గిరిగిరి దందా..ఇక మూతేనా! | To cancel the effect of the large notes | Sakshi
Sakshi News home page

గిరిగిరి దందా..ఇక మూతేనా!

Published Sun, Nov 20 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

గిరిగిరి దందా..ఇక మూతేనా!

గిరిగిరి దందా..ఇక మూతేనా!

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
అక్రమ వడ్డీ వ్యాపారంపై ఐటీ నిఘా

భయాందోళనలో వడ్డీవ్యాపారులు
చిరువ్యాపారుల్లో గందరగోళం.

 
జమ్మికుంట : పెద్ద నోట్ల రద్దు ప్రభావం గిరిగిరి దందాపై పడింది. వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక..కొత్తగా ఇవ్వకుండా అయోమయంలో పడ్డారు. ఈ వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం..ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో పెద్ద నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు చిరువ్యాపారులు, దుకాణదారులకు వడ్డీలకిచ్చి ముక్కుపిండి వసూలు చేసిన వడ్డీ వ్యాపారుల చేష్టలు ఇక ముందు సాగడం కష్టమే అనిపిస్తోంది.

అక్రమవడ్డీ వ్యాపారం ఇలా..
చేతిలో లెక్కకు మించి డబ్బులున్న వారు చిరువ్యాపారులు, దుకాణదారులకు గిరిగిరి పేరుతో వడ్డీకి డబ్బులిస్తుంటారు. రూ.10వేల నుంచి మొదలుకొని రూ.2లక్షలు వరకు అందిస్తుంటారు. రూ.3 చొప్పున వడ్డీతో డబ్బులు ముట్టేలా వంద రోజులు గడువు పెడతారు. రూ.లక్ష అప్పుగా ఇస్తే మొదటనే రూ.10వేలు తీసుకుని రూ.90వేలు అప్పగిస్తారు. ఇచ్చిన డబ్బుకు రోజుకు రూ.వంద చొప్పున వంద రోజుల వరకు వసూలు చేస్తారు. ఇలా జమ్మికుంటలో దాదాపు వందల మంది వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఇలా చాలా మంది రూ.10 లక్షలు మొదలుకొని రూ.కోటి వరకు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఏటా వంద కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పెద్ద మొత్తంలో ఇంట్లో ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల చివరి వరకు నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉండడంతో డిపాజిట్ చేయాలా? వద్దా? అనే సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తుంది.

చిట్టీలు ఇలా
జమ్మికుంటలో చిట్టీల దందా జోరుగా సాగుతోంది. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు నెలవారీ చిట్టీల దందా సాగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేకుం డానే చిట్టీల దందా నడుస్తోంది. జమ్మికుంట వ్యాపార కేంద్రంలో వంద కోట్లకు పైగా ఈ చిట్టీల దందా కొనసాగుతున్నట్లు ప్రచారం ఉంది. అక్రమ ఫైనాన్‌‌సలు, పలువురు బడా వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. అరుుతే చిట్టీలు వేసేవారు... చిట్టీలు ఎత్తుకునే వారికి క్యాష్..టు క్యాష్ ఇచ్చేందుకు ప్రధాని నిర్ణయంతో అడ్డుకట్ట పడినట్లరుుంది. ప్రస్తుతం చిట్టీలు ఇవ్వడం.. నెలవారీ డబ్బులు వసూలు చేయడం నిలిచినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు అవసరాల కోసం డబ్బులు కూడపెట్టి చిట్టీలు వేస్తే నోట్ల రద్దుతో చేతికి డబ్బులు వస్తాయో.. రావోననే అయోమయంలో పడ్డారు. అదే విధంగా ఫైనాల్స్‌లో లక్షల్లో డబ్బులు దాచిన వారు ఎలా గట్టెక్కుతామోనని భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లోనే అక్రమ ఫైనాన్‌‌సలతో పాటు వడ్డీవ్యాపారులు బోర్డులు తిప్పేసే పరిస్థితులు కనిపిస్తున్నారుు.

చిరువ్యాపారుల విలవిల
పెద్ద నోట్ల రద్దుతో బడాబాబులు, వడ్డీవ్యాపారులు నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటే చిరువ్యాపారులు మాత్రం అప్పు దొరక్క బిక్కమొహం వేస్తున్నారు. బడా వ్యాపారులకు కోట్లలో రుణాలు ఇచ్చేందుకు క్యూలు కట్టే బ్యాంకర్లు చిరువ్యాపారులకు రూ.10వేల రుణం ఇవ్వలేకపోతుంటారు. దీంతో కుటుంబ పోషణ, వ్యాపారం కొనసాగించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో వడ్డీవ్యాపారులు దందా చేయకపోవడంతో రుణం లభించక చిరువ్యాపారులు దుకాణాలు మూసేస్తున్నారు. బ్యాంకర్లు స్పందించి ఎలాంటి తిరకాసు లేకుండా రుణాలు ఇవ్వాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.  
 
వడ్డీ వద్దు !
వడ్డీ వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను వడ్డీ లేకుండా ఇస్తామంటూ పలువురు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిత్యం చెల్లించే డబ్బులు రూ.వంద నోట్లు ఇస్తే సరిపోతుందని వ్యాపారులను బతిమిలాడుతున్నట్లు తెలిసింది. రద్దరుున నోట్లను తీసుకుంటే చిక్కుల్లో పడిపోతామనే భయంతో ఎవరూ ముందుకురావడం లేదని సమాచారం.
 
ఐటీ నిఘా
జమ్మికుంటలో వడ్డీ వ్యాపారుల గిరిగిరి దందాతోపాటు అక్రమ ఫైనాన్‌‌సలు, నెలవారీ చిట్టీలు నిర్వహించే వారిపై ఐటీ శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల పేర్లు సేకరించినట్లు సమాచారం. ఆదాయం, ఆస్తుల వివరాలు, ఫైనాన్‌‌సల టర్నోవర్ తదితర వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement