెలిపారు. ఈ డేటాను టీడీఎస్, టీసీఎస్ ద్వారా సేకరించిన ఎక్కువ విలువ ఉన్న లావాదేవీలతో ట్యాలీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ నెంబర్‌ను రూ.2 లక్షలకు పైన జరిపే లావాదేవీలు ప్రాపర్టీ, షేర్లు, బాండ్లు, ఇన్సూరెన్స్, విదేశీయ ప్రయాణం వంటి అన్నింటికీ తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతేడాది 35 లక్షల నాన్-ఫైలర్స్‌ను గుర్తించామని, ఆ ముందటేడాది ఈ సంఖ్య 67 లక్షలుగా ఉండేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నాన్-ఫైలర్స్‌ను గుర్తించిన అనంతరం పలు కేటగిరీలోకి కేసులను వర్గీకరించి, మానిటర్ చేస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. రిటర్నులు ఫైల్ చేయాలని టార్గెట్ చేసిన గ్రూప్‌లుకు టెక్ట్స్ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పంపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. వారి స్పందనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్ ఇన్సైట్ అనే కొత్త మెకానిజం ద్వారా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ఐటీ చట్టాలు దుర్వినియోగం చేయొద్దు
న్యూఢిల్లీ: పన్నులు కట్టే విషయంలో వేతన జీవుల కన్నా కార్పొరేట్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర సూచించారు. వివిధ మినహాయింపులు పోనూ భారత్‌లో బడా కంపెనీలపై విధిస్తున్న పన్ను భారం చాలా తక్కువే ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో పన్నులు ఎగవేసే ఉద్దేశంతో.. ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయొద్దని సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్ర ఈ విషయాలు తెలిపారు. ‘చట్టాలు చాలా మటుకు సరళం చేశాం. సాధారణంగా మీరు అడిగేట్లుగానే రేటు కూడా సముచిత స్థాయిలోనే ఉండేలా చూస్తున్నాం. ఇక, పరిశ్రమవర్గాలు నిఖార్సుగా పన్నులు కడుతున్న పక్షంలో పన్ను రేటు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. వేతన జీవులకన్నా కంపెనీలు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన చెప్పారు. -
కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటా ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో వాటాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2018-19వ సంవత్సరానికి రూ. 33,929.84 కోట్లు దక్కనున్నాయి. ఇక తెలంగాణకు రూ. 19,207.43 కోట్లు కేంద్రం ఇవ్వనుంది. ప్రతి ఏడాది రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల మొత్తంలో ఆయా రాష్ట్రాల వాటాను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలకు దక్కనున్న కేంద్ర పన్నుల వాటా మొత్తం జాబితాను వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సూచలన మేరకు రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల రాబడిలో 42శాతం వాటాను ఆయా రాష్ట్రాలకు తిరిగి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్ పన్ను మొత్తం రూ. 9526 కోట్లు కాగా, ఆదాయపన్ను మొత్తం రూ. 8430 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూ. 10,919 కోట్లు, సుంకాల మొత్తం 1671 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నులు 1628 కోట్లు.. ఇందులో 2016-17 సంవత్సరం అంచనాలతో పోలిస్తే.. రూ. 849 కోట్లు లోటు కనిపిస్తున్నది. ఇక, తెలంగాణకు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్ పన్ను మొత్తం రూ. 5381 కోట్లు కాగా, ఆదాయపన్ను మొత్తం రూ. 4772 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూ. 6181 కోట్లు, సుంకాల మొత్తం 946 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నులు 946 కోట్లు.. ఇందులో 2016-17 సంవత్సరం అంచనాలతో పోలిస్తే.. రూ. 481 కోట్లు లోటు కనిపిస్తున్నది. రాష్ట్రాలవారీగా కేంద్ర పన్నుల వాటాను క్రింది చిత్రపటంలో చూడొచ్చు.. -
బ్యాలెన్స్డ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయ్?
నేను 2011లో ఒక యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ)ని తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేశాను. బీమా మొత్తంలో 20 శాతానికి సమానమైన ప్రీమియమ్‌ను ఈ ఐదేళ్ల కాలంలో చెల్లించాను. ఈ పాలసీని సరెండర్ చేయడంవల్ల వచ్చిన సరెండర్ వేల్యూపై నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? వివరించగలరు. – నందు, విజయవాడ పన్ను అంశాల పరంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యులిప్)లను జీవిత బీమా పాలసీలాగానే పరిగణిస్తారు. యులిప్‌లకు సాధారణంగా లాక్–ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. మీ యులిప్కు ఈ ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ముగిసినందున మీరు పొందిన సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10డి) కింద మీకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద మీరు చెల్లించిన ప్రీమియమ్లకు పన్ను రాయితీ పొందినప్పటికీ, మీకు సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్ను భారం ఉండదు. నేను గత కొంత కాలంగా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ రాబడులపై పన్నులు ఎలా ఉంటాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? ఉంటే ఏ రేంజ్లో ఈ పన్నులు ఉంటాయి ? – రవళి, విశాఖపట్టణం బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను హైబ్రిడ్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్ డెట్‌లో కొంత, ఈక్విటీలో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తాయి. దేంట్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారో దానిని బట్టి వీటిని ఈక్విటీ ఆధారిత లేదా డెట్ ఆధారిత ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఫండ్ ఈక్విటీలో కనీసం 65 శాతం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఫండ్‌ను ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్‌గా భావిస్తారు. 65 శాతం కంటే తక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, దానిని డెట్ ఆధారిత ఈక్విటీ ఫండ్‌గా భావిస్తారు. ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించి కొనసాగాయనుకోండి..మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ ఫండ్స్‌లో ఏడాదిలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వచ్చిన రాబడులపై మీరు 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లకు మించి కొనసాగితే, వాటిపై వచ్చే రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. ఈ ఫండ్స్‌ను మీరు మూడేళ్లలోపే విక్రయిస్తే, వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను, నా భార్య ఇద్దరమూ ఉద్యోగులమే. మాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. మా నలుగురికి గరిష్టంగా ఎన్ని పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాలు ఉండొచ్చు? ఈ ఖాతాల్లో గరిష్టంగా ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు? – ఈశ్వర్, వరంగల్ మీరు, మీ భార్య ఇద్దరూ చెరొక పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. ఒక్కో ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇక మీలో ఎవరైనా ఒకరు మీ మైనర్ పిల్లల తరపున మరో పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పిల్లల్లో ఒకరికి ఒకటి చొప్పున పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఒక వ్యక్తి తన సొంత ఖాతా, గార్డియన్‌గా పిల్లల పేరు మీద తెరచిన పీపీఎఫ్ ఖాతాల్లో మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. అయితే రూ.లక్షన్నరకు మించి చేసిన డిపాజిట్‌పై ఎలాంటి వడ్డీ రాదు. పైగా లక్షన్నరకు మించి డిపాజిట్ చేసిన దానికి ఎలాంటి పన్ను రాయితీలు కూడా లభించవు. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తరచుగా వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఇవి మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ? –వెంకట్, హైదరాబాద్ ఓపెన్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ రెండింటికి కొన్ని ప్రయోజనాలు కొన్ని లోపాలూ ఉన్నాయి. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఉన్న ప్రధాన లోపం.. ఇన్వెస్టర్లు రెగ్యులర్‌గా ఈ తరహా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వీలు లేకపోవడం. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్టర్లు తరచుగా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు. ఈ అంశం ఫండ్ మేనేజర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలం రాబడులను దృష్టిలో ఉంచుకునే ఫండ్ మేనేజర్ పెట్టుబడి వ్యూహాలు రూపొందిస్తారు. అయితే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్.. అధిక రాబడులు సాధించిన దాఖలాలు ఏవీ ఇంతవరకూ లేవు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ పనితీరు ఇవి ప్రారంభమైనప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
‘చమురు’ వదులుతోంది!
సాక్షి, అమరావతి : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్ను వేసి వినియోగదారుల నడ్డివిరుస్తోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 450 కోట్ల లీటర్ల డీజిల్, 115 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్‌పై వేసే వ్యాట్ కాకుండా ప్రతి లీటరుకు అదనంగా వినియోగదారుల జేబులో నుంచి మరో నాలుగు రూపాయలు లాగేస్తున్నారు. దీంతో 450 కోట్ల లీటర్ల డీజిల్‌పై రూ.1,800 కోట్లు, అదేవిధంగా 115 కోట్ల లీటర్ల పెట్రోలుపై రూ. 460 కోట్లు.. మొత్తం కలిపి రూ.2260 కోట్ల మేరకు ప్రతి ఏటా వినియోగదారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఈ లెక్కన వినియోగదారులకు తెలియకుండానే నెలకు రూ. 188.33 కోట్లు వారి జేబుకు చిల్లు పడుతోంది. ఇలా మూడేళ్లుగా నాలుగు రూపాయల అదనపు పన్ను వసూలు చేస్తుండటంతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా కన్పిస్తోంది. చమురు ధరల్లో మన రాష్ట్రానికి, పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు లేక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సుమారు 600 బంకులకు గాను 200–300 వరకు మూతబడినట్లు సమాచారం. మనకు, పక్క రాష్ట్రాల్లో లీటరుకు రూ.4 తేడా ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లోని వాహనదారులు అక్కడకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో మన రాష్ట్రం సరిహద్దుల్లోని బంకుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం అమ్మకాలు తగ్గాయని అక్కడి బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హామీని మరచిపోయి అదనపు పన్ను వేయడం అన్యాయమని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలను పరిశీలిస్తే రాష్ట్రంలో లీటరు పెట్రోల్ రూ.35 ప్రకారం విక్రయించాల్సి ఉండగా రూ.76.27లకు విక్రయించడం ఏ మేరకు సబబమని వారు ప్రశ్నిస్తున్నారు. అదనపు పన్నుతో తీవ్ర నష్టం రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 అదనపు పన్ను వేయడంవల్ల వాటి అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. సరిహద్దు రాష్ట్రాలో ధరలు తక్కువగా ఉన్నందున అక్కడకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది 16 శాతం కొనుగోళ్లు తగ్గాయి. దీంతో ఒక్కొక్కరు పెట్రోలు బంకులు మూసివేస్తున్నారు. అదనపు పన్ను వసూలు చేస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, ఇతర వాహనదారులు మన రాష్ట్ర సరిహద్దులోని బంకుల్లో డీజిల్, పెట్రోలు నింపుకోవడం లేదు. దీంతో ఇటు ప్రభుత్వానికి అటు బంకుల నిర్వాహకులు, లారీ ట్రాన్స్‌పోర్టు యజమానులు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై పునరాలోచించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన కన్పించడం లేదు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. – రావి గోపాలకృష్ణ, రాష్ట్ర పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షులు. -
బీసీసీఐ పన్ను ఎంత కట్టిందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానం జీఎస్టీలోకి తీసుకొచ్చిన తర్వాత తొలి నెలల్లో భారీగా పన్ను వసూలయ్యాయి. అంచనాల కంటే జీఎస్టీ వసూలు బాగానే వచ్చాయి. దేశంలోనే అత్యంత ధనికవంతమైన క్రీడా సంస్థ బీసీసీఐ, జీఎస్టీ అమలు తర్వాత రూ.44 లక్షల పన్నులు చెల్లించింది. బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొంది. జూలై నెల కింద 44 లక్షల 29,516 రూపాయల పన్నులు చెల్లించినట్టు బీసీసీఐ తన వెబ్సైట్లో తెలిపింది. భారత జాతీయ జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్కు కూడా ఐదు నెలల కాలానికి రూ.58 లక్షల 87,139ను బీసీసీఐ చెల్లించింది. అంతేకాక 2015-16 సీజన్‌ల్లో అంతర్జాతీయ మ్యాచుల నుంచి ఆర్జించిన గ్రాస్ రెవెన్యూలను కొంతమంది ప్లేయర్లకు బీసీసీఐ పంచింది. వీరిలో ఎక్కువగా స్టువర్ట్ బిన్నీకి రూ.92 లక్షలు, హర్బజన్ సింగ్‌కు రూ.62 లక్షలు, స్పిన్నర్ అక్సర్ పటేల్‌కు రూ.37.51 లక్షలు, ఉమేశ్ యాదవ్‌కు రూ.34.79 లక్షలు చెల్లించినట్టు తెలిసింది. -
జీఎస్టీ పేరు.. దోపిడీ తీరు
♦ తగ్గని పప్పులు,మసాలా దినుసుల ధరలు ♦ 50 శాతం మంది వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు లేవు ♦ మధ్య తరగతి ప్రజలకు తప్పని ధరాఘాతం ♦ నిద్రావస్థలో వాణిజ్య పన్నుల యంత్రాంగం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణ మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంట్లోని వారు సరుకులు తీసుకురమ్మని పంపారు. ఆయన సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లారు.సరుకులు కావాలని పట్టీ ఇచ్చారు. దుకాణదారుడు అన్నీ ఇచ్చాడు. ఇదేమందయ్యా..! కందిపప్పు కిలో రూ.60–65 మధ్య ధర ఉంటే నీవేమో రూ.90 రాశావని దుకాణదారుడిని నిలదీశారు. అవునయ్యా...జీఎస్టీ అమలులోకి వచ్చింది.. నన్నేం చేయమంటావని అన్నాడు. అన్ని సరుకులకు జీఎస్టీ లేదు కదా? అని వెంకటరమణ దుకాణదారుడిని ప్రశ్నించారు. మా ధర ఇంతే తక్కువకు ఎక్కడైనా వస్తే తెచ్చుకో...అని అన్నాడు. కడప అగ్రికల్చర్/కోటిరెడ్డి సర్కిల్: మామూలుగా జీఎస్టీ అమలైతే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ హోల్‌సేల్ వ్యాపారులు పన్నులు చెల్లించలేమంటూ రిటైలర్లకు విక్రయించే ధరలను పెంచేశారు. ఇదే సాకు చూపి చిరు వ్యాపారులు సైతంధర పెంచి విక్రయిస్తున్నారు. కంపెనీ ప్యాకెట్లలో లేని(నాన్ ప్యాక్డ్) వస్తువులకు జీఎస్టీ లేదని నిబంధనలు చెబుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. కానీ దుకాణదారులు అన్ని వస్తువులకు పన్నులు ఉన్నాయంటూ ధరలను పెంచేశారు. జీఎస్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను చాలా మంది వ్యాపారులు చేసుకోలేదు. కానీ బిల్లులు ఇవ్వకుండానే ధరలు మాత్రం పెంచారు. హోల్‌సేల్‌లో కొన్నప్పుడు తాము ముందే పన్నులు చెల్లించామని వ్యాపారులు వినియోగదారులతో వాదనలకు దిగుతున్నారు. జీఎస్టీ అమలులో ఉన్నా.. మార్కెట్లో జీఎస్టీ వచ్చినప్పటి నుంచి చాలా సరుకుల ధరలు తగ్గాల్సి ఉంది. ఇప్పటికీ మూడేళ్ల నుంచి ఉన్న ధరలతోనే అమ్ముతున్నారు. పప్పులు, మసాలా దినుసులు, బియ్యం ధరలు తగ్గిస్తూ జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచారు. వ్యాపారులు మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు ధరలు ఏ మాత్రం తగ్గలేదని వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. జిల్లాలో దాదాపు 70 శాతం మంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. చాలీ చాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా ఉన్న తరుణంలో జీఎస్టీ దెబ్బతో ధరలు పెరిగి కుంగిపోతున్నారు. పప్పులు, మసాలా దినుసుల ధర బాగా తగ్గినా వ్యాపారులు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్‌కి మార్కెట్లోని వస్తువుల ధరలకు చాలా తేడా కనిపిస్తోంది. హోల్‌సెల్‌గా వస్తువులను సరఫరా చేసే బడా వ్యాపారులు సిండికేట్ కావడం, కార్పొరేట్ వ్యాపార సంస్థల చేతుల్లో ధరల నిర్ణయాధికారం ఉంటుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం జిల్లాలో చాలా మంది వ్యాపారులు సిండికేటై జీఎస్టీ సాకుతో ధరలనుతగ్గించలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిలో కంది పప్పు కొంతమంది వ్యాపారులు రూ.60–65 మధ్య అమ్ముతుంటే మరి కొందరు రూ.80–90లతో విక్రయిస్తున్నారు. బియ్యం కిలో ధర రూ.50 ఉండగా దానిని రూ.80లకు విక్రయిస్తున్నారు. కంపెనీ ప్యాకింగ్లేని కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, వేరుశనగ పప్పులను, మసాలా దినుసులను ఇష్టారాజ్యంగా వారికి తోచిన ధరకు విక్రయిస్తున్నారు. సామాన్యులు ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేయమంటావ్.. ప్రభుత్వం జీఎస్టీ అనే పన్ను విధించింది. ఆ ధరకే మేం కొనుగోలు చేసి మీకు విక్రయిస్తున్నామనే సమాధానం వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలోని సరుకుల దుకాణా లను తనిఖీ చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులపై పన్నులుంటాయా?
లిక్విడ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి వాటిపై లాభాలనార్జిస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – సాగర్, విశాఖపట్టణం లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే గడించే మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపు విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఒక వేళ మూడేళ్ల కాలానికి మించిన తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుంది. నా భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో ఆరేళ్లు పనిచేసి మానేసింది. ఇటీవలే ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసింది. ఈ విత్‌డ్రా చేసిన మొత్తంపై పీఎఫ్ డిపార్ట్మెంట్ ఎలాంటి పన్నుకోత విధించలేదు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ విత్‌డ్రాయల్‌ను చూపించాలా ? ఒక వేళ చూపించాల్సి వస్తే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద చూపించాలి? – వివేక్, హైదరాబాద్ రెండు సందర్భాల్లో ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పీఎఫ్ విత్డ్రాయల్స్పై టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) ను విధిస్తుంది. మొదటి సందర్భం,..ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఇక రెండోది. ఎవరైనా ఉద్యోగి ఒక కంపెనీలో నిరంతరంగా ఐదేళ్లలోపే పనిచేసి, పీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ రెండు సందర్భాల్లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై టీడీఎస్ ఉంటుంది. మీ భార్య ఒక కంపెనీలో 5 ఏళ్లకు మించి పనిచేసినందున పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి టీడీఎస్‌ను ఈపీఎఫ్ఓ విధించలేదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ మొత్తాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. వేతనం నుంచి ఆదాయం అనే పద్దు కింద ఈ మొత్తాన్ని చూపించాల్సి ఉంటుంది. నేను కొంత మొత్తానికి హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ అనే టర్మ్ ప్లాన్‌ను తీసుకున్నాను. అయితే ఈ ప్లాన్‌లో యాక్సిడెంట్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజ్ లేదు. ఈ రెండు కవరేజ్‌లు ఉన్న మరో టర్మ్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్–లైఫ్ ఆప్షన్‌ను అదనంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా అదనపు టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలా ? లేక హెచ్డీఎఫ్సీ సంస్థనే ఈ రెండు కవరేజ్‌లు కూడా జత చేయమని అడిగి కొంచెం ఎక్కువగా ప్రీమియమ్ చెల్లించాలా ? తగిన సలహా ఇవ్వగలరు ? – నాగేశ్, విజయవాడ క్రిటికల్ ఇల్నెస్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలు ఉన్న మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమా ?లేక ప్రస్తుతమున్న టర్మ్ప్లాన్కే రైడర్లను జత చేస్తే ఎక్కువ ప్రయోజనమా అనే విషయాలపై మీరు ముందుగా మదింపు చేయండి. మీరు ప్రస్తుతం తీసుకున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్‌కు క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేయవచ్చు. కొంత అధిక ప్రీమియమ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.10,332గా ఉంటుంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేశారనుకోండి, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్రూ.15,979కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేస్తే, ప్రీమియమ్ రూ.21,698కు పెరుగుతుంది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్ను తీసుకుంటే, ఈ ప్లాన్‌కు సంబంధించి బేసిక్ కవరేజ్ ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.8,906గా ఉంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేస్తే, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.13,074కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేశారనుకోండి, ప్రీమియమ్ రూ.18,742కు పెరుగుతుంది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను సూచించండి? – తేజశ్విని, ఈమెయిల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో పోల్చితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ దాదాపు లిక్విడ్ ఫండ్స్లాంటివే. ఈ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు ఉన్న మంచి ఆకర్షణీయ అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ములపై వచ్చే రాబడుల కన్నా, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులే అధికంగా ఉంటాయి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, ఐడీఎఫ్సీ ఆర్బిట్రేజ్ ఫండ్, జేఎం ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, రిలయన్స్ ఆర్బిట్రేజ్ అడ్వాండేజ్ ఫండ్, ఎస్బీఐ ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్‌లో ఏదో ఒకదానిని ఎంచుకొని ఆ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. -
భారీ పన్ను డిఫాల్టర్ల జాబితా జారీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ఆదాయపన్ను శాఖ తాజాగా జాబితా విడుదల చేసింది. భారీగా పన్ను ఎగవేత దారులు నేమ్ అండ్ షేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవమాన వ్యూహంలో భాగంగా రూ .10 కోట్లకుపైగా పన్నులు చెల్లించని ఢిల్లీకి చెందిన ఐదు సంస్థల పేర్లను ప్రచురించింది. ఆదాయ పన్ను,కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సిన జాబితాను ప్రధాన జాతీయ జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలోఐటీశాఖ విడుదల చేసింది. "పన్ను బకాయిలు వెంటనే" చెల్లించాలని కోరింది. పన్ను శాఖ యొక్క పాలసీ యంత్రాంగం ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు (సిబిడిటి) గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ అవమాన పథకాన్ని ఆదాయం పన్ను శాఖ ప్రారంభించింది. ఈ క్రమంలో గతంలో 96 సంస్థలు గుర్తించింది. ఇవి గుర్తించలేకుండా లేదా రికవరీ కోసం ఎలాంటి ఆస్తులు లేకుండా మిగిలిపోయాయి. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జారీ చేసిన ఒక నోటీసు లో ఈ జాబితాను వెల్లడి చేశారు. పాన్ కార్డు సంఖ్య, చివరిగా తెలిసిన చిరునామా, అంచనా పరిధి , పన్ను చెల్లించని మొత్తాన్ని, వ్యక్తిగత, సంస్థల వివరాలతో వెల్లడించినట్టు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ సంస్థల చిరునామా, వ్యాపారం, వాటాదారుల నిర్వహణ మరియు నిర్వహణ వంటివి మారవచ్చు. ఈ సంస్థల గురించి సమాచారం తెలిసిన వారు, ఉపయోగకరమైన సమాచారం ఉంటే తమకు తెలియపర్చాల్సిందిగా కోరారు. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లీన్‌మనీ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రారంభించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చేలా , పన్ను చెల్లింపులకు ప్రజలను ప్రోత్సహించేలా ఈ పోర్టల్‌ను లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ డిఫాల్టర్ల పేర్లను తన అధికారిక వెబ్ సైట్ లో కూడా ప్రచురించడం ప్రారంభించింది. -
సకాలంలో పన్నులు చెల్లించండి
కాకినాడ సిటీ : వ్యాపారులందరూ తమ పన్నులను సకాలంలో చెల్లించి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించాలని జీఎస్టీ అదనపు డైరెక్టర్ ఎస్కే రెహమా¯ŒS కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంస్థల ఆధ్వర్యంలో శనివారం స్థానిక యంగ్మె¯Œ్స హ్యాపీక్లబ్‌లో నగరంలోని వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏకీకృత పన్ను (జీఎస్టీ) విధానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును విశాఖ కస్టమ్స్ కమిషనర్ బి.హరేరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతినెలలో వ్యాపారులు విక్రయించిన వస్తువులకు తరువాత నెలలోని 20వ తేదీన వివరాలు వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథి, జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్కే రెహమా¯ŒS మాట్లాడుతూ ఒకే పన్ను విధానం ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విధానంపై వ్యాపారులకు అవగాహనను గత ఏడాది నుంచి కల్పిస్తున్నామన్నారు. జీఎస్టీ విధానం అమలయ్యాక వాటితో వచ్చిన ఇబ్బందులను వ్యాపారుల నుంచి తెలుసుకుని కేంద్రానికి వివరిస్తామన్నారు. ఈ సదస్సుకు కోకనాడ చాంబర్ అధ్యక్షుడు దంటు సూర్యారావు అధ్యక్షత వహించగా వాణిజ్య పన్నులశాఖ డీసీ డి.రమేష్, కాకినాడ ఐసీఏఐ చైర్మ¯ŒS ఎ¯ŒS.సురేష్, గోదావరి చాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ, ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు జి.సాంబశివరావు, వ్యాపారులు, చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘ఫిక్స్డ్’ మైండ్ వదిలేయండి!
► ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్డీలు పనికిరావు ► పన్ను, ద్రవ్యోల్బణం పోగా మిగిలేది సున్నానే ఎఫ్డీ, ఆర్డీ, పొదుపు కోసమే తప్ప పెట్టుబడికి కాదు ► దీర్ఘకాలిక లక్ష్యాలకు డెట్, ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం సంప్రదాయంగా, కొన్ని దశాబ్దాలుగా ఎక్కువ మందికి పొదుపు, మదుపు సాధనంగా ఉంటూ వస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం కళతప్పాయ్! దీర్ఘకాల లక్ష్యాలకు, సంపద వృద్ధికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇకపై ఎంత మాత్రం ఉత్తమ సాధనాలు కావన్నది ఆర్థిక పండితుల మాట. ఆర్థిక విధానాలు, మార్కెట్ తీరుతెన్నులు మారుతున్న తరుణంలో, ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రస్తుతం పక్కన పెట్టేసి వాటికి మించి రాబడులనిచ్చే వాటిని ఎంచుకోవడం అవసరం అంటున్నారు ఆర్థిక సలహాదారులు... మన తాత, తల్లిదండ్రుల కాలం నుంచి చాలా మందికి తెలిసింది ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) గురించే. లేదంటే పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు. కొంత మొత్తం పొదుపు కనిపించిన వెంటనే బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయడం అలవాటుగా ఉండేది. కానీ, అదే సమయంలో అత్యవసరాలు ఏర్పడితే కనిపించేదీ అదే డిపాజిట్. దాంతో ఆ డిపాజిట్‌ను మధ్యలోనే రద్దు చేసి వెనక్కి తీసుకునేవారు. చివరి వరకూ కొనసాగించేది కొందరే. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉత్తమ పెట్టుబడి సాధనం కాదు అనేందుకు పలు కారణాలున్నాయి. ఒకప్పుడు 8–9% వడ్డీ రేటు డిపాజిట్లపై వచ్చేది. కానీ, ఇప్పుడది 7 శాతానికి పడిపోయింది. ఎఫ్డీపై పన్ను భారంతోపాటు ఎటువంటి పన్ను రాయితీలు లేవు. ఒకవేళ 30% ఆదాయపన్ను శ్లాబులో ఉన్న వారు తీసుకెళ్లి ఎఫ్డీలో పెడితే పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షలను ఎఫ్డీ చేస్తే దానిపై వార్షికంగా రూ.72వేల ఆదాయం పొందారనుకోండి. 30% పన్ను కింద రూ.21,600 చెల్లించాల్సి వస్తుంది. పోనీ ఎంతోకొంత వచ్చిందని సర్ది చెప్పుకోకండి. ద్రవ్యోల్బణం ఉండనే ఉంది. ఏటేటా ద్రవ్యోల్బణం నగదు విలువను హరిస్తుంటుంది. ఈ ప్రభావాన్ని మినహాయిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడిలో చివరికి ఏమీ మిగలదు. అధిక పన్ను రేటులో ఉన్నవారు ప్రతి కూల రాబడులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రాబడి లేకపోగా తమ పెట్టుబడుల విలువ 1 నుంచి 2% వరకు కోల్పోవాల్సి ఉంటుంది. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనాలున్నాయి. అందులోనూ ఫిక్స్డ్ డిపాజిట్ల తరహా సాధనమే కావాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ సరైనవి. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పైనా పన్ను ఉంటుంది. కానీ ఆ పన్ను ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన రాబడులకే వర్తిస్తుంది. అందుకే ఎఫ్డీలతో పోలిస్తే డెట్ మ్యూ చువల్ ఫండ్స్ బెటర్. డెట్ మ్యూచువల్ ఫండ్స్...? నిజానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డెట్ ఫండ్స్ ఓ రకం. ఇది ఎఫ్డీలకు చక్కని ప్రత్యామ్నాయం. డెట్ ఫండ్స్ ద్వారా తమకు వచ్చిన నిధులను అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అధిక భద్రత ఉండే ప్రభుత్వ బాండ్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, ఇతర భద్రతతో కూడిన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణ ఇన్వెస్టర్‌కు ఈ విధమైన వైవిధ్య పెట్టుబడులు కష్ట సాధ్యం. పన్నులో వెసులుబాటు బ్యాంకు ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటిపైనా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ డెట్ ఫండ్స్‌పై పన్ను చాలా తక్కువ. ఎలా అంటే... డెట్ ఫండ్స్‌పై రాబడి 8 శాతం ఉందనుకోండి. దానిలోంచి ద్రవ్యోల్బణ సూచీ ప్రభావాన్ని తీసేయగా మిగిలిన నికర రాబడిపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇదీ తేడా... ఉదాహరణకు... ఎఫ్డీలో, డెట్ ఫండ్‌లో రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెడితే... రెండింటిపైనా రాబడి 8 శాతం అనుకుంటే (కేవలం అవగాహన కోసమే) మూడేళ్ల తర్వాత ఒక్కోదానిలో రూ.1,25,971 చొప్పున అవుతాయి. ఎఫ్డీపై కొనుగోలు ఆధారిత ద్రవ్యోల్బణ ప్రభావం కలిపేందుకు అవకాశం లేదు. అదే డెట్ ఫండ్‌పై ఈ వెసులుబాటు ఉంది. అప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని నికర పెట్టుబడికి కలిపితే లక్ష కాస్తా రూ.1,19,102 అవుతుంది. అంటే పన్ను చెల్లించాల్సిన నికర రాబడి డెట్ ఫండ్‌లో రూ.6,869 కాగా, ఎఫ్డీలో రూ.1,25,971. ఇప్పుడు ఎఫ్డీపై 30 శాతం పన్ను రేటులో ఉన్న వారు చెల్లించాల్సిన పన్ను రూ.8,025. ఎఫ్డీపై రూ.1,371 మాత్రమే. పన్ను పోగా ఎఫ్డీలో మిగిలిన రాబడి రూ.17,946. డెట్ ఫండ్‌లో రూ.24,597. రాబడి శాతం ఎఫ్డీలో 5.65 శాతం కాగా, డెట్ ఫండ్‌లో 7.61 శాతంగా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు? దీర్ఘకాల పెట్టుబడులకు ఎఫ్డీలు సరైన సాధనాలు కావన్నది నిజమే. కానీ, ఆరు నెలల కాలానికి ఎఫ్‌డీల్లో మదుపు చేయడం తప్పేమీ కాదు. చాలా తక్కువ కాలంలోనే డబ్బుతో పని ఉంటే అప్పటి వరకు ఎఫ్‌డీల్లో ఉంచడమే నయం. రాబడి ఓ రెండు శాతం ఎక్కువ వస్తుంది కదా అని మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లక్కర్లేదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధికి రాబడుల్లో ఉండే వ్యత్యాసం స్వల్పమే. సిప్ విధానంలో... కొంత మందికి రికరింగ్ డిపాజిట్ కట్టడం అలవాటు. నెలనెలా కొంత పొదుపు చేసుకునేందుకు ఇలా ఆర్డీ, చిట్స్‌లో చేరడం చేస్తుంటారు. కానీ, ఇవి కేవలం పొదుపు సాధనాలుగానే ఉపయోగపడతాయి. పొదుపు వేరు, మదుపు వేరన్న విషయం తెలిసే ఉంటుంది. వీటి కంటే డెట్ ఫండ్స్‌లో సిప్ విధానంలో నెలనెలా కొంత మదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది. చాలా స్వల్ప కాల వ్యవధికి ఎఫ్డీలను ఎంచుకుంటే తప్పులేదు గానీ, రిటైర్మెంట్, పిల్లల విద్య తరహా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఎంచుకోవడం ఎంత మాత్రం సరికాదు. మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ వంటివే దీర్ఘకాల అవసరాలను తీర్చగలిగే సాధనాలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ చేయదలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మంచి రాబడులను పొందడానికి అవకాశం ఉంది. అదీ సిప్ విధానంలోనే. ఫండ్ పథకాల్లోనూ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పూర్తి ఈక్విటీ, ఈక్విటీ + డెట్ కలసినవి, ఈక్విటీ పథకాల్లోనూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ ఉన్నాయి. వీటిలో నెలనెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే దీర్ఘకాలంలో వార్షికంగా 14 నుంచి 18 శాతం వరకు రాబడులను పొందడానికి అవకాశం ఉందని చరిత్ర చెబుతోంది. పన్ను రహిత రాబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల్లోనూ రాబడులు 14 శాతం కంటే ఎక్కువే ఉన్నాయి. అందుకే దీర్ఘకాల అవసరాలకు ఎఫ్డీలకు బదులు ప్రత్యామ్నాయాలవైపు చూడడం ద్వారానే సంపద సృష్టి సాధ్యమవుతుంది. -
తిరుగుడే తిరుగుడు
⇒పన్నుల వసూలుకు మిస్తున్న పంచాయతీ సిబ్బంది ⇒ఈనెల 30 వరకు గడువు పెంచడంతో కలెక్షన్‌కు చర్యలు ⇒మిగిలిన రూ.3.19 కోట్ల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక ⇒వంద శాతం లక్ష్యంగా అధికారుల కృషి వరంగల్ రూరల్: ఆర్థిక సంవత్సరం గతనెల 31వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వసూలు కావాల్సిన పన్నులు ఇంకా మిగిలిపోయాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండడంతో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇందులో భాగంగా జిల్లాలో మిగిలిపోయిన రూ.3.19 కోట్ల వసూలుకు అధికా రులు కృషి చేస్తు న్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని జిల్లా పంచాయతీ అధికారి నుంచి కారోబార్ వరకు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. 72.55 శాతం వసూళ్లు.. జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2016–17) రూ.11,64,00,173 మేరకు ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసిన మార్చి 31వ తేదీ వరకు రూ.8,44,47,385(72.55శాతం) పన్నులే వసూలయ్యాయి. అంటే ఇంకా రూ.3.19 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నగదు బకాయిగా పేరుకుపోతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి చాలా జిల్లాల్లో ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు పన్నుల వసూళ్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు బకాయిలు వంద శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పిండి కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు. నోట్లు రద్దుతోనే.. కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీంతో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఉద్యోగులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్యలో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ.11.64 కోట్ల వరకు ఉన్న పన్నుల్లో రూ. 8.44 కోట్ల వరకు వసూలయ్యాయి. అంటే నోట్ల రద్దు అంశం పన్నులు భారీగా వసూలయ్యేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అందరి సహకారంతో ముందుకు.. జిల్లాలో ఆస్తి, నీటి పన్నులు రూ.3 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు వసూలైన పన్నులు లెక్కిస్తే ఈ బాకీ తేలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పన్నుల స్వీకరణకు అవకాశం కల్పించగా అప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నాం. అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓ పీఆర్డీల సహకారం తీసుకుంటూ కార్యదర్శులు పన్నులు వసూళ్లలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన గడువు సద్వినియోగం చేసుకుని వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. -
ఏమేం పన్నులు కడుతున్నాం?
నిజానికి.. దేశంలో పౌరులందరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో నిరంతరం పన్ను కడుతుంటారు. ఆదాయం తక్కువున్న వారు, అసలే ఆదాయం లేని వారు ప్రత్యక్షంగా ఆదాయ పన్ను కట్టకపోవచ్చు. కానీ.. వారు దుకాణంలో కొనే వస్తువుల నుంచి రెస్టారెంట్లో భోజనం చేయడం వరకూ అత్యధిక పర్యాయాలు పరోక్ష పన్నులు కడుతుంటారు. ఆధునిక ప్రభుత్వాలు చాలా వరకూ పన్నుల ద్వారానే నడుస్తుంటాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంటాయి. అవి ఆదాయపన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కావచ్చు. అమ్మకం పన్ను, సేవా పన్ను వంటి పరోక్ష పన్నులు కావచ్చు. స్థానిక ప్రభుత్వాలైన నగర పాలక సంస్థ, పురపాలక సంస్థ, పంచాయతీలు కూడా కొన్ని పన్నులు వసూలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ పన్నులు: ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను రాష్ట్ర ప్రభుత్వ పన్నులు: వ్యాట్, స్టాంప్ డ్యూటీ, భూమి శిస్తు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం స్థానిక సంస్థలు: నీటి పన్ను, ఆస్తి పన్ను, దుకాణం పన్ను వగైరా ప్రత్యక్ష పన్నులు ఇవీ... ఆదాయ పన్ను: నిర్దిష్ట పరిమితిని మించి ఆదాయం ఆర్జించే ప్రతి ఒక్కరూ కట్టే పన్ను ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేస్తుంది. ఈ పన్నును కేంద్రం తరచుగా సవరిస్తుంటుంది. అలాగే.. ఈ పన్ను విషయంలో కొన్ని రాయితీలు, మినహాయింపులు కూడా ప్రకటిస్తుంటుంది. పెట్టుబడి రాబడుల పన్ను: ఆస్తులు, షేర్లు, బాండ్లు, విలువైన వస్తువులను ముందుగా నిర్ణయించిన కాలపరిమితి లోపల అమ్మి లాభం గడిస్తే.. ఆ లాభంపై చెల్లించే పన్ను. ఆయా పెట్టుబడుల రకాన్ని బట్టి ఈ పన్ను శాతం మారుతుంది. ప్రస్తుతం షేర్లపై స్వల్ప కాలిక (ఏడాది లోపు) పెట్టుబడి రాబడి పన్ను 10 శాతం, దాని మీద విద్యా సెస్సు వసూలు చేస్తోంది. దీర్ఘకాలిక (ఏడాది కన్నా ఎక్కువ కాలం) పెట్టుబడి రాబడిపై పన్ను లేదు. ఆస్తుల క్రయవిక్రయాల విషయంలో స్వల్పకాలిక పెట్టుబడి రాబడి పన్ను కాలపరిమితి మూడేళ్లు. ఆ కాలం దాటితే పన్ను ఉండదు. కానుక పన్ను: ఒక వ్యక్తి అందుకునే కానుకల పైనా పన్ను చెల్లించాలి. దానిని ఆదాయం కింద గణిస్తారు. కానుక విలువ ఒక ఏడాదిలో రూ. 50,000 కన్నా మించితే ఈ పన్ను వర్తిస్తుంది. సంపద పన్ను: ఒక వ్యక్తి మొత్తం సంపద మీద వసూలు చేసే పన్ను. అన్ని ఆస్తుల మొత్తం నుంచి.. ఆ ఆస్తులను పొందడానికి చేసిన రుణాలను తీసివేసి సంపదను విలువకడతారు. విలువకట్టే తేదీ నాటికి సంపద విలువను లెక్కించి ఈ పన్ను విధిస్తారు. సంపద విలువ రూ. 30 లక్షలు దాటితే ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. అయితే.. 2015 బడ్జెట్లో సంపద పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఏటా రూ. 1 కోటి, అంతకు మించి ఆదాయార్జన గల వారిపై 12 శాతం సర్ ఛార్జి వసూలు చేస్తోంది. సెక్యూరిటీ (షేర్ల) లావాదేవీల పన్ను: స్టాక్ఎక్సేంజీలో జరిపే ప్రతి లావాదేవీ పైనా ఈ పన్ను విధిస్తారు. ప్రిరిక్విసిట్ పన్ను: ఒక సంస్థ తన ఉద్యోగులకు ఇచ్చే నగదేతర ప్రయోజనాలు- డ్రైవర్‌తో సహా కారు సదుపాయం, క్లబ్ సభ్యత్వం, సంస్థ షేర్లలో వాటా తదితరాలపై పన్ను వసూలు చేస్తారు. టోల్ పన్ను: ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రదేశాలలో టోల్ పన్ను కట్టాల్సి ఉంటుంది. కార్పొరేట్ పన్ను: భారతదేశంలో పనిచేసే ఏదైనా కార్పొరేట్ సంస్థ తన ఆదాయంపై చెల్లించే వార్షిక పన్ను. పన్నుల విధింపు కోసం దేశంలోని కంపెనీలను దేశీయ, విదేశీ సంస్థలుగా వర్గీకరించారు. ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. దాని మీద 3 శాతం సెస్సు కూడా ఉంది. అంటే మొత్తం పన్ను 30.9 శాతం. ఇక ఆదాయం రూ. 1 కోటి కన్నా మించితే ప్రాథమిక పన్ను మీద అదనంగా 12 శాతం సర్ చార్జి వసూలు చేస్తారు. పరోక్ష పన్నులు ఇవీ... కేంద్ర అమ్మకం పన్ను: దేశంలో వస్తు ఉత్పత్తుల విక్రయాలపై విధించే పన్ను ఇది. అంతర్రాష్ట్ర వస్తు విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రంలో అంతర్గత అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసే పన్నును కేంద్ర అమ్మకం పన్ను అంటారు. ప్రస్తుతం కేంద్రం 2 శాతం సీఎస్టీ వసూలు చేస్తోంది. విలువ ఆధారిత పన్ను: రాష్ట్రాలు వసూలు చేసే అమ్మకం పన్నును వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకే తరహా వ్యాట్ అమలులో ఉంది. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లు వంటి ఖరీదైన వస్తువుల మీద 1 శాతం వ్యాట్ ఉంది. ఆటోమేటిక్ వ్యవసాయ పనిముట్లు, పురుగు మందులు, సిమ్ కార్డుల, మైక్రోఫోన్లు, కాఫీ, ఐస్, పేటెంట్లు వంటి వాటిపై 4 శాతం వ్యాట్ ఉంది. ఈ జాబితాలో సుమారు 125 వస్తువులున్నాయి. ఇక నాలుగో షెడ్యూలులోని వస్తువుల మీద వ్యాట్ 22.5 శాతం నుండి 70 శాతం వరకూ ఉంటుంది. మద్యం మీద అత్యధికంగా 70 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీద 33 శాతం, డీజిల్ మీద 22.5 శాతం, పొగాకు మీద 25 శాతం వ్యాట్ ఉంది. ప్రజల, పర్యావరణ ఆరోగ్యం, బాగోగులను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా వస్తువుల మీద వ్యాట్ అధికంగా వసూలు చేస్తున్నారు. పై మూడు రకాలు కాకుండా ఐదో షెడ్యులులో ఉన్న మిగతా వస్తువులన్నింటి మీదా 12.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. సేవా పన్ను: డబ్బు చెల్లించి పొందే సేవల్లో చాలా సేవలకు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులు, ఏసీ రైల్వే టికెట్లు, కార్లు, ఇళ్లు, సినిమా టికెట్లు, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, హోటళ్ల బిల్లులు, వైద్య సేవలు తదితరాలు. ప్రస్తుతం 14 శాతం సేవా పన్ను వసూలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ సెస్సు, కృషి కళ్యాణ్ సెస్సులను కలుపుకుని సేవలపై మొత్తం 15 శాతం పన్ను విధిస్తున్నారు. స్వచ్ఛ భారత్ సెస్సు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2015 నవంబర్ 15 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సును వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు 0.5 శాతంగా ఉంది. కృషి కళ్యాణ్ సెస్సు: రైతుల సంక్షేమాన్ని విస్తరించడం కోసం 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2016 జూన్ 1 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు రేటు 0.5 శాతం. కస్టమ్స్ సుంకం: విదేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పరోక్ష పన్ను ఇది. ఈ పన్నును ప్రధానంగా సదరు వస్తువులను దేశంలోకి దిగుమతి చేసుకునే కేంద్రంలో చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువుల స్వభావాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుంటాయి. ఎక్సైజ్ సుంకం: దేశంలోనే ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే మరొక పన్ను. వస్తువులు తయారు చేసేవారు, వస్తువులు తయారు చేయడానికి కార్మికులను నియమించుకునే వారు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యాంటీ డంపింగ్ సుంకం: ఏదైనా విదేశం ఏవైనా వస్తువులను వాటి సాధారణ విలువ కన్నా తక్కువ ధరకు మన దేశంలోకి భారీగా దిగుమతి చేయడాన్ని నిరోధించడానికి ఈ పన్నును అమలు చేస్తున్నారు. ఇతర పన్నులు... వృత్తి పన్ను: ఆదాయాన్ని ఆర్జించే వృత్తి నిపుణుడు ఈ పన్ను చెల్లించాలి. దీనిని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు విధిస్తాయి. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఈ పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగీ ఈ పన్ను చెల్లించాలి. సదరు ఉద్యోగికి సంబంధించిన సంస్థ స్వయంగా ప్రతి నెలా ఈ పన్నును మినహాయించుకుని మున్సిపల్ కార్పొరేషన్లకు జమచేస్తుంది. డివిడెండ్ పంపిణీ పన్ను: కంపెనీలు తమ పెట్టుబడిదారులకు చెల్లించే డివిడెండ్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఏదైనా కంపెనీ డివిడెండును ప్రకటిస్తే.. అలా ప్రకటించిన డివిడెండ్లపై 16.995 శాతం పన్ను కట్టాలి. ఇది కార్పొరేట్ పన్ను 30.9 శాతానికి అదనం. డివిడెండ్ పన్ను: 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను ఇది. రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం అదనపు పన్ను విధించారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. మున్సిపల్ పన్ను: ప్రతి నగరంలోనూ నగరపాలక సంఘం ఆస్తి పన్ను వసూలు చేస్తుంది. ప్రతి ఆస్తి యజమానీ ఈ పన్ను చెల్లించాలి. ఈ పన్ను రేటును ఆయా నగర పాలక సంస్థలు నిర్ణయిస్తాయి. హైదరాబాద్‌లో నివాస గృహం చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ ఆధారంగా.. ఆ విలువలో 17 శాతం నుంచి 30 శాతం వరకూ ఆస్తి పన్ను కట్టాలి. అందులో సాధారణ పన్ను, కన్జర్వెన్సీ పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ పన్ను కలిసి ఉంటాయి. అదనంగా లైబ్రరీ సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ రూ. 50 కన్నా తక్కువగా ఉంటే ఈ పన్ను వర్తించదు. వినోద పన్ను: వినోదానికీ పన్ను వర్తిస్తుంది. సినిమా టికెట్లు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రసార సేవలు, డీటీహెచ్ సేవలు, కేబుల్ సేవలు వంటి వినోదాల ఆర్థిక లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్ను విధిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో వినోద పన్ను టికెట్ విలువ మీద 20 శాతంగా ఉంది. అదే తెలుగు సినిమాలకైతే కాస్త తక్కువగా 15 శాతం పన్ను ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్ను: ఒక స్థిరాస్తి కొన్నపుడు విక్రేతకు చెల్లించే మొత్తానికి అదనంగా.. స్టాంపు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్నులు చెల్లించాలి. ఆస్తుల పత్రాలు రూపొందించడానికి ఇవన్నీ అవసరం. సులుభంగా చెప్పాలంటే ఒక ఆస్తి యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మార్చడానికి ఈ పన్నులు వసూలు చేస్తారు. ఈ పన్నులు ఆస్తి రకాన్ని బట్టి, దాని విలువను బట్టి ఉంటుంది. విద్యా సెస్సు, సర్ చార్జి: దేశంలో పేద ప్రజల విద్య కోసం విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. దేశంలో ప్రధానంగా ఆదాయ పన్ను, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల మీద విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. అది మొత్తం చెల్లించే పన్ను మీద 3 శాతం ఉంటుంది. సర్ చార్జి అంటే.. అప్పటికే ఉన్న పన్ను రేటుకు అదనంగా కలిపే పన్ను. మౌలిక సదుపాయాల సెస్సు: కార్లు, యుటిలిటీ వాహనాలపై 2016 బడ్జెట్లో ఈ పన్నును ప్రవేశపెట్టారు. నాలుగు మీటర్ల లోపు నిడివి, 1200 సీసీ లోపు సామర్థ్యం గల ఇంజన్లు గల పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్‌జీలతో నడిచే వాహనాలపై 1 శాతం మౌలికసదుపాయాల సెస్సు వసూలు చేస్తున్నారు. 4 మీటర్లకు పైబడిన, 1500 సీసీ లోపు సామర్థ్యం గల వాహనాలపై ఈ సెస్సు 2.5 శాతంగా ఉంది. ఇక పెద్ద కార్లు, ఎస్‌యూవీల మీద 4 శాతం సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రవేశ పన్ను: గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రవేశ పన్నును వసూలు చేస్తున్నాయి. ఈ-కామర్స్ మార్గంలో ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించే అన్ని వస్తువుల మీదా 5.5 శాతం నుండి 10 శాతం వరకూ ప్రవేశ పన్ను వసూలు చేస్తున్నాయి. కొసమెరుపు: ఇన్ని రకాలుగా ఉన్న పన్నులకు, వాటిలో గందరగోళానికి త్వరలో ఒక రూపం రానుంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానం అమలులోకి రానుంది. తప్పక చదవండి: ఈ ఆదాయాలకు పన్ను లేదు... మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం! -
విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు
-
మద్యంతో ముంచేద్దాం..!
⇒ ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి ⇒ మద్యం ధరలు, దుకాణాల సంఖ్య పెంచే యోచన ⇒ విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది మద్యం పొంగి పొర్లనుంది. మద్యం ద్వారా ఏకంగా రూ.20 వేల కోట్లు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్యను పెంచటంతో పాటు మద్యం రేట్లు, లైసెన్సు ఫీజులు, మద్యం అమ్మకాలపై పన్నుల మోత మోగించేందుకు నడుం బిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త బడ్జెట్లో ఈ అంచనాలను అమాంతం 50 శాతానికి పైగా పెం చింది. అదనంగా రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించడం గమనార్హం. భారీగా పెరగనున్న దుకాణాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు న్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో వీటి లైసెన్స్ గడువు ముగియనుంది. ఆశించిన ఆదాయం రాబట్టా లంటే లైసెన్సు ఫీజులను పెంచడంతోపాటు ఇప్పు డున్న దుకాణాల సంఖ్యనూ పెంచాలని సర్కారు యోచిస్తోంది. విదేశీ మద్యం ద్వారా వీలైనంత ఎక్కు వ ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ మద్యం ద్వారా రూ.4,447 కోట్ల ఆదాయం సమకూరనుంది. విదేశీ మద్యం విక్రయాలను విస్తరించటంతో పాటు అదనపు ఫీజుల ను పెంచాలని సర్కారు నిర్ణయించింది. అందుకే విదేశీ మద్యం ద్వారా రూ.8,201 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది. ఎక్సైజ్ ఆదాయమే పెద్ద దిక్కు అమ్మకపు పన్ను తర్వాత ఖజానాకు ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయమే పెద్ద దిక్కు. ఎక్సైజ్ డ్యూటీ, లీజు, లైసెన్సు ఫీజు, ఎక్సైజ్ వ్యాట్, ప్రివిలేజ్ ఫీజు ఇవన్నీ ఈ పద్దులో ఉంటాయి. మద్యం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ డ్యూటీని ఈసారి గణనీయంగా పెంచే అవ కాశం ఉంది. తద్వారా మద్యం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై 70 నుంచి 180 శాతం వరకు వ్యాట్ విధిస్తుండగా, ప్రీమియం, ఫారిన్ లిక్కర్‌పై వ్యాట్‌ను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు లైసెన్సు ఫీజులు ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన సంవత్సరానికి రూ.40 లక్షల నుంచి రూ.1.08 లక్షల వరకు వివిధ స్లాబుల్లో ఉన్నాయి. వీటిని సవరించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం 13 వేల జనాభాకి ఓ మద్యం దుకా ణం ఉండగా, వీటిని విస్తరించే అవకాశాలున్నాయి. బార్ల లైసెన్సులను నగర పంచాయతీల నుంచి మం డల స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది. సుప్రీం ఆదేశాలతో వ్యాపారుల బెంబేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 తర్వాత రహదారులకు ఆనుకుని మద్యం అమ్మకాలు ఉండరాదని స్పష్టం చేసింది. దీంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రహదారులకు దూరంగా వెళితే వ్యాపారాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతుంది. -
శాంతిమయ జీవితం ఎక్కడ?
పంట చేతికి రాకపోతే పస్తులుండే వ్యవసాయ సమాజంలో పుట్టి పెరిగాడాయన. కరువులోనూ ముక్కుపిండి పన్నులు వసూలు చేసే రోమా నియంతృత్వ పాలనకు, యూదు మత పెద్దల దౌర్జన్యం, వేషధారణకు ఆయన ప్రత్యక్షసాక్షి, బాధితుడు కూడా. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరక్క పస్తులుండే జాలరులు ఆయన అంటే యేసుప్రభువు ప్రియ శిష్యులు. యేసు బోధలు అయనెదుర్కొన్న కష్టాలు, సవాళ్లు ఒత్తిళ్ల నుండి వచ్చాయి కాబట్టే అవి ఆచరణాత్మకమైనవిగా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. అందుకే అంత సాధికారికంగా, పరలోకపు తండ్రిగా దేవుడుండగా విశ్వాసులు అసలు చింతించవలసిన పని లేదన్న ఆయన బోధ విప్లవాత్మకమైనది. నిన్నటి తప్పిదాల అపరాధభావన, రేపటి సవాళ్ల తాలూకు అందోళన అనే ఇద్దరు దొంగల మధ్య, దేవుడిచ్చిన అత్యంత ఆశీర్వాదకరమైన ‘నేటిని’ సిలువ వేసుకొంటున్న అభాగ్యులం మనం. అలా మానవాళికి శాపంగా మారిన చింతను యేసు తూర్పారబట్టాడు. పరలోకపుతండ్రిగా దేవుని మానవాళికి పరిచయమవడం ద్వారా యేసుక్రీస్తు ‘చింతించడం’ వెనుక ఉన్నమహా రహస్యాన్ని ఛేదించాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను విశ్వసించినంత తేలికగా, సంపూర్ణంగా మానవాళి దేవుని పరలోకపు తండ్రిగా విశ్వసించకపోవడమే వారి చింతలన్నింటికీ మూలమని యేసు రోగనిర్ధారణ చేశాడు. ఇహలోకపు తండ్రిగా మనకు చాలా పరిమితులున్నాయి. కాబట్టి పిల్లల కోసం ఎన్నో చేయాలనుకున్నా అన్నీ చేయలేని అశక్తులం మనం. అయినా ‘తండ్రీ’ అన్న సంబోధనలోనే పిల్లలు ఎంతో స్వాంతన, ఆదరణ పొందుతారు. అలాంటప్పుడు సర్వశక్తిమంతుడైన దేవవుడే పరలోకపు తండ్రిగా ఉంటే అదెంత భాగ్యం? ‘దైవర్శనం’ కోసం పుణ్యస్థలాలకు, మహా దేవాలయాలకు వెళ్లే సంస్కృతి కొందరికి లాభకరంగా మారింది కాని సగటు విశ్వాసికి చాలా నష్టం చేసింది. దేవుడంటే అక్కడెక్కడో ఉండే అందుబాటులో లేని ‘దూరపుశక్తి’ అన్న భావనే విశ్వాసుల్లో అశాంతికి కారణమైంది. కాని దేవుడు నిరంతరం మనల్ని వెన్నంటి ఉండే పరలోకపు తండ్రి ‘అన్న భావనతో, నా జీవనపథంలో ఎంతటి ప్రతికూలతనైనా ఆయనే ఎదుర్కొంటాడన్న నిర్భయత్వం ఏర్పడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవునికి పరిమితులే లేవు గనుక మన సమస్య ఎంత గడ్డుదైనా దానికి ఆయన వద్ద అద్భుతమైన పరిష్కారముంటుందననది ఆయన పిల్లలముగా మనకు కలిగే భరోసా! అదే మన జీవితాన్ని ‘నిశ్చింతల ద్వీపం’గా మార్చుతుంది. ఆలస్యమెందుకు? ఈ రోజే మీ చేయి పరలోకపు తండ్రి చేతిలో వేయండి. మీ చింతలన్నీ ఆయనకే ‘అప్లోడ్’ చేయండి! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
బకాయిలు కొండంత
నత్తనడకన ఆస్తిపన్ను వసూళ్లు పట్టణాలు, పల్లెల్లో అదే తీరు పంచాయతీల్లో రూ.102 కోట్ల బకాయిలు పట్టణాల్లో రావాల్సింది రూ.51.24 కోట్లు గ్రామాలను వేధిస్తున్న సిబ్బంది కొరత కొరవడుతున్న పర్యవేక్షణ పల్లెలు, పట్టణాలకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ఇచ్చే నిధులతోపాటు.. ఆస్తిపన్నులు కూడా ముఖ్యమైన ఆదాయ వనరు. ఇంత కీలకమైన పన్ను వసూళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించడంలేదు. ఫలితంగా పన్ను వసూళ్లు ఇప్పటికీ నత్తనడకగా సాగుతున్నాయి. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను డిమాండు రూ.107.76 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ మొత్తం రూ.113 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.11 కోట్లు మాత్రమే వచ్చింది. మరో నలభై రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో.. మిగిలిన బకాయిలు వసూలు కావడం అనుమానమే. దీంతో ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : చాలీచాలని సిబ్బంది, పర్యవేక్షణ లోపాలతో గ్రామ పంచాయతీల్లో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అటు ప్రభుత్వం రూపాయి కూడా విదల్చకపోవడం, ఇటు పన్నులు కూడా సరిగా వసూలు కాకపోవడంతో.. గ్రామ పంచాయతీల అభివృద్ధి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. జిల్లాలో 1,063 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో సగానికి పైగా పంచాయతీలు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా మొత్తమ్మీద గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలు రూ.113 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం రూ.11 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రూ.102 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉందన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో కొద్ది రోజులు మాత్రమే గడువుంది. ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద మొత్తాన్ని అధికారులు ఏవిధంగా వసూలు చేయగలరనేది ప్రశార్థకంగా మారింది. గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, బ్లీచింగ్, ముగ్గు వంటివాటి కొనుగోలుకు సాధారణ నిధులు వినియోగించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలు సైతం డబ్బులు లేక విలవిలలాడుతూండగా, మైనర్ పంచాయతీల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. డ్రైనేజీలు, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు తాత్కాలిక సిబ్బందితో పనులు చేయించేవారు. ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. కార్యదర్శుల కొరత కారణంగా సిబ్బందిపై అజమాయిషీ లేదు. దీనికితోడు గత ఏడాదిన్నర కాలంగా పూర్తిస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కూడా లేరు. దీంతో పన్ను బకాయిలపై దృష్టి సారించేవారే కరవయ్యారు. 2015 నవంబర్‌లో డీపీఓగా పని చేసిన కె.ఆనంద్ బదిలీపై వెళ్లారు. అప్పటినుంచీ రెగ్యులర్ డీపీఓను నియమించలేదు. జిల్లా సహకారి అధికారి, సెట్రాజ్ సీఈవో, జిల్లా పరిషత్ సీఈవో, అమలాపురం డీఎల్పీవోలు ఇ¯ŒSచార్్జ డీపీవోలుగా పని చేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ ఇ¯ŒSచార్జ్ డీపీఓగా పని చేస్తున్నారు. బిల్లు కలెక్టర్‌తో సమావేశాలు లేవు గతంలో పన్ను వసూళ్లపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లతో డీపీఓ దాదాపు ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర బిల్లు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి పన్నులు వసూలు చేయకుంటే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ డీపీఓ లేకపోవడంతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో గ్రామ పంచాయతీల్లో భారీగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. పట్టణాల్లో నత్తనడకే మండపేట : జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సం వత్సరం ముగిసేనాటికి నూరు శాతం వసూళ్లు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకూ 52 శాతం మాత్రమే వసూలయ్యాయి. 77.2 శాతంతో తుని మున్సిపాలిటీ ముందంజలో ఉండగా, 41.4 శాతంతో రామచంద్రపురం చివరి స్థానంలో ఉంది. మరో 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. నిధుల విడుదలకు నూరు శాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కాకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతోపాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో 2,35,685 ప్రైవేటు భవనాలున్నాయి. వీటిద్వారా ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ మొత్తం రూ.107.76 కోట్లుగా ఉంది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇది సుమారు 52 శాతంగా ఉంది. 77.2 శాతంతో తుని మున్సిపాల్టీ ముందంజలో ఉంది. మండపేట మున్సిపాల్టీలో 74.7, కాకినాడ నగర పాలక సంస్థలో 58, రాజమహేంద్రవరంలో 55, అమలాపురంలో 58.7, పెద్దాపురంలో 65.6, సామర్లకోటలో 62.5, పిఠాపురంలో 43.6, రామచంద్రపురంలో 41.4 శాతం చొప్పున పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 75.7, ఏలేశ్వరంలో 73.1, ముమ్మిడివరంలో 59.4 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇంకా రూ.51.24 కోట్లు వసూలు కావాల్సి ఉంది. నూరు శాతం వసూలు జరిగేనా? 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థలు నూరు శాతం పన్నులు వసూలు చేయడం తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్ను వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతరం సమీక్ష జరుగుతోంది. దాదాపు మరో 40 రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియనుండగా.. పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నుంచి నూరు శాతం వసూలు గగనమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి పనులపై పడనుంది. -
ఇక నిమిషాల్లో పాన్ కార్డు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ జారీచేసే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్ కార్డు) కావాలంటే వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితికి ఇక చెల్లుచీటి కానుంది. నిమిషాల్లో పాన్ కార్డు ఇక మీ ముందుకు రానుంది. అంతేకాక ఇన్ కమ్ ట్యాక్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లించేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సులువుగా ఆధార్ కార్డు ఈ-కేవైసీ ఫెసిలిటీ ద్వారా పాన్ కార్డును జారీచేసేలా కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ సిమ్ ను ఈ-కేవైసీ ద్వారా జారీచేస్తే, పాన్ కార్డు కూడా ఇవ్వడం కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు, మూడు వారాలు పడుతున్న ఈ పని ఇక ఐదు లేదా ఆరు నిమిషాల్లో ముగించేయొచ్చని పేర్కొంటున్నారు. మొదట నెంబర్ జారీచేసి, తర్వాత కార్డు డెలివరీ చేసేలా చూస్తున్నారు. ఇప్పటికే జతకట్టిన సీబీడీటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కొత్త కంపెనీల స్థాపనకు పాన్ కార్డును నాలుగు గంటల్లో జారీచేసేలా పనిచేస్తున్నాయి. -
పన్నులు వసూలు కాకుంటే పంచాయతీలు విలీనం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో పన్నులు వసూలు చేయడం చేతకాకపోతే పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో పంచాయతీ పన్నులు, పారిశుద్ధ్యం, బయోమెట్రిక్ హాజరు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016–17 పన్నులు ఇంతవరకూ కేవలం 34 శాతం మాత్రమే వసూలు చేశారని, మార్చి 31వ తేదీ నాటికి నూరుశాతం పన్నులు ఎలా వసూలు చేయగలుగుతారని ప్రశ్నించారు. గత ఏడాది పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన ఏలూరు ఈవోఆర్డీని పోలవరానికి, పోలవరం ఈవోఆర్డీని ఏలూరుకు బదిలీ చేయాల్సిందిగా డీపీవో కె.సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు ఉదయం 5.30 గంటలకే క్షేత్రస్థాయికి వెళ్లాలని చెప్పినా ఏ ఒక్కరూ వెళ్లడం లేదని, ఇకపై ఉదయం 5.30 గంటలకే ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీలకు సంబంధించి వెబ్‌సైట్‌ను రూపొందించి పంచాయతీల వారీ సమాచారాన్ని పొందుపరచాలన్నారు. పంచాయతీలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, పన్నులు, నాన్‌టాక్సెస్, ఇతర సమాచారం సేకరించాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలదేనని, ఆ సమాచారాన్ని కంప్యూటర్ ఆపరేటరు ద్వారా నమోదు చేయించాలన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారి సీహెచ్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. తెల్లకార్డుకు అర్హత లేకుంటే గులాబీ కార్డు జిల్లాలో తెల్లరేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతలేదని గుర్తించిన వెంటనే గులాబీకార్డు మంజూరు చేయాల్సిందిగా తహసీల్దార్లను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో తెలుపురంగు రేషన్‌కార్డు పొంది ఉండి స్వచ్ఛందంగా తనకు తెల్లరేషన్‌కార్డు రద్దు చేసి గులాబీ కార్డు మంజూరు చేయాల్సిందిగా లబ్ధిదారుడు కోరినట్లయితే వెంటనే చర్యలు తీసుకుని గులాబీ కార్డు మంజూరు చేయాలన్నారు. ప్రతి దానికి ఆధార్ నెంబరును అనుసంధానం చేస్తారని, ఏవైనా అవకతవకలు జరిగినట్టయితే వెంటనే గుర్తించి సంబంధితాధికారిపై గాని లబ్ధిదారుడుపై గాని చర్యలు తీసుకుంటామని అన్నారు. చేపల చెరువుల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, అర్హత కలిగిన వారికి వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ కె.సుధాకర్, జెడ్పీసీ ఈవో డి.సత్యనారాయణ, నిక్నెట్ అధికారి శర్మ పాల్గొన్నారు. -
3.4 బిలియన్ డాలర్లు పన్నులు చెల్లించిన అలీబాబా
3 కోట్ల మందికి ఉపాధి కల్పన బీజింగ్: చైనా ఈ–కామర్స్ దిగ్గజం ‘అలీబాబా గ్రూప్’ గతేడాది మొత్తంగా దాదాపు 3.41 బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించింది. అలాగే 3 కోట్ల మందికి ఉపాధిని కల్పించింది. ఇక అలీబాబా ప్లాట్‌ఫామ్‌లోని వ్యాపారులు, తయారీదారులు, లాజిస్టిక్స్ కంపెనీలు 2016లో 200 బిలియన్ యువాన్లను పన్నులు రూపంలో చెల్లించాయి. ‘మేము, మా అనుబంధ సంస్థ ఏఎన్‌టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ గతేడాది మొత్తంగా 23.8 బిలియన్ యువాన్లను (3.41 బిలియన్ డాలర్లు= దాదాపు రూ.23,188 కోట్లు) పన్నుల రూపంలో చెల్లించాం. ఇది గతేడాది పోలిస్తే 33 శాతం అధికం’ అని అలీబాబా పేర్కొంది. కాగా అలీబాబా షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 45,000కు పైగా సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. వీరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 142 శాతం మేర వృద్ధి చెందింది. -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ. 123 కోట్ల పన్ను
నిజామాబాద్ నాగారం : నిజామాబాద్ డివిజన్ సర్కిల్ పరిధి సంగారెడ్డి జిల్లా యెద్దు మైలారం గ్రామంలో గల ఆర్డినెన్సు ఫ్యాక్టరీ నుంచి 123 కోట్ల 70 లక్షల 64వేల 553 పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖాజానాకు జమ చేసినట్లు వాణిజ్యపన్నుల శాఖ ఇంటిలిజెన్సు అసిస్టెంట్ కమీషనర్ లక్ష్మయ్య తెలిపారు. దేశ రక్షణకు యుద్ధ ట్యాంకులు తయారు చేసి సరఫరా చేస్తున్న ఆర్డినెన్స్ కంపెనీ పన్నులు చెల్లించకపోవడంతో ఇంటిలిజెన్స్ బృందం క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సుమారు 49 ఆర్డినెన్సు కంపెనీలు ఉన్నాయని, ఎక్కడ కూడా ఈ కంపెనీలు పన్నులు చెల్లించ లేదన్నారు. నిజామాబాద్ డివిజన్లో ఇదే మొదటి సారన్నారు. వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు మదింపు చేసి టాక్స్‌లు వసూలు చేస్తుంటామన్నారు. యెద్దు మైలారంలోని ఆర్డినెన్స్ కంపెనీ గతంలో కేవలం కొన్ని వ్యాపార లావాదేవీలపైన మాత్రమే పన్ను చెల్లించేందన్నారు. ముఖ్యంగా కంపెనీ తయారు చేసి దేశరక్షణకు సరఫరా చేస్తున్న యుద్ధ ట్యాంకర్ వాహనాలపైన మినహాయింపులు పొందుతూ టాక్స్ చెల్లించడం లేదని ఇంటలి జెన్స్ బృందం పరిశీలనలో తేలిందన్నారు. ఆ ట్యాంకర్ల సరఫరాపై పన్నులు విధించినట్లు తెలిపారు. మొదటి విడత రూ. మార్చి 17న రూ. 25 కోట్ల 85 లక్షల 34 వేల 185 వసూలు చేసినట్లు తెలిపారు. రెండవ విడతలో సెప్టెంబర్ 29న రూ.42 కోట్ల 55 లక్షల 11వేల 235 వసూలు చేశామన్నారు. శుక్రవారం నాడు రూ. 55 కోట్ల 35 లక్షల 19వేల 133 వసూలు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 123 కోట్ల 70 లక్షల 64వేల 553 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తెలిపారు. కేవలం ఆడిట్ ద్వారా పన్నులు అత్యధికంగా వసూలు చేసిన ఘనత నిజామాబాద్ వాణిణ్య పన్నుల శాఖ డివిజన్‌కు దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే వ్యాపార సంస్థ ద్వారా పన్నులు వసూలు చేయడం ఇంటిలిజెన్స్ వింగ్ ద్వారానే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా వివిధ వ్యాపార సంస్థలు తమ అమ్మకాలపై రాష్ట్రంలో వ్యాట్, సీఎస్టీ ట్యాక్సులు వసూలు చేస్తాయన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 8 లార్జ్ యూనిట్ సర్కిల్లు ఉన్నాయని, వీటిలో అధిక పన్నులు చెల్లించే 41 మంది డీలర్లు అయిన ప్రముఖ వ్యాపార సంస్థలు ఎంఆర్ఎఫ్, బీహెచ్ఈఎల్, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తదితర కంపెనీలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ జి లావణ్య, గతంలో ఉన్న డీసీ శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఇది సాధించామన్నారు. సమావేశంలో ఏసీటీఓలు జి గంగాధర్, పోతనకర్ లక్ష్మీనారాయణ, ఎస్ జయంత్నాద్, ఆధిత్యకుమార్, జూనియర్అసిస్టెంట్ బి భారతి, తదితరులు పాల్గొన్నారు. -
కార్ల కొనుగోళ్లకూ ఆదాయాలకూ పొంతనేది?
పన్ను పరిధి నుంచి పెద్ద సంఖ్యలో తప్పించుకుంటున్నారన్న విమర్శ.. న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో ప్రజలు పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారని ఒక ఉన్నతాధికారి విశ్లేషించారు. పన్ను రిటర్నుల ప్రకారం దేశంలో వార్షికంగా రూ.10 లక్షల పైబడిన ఆదాయం కలిగిన వారి సంఖ్య కేవలం 24 లక్షల మందేనని ఆ అధికారి పేర్కొంటూ, అయితే కొత్త కార్ల అమ్మకాల సంఖ్య మాత్రం వార్షికంగా 25 లక్షలుగా ఉంటోందన్నారు. వీటిలో లగ్జరీ కార్ల సంఖ్య దాదాపు 35,000. ‘‘ఒక కారు వినియోగ జీవిత కాలం దాదాపు ఏడేళ్లు. సామాన్యుడు ఒక కారు కొన్నాక మళ్లీ ఐదేళ్ల వరకూ కొత్త కారు కొనలేడు. అయినా వార్షికంగా పెద్ద సంఖ్య లో కార్ల కొనుగోళ్లు జరుగుతున్నాయంటే, పన్ను పరిధిలోకి రాకుండా పలువురు తప్పించుకుంటు న్నట్లు అర్థమవుతోంది’’ అని ఆయన విశ్లేషించారు. ట్యాక్స్ రిటర్న్‌లు... 3.65 కోట్లు దేశంలో దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఉంటే, 2014–15 అసెస్మెంట్ ఇయర్లో కేవలం 3.65 కోట్ల మంది వ్యక్తిగతంగా తమ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పన్ను పరిధికి వెలుపల ఉన్నారని అన్నారు. 3.65 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేస్తే, ఇందులో కేవలం 5.5 లక్షల మంది మాత్రమే వార్షికంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినట్లు తెలిపారు. మొత్తం పన్నుల బాస్కెట్లో ఒక్క వీరి వాటానే 57 శాతంగా ఉందన్నారు. అంటే రిటర్న్స్ ఫైల్ చేసే 3.65 కోట్ల మందిలో కేవలం 1.5 శాతం మంది వాటా పన్ను బాస్కెట్లో 57 శాతంగా ఉందని వివరించారు. గత మూడేళ్లలో వార్షికంగా వరుసగా 25.03 లక్షలు, 26 లక్షలు, 27 లక్షల కార్లు అమ్ముడయ్యాయని అధికారి వివరిస్తూ, కారు కొనడానికి ఆదాయం కలిగి ఉన్న పెద్ద సంఖ్యలోని ప్రజలు పన్ను బాస్కెట్ పరిధికి వెలుపల ఉంటున్నట్లు దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడాదికి రూ. కోటి ఆదాయం ఉన్నట్లు చూపుతున్న వారి సంఖ్య 48,417 అయితే, ప్రతి ఏడాదీ బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, మెర్సిడెస్, పోర్షే, మాసిరాటి వంటి లగ్జరీ కార్ల అమ్మకాలు దాదాపు 35,000గా నమోదవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కారు వినియోగ కనీస కాలం దాదాపు ఏడేళ్లయితే, వార్షికంగా ఇన్ని కార్లు ఎలా అమ్ముడవుతాయని ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోల్చితే.. కాగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే భారత్ పన్ను ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఈ నిష్పత్తి కేవలం 16.7 శాతం అయితే, అమెరికాలో 25.4 శాతం, బ్రిటన్‌లో 30.3 శాతంగా ఉందన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని పెద్ద నోట్ల రద్దు ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. దీనివల్ల అనధికార డబ్బును అధికారికంగా మార్చుకోవాల్సిన పరిస్థితి నల్లకుబేరులకు ఏర్పడుతోందని అన్నారు. వారిపై పెద్ద ఎత్తున్న పన్ను కొరడా తప్పదని హెచ్చరించారు. -
మ్యూచువల్ ఫండ్‌లో డివిడెండ్ ఖరారు ఎలా...?
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వృద్ధికి మాత్రమే కాదు, అడపా దడపా అవసరాలకు మధ్యంతరంగా నగదు అందుకునేందుకూ అక్కరకు వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లు ఉంటాయనే విషయం తెలిసిందే. డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మధ్య మధ్యలో డివిడెండ్ రూపంలో ఆదాయం పొందవచ్చు. మరి ఈ డివిడెండ్ ఖరారు ఎలా చేస్తారంటే... ఓ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభం నుంచే డివిడెండ్ పంపిణీ ఉంటుంది. ఫండ్ మేనేజర్ లాభాలను నమోదు చేసినా, కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకున్నా... ఒకవేళ డెట్ ఫండ్స్ అయితే వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం నుంచి ఈ డివిడెండ్ పంపిణీ ఉంటుంది. డివిడెండ్ ఎప్పుడెప్పుడు..? నెలకోసారి, త్రైమాసికంలో ఓ సారి లేదా వార్షికంగా ఒక సారి డివిడెండ్‌ను ప్రకటించే పథకాలు ఉంటాయి. మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు, హైబ్రిడ్ ఫండ్స్‌లో చాలా వరకు క్రమం తప్పకుండా నెలనెలా డివిడెండ్‌ను జారీ చేస్తుంటాయి. ఎంత మొత్తం అంటే... నిర్దిష్టంగా ఇంత అని చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న మ్యూచువల్ఫండ్ పథకంలో యూనిట్ ఎన్ఏవీ... గ్రోత్ ఆప్షన్ యూనిట్ ఎన్ఏవీతో పోల్చి చూస్తే వృద్ధి చెందదు. ఎన్ఏవీ కొంచెం పెరిగిన వెంటనే ఆ మేరకు ఫండ్ మేనేజర్ డివిడెండ్‌ను పంపిణీ చేసేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఫండ్ యూనిట్ రూ.10కి కొనుగోలు చేశారు. ఓ నెల తర్వాత అది రూ.12 అయిందనుకోండి. రూ.2ను డివిడెండ్‌గా ప్రకటించవచ్చు. పన్ను ఉంటుందా...? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జారీ చేసే డివిడెండ్ ఆదాయంపై పన్ను ఉండదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం ఫండ్ నిర్వహణ సంస్థ 28.84 శాతాన్ని డివిడెండ్ పంపిణీ పన్నుగా చెల్లిస్తుంది. డివిడెండ్ ఆప్షన్ సరైనదేనా...? రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఆప్షనే సరైనది. అలాగే క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా ఇదే తగినది. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవాలని కోరుకునే వారు మాత్రం గ్రోత్ ఆప్షన్ ఎంచుకుని సిప్ విధానంలో పెట్టుబడి పెడుతూ వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తుంటారు. డివిడెండ్ విధానంలో కాంపౌండింగ్ వడ్డీ ప్రయోజనం కోల్పోవడం వల్ల సంపద వృద్ధి సాధ్యం కాదు. -
నగదు ర'హితమే'!
నగదు తగ్గడం వలన ఎన్నో లాభాలు - నల్లధనం, అవినీతిపై నియంత్రణ - పన్నుల ఎగవేతకూ చెక్.. లావాదేవీల్లో పారదర్శకత - నకిలీ నోట్ల వంటి సమస్యలూ ఉండవు - సైబర్ నేరాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువశాతం నగదు ఆధారంగానే నడుస్తోంది. అయితే వ్యవస్థ నుంచి నగదు పూర్తిగా తొలగిపోయినా.. లేదా గణనీయంగా తగ్గినా చాలా రకాల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్లధనం, అవినీతికి చెక్ పడుతుంది. పన్నుల ఆదాయం పెరుగుతుంది. అయితే నగదు రహిత వ్యవస్థలో ప్రధానమైన ప్లాస్టిక్ మనీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వంటి వాటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ అంశాలపై ఈ రోజు ఫోకస్.. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ నల్లధనానికి, అవినీతికి చెక్ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువలో నల్లధనం వాటా 25 శాతం వరకూ ఉంటుందని అంచనా. అన్ని లావాదేవీలు నగదు రహితంగా జరిగితే ఈ నల్లధనం వాటా గణనీయంగా తగ్గిపోతుంది. రూపారుు డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది. అమ్మకాలను, ఆదాయాన్ని తక్కువగా చూపడానికి కుదరదు. ప్రతి పైసా లెక్కలోకి వస్తుంది కాబట్టి విధిగా సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నగదు రహిత లావాదేవీలతో పాటు.. ప్రభుత్వ అనుమతుల జారీ, పథకాల అమలు తదితరాలను డిజిటలైజ్ చేయడం వల్ల అధికార యంత్రాంగంలో అవినీతి గణనీయంగా తగ్గిపోతుంది. పన్ను ఆదాయం పెరుగుతుంది దేశ జనాభా 125 కోట్ల వరకూ ఉంటే ఇందులో ఆదాయ పన్ను కట్టే వారు నాలుగు కోట్ల మంది కూడా లేరు. మిగిలిన వారి దగ్గర పన్ను కట్టేంత ఆదాయం లేదని కాదు. లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కువగా ఉందని దీనర్థం. క్రెడిట్, డెబిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా జరిగితే వ్యాపారులు ఆ లెక్కలను ప్రభుత్వానికి చూపాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి పన్నులు కచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. మన దేశంలో స్థూల జాతీయోత్పత్తిలో పన్నుల వాటా పది నుంచి 17 శాతం వరకూ ఉంటుందని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతమున్న పన్ను రేట్లు (కార్పొరేట్, ఆదాయ) ఇదే స్థారుులో కొనసాగిస్తే మాత్రం చాలామంది నగదు రహిత లావాదేవీలకు ఇష్టపడే అవకాశం తక్కువ. ‘నగదు’ ఖర్చులు ఆదా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా ఉంటే నోట్ల ముద్రణ, రవాణా ఖర్చులు చాలా తగ్గుతాయి. ఒక్కో రూ.500 నోటును ముద్రించేందుకు దాదాపు 3.08 రూపాయలు, రూ.1,000 నోటును ముద్రించేందుకు నాలుగు రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇది కూడా నాలుగేళ్ల క్రితం అంచనా. ఇక దేశంలోని నాలుగు ముద్రణ కేంద్రాల నుంచి నోట్లను దేశవ్యాప్తంగా తరలించేందుకు, ఆయా క్యాష్ సెంటర్లలో నిల్వ ఉంచేందుకు, నిర్వహణకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకులు (క్యాష్ మేనేజ్మెంట్కు) ఏటా దాదాపు రూ. 21 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారుు. కరెన్సీ తక్కువగా ప్రింట్ చేస్తే అంత మేరకు ఈ ఖర్చులు తగ్గుతారుు. మాంద్యంలోనూ ఆదుకుంటుంది అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం గుర్తుంది కదా? లావాదేవీలన్నీ నగదు రహితంగా మారితే ఈ రకమైన మాంద్యాలను అధిగమించడం కొంచెం సులువు అవుతుంది. ప్రజల సొమ్ములో అధిక భాగం బ్యాంకుల్లోనే ఉంటుంది కాబట్టి.. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో బ్యాంకులు డిపాజిట్లపై నెగటివ్ పన్నులు విధించడం ద్వారా ప్రజలు ఆ మొత్తాలను ఖర్చు పెట్టేలా చేయవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. నకిలీ నోట్లకు చెల్లుచీటీ డిమాండ్ ఉన్నప్పుడే ఏ వస్తువుకై నా విలువ పెరుగుతుంది. సరఫరాదారులూ ఎక్కువవుతారు. నగదు కూడా దీనికి అతీతం కాదు. లావాదేవీలు ఎక్కువ శాతం నగదు రూపంలో జరిగితే నకిలీల బెడదను తప్పించడం కష్టం. అదే లావాదేవీలన్నీ బ్యాంకులు, డిజిటల్ రూపంలో జరిగితే నగదు అవసరం బాగా తగ్గిపోతుంది కాబట్టి నకిలీలను చలామణీలోకి తీసుకురావడం దాదాపు అసాధ్యమవుతుంది. నేరాలు తగ్గుతాయి నగదు రహిత ఆర్థిక లావాదేవీల వల్ల సమాజంలో నేరాలు తగ్గుతాయని ఒక అంచనా. స్వీడన్నే ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ నగదు రహిత ఆర్థిక లావాదేవీలు పుంజుకున్న తరువాత బ్యాంకు దోపిడీలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నారుు. 2008లో దాదాపు 116 దోపిడీలు జరిగితే 2012 నాటికి 5కు తగ్గారుు. అంతెందుకు నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత ముంబైలో నేరాల సంఖ్య సగానికిపైగా తగ్గినట్లు కథనాలు వచ్చారుు. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి అని అంచనా. ఆర్థిక లావాదేవీలు వేగవంతం నగదు రహితంగా డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీలు వేగవంతమవుతారుు. బ్యాంకు నుంచి వినియోగదారుడికి, వినియోగదారుడి నుంచి బ్యాంకుకు, ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి మరొక వ్యక్తి బ్యాంకు ఖాతాకు నగదును క్షణాల్లో బదిలీ చేయవచ్చు. నగదును జమ చేయడానికి బ్యాంకులకు వెళ్లడం, క్యూలలో నిల్చోవడం వంటి ప్రయాసలు తగ్గిపోతారుు. ఉగ్రవాదానికి గొడ్డలిపెట్టు ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చే వారికి నగదు వ్యవహారాలే ప్రధానం కాబట్టి నగదు రహిత లావాదేవీలు ఈ చర్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సాయపడతాయ నడంలో సందేహం లేదు. నల్లధనం తక్కువవుతున్న కొద్దీ ఉగ్రవాద చర్యలకు నిధులందించే వారికి ఇబ్బందే. అరుుతే నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగే పది దేశాల్లో ఇటీవల జరిగిన అధ్యయనం మాత్రం.. నగదు రహిత లావాదేవీలు ఉగ్రవాద నిధుల ప్రవాహానికి అడ్డంకి కాదని పేర్కొనడం గమనార్హం. -
మున్సిపల్ కార్పొరేషన్‌కు పాతనోట్ల పంట
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దుతో పింప్రి మున్సిపల్ కార్పొరేషన్ దశ తిరిగింది. గత 13 రోజుల నుంచి ఈ కార్పొరేషన్ ఖజానాకు ఆస్తి పన్ను రూపంలో రూ.130 కోట్లు వచ్చి చేరాయి. కేంద్రం నోట్ల రద్దు ప్రకటించిన రెండు రోజులకే పింప్రీ మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) పన్ను చెల్లింపులో పాత నోట్లను అంగీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం నగరవ్యాప్తంగా 15 కార్యాలయాలను ఏర్పాటు చేసి, 200 మంది సిబ్బందిని మోహరించింది. రెండు ప్రైైవేట్ బ్యాంక్‌లకు పన్ను వసూలు అధికారాన్ని కూడా కల్పించింది. దీంతో బుధవారం గడువు ముగిసేటప్పటికి రూ.130 కోట్ల నగదు పన్నుల రూపంలో జమ అయింది. ప్రజల స్పందన భారీగా ఉండటంతో ఈ డ్రైైవ్ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, పెండింగ్ పన్నులను బకాయి దారులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీతో చెల్లిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ చెల్లింపులపై దర్యాప్తు చేపట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. పీఎంసీ ఆస్తి పన్ను విభాగ అధికారి సుహాస్ మపారి మాట్లాడుతూ.. కేవలం 13 రోజుల్లో తాము రూ.130 కోట్లు నగదు రూపంలో పొందగా, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో కలిపి రూ. 910 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. అయితే, ఐటీ విభాగం కోరిక మేరకు.. చెల్లింపుదారుల వివరాలన్నిటినీ వారికి అందించామని వెల్లడించారు. -
గిరిగిరి దందా..ఇక మూతేనా!
► పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ► అక్రమ వడ్డీ వ్యాపారంపై ఐటీ నిఘా ► భయాందోళనలో వడ్డీవ్యాపారులు ►చిరువ్యాపారుల్లో గందరగోళం. జమ్మికుంట : పెద్ద నోట్ల రద్దు ప్రభావం గిరిగిరి దందాపై పడింది. వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక..కొత్తగా ఇవ్వకుండా అయోమయంలో పడ్డారు. ఈ వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం..ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో పెద్ద నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు చిరువ్యాపారులు, దుకాణదారులకు వడ్డీలకిచ్చి ముక్కుపిండి వసూలు చేసిన వడ్డీ వ్యాపారుల చేష్టలు ఇక ముందు సాగడం కష్టమే అనిపిస్తోంది. అక్రమవడ్డీ వ్యాపారం ఇలా.. చేతిలో లెక్కకు మించి డబ్బులున్న వారు చిరువ్యాపారులు, దుకాణదారులకు గిరిగిరి పేరుతో వడ్డీకి డబ్బులిస్తుంటారు. రూ.10వేల నుంచి మొదలుకొని రూ.2లక్షలు వరకు అందిస్తుంటారు. రూ.3 చొప్పున వడ్డీతో డబ్బులు ముట్టేలా వంద రోజులు గడువు పెడతారు. రూ.లక్ష అప్పుగా ఇస్తే మొదటనే రూ.10వేలు తీసుకుని రూ.90వేలు అప్పగిస్తారు. ఇచ్చిన డబ్బుకు రోజుకు రూ.వంద చొప్పున వంద రోజుల వరకు వసూలు చేస్తారు. ఇలా జమ్మికుంటలో దాదాపు వందల మంది వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది రూ.10 లక్షలు మొదలుకొని రూ.కోటి వరకు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఏటా వంద కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పెద్ద మొత్తంలో ఇంట్లో ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల చివరి వరకు నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉండడంతో డిపాజిట్ చేయాలా? వద్దా? అనే సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తుంది. చిట్టీలు ఇలా జమ్మికుంటలో చిట్టీల దందా జోరుగా సాగుతోంది. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు నెలవారీ చిట్టీల దందా సాగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేకుం డానే చిట్టీల దందా నడుస్తోంది. జమ్మికుంట వ్యాపార కేంద్రంలో వంద కోట్లకు పైగా ఈ చిట్టీల దందా కొనసాగుతున్నట్లు ప్రచారం ఉంది. అక్రమ ఫైనాన్సలు, పలువురు బడా వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. అరుుతే చిట్టీలు వేసేవారు... చిట్టీలు ఎత్తుకునే వారికి క్యాష్..టు క్యాష్ ఇచ్చేందుకు ప్రధాని నిర్ణయంతో అడ్డుకట్ట పడినట్లరుుంది. ప్రస్తుతం చిట్టీలు ఇవ్వడం.. నెలవారీ డబ్బులు వసూలు చేయడం నిలిచినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు అవసరాల కోసం డబ్బులు కూడపెట్టి చిట్టీలు వేస్తే నోట్ల రద్దుతో చేతికి డబ్బులు వస్తాయో.. రావోననే అయోమయంలో పడ్డారు. అదే విధంగా ఫైనాల్స్‌లో లక్షల్లో డబ్బులు దాచిన వారు ఎలా గట్టెక్కుతామోనని భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లోనే అక్రమ ఫైనాన్సలతో పాటు వడ్డీవ్యాపారులు బోర్డులు తిప్పేసే పరిస్థితులు కనిపిస్తున్నారుు. చిరువ్యాపారుల విలవిల పెద్ద నోట్ల రద్దుతో బడాబాబులు, వడ్డీవ్యాపారులు నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటే చిరువ్యాపారులు మాత్రం అప్పు దొరక్క బిక్కమొహం వేస్తున్నారు. బడా వ్యాపారులకు కోట్లలో రుణాలు ఇచ్చేందుకు క్యూలు కట్టే బ్యాంకర్లు చిరువ్యాపారులకు రూ.10వేల రుణం ఇవ్వలేకపోతుంటారు. దీంతో కుటుంబ పోషణ, వ్యాపారం కొనసాగించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో వడ్డీవ్యాపారులు దందా చేయకపోవడంతో రుణం లభించక చిరువ్యాపారులు దుకాణాలు మూసేస్తున్నారు. బ్యాంకర్లు స్పందించి ఎలాంటి తిరకాసు లేకుండా రుణాలు ఇవ్వాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. వడ్డీ వద్దు ! వడ్డీ వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను వడ్డీ లేకుండా ఇస్తామంటూ పలువురు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిత్యం చెల్లించే డబ్బులు రూ.వంద నోట్లు ఇస్తే సరిపోతుందని వ్యాపారులను బతిమిలాడుతున్నట్లు తెలిసింది. రద్దరుున నోట్లను తీసుకుంటే చిక్కుల్లో పడిపోతామనే భయంతో ఎవరూ ముందుకురావడం లేదని సమాచారం. ఐటీ నిఘా జమ్మికుంటలో వడ్డీ వ్యాపారుల గిరిగిరి దందాతోపాటు అక్రమ ఫైనాన్సలు, నెలవారీ చిట్టీలు నిర్వహించే వారిపై ఐటీ శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల పేర్లు సేకరించినట్లు సమాచారం. ఆదాయం, ఆస్తుల వివరాలు, ఫైనాన్సల టర్నోవర్ తదితర వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. -
పాత నోట్లతో 24 వరకు పన్నులు..
సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఈ నెల 24వ తేదీ వరకు ప్రస్తుత సంవత్సర ఆస్తిపన్ను, గత బకాయిలు, ట్రేడ్‌లైసెన్స్ లను చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని నగరవాసులు వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని, వీటితో పాటు అన్ని మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల్లో పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లను మాత్రం జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో మాత్రమే జమచేయాలని తెలిపారు. -
పన్నుల విధానంపై అవగాహన అవసరం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(వేదాయపాళెం): వస్తు సేవలు, వాణిజ్యపరమైన పన్నుల విధానంపై ఆయా శాఖల అధికారులకు అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో శుక్రవారం కమర్షియల్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 ఏప్రిల్ చట్టంలోని ప్రధాన అంశాల గురించి వివరించారు. రాజ్యాంగ సవరణ 122 యాక్ట్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడిట్, పన్నులు, పలు విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని వివరించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు. కమర్షియల్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి, సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
సినిమాల నిర్మాణానికి టర్కీ ప్రోత్సాహకాలు
హైదరాబాద్ : విదేశీ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే దిశగా టర్కీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. తమ దేశంలో చిత్రీకరించే సమయంలో చేసే వ్యయాలపై దాదాపు 18 శాతం దాకా పన్ను రీఫండ్ ఇస్తున్నట్లు టర్కీ టూరిజం శాఖలో భాగమైన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ కోఆర్డినేటర్ ఒజ్గుర్ అయ్‌టుర్క్ తెలిపారు. అలాగే చిత్ర నిర్మాణ సామగ్రి సత్వర కస్టమ్స్ క్లియరెన్స్, చిత్రీకరణ లొకేషన్స్ ఎంపిక మొదలైన వాటిలో తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో 8 నగరాల్లో తలపెట్టిన రోడ్ షోలలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒజ్గుర్ ఈ అంశాలు చెప్పారు. దిల్ ధడక్‌నేదో, ఏక్ థా టైగర్ తదితర బాలీవుడ్ సినిమాలు టర్కీలో చిత్రీకరణ జరుపుకున్నాయి. మరోవైపు, గతేడాది మొత్తం 2.6 కోట్ల మంది పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించగా వీరిలో 1.31 లక్షల మంది భారత టూరిస్టులు ఉన్నారని ఒజ్గుర్ తెలిపారు. దేశీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈసారి కొంత తగ్గినా.. వచ్చేసారి భారత టూరిస్టుల సంఖ్య 20 శాతం పైగా వృద్ధి చెందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టూరిజం ద్వారా 31 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందన్నారు. వివాహాలు, హనీమూన్, గోల్ఫ్ వంటి క్రీడలు మొదలైన వాటికి అనువైనదిగా టర్కీని ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు.