Cancel currency
-
మరికొంతకాలం ఎన్బీఎఫ్సీలపై ‘నోట్ల రద్దు’ ఎఫెక్ట్: మూడీస్
ముంబై: దేశంలో నోట్ల రద్దు ప్రభావం నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై మరికొంత కాలం కొనసాగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ– మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ విశ్లేషకులు అల్కా అంబరసు పేర్కొన్నారు. ముఖ్యంగా వాహన విభాగం, ఆస్తుల తనఖా వంటి విభాగాల్లో వసూళ్లపై మరికొన్ని త్రైమాసికాలు ప్రతికూలత పడుతుందని విశ్లేషించారు. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేశారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా రిటైల్ రుణం విషయంలో తన వాటాను ఎన్బీఎఫ్సీ పెంచుకుంటోందని, ఇదే ధోరణి కొనసాగే వీలుందని నివేదికలో మూడీస్ వివరించింది. -
నోట్ల రద్దుతో పరిశ్రమల పడక
• డిసెంబర్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత • నాలుగు నెలల కనిష్టం ∙మైనస్ 0.4 శాతానికి డౌన్ • కీలక తయారీ, వినియోగ ఉత్పత్తుల తగ్గుదల న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 2016 డిసెంబర్లో 2015 డిసెంబర్‌తో పోల్చిచూస్తే... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా, –0.4 శాతం క్షీణించింది. 2015 డిసెంబర్లో సైతం పారిశ్రామిక ఉత్పత్తి –0.9 శాతం క్షీణతలో (2014 డిసెంబర్‌తో పోల్చితే) ఉంది. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలో సూచీ 3.2 శాతం నుంచి 0.3 శాతానికి పడిపోయింది. తాజా సమీక్షా నెలను చూస్తే... సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం, అలాగే వినియోగ వస్తువుల ఉత్పత్తి భారీగా పడిపోయాయి. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ప్రధానాంశాలు చూస్తే... తయారీ రంగం డిసెంబర్లో – 1.9 క్షీణత మరింత తగ్గి –2.0 శాతానికి చేరింది. వినియోగ వస్తువుల్లో టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషను వంటి దీర్ఘకా వినియోగ వస్తువుల ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 10.3 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీసహా స్వల్పకాలం వినియోగించే వస్తువుల సూచీ సైతం డిసెంబర్లో మైనస్ 5 శాతం క్షీణించింది. ఈ రెండు విభాగాలనూ కలిపి చూస్తే– 3.2 % వృద్ధి (2015 డిసెంబర్లో) తాజాగా –6.8 % క్షీణతకు పడిపోయింది. వచ్చే నెలల్లో పుంజుకుంటుంది: జైట్లీ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ డిసెంబర్ నెల క్షీణతకు కారణం పెద్ద నోట్ల రద్దేనని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. అయితే ఆ తరువాతి నెలల్లో క్రమంగా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒక చానెల్‌కు ఆయన ఈ మేరకు ఒక ఇంటర్వూ్య ఇచ్చారు. ఏ ఆర్థికమంత్రి అయినా ఎప్పుడూ వడ్డీరేట్లు తగ్గాలనే కోరుకుంటారనీ, ఇది వృద్ధికి దారితీస్తుందని భావిస్తారనీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
భారీగా దెబ్బతిన్న కొనుగోళ్ల సెంటిమెంట్..
పెద్ద నోట్ల రద్దు ప్రభావం సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న ఇండియాస్ బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ తొలిసారిగా భారీగా పడిపోయింది. గత ఏడాది జూలై నెలలో 0.43గా ఉన్న బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ ప్రతీ నెలా పెరుగుతూ నవంబర్ నాటికి 0.68 పాయింట్లుకు చేరుకోగా, నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ నాటికి ఈ ఇండెక్స్ 0.26 పాయింట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 3,000 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మూడు నెలలకు ఒకసారి ఈ ఇండెక్స్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ క్రమేపీ పెరుగుతూ వస్తోందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు ప్రకటన చేసిన తర్వాత ఈ సెంటిమెంట్ తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని టీఆర్ఏ రీసెర్చ్ సీఈవో ఎన్.చంద్రమౌళి పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిసారి జీతాలు అందుకున్న డిసెంబర్ నెలలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అన్నిటికంటే అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో కొనుగోళ్ల సెంటిమెంట్ దెబ్బతినగా అత్యల్పంగా హైదరాబాద్‌లో దెబ్బతింది. కానీ వీటికి భిన్నంగా అహ్మదాబాద్‌లో మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్ పెరగడం గమనార్హం. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ నెలలో ఢిల్లీలో బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ 122 శాతం పడిపోయింది. ఆ తర్వాత కోల్‌కతా 90 శాతం, ముంబై 58 శాతం, పూణే 46 శాతం, చెన్నై 35 శాతం, బెంగళూరు 16 శాతం, హైదరాబాద్ 15 శాతం క్షీణించాయి. కానీ ఒక్క అహ్మదాబాద్‌లో మాత్రం ఇండెక్స్ 17 శాతం పెరగడం విశేషం. -
డబ్బుల కోసం తప్పని పాట్లు
► నెల గడుస్తున్నా తీరని ఇబ్బందులు ► గోపాల్రావుపేటలో భారీ క్యూలైన్ రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పేద ప్రజలకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. నోట్లు రద్దు చేసి నెల రోజులు కావస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపించడంలే దు. బ్యాంకుల చుట్టు నిత్యం ఖాతాదారులు తిరిగి ఇబ్బందిపడుతున్నారు. బ్యాంకులకు వెళ్లి రోజంతా క్యూలైన్ కట్టినప్పటికీ చేతికి మాత్రం డబ్బులు అందడంలేదని గోపాల్రావుపేట గ్రామానికి చెందిన లక్ష్మి అవేదన వ్యక్తం చేశా రు. గోపాల్రావుపేట గ్రామంలో ఆంధ్రాబ్యా ంకులో మంగళవారం మహిళలు డబ్బుల కోసం భారీగా తరలివచ్చారు. అధికారులు రూ.నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేలు ఇస్తున్నారని పలువురు ఖాతాదారులు తెలిపారు. రామడుగులోని ఆంధ్రాబ్యాంకు, వెదిర గ్రామం లో సిండికెట్ బ్యాంకు వద్ద డబ్బుల కోసం పెద్దఎత్తున ఖాతాదారులు క్యూకట్టి నిలబడ్డారు. కాగా ప్రభుత్వ నోట్ల రద్దు చేయడంతో తమ డబ్బులు కూడా తాము తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వెదిర గ్రామానికి చెందిన సంపత్ తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ నోట్ల ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు. -
డిజిటల్ ప్రపంచంలో హిట్ కాయిన్!
• నోట్ల రద్దుతో బిట్‌కాయిన్‌పై పెరిగిన ఆసక్తి • నవంబర్‌లో రూ.68,000కు ఎగిసిన బిట్‌కాయిన్ విలువ • దేశంలోని ట్రేడింగ్ ఎక్సే్ఛంజీల్లో పెరిగిన యూజర్ల సంఖ్య • అవకాశాల్ని అందుకోవటానికి బిట్‌కాయిన్ స్టార్టప్‌లు • ప్రపంచవ్యాప్తంగా అధికార నియంత్రణ లేని కరెన్సీ ఇదే • బంగారంకన్నా విలువెక్కువ... బంగారమూ కొనుక్కోవచ్చు • ప్రభుత్వాల జోక్యం లేకపోవటంతో సురక్షిత సాధనంగా గుర్తింపు! • వీటిని స్వీకరించటానికి ఓకే అంటున్న ఆన్లైన్ సంస్థలు, దిగ్గజాలు • ఒక బిట్‌కాయిన్‌ను 10 కోట్ల ‘సతోషి’లుగా విభజించే అవకాశం • ఎప్పటికైనా గరిష్ఠంగా సృష్టించగలిగేది 2.1 కోట్ల బిట్కాయిన్లనే • వాటిని విడగొట్టగలరు తప్ప మరిన్ని సృష్టించటం అసాధ్యం • దాంతో మున్ముందు విలువ మరింత పెరుగుతుందనే భావన • పెరుగుతున్న ఎక్సే్ఛంజీలు; డిజిటల్ బిట్‌కాయన్ వాలెట్లు కరెన్సీల్లో ఖరీదైనదేంటి? రోజూ చూస్తుంటాం కనక ఠక్కున డాలరు గుర్తొస్తుంది. కానీ దాని విలువ మనకు కేవలం 68 రూపాయలు. అదే కువైట్ దినార్ అయితే..? దాదాపు 223 రూపాయలు. ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన కరెన్సీ ఇదే అంటారంతా!!. మరి బిట్‌కాయిన్ సంగతో..? ఒక బిట్‌కాయిన్ దాదాపు రూ.55,700. అంటే... తులం బంగారంకన్నా కూడా ఎక్కువ. దాదాపు రూ.49,000 పలుకుతున్న కిలో వెండికన్నా కూడా ఎక్కువ. అంతెందుకు!! మన షేర్ మార్కెట్లో అత్యధిక ధర పలికే ‘ఎంఆర్ఎఫ్’ షేరుకన్నా కూడా ఎక్కువ. ఇంకా చిత్రమేంటంటే... 2013 ఆరంభంలో దీని ధర దాదాపు రూ.500 దగ్గరుండేది. కానీ మూడేళ్లలో ఏకంగా 110 రెట్లకుపైగా పెరిగిపోయింది. ఎందుకింతలా పెరిగింది? అసలు బిట్‌కాయిన్ అంటే ఏంటి? దీన్నెవరు ముద్రిస్తారు? ఎక్కడ కొనాలి? దీని యజమానులెవరు? దీంతో ఏమేం కొనుక్కోవచ్చు? అసలెక్కడ వాడొచ్చు? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానాలే... ఈ ప్రత్యేక కథనం. బిట్‌కాయిన్ అంటే... డిజిటల్ కరెన్సీ. ఆన్లైన్లో కొని, ఆన్లైన్లో మాత్రమే వాడుకోగలిగే కరెన్సీ. డాలర్, యూరో, మన రూపాయి వంటి కరెన్సీల్లా దీన్నెవరూ ముద్రించరు. ఫెడరల్ బ్యాంకుల మాదిరిగా దీనిపై ఎవరి నియంత్రణా ఉండదు కూడా. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో శక్తిమంతమైన కంప్యూటర్లు, సర్వర్లను ఉపయోగించి దీన్ని సృష్టించే వ్యక్తుల్ని మైనర్స్‌గా పిలుస్తుంటారు. ఈ మైనింగ్ టీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. ఈ నెట్వర్కే బిట్‌కాయిన్ లావాదేవీల్ని పారదర్శక పద్ధతిలో బ్లాక్‌చెయిన్ ద్వారా నమోదు చేస్తుంది. అంటే! బిట్కాయిన్లకు తమ సొంత పేమెంట్ గేట్‌వే ఉందన్నమాట. అదీ కథ. ధరెందుకు పెరుగుతోంది? బిట్కాయిన్లను జపాన్‌కు చెందిన సతోషి నకమొతో 2008లో సృష్టించారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు డిజిటల్ రూపంలో మార్చుకునే కరెన్సీగా... ఏ నియంత్రణా లేని కరెన్సీగా ఇది చలామణిలోకి వచ్చింది. కాకపోతే దీన్ని ఆన్లైన్ సైట్లు, ఇతర వ్యాపారులు తీసుకోవటం 2009 నుంచీ మొదలయింది. దీంతో బిట్కాయిన్ల ధర ఒకదశలో అమాంతం ఎగసింది. మళ్లీ పడింది. దాదాపు అంతర్జాతీయ వ్యాపారులంతా దీన్నిపుడు అంగీకరిస్తుండటంతో ధర బాగా పెరుగుతోంది. బిట్కాయిన్ల ధర బాగా పెరగటానికి మరో కారణం కూడా ఉంది. ఎంత మైనర్లయినా... ఎంత శక్తిమంతమైన కంప్యూటర్లయినా ఈ బిట్కాయిన్లను 2.1 కోట్లకు మించి సృష్టించలేవు. అంటే ఏ దశలోనైనా 2.1 కోట్లకన్నా ఎక్కువ బిట్కాయిన్లుండే చాన్సు లేదన్నమాట. కాకపోతే వీటిని ముక్కలు చెయ్యటం మాత్రం వీలవుతుంది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ను అత్యంత తక్కువ డినామినేషన్లో... 10కోట్లవ వంతుకు విడగొడుతున్నారు. దీన్ని ‘సతోషి’గా పిలుస్తున్నారు. అంటే... 10 కోట్ల సతోషిలు కలిస్తే ఒక బిట్‌కాయిన్ అన్నమాట. దీనర్థం ఒక్కటే... కోట్ల కోట్ల సతోషిలు అందుబాటులోకి రావచ్చు. చిల్లర సమస్య కూడా ఉండదు. కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతుందన్నది కాదనలేని నిజం. బిట్కాయిన్లు ఎందుకు ఆకర్షణీయమంటే.. ⇔ దీన్ని ఒక ప్రభుత్వమో, కేంద్రబ్యాంకో నియంత్రించదు. కాబట్టి తాజా నోట్లరద్దు మాదిరిగా ఒక్క ఆదేశంతో వెనక్కి తీసుకోలేరు. నెట్‌వర్క్‌లో ఉండే కంప్యూటర్లన్నీ కలసి దీన్ని నియంత్రిస్తాయి. అంటే వికేంద్రీకృత కరెన్సీ అన్నమాట. ⇔ బ్యాంకు ఖాతా అక్కర్లేదు. ఆన్లైన్లో బిట్‌కాయిన్ అడ్రస్ ఏర్పాటు చాలా తేలిక. మీ పేరు, ఇతర వివరాలు చెప్పకుండా ఆ అడ్రస్‌లో బిట్కాయిన్లు దాచుకోవచ్చు. లావాదేవీలన్నీ పారదర్శకం కనక... అన్నీ బ్లాక్‌చెయిన్‌లో నమోదవుతాయి. ఏ అడ్రస్ ఎవరిదనేది తెలియకపోయినా... దేన్లో ఎన్ని కాయిన్లున్నాయో ఈజీగా తెలుస్తుంది. డబ్బుకు లెక్కుంటుంది. ⇔ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా అతివేగంగా లావాదేవీలు జరిగిపోతాయి. లావాదేవీల ఖర్చు అత్యల్పం. ⇔ క్రెడిట్, డెబిట్ కార్డులకొచ్చేసరికి సమాచారమంతా ఆన్లైన్లో ఇస్తాం కనక మోసాలకు కొదవలేదు. బిట్కాయిన్లలో అది దాదాపు అసాధ్యం. ప్రతి వ్యక్తికీ ప్రయివేటు, పబ్లిక్ కీ రెండుం టాయి. పబ్లిక్ కీ అంటే అడ్రస్. అది అందరికీ తెలిసేదే. ప్రయివేటు కీ మాత్రం తనకే తెలుస్తుంది. ఆ రెంటినీ కలిపి లావాదేవీ జరిపితే... క్లిష్టమైన గణితంతో కలసి సర్టిఫికెట్ పుడుతుంది. అప్పుడు సదరు లావాదేవీ అధికారికమవుతుంది. ⇔ బ్యాంకులు మీ ఖాతా కావాలనుకుంటే స్తంభింపజేయగలవు. బిట్‌కాయిన్ వ్యవస్థలో అలా జరిగే అస్కారం లేదు. ఒక అడ్రస్‌లో ఎన్ని కాయిన్లున్నాయో అందరికీ తెలుస్తుంది. ఆ అడ్రస్ ఎవరిదనేది తెలియదు. పైపెచ్చు మీరు బిట్కాయిన్లతో ఏది కొన్నా రహస్యంగానే ఉంటుంది. మరి ఈ కాయిన్లు కొనేదెలా? బిట్కాయిన్లను వ్యక్తుల నుంచిగానీ, ఎక్సే్ఛంజీల నుంచిగానీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే వీటిని కొనే ముందు వాలెట్ కొనుక్కోవాలి. వాలెట్లను మీ కంప్యూటర్లో, ఆన్లైన్లో, లేదా హార్డ్ వేర్ రూపంలో అందించే వాల్ట్ రూపంలో ఉంచుకోవచ్చు. తరువాత కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు చాలా సంస్థలు, ఎక్సే్ఛంజీ లున్నా... బిట్‌స్టాంప్, క్రాకెన్ (అమెరికా), బిట్‌ఫినెక్స్ (హాంకాంగ్), ఓకే కాయిన్, బీటీసీసీ (చైనా), బీటీసీఎక్స్, కాయిన్ సెక్యూర్ (ఇం డియా) వంటివి ఆయా దేశాల్లో ప్రధానమైనవి. కాకపోతే ప్రతి ఎక్సే్ఛంజీ ఇపుడు ఆయా దేశాల్లోని నిబంధనల మేరకు వ్యక్తుల పాన్ వంటి వివరాలడుగుతోంది. ఇక కాయిన్‌బేస్, సర్కిల్ వంటి వాలెట్ సంస్థలు కూడా వాలెట్ సేవలతో పాటు ఎక్సే్ఛంజీల మాదిరి కొనుగోలు, అమ్మకం సేవలందిస్తున్నాయి. చాలా దేశాల్లో వీటిని క్రెడిట్, డెబిట్ కార్డులు... మనీ ఆర్డర్లు ఉపయోగించి కొనుగోలు చేసే వీలుంది. విశేషమేంటంటే మీ వాలెట్ డిజిటల్ రూపంలోనే ఉంటుంది కనక ఎప్పటికప్పుడు మారే బిట్‌కాయిన్ విలువ మీ వాలెట్లోనూ కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మీ బిట్కాయిన్ల విలువ కూడా మారుతుంది. మైనింగ్ జరిగేది ఎలా? బిట్కాయిన్లను ఒకరికొకరు పంపించుకోవచ్చు. మరి ఎవరో ఒకరు రికార్డులు నిర్వహించాలి కదా? నిర్ణీత సమయానికి జరిగిన రికార్డులన్నిటినీ తమ కంప్యూటర్ల సాయంతో ఎవరో ఒకరు నిర్వహిస్తారు. దాన్ని బ్లాక్‌గా వ్యవహరిస్తారు. సదరు బ్లాక్‌లతో బ్లాక్ చెయిన్ ఏర్పడుతుంది. అది ఆ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవతుంది. కానీ కొత్త లావాదేవీలు నమోదయ్యే కొద్దీ ఇది మరింత పెరుగుతుంది. దాన్నంతటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో యాష్లు, ఇతర సాంకేతిక పదాలుపయోగించి సురక్షితం చేస్తారు. ఇలా బ్లాక్‌చెయిన్ అప్డేట్ చేసిన మైనర్లకు నజరానాగా 25 బిట్ కాయిన్లు దక్కుతాయి. అది అందరికీ తెలుస్తుంది కూడా. కాకపోతే లావాదేవీలు పెరిగేకొద్దీ... ఇది మరింత సంక్లిష్టంగా మారుతుంటుంది. ఇక బిట్‌కాయిన్ మైనింగ్‌కు ఉపయోగించే హార్డ్‌వేర్ కూడా తేలికదేమీ కాదు. సెకనుకు ఎన్ని ఎక్కువ హ్యాష్‌లు జనరేట్ చేసే ప్రాసెసర్ అయితే కాయిన్లు పొందేందుకు అన్ని అవకాశాలుంటాయన్న మాట. మామూలు సిస్టమ్‌లు సెకనుకు 10మెగా హ్యాష్‌లు జనరేట్ చేసేవైతే... మైనర్లు వాడేవి సెకనుకు 1టెరా హ్యాష్‌లు జనరేట్ చేసే శక్తి కలిగి ఉంటాయి. ఇక వీటికయ్యే విద్యుత్ ఖర్చులూ ఎక్కువే. ఇవి కాక ఇంకొన్ని పరికరాలూ ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్ మైనింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించటం ద్వారా మైనర్ల టీమ్‌లో చేరొచ్చు. రోజుల వ్యవధిలో భారీ రాబడులు.. బిట్కాయిన్లలో పెట్టుబడులపై అవగాహన ఉన్న కొందరు ఇన్వెస్టర్లు డీమోనిటైజేషన్ తరుణంలో బాగానే లాభపడ్డారు. కొన్నాళ్ల క్రితం రూ.49,000–51,000 స్థాయిలో కొనుగోలు చేసిన వారు నవంబర్‌లో రూ.68,000–69,000 స్థాయిలో విక్రయించి లబ్ధి పొందారు. సాధారణంగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో ఏళ్ల తరబడి చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై చక్రగతిన 25–30 శాతం మేర రాబడులు వస్తుండగా.. కేవలం నెలరోజుల వ్యవధిలోనే బిట్కాయిన్లు 25 శాతం పైగా రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇది రూ.55,700 స్థాయిలో కదులుతోంది. ఈ పరిణామాలతో కొత్త ఇన్వెస్టర్లు కూడా వీటి వైపు చూస్తున్నారు. బిట్‌కాయిన్ స్టార్టప్‌లకు పండుగ!! పెద్ద నోట్ల రద్దుతో అంతా ప్రత్యామ్నాయా మార్గాలవైపు చూస్తున్న నేపథ్యంలో బిట్‌కాయిన్ స్టార్టప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. ఈ మధ్య దేశంలో జేబ్‌పే, ఉనోకాయిన్, కాయిన్‌సెక్యూర్ వంటి బిట్‌కాయిన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘జేబ్‌పే’లో నవంబర్‌లో ట్రేడింగ్ పరిమాణం ఏకంగా రూ.120 కోట్ల స్థాయిని తాకింది. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. ఆదాయం కూడా 25 శాతం పెరిగినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొందరు ఇన్వెస్టర్ల నుంచి వ్యక్తిగత పెట్టుబడులు జేబ్‌పే సమీకరించింది. సాధారణంగా ప్రతి నెలా సుమారు 20,000 కొత్త యూజర్లు జేబ్పేలో చేరుతుండగా.. నవంబర్‌లో ఈ సంఖ్య ఏకంగా 50,000కు పెరిగింది. మొత్తం మీద జేబ్పేలో ప్రస్తుతం 2,50,000 మంది పైచిలుకు యూజర్లున్నారు. మరోవైపు, ఉనోకాయిన్ యూజర్ల సంఖ్య గత నెలలో మూడు రెట్లు పెరిగి 1,20,000కి చేరింది. ట్రేడింగ్ పరిమాణం రెట్టింపై రోజుకు 300 బిట్కాయిన్ల స్థాయికి చేరింది. ఇక, కాయిన్‌సెక్యూర్ కొత్త యూజర్ల సంఖ్య 300 శాతం పెరిగి 90,000కు చేరింది. దేశీయంగా బిట్‌కాయిన్ స్టార్టప్‌లు..: దేశీయంగా సుమారు 20 బిట్‌కాయిన్ స్టార్టప్‌లున్నాయి. వీటిలో మూడు మాత్రమే ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించగలిగాయి. ఇందులో జేబ్‌పే (1 మిలియన్ డాలర్లు), ఉనోకాయిన్ (1.5 మిలియన్ డాలర్లు), కాయిన్‌సెక్యూర్ (1.5 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఉనోకాయిన్ ఇటీవలే బ్లూమ్ వెంచర్స్, అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ డిజిటల్ కరెన్సీ గ్రూప్ నుంచి నిధులు సమీకరించింది. బిట్ కాయిన్లను దేనికి వాడొచ్చు? ఇప్పుడు కాయిన్‌బేస్ వంటి వాలెట్లు తమ వాలెట్లోని బిట్కాయిన్లతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. బంగారం బిస్కెట్లను ఆర్డర్ చేస్తే డెలివరీ చేస్తున్నాయి కూడా. ఇక డెల్ వంటి సంస్థలతో పాటు విదేశాల్లోని పలు ఎయిర్‌లైన్ సంస్థలు కూడా బిట్కాయిన్లను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. అమెజాన్ వంటి సైట్లలో షాపింగ్‌కు వినియోగించే గిఫ్ట్ కార్డులనూ వీటితో కొనొచ్చు. ఇపుడిప్పుడే చాలా ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు వీటిని అంగీకరిస్తున్నాయి. కాకపోతే ప్రతి లావాదేవీనీ మైనర్లు ధ్రువీకరిస్తుంటారు. తరువాత బ్లాక్‌చెయిన్ ఏర్పడుతుంది. దీనికి 10 నిమిషాల వరకూ సమయం పట్టొచ్చు. ఒక బిట్‌కాయిన్‌ను 10కోట్ల సతోషిలుగా విడగొట్టే అవకాశముంది కనక ఏ ధరతోనైనా లావాదేవీ చేసుకోవచ్చు. ఇక ఇండియా విషయానికొస్తే పెద్ద ఈ కామర్స్ సంస్థలు.. బిట్కాయిన్ల రూపంలో చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. ఫ్లయింగ్ స్పాగెట్టీ మాన్స్టర్ వంటి రెస్టారెంట్లు కూడా వీటిని అనుమతించాలని భావిస్తున్నాయి. సప్న బుక్‌హౌస్, వైకే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫ్లైట్షాప్ వంటి వ్యాపార సంస్థలు ఉనోకాయిన్ ఎక్సే్చంజీ ద్వారా బిట్కాయిన్ల చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. బిట్‌కాయిన్‌ను కూడా ఒకరకంగా పసిడి లాంటి పెట్టుబడి సాధనంగా చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తుండటం గమనార్హం. -
రాహుల్ మాట్లాడుతున్నాడు!
అందుకు చాలా సంతోషంగా ఉంది! ► రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ ఎద్దేవా ► నోట్ల రద్దును విమర్శించడం ఉగ్రవాదుల చొరబాట్లకు పాక్ సాయమందించడంతో సమానం! ► పేదరికాన్ని వారసత్వంగా ఇచ్చారంటూ మన్మోహన్ సింగ్‌పై ధ్వజం వారణాసి: సహారా, బిర్లా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ప్రధాని మోదీ వ్యంగ్యంగా స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీలోని ఆ యువ నాయకుడు ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాడని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉంద’ని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్నట్లే.. విపక్షాలు అవినీతి పరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు పాక్ సహకరించడంతో సమానమన్నారు. నోట్లరద్దు వల్ల నల్లధనంతో పాటు నల్ల మనసున్నవాళ్లూ బయటపడ్డారన్నారు. నవంబర్ 8 ప్రకటన తర్వాత తొలిసారిగా సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ.. బనారస్ హిందూ వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘నోట్లరద్దు అమలు, తదనంతర పరిణామాలపై సరైన చర్యలు తీసుకోలేదని చాలామంది విమర్శిస్తున్నారు. అన్ని సమస్యలు ముందుగానే ఊహించాను కానీ.. రాజకీయ పార్టీల నాయకులు నిస్గిగ్గుగా అవినీతిపరులకు అండగా నిలుస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. తప్పులను బయటపెట్టుకుంటున్నారు పేదరికం, నిరక్షరాస్యత, సరైన విద్యుత్ సదుపాయాలు లేకుండా నగదురహిత ఆర్థిక వ్యవస్థ నిష్ఫలమంటూ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్, పి.చిదంబరంలు వ్యాఖ్యానించటంపైనా ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇన్నాళ్లూ వీరు దేశానికి ఏం చేశారో (కనీస అవసరాలు కల్పించటంలో విఫలమయ్యారు) బయటపెట్టుకుంటున్నారన్నారు. ‘వ్యక్తిగతంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ ఇమేజ్ ఉన్నా.. భారీ కుంభకోణాలు బయటపడింది ఆయన హయాంలోనే. రెండుసార్లు ప్రధానిగా, ఓసారి ఆర్థికమంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. 1970 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పదవుల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేదరికం గురించి మాట్లాడటం హాస్యాస్పదం’అని మోదీ అన్నారు. సరైన విద్యుత్ వసతుల్లేని దేశంలో నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమన్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి.. పదేళ్లలో దేశంలో కనీసం విద్యుత్ లైన్లు వేయాలని గుర్తులేదా అని ప్రశ్నించారు. అంతకుముందు, వారణాసిలో మదన్ మోహన్ మాలవీయ కేన్సర్ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బెనారస్ హిందూవర్సిటీలో జరుగుతున్న ‘రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం’ను ప్రధాని ప్రశంసించారు. చాణక్య నాటకాన్ని వేసేందుకు వచ్చిన విద్యార్థులతో మోదీ సంభాషించారు. ‘ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి. పోయాయి. కానీ చాణక్యుడు, అతని ఆలోచన ఎప్పటికీ నిలిచి ఉంటాయి’ అని మోదీ అన్నారు. అనంతరం యూపీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, ప్రధాని కాన్వాయ్ పైకి ఓ యువకుడు కరపత్రం విసిరిన ఘటనతో వారణాసిలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ‘మోదీ మీ వారణాసి పర్యటనను వ్యతిరేకిస్తున్నాం’ అని కరపత్రంలో ఉంది. అయితే పోలీసులు తేరుకునేలోపే ఆ యువకుడు తప్పించుకున్నాడు. నిరాశతోనే మోదీ వ్యాఖ్య: మాయావతి విపక్షాలను పాకిస్తాన్ తో పోల్చటం ద్వారా ప్రధాని తన నిరాశ, నిసృ్పహలను బయట పెట్టుకున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. నోట్లరద్దు కారణంగా ప్రజల ఇబ్బందులపై ప్రశ్నిస్తే.. ప్రధాని ఇలా విమర్శించటం ఆక్షేపణీయమన్నారు. ఆయన మాట్లాడకుంటేనే భూకంపం ‘వాళ్ల పార్టీలో ఓ యువనాయకుడున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసంగాలివ్వటం నేర్చుకుంటున్నాడు. ఈయన మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచీ నా ఆనందానికి అవధుల్లేవు. ఈమధ్య ఆయన తను మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు. కానీ ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వస్తుంది. ఆయన మాట్లాడారు కదా.. ఇప్పుడా ప్రకృతి విపత్తు వచ్చే అవకాశం లేదని మేం భరోసా ఇవ్వగలం’ అని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ వ్యగ్యంగా విమర్శించారు. దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నందున ఆన్ లైన్ లావాదేవీలు అసాధ్యమంటూ రాహుల్ చేసిన ప్రకటన పైనా ప్రధాని స్పందించారు. ‘చదవటం, రాయటం తెలిసిన వారందరినీ నిరక్షరాస్యులుగా మార్చేందుకు నేను చేతబడి చేయిస్తానని కూడా రాహుల్ అంటారనుకుంటా’ అని ఎద్దేవా చేశారు. ‘మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకోవటం కూడా రాని వ్యక్తి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని దశాబ్దాలుగా చేసిన దాన్ని ఎలా అర్థం చేసుకోగలరు’ అని మోదీ విమర్శించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కొన్నిరోజులు ఓపిగ్గా ఉండాలని మోదీ కోరారు. -
'నోట్ల’ వ్యవహారంలో కేంద్రం విఫలం
• మండలిలో చర్చ సందర్భంగా విపక్ష నేత షబ్బీర్ అలీ • అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ • ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే విమర్శించడంలో తప్పేముందన్న షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని అరికట్టడం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, నకిలీ నోట్ల చెల్లుబాటును అడ్డుకోవడమే లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణ యం తీసుకున్న కేంద్ర ప్రభు త్వం.. ఆ మూడు అంశాల్లోనూ పూర్తిగా విఫలమైందని శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపిం చారు. నోట్ల రద్దు అంశంపై శనివారం జరిగిన చర్చ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. జనం రోజువారీ పనులు మానుకుని కొత్త నోట్ల కోసం బ్యాం కులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. రోజుకో రకమైన ప్రక టనలతో కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు ప్రశాంతంగా ఉన్న ప్రజ లను భయకంపితులను చేస్తు న్నారని ఆరోపించారు. ప్రధాని తాను అనుకున్నది సాధించ డంలో విఫలమయ్యారని అన డంతో అక్కడే ఉన్న సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాలను తాము విమర్శించలేమని చెబుతూ వైఫల్యం అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని మండలి చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. షబ్బీర్ అలీ తిరిగి మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర నిర్ణయాలను విమర్శిం చడంలో తప్పేముందని ప్రశ్నించారు. గతంలో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ, మండలి తీర్మానాలు చేయలేదా అని గుర్తు చేశారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆదాయం పడిపోయినందున, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గతేంటని ప్రశ్నించారు. ప్రధానిని కలసిన సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి హామీలిచ్చారో తెలిపాలని సీఎంను కోరారు. రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాకు 5,259 బ్యాంకులు ఏవిధంగా సేవలు అందించగలుగుతాయని ప్రశ్నించారు. 8 వేల ఏటీఎంలలో 80 శాతం పనిచేయడం లేదన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ అల్తాఫ్ రజ్వీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయం చిన్న వ్యాపారులను, మధ్య తరగతి వర్గాలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ.. కళ్లెదుట కనబడుతున్న కష్టాలను కాదనలేమని, ప్రధాని తీసుకున్న గొప్ప నిర్ణయంతో దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. -
ఎప్పటికో లాభమైనా... ఇప్పటికి నష్టమే!
• పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై ఎస్అండ్పీ విశ్లేషణ • అసంఘటిత, గ్రామీణ, నగదు ఆధారిత విభాగాలకు నష్టం • సావరిన్ రేటింగ్ మాత్రం తగ్గకపోవచ్చు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతోపాటు, 2017 సెప్టెంబర్ నుంచీ అమల్లోకి వస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)– తక్షణం అసంఘటిత, గ్రామీణ, అలాగే ఆభరణాలు, రియల్టీ వంటి నగదు ఆధారిత విభాగాలపై ‘తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని’’ చూపించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో విస్తృత ప్రాతిపదికన డిమాండ్ తగ్గడం.... ఈ ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో అమలయ్యే జీఎస్టీ వల్ల పన్నుల భారం పెరిగి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించవచ్చని తాజా నివేదికలో అది విశ్లేషించింది. ‘‘భారత్‌లో పెద్ద నోట్ల రద్దు– జీఎస్టీ: స్వల్పకాలిక కష్టం– దీర్ఘకాలిక లాభం’’ అన్న పేరుతో ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ విశ్లేషకుడు అభిశేక్ దాంగ్రా ఒక వ్యాసం రాశారు. దాన్లో పేర్కొన్న వివరాలను చూస్తే... ⇔ పెద్ద నోట్ల ప్రభావంతో రుణ మంజూరీలకు సంబంధించి అటు కార్పొరేట్లు, ఇటు బ్యాంకులు స్వల్పకాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఇది జీడీపీ వృద్ధితీరు తగ్గుదలకూ దారితీయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును సంస్థ 7 శాతం నుంచి ఇప్పటికే 6.9 శాతానికి తగ్గించింది. ⇔ భారత ప్రభుత్వ సంస్కరణలు దీర్ఘకాలికంగా వ్యవస్థాగత ప్రయోజనాలను అందించేవే. అయితే స్వల్పకాలికంగా నిర్వహణ, సర్దుబాట్ల ఇబ్బందులు ఉంటాయి. ⇔ 2017 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం పడిపోతుందని మేము భావిస్తున్నాం. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో తిరిగి వృద్ధి ఊపందుకునే వీలుంది. దీర్ఘకాలికంగా చూస్తే...వృద్ధి తిరిగి 8 శాతం జోన్లోకి ప్రవేశించే అవకాశమూ ఉంది. నోట్ల రద్దు సమస్య స్వల్పకాలమే: నొమురా భారత్‌లో నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అంచనా వేసింది. దీర్ఢకాలంలో భారత్ వృద్ధి తీరుకు భరోసాను ఇచ్చింది. వచ్చే 12 నెలల కాలం చూస్తే... వృద్ధి విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదని పేర్కొంది. 2016, 17లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని, 2018లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వివరించింది. -
గ్రోఫర్స్‌తో యస్ బ్యాంక్ జట్టు
ఇంటి ముంగిట్లోకే రూ.2,000 నగదు న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో కస్టమర్లకు ఇంటి ముంగిట్లోకి నగదును తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా ఈ–గ్రోసరీ సంస్థ ‘గ్రోఫర్స్’తో జతకట్టింది. ఆన్లైన్లో గ్రోఫర్స్ ద్వారా కిరాణా సరుకులు ఆర్డర్ ఇచ్చిన వారు వాటి డెలివరీతోపాటు రూ.2,000 వరకు నగదును పొందొచ్చని బ్యాంక్ పేర్కొంది. ఏ బ్యాంక్ ఖాతాదారుడైనా ఈ సేవలు పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు ముంబై, గుర్గావ్, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని వివరించింది. క్యాష్ పొందాలని భావించే వారు గ్రోఫర్స్లో కనీసం రూ.2,000తో కిరాణా సరుకులు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. సరుకులు ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఒక ప్రత్యేకమైన కోడ్ ద్వారా నగదు కావాలని విజ్ఞప్తి చేయాలని తెలిపింది. అప్పుడు సరుకులు తీసుకొని వచ్చే యస్ బ్యాంక్ పీఓఎస్ మెషీన్లను కలిగిన గ్రోఫర్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్ల డెబిట్ కార్డులను స్వైప్ చేసి వారికి నగదును అందజేస్తారని వివరించింది. -
పన్ను రేట్లు దిగివస్తాయ్!
• ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సంకేతాలు • పెద్ద నోట్ల రద్దుతో పన్నుల ఆదాయం పెరుగుతుంది • లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను వసూలు చేస్తామని వెల్లడి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని త్వరలో పన్ను రేట్లు దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సంకేతాలు ఇచ్చారు. డీమోనిటైజేషన్ కారణంగా లెక్కల్లో చూపని సంపద నుంచి అధిక మొత్తంలో పన్ను ఆదాయం వ్యవస్థలోకి వస్తే భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష రేట్లు తక్కువ స్థాయికి దిగివస్తాయన్నారు. అనైతిక చర్యలకు పాల్పడేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమంగా భారీ మొత్తాల్లో నగదు సమకూర్చుకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, నిఘా సంస్థలు వారిపై కన్నేసి ఉంచాయన్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో కొందరు భారీ మొత్తాల్లో పాత నోట్లను కొత్త నోట్లతో మార్చుకుంటున్న నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు. ఈ విధమైన చర్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఆర్థిక రంగానికి నష్టం చేకూరుస్తాయన్నారు. డిజిటల్ యుగంలోకి...: ‘‘వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు చాలా వరకు నేడు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది. ఈ డిపాజిట్లు అన్నింటినీ లెక్కించాల్సి ఉంది. పన్నులు చెల్లించని నగదు ఉంటే వాటిపై పన్ను వసూలు చేస్తాం’’ అని జైట్లీ వివరించారు. భవిష్యత్తు లావాదేవీలన్నీ డిజిటల్ ఆధారితమేనని, నగదు రహిత సమాజం దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. ‘‘ఒక్కసారి ఈ మొత్తం డిజిటల్‌గా మారితే పన్ను వలలో చిక్కుకున్నట్టే. ఫలితంగా ఇప్పటి కంటే భవిష్యత్తులో పన్ను ఆదాయం మరింత పెరుగుతుంది. దీంతో పన్ను రేట్లను మరింత సహేతుక స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది. ఇది ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లకూ వర్తిస్తుంది’’అని జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు తోడు జీఎస్టీ అమలు వంటి సంస్కరణలు, నగదు వినియోగంపై పాన్ నంబర్ చూపాలనే ఆంక్షలతో అవినీతి తగ్గుముఖం పడుతుందన్నారు. నగదు వినియోగం తగ్గిస్తే, పన్ను ఎగవేతలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పారు. -
ఆవేదన.. ఆక్రోశం
రోజురోజుకూ ఎక్కువవుతున్న కరెన్సీ కష్టాలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ నిట్టూర్పు నగదు లభ్యత అంతంత మాత్రమే ‘అయ్యా..కాటికి కాళ్లు చాపుకున్న దాన్ని. అసలే నడవలేను. పింఛన్ డబ్బు కోసం రోజూ తిరుగుతున్నా. ఈరోజు పక్కింటి వారు రిక్షాలో ఇక్కడికి తీసుకొచ్చారు. మాలాంటి ముసలోళ్లకా ఈ కష్టాలు?! ఇన్ని అవస్థలు పడేదాని కంటే చావడమే మేలు..’- అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన లక్ష్మక్క ఆవేదన ఇది. ప్రజల కరెన్సీ కష్టాలకు ఆమె ఆవేదన అద్దం పడుతోంది. ఇలా ఎందరో వృద్ధులు, వికలాంగులు, రైతులు, సామాన్యులు నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. చేతిలో డబ్బులేక, బ్యాంకుల్లోనూ దొరక్క అవస్థ పడుతున్నారు. ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రమూ తగ్గడం లేదు. మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు మంగళవారం తెరుచుకోవడంతో జిల్లా వ్యాప్తంగా జనం పోటెత్తారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల వద్ద కూడా బారులు తీరారు. మరోవైపు ఏటీఎంల చుట్టూ జనం ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. తెరిచివున్న వాటి వద్ద చాంతాడంత క్యూలు కన్పించాయి. బ్యాంకుల్లో నగదు లభ్యత అంతంతమాత్రంగానే ఉంది. దీంతో కొన్ని బ్యాంకుల్లో రూ.3 వేలతోనే సరిపెట్టారు. జిల్లావ్యాప్తంగా 500లకు పైగా ఏటీఎంలు ఉంటే మంగళవారం 15లోపే పనిచేశాయి. అనంతపురం నగరంలోని సాయినగర్ రెండో క్రాస్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం ఒక్కటే పనిచేసింది. ఇక్కడే ఉన్న బ్యాంక్ వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచే ఖాతాదారులు భారీసంఖ్యలో బారులుతీరారు. జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కన్పించింది. బ్యాంకులకు ఈ నెల 11న రూ.90 కోట్లు వచ్చింది. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నామని బ్యాంకర్లు తెలిపారు. వేతనాల సమయం కాబట్టి కనీసం రూ.200 కోట్లు వస్తేనే కొంత మేర ఉద్యోగులకు సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుందని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి చెప్పారు. నగదు వస్తుందని చెబుతున్నారే తప్ప ఎంత మొత్తం, ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేదని బ్యాంకర్లు అంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది – రాజ్యలక్ష్మి, గృహిణి, ద్వారకా విలాస్, అనంతపురం డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజూ నేను, మా ఆయన వచ్చి బ్యాంక్ వద్ద గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది. ఇంటి ఖర్చులకు కూడా కష్టంగా ఉంది. ఏటీఎంలో వచ్చే రూ.2 వేలు చాలడం లేదు. బ్యాంక్‌లోనూ, ఏటీఎంలోనూ విత్‌డ్రా మొత్తం పెంచాలి. నాలుగు రోజులుగా తిరుగుతున్నా : రసూల్‌బీ, విజయనగర్ కాలనీ, అనంతపురం వితంతు పింఛన్ డబ్బు కోసం వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా. మూడు రోజులుగా సెలవు ఉండడంతో ఈ రోజు ఉదయం ఆరు గంటలకే బ్యాంక్ వద్దకు వచ్చి కూర్చున్నా. టోకెన్ ఇచ్చి వెళ్లారు. వాళ్లు ఎప్పుడు పిలిచి డబ్బు ఇస్తారోనని ఎదురు చూస్తున్నా. మాలాంటి పేదలను కష్టపెట్టినోళ్లు ఎవరూ బాగుపడరు. -
బంగారం వర్తకుల ఖాతాలు ఫ్రీజ్!
• పలువురి ఖాతాల్ని నిలిపేసిన యాక్సిస్ బ్యాంకు • నోట్ల రద్దు తరవాత భారీ విక్రయాలే కారణం ముంబై: నోట్ల రద్దు అనంతరం బంగారం కొనుగోళ్లకు సహకరించిన పలువురు బులియన్ వర్తకులు, డీలర్ల ఖాతాలను యాక్సిస్ బ్యాంకు స్తంభింపజేసింది. ఇలాంటి వర్తకులకు సహకరించారన్న ఆరోపణలపై ఒక బ్రాంచిలో ఇద్దరు యాక్సిస్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికే అరెస్టయిన విషయం తెలిసిందే. ‘‘పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్నిచోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, విచారణ నేపథ్యంలో కొన్ని కరెంటు ఖాతాల్లో లావాదేవీల్ని తాత్కాలికంగా నిలుపుచేస్తున్నాం’’ అని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే 10 నెలల కనిష్ట స్థాయిలో ఉన్న పసిడి ధరపై ఈ చర్య ప్రభావం చూపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి పెద్ద నోట్లను రద్దుచేశాక కొందరు నల్లకుబేరులు తమ దగ్గరున్న సొమ్మును తెలుపు చేసుకోవటానికి 50 శాతం ఎక్కువ ధర పెట్టి కూడా భారీగా పసిడి కొన్నారు. ఇందుకు సహకరించారని ఇద్దరు యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులను గతవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పలు బులియన్ డీలర్లు, ఆభరణాల వర్తకుల అకౌంట్లను నిలుపుచేసినట్లు బ్యాంకు ప్రకటించింది. ‘‘తగిన విచారణ అనంతరం తప్పు లేదని తేలితే వారి ఖాతాల్ని పునరుద్ధరిస్తాం’’ అని బ్యాంకు తెలియజేసింది. కాగా బ్యాంకు ఎలాంటి కారణం చెప్పకుండానే తమ ఖాతా నిలిపేసినట్లు పేరు వెల్లడికావటానికి ఇష్టపడని చెన్నై బంగారం డీలర్ ఒకరు తెలిపారు. 33 శాతం కొనుగోళ్లు అడ్డగోలే! దేశంలో ఏటా దాదాపు 800 టన్నుల పసిడికి డిమాండ్ ఉంది. దీన్లో మూడో వంతు కొనుగోళ్లు ‘‘బ్లాక్ మనీ’’తోనే అనే వాదన ఉంది. నవంబర్‌లో పసిడి దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయిలో దాదాపు 100 టన్నులు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన నోట్ల పంపిణీ అవకతవకలపై యాక్సిస్ గత వారం 19 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది. బ్యాంక్ లైసెన్స్ రద్దు... వదంతే: ఆర్బీఐ నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని బ్రాంచీల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి యాక్సిస్ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తున్నట్లు వదంతులొస్తున్నాయని, వాటిలో నిజం లేదని ఆర్బీఐ తెలియజేసింది. ఇదే విషయాన్ని బీఎస్ఈకి యాక్సిస్ బ్యాంకు తెలిపింది. ‘‘బ్యాంక్ లైసెన్స్ రద్దు వార్తలను పూర్తిగా తోసిపుచ్చుతున్నాం. ఆర్బీఐ నిర్దేశిస్తున్న విధంగా పటిష్ట యంత్రాంగం, నిర్వహణ వ్యవస్థలకు లోబడి బ్యాంకు పనిచేస్తోంది’’ అని యాక్సిస్ పేర్కొంది. తాజా పరిణామాలతో యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 2.5 శాతం తగ్గి, రూ.445 వద్ద ముగిసింది. -
రాజధానిలో ఎస్కార్ట్ హుండీ!
• నోట్ల రద్దు నేపథ్యంలో హైదరాబాద్‌లో కొత్త దందా • నగరం నుంచి ఉత్తరాదికి భారీగా వెళ్తున్న పాతనోట్లు • రూ.లక్షకు రూ.5 వేల కమీషన్ ఇస్తున్న బడాబాబులు • మూలాల కోసం ఆరా తీస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో జరిగే అక్రమ ద్రవ్య మార్పిడి వ్యవహారంలో కొత్త దందా మొదలైంది. ఎస్కార్ట్ హుండీగా పిలిచే ఈ పంథాలో భారీగా పాత కరెన్సీ ఉత్తరాదికి తరలివెళ్తోంది. ప్రతి రూ.లక్షకు రూ.ఐదు వేల కమీషన్ ఇస్తున్న బడాబాబులు తాము ఖరీదు చేసిన సెకండ్ హ్యాండ్ కార్లలోనే నగదును పంపించేస్తున్నారు.ప్రాథమిక సమా చారం అందు కున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ‘సంప్రదాయానికి’ బ్రేక్‌పడటంతో..: రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దే«శంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అంటారు. నగరంలో ఈ రెండు వ్యాపారాలు జోరుగా సాగేవి. ఒకే ముఠాకు చెందిన ఏజెంట్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఈ దందా నిర్వహిస్తుంటారు. వ్యాపారులు ఓ ప్రాంతంలోని ఏజెంట్‌కు నగదు అప్పగిస్తే.. అతడు కమీషన్ తీసుకుని నిమిషాల్లో మరో ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా దాన్ని అవసరమైన చోట డెలివరీ చేయిస్తాడు. ఈ వ్యవçహారాలు సాగడానికి రెండు చోట్లా లిక్విడ్ క్యాష్ ఉండటం తప్పనిసరి. నోట్ల రద్దుతో ఈ సంప్రదాయ దందాకు బ్రేక్ పడింది. ఇక్కడ అవకాశం లేక...: నగరంలోని ప్రధాన వాణిజ్య, వ్యాపార ప్రాంతంల్లో జరిగే వ్యాపారంలో 80 శాతం జీరో దందానే.పన్నుల ఎగవేతకు ఏ దశలోనూ బిల్లులు, లెక్కలు లేకుండా రూ.కోట్లలో వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరంతా హుండీని ఆశ్రయిస్తుంటారు. ఏ రోజు ఈ దందా జరగకపోయినా నగరంలోని వ్యాపారుల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో అనేక మంది బడా బాబుల వద్ద భారీగా కరెన్సీ నోట్లు నిల్వ ఉన్నాయి. గత నెల 8న వెలువడిన నోట్ల రద్దు ప్రకటన, మార్పిడికి ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉండటం వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఉత్తరాదిలో ఉన్న ముఠాలతో మిలాఖత్ అయి ప్రారంభించిన దందానే ఎస్కార్ట్ హుండీ. కార్లలో రూ.కోట్లు దాచిపెట్టి..: ఈ దందాలో సిటీ నుంచి పాత నోట్లు ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎస్కార్ట్ హుండీ విధానంలో ఉత్తరాదిలో ఉన్న ఏజెంట్ల వివరాలు నగదును పంపే వ్యాపారులకే తెలుస్తుంది. వీరు ఓ కారు/తేలికపాటి వాహనంలో పాత నోట్లును నేర్పుగా పేరు స్తారు. నమ్మకమైన వ్యక్తికి అప్పగించి చేర్చాల్సిన ప్రాంతాన్ని చెప్తుంటారు. అతడు ఆ కారును తీసుకెళ్లి నిర్దేశిత ప్రాంతంలో పార్క్ చేసి, వివరాలను హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారికి చెప్తాడు. అతను రిసీవ్ చేసుకునే వ్యక్తికి సమాచారం ఇస్తాడు. ఆధారాలు దొరక్కుండా..: అక్కడి వ్యక్తులు నగదు ఉన్న కార్లను తీసుకువెళ్లి.. అందులోని నగదును ఖాళీ చేసి ఆ తర్వాత కారుతో వెళ్లిన వ్యక్తికి అప్పగిస్తారు. సదరు ఏజెంట్ ఆ వాహనాన్ని వ్యాపారికి అప్పగిస్తాడు. దీని కోసం ఏజెంట్‌కు వ్యాపారి పూర్తి ఖర్చులతో పాటు రూ.లక్షకు రూ.ఐదు వేల కమీషన్ ఇస్తాడు.ఆధారాలు చిక్కకుండా నగదు రవాణా వాహనం తమ పేరిట లేకుండా ఉండేలా చూసుకుంటూ పాత సెకండ్ హ్యాండ్ కార్లను ఖరీదు చేస్తున్నారు. -
నష్టాల బాటలోనే పసిడి
ముంబై: అంతర్జాతీయంగా బేరిష్ ధోరణి, దేశీయంగా పెద్ద నోట్ల రద్దుతో ఆభరణాలకు డిమాండ్ తగ్గడం తదితర అంశాలతో పసిడి వరుసగా అయిదో వారమూ నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో పుత్తడి ధరలపై ఒత్తిడి మరింతగా పెరిగింది. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర అంత క్రితం వారం ముగింపు రూ. 28,530తో పోలిస్తే రూ. 345 నష్టంతో రూ. 28,185 వద్ద ముగిసింది. ఆభరణాల బంగారం కూడా అంతే నష్టంతో రూ. 28,380 నుంచి తగ్గి రూ. 28,035 వద్ద ముగిసింది. వెండి కిలో ధర మాత్రం రూ. 41,815–40,790 మధ్య కదిలి చివరికి రూ. 775 లాభంతో రూ. 41,565 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం రేటు ఫిబ్రవరి అనంతరం కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఈటీఎఫ్‌ల అమ్మకాలు మందకొడిగా ఉండటం తదితర అంశాల కారణంగా 2017లో పసిడి ధరల అంచనాలను ఔన్సుకు (31.1 గ్రాములు) 1,438 డాలర్ల నుంచి 1,338 డాలర్లకు తగ్గిస్తున్నట్లు క్రెడిట్ సూసీ గ్రూప్ వెల్లడించింది. -
‘బడ్జెట్’కు నోట్ల రద్దు చిల్లు!
• తగ్గిపోనున్న ప్రభుత్వ ఆదాయాలు • వాటాల విక్రయ లక్ష్యమూ కష్టమే • నోట్ల రద్దు ప్రభావం ఎక్కువ కాలమే ఉంటుందన్న అంచనాలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు సెగ ప్రభుత్వానికీ తగిలింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్సన్నాహాలపై దీని ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించారుు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగం తగ్గడం, వృద్ధికి విఘాతం... ఫలితంగా ప్రభుత్వ ఆదాయలు, వాటాల విక్రయాలపైనా దీని ప్రభావం ఉండడం కారణాలని ఆ వర్గాలు పేర్కొన్నారుు. నల్లధనం కట్టడిలో భాగంగా గత నెల 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అరుుతే, నెల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద నగదు కోసం భారీ క్యూలు దర్శనమిస్తుండడం, కంపెనీలు వేతన చెల్లింపుల సమస్యలను ఎదుర్కొండటంతో ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ కాలం పాటే ఆర్థిక రంగ కార్యకలాపాలు నెమ్మదిస్తాయని అధికారులు కలవరపడుతున్నారు. ఏటా ఫిబ్రవరి నెల చివర్లో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అరుుతే, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అరుుతే, బడ్జెట్ సన్నాహాలను ఇంకా ప్రారంభించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. రూ.35వేల కోట్లకు గండి ‘‘నిర్మాణం, వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలపై నగదు కొరత ప్రభావం పడుతుంది. దీంతో పన్ను వసూళ్లు తగ్గుతారుు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ సైతం కష్టతరమవుతుంది’’ అని ఓ అధికారి వివరించారు. నవంబర్ నెలలో దేశీ ద్విచక్ర, వాణిజ్య వాహనాల విక్రయాలు 10 శాతం మేర తగ్గిపోవడం, రిటైల్, ఆభరణాల రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారుు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.56,500 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని అధికారుల అభిప్రాయంగా ఉంది. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు సగం మేరే ప్రభుత్వం నిధులు సేకరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా, డీమోనిటైజేషన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు రూ.35,000 కోట్ల మేర పడిపోనున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స అండ్ పాలసీ ఆర్థికవేత్త ఎన్ఆర్భానుమూర్తి పేర్కొన్నారు. ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ఆర్బీఐ తాజా అంచనా 7.1 శాతానికంటే దిగువకు పడిపోతుందని తెలిపారు. కానీ జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్దేశించుకున్న 3.5 శాతానికి చేరుకుంటామని కేంద్రం ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నారుు. -
పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే..!
► బ్యాంకుల్లోనే పింఛన్ల చెల్లింపు ►ఖాతా వివరాలు సేకరిస్తున్న ఎంపీడీవోలు ►జనవరి నుంచి అమలు చేసేందుకు కసరత్తు ► ఉమ్మడి జిల్లాలో 3.64లక్షల లబ్ధిదారులు ఆదిలాబాద్ రిమ్స్ : ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్ డబ్బులను నగదు రూపంలో చేతికి అందిస్తుండగా అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి చెక్ పెట్టి పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆసరాతోపాటు బీడీ కార్మికులకు ఇచ్చే జీవన భృతి, ఎరుుడ్‌స బాధితులకు పంపిణీ చేసే పింఛన్ డబ్బులు కూడా బ్యాంక్‌ఖాతాలో జమ చేయనుంది. ఈ ప్రక్రియ అమలులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఎంపీడీవోలు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించిన ప్రభుత్వం బ్యాంకుల ద్వారానే పింఛన్ డబ్బులు చెల్లించనుంది. నాలుగు జిల్లాల్లో 3.64లక్షల లబ్ధిదారులకు.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల,కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి పింఛన్ లబ్ధిదారులున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 64,841, నిర్మల్‌లో 1,36,345, మంచిర్యాలలో 86,360, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 46,611 మంది ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెల రూ.50కోట్లపైనే నగదు రూపంలో పింఛన్ డబ్బులు చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా వేలిముద్రలు తీసుకుని ప్రతినెలా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల చేతికి అందిస్తున్నారు. అరుుతే వచ్చే ఏడాది జనవరి నుంచి వీరికి బ్యాంకుల ద్వారానే చెల్లింపులు చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు ఉన్న పెన్షనర్ల సంఖ్య.. బ్యాంకులు లేని గ్రామాల సంఖ్య.. తదితర వివరాలను ఇప్పటికే ఎంపీడీవోలు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి ఈ అంశాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పింఛన్ చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బ్యాంకుల ద్వారానే సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు లబ్ధిదారులకు సరైన న్యాయం జరుగుతుంది. పింఛన్‌దారులకు ఎంతమందికి ఖాతాలున్నారుు.. ఎంతమందికి లేవు.. అనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి ఖాతాలు కలిగిన వారి వివరాలను ఎంపీడీవో లాగిన్‌లో నమోదు చేస్తారు. లబ్ధిదారుల నుంచి అకౌంట్ నంబర్, ఐఎఫ్‌టీ కోడ్ తీసుకుంటారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో లాగిన్‌లో ఈ డాటా మొత్తాన్ని నమోదు చేస్తారు. బ్యాంకు ఖాతాలు లేని వారు ఖాతాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు. -
సండే సందడి కరువు..!
చేతిలో నగదు లేక జనం విలవిల సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా జీతం చేతికి అందాక వచ్చే ఆదివారం చిరుద్యోగులకు పండుగే.. మటనో, చికెనో లేదా ఏదైనా ప్రత్యేక వంటకాల తోనో ఓ విందులాగా గడుపుతారు.. సాయంకా లం భార్యాపిల్లలతో సినిమాకో, షికారుకో వెళతా రు.. కానీ ఈ నెల తొలి ఆదివారం మాత్రం సామా న్యులందరికీ తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చింది. కారణం చేతిలో డబ్బులు లేకపోవడమే! బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవ డంతో రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చిరుద్యోగులు, నెల నెలా డబ్బులు చేతికందే వివిధ రంగాల వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెలవు రోజైనా కూడా ఇళ్లకే పరిమితమైపోయారు. కొందరు ‘సెలవు రోజు’కే విశ్రాంతి ప్రకటించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నగదు కోసం ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. వ్యాపారాలన్నీ బంద్.. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు, దుకాణాల్లో అమ్మకాలు 50 శాతానికిపైగా పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్‌లోని బేగంబజార్, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, అబిడ్స, కోఠి తదితర ప్రధాన మార్కెట్లలోనూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. సాధా రణంగా నగరంలో వీధి వ్యాపారాలు అత్యధికంగా జరుగుతుంటాయి. కానీ నోట్ల రద్దు, చిల్లర కష్టా లతో అవన్నీ బాగా దెబ్బతిన్నాయి. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స, ఐమ్యాక్స్, జూపార్క్ తదితర వినోద, పర్యాటక స్థలాలకు రద్దీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎం.. ఏ వేళలో చూసినా బంద్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏటీఎంలు ఆదివారం కూడా ఖాళీగానే వెక్కిరించారుు. హైదరాబాద్‌లోని ఏడువేల ఏటీఎంలలో రెండు వేలు కూడా పనిచేయలేదు. అందులోనూ ఎక్కడ చూసినా కిలోమీటర్ల పొడవునా జనం బారులు తీరారు. దాంతో నగదు నింపిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయాయి. ఫంక్షన్ హాల్ నుంచి గుడికి.. నోట్ల రద్దు, నగదు కొరతతో ఏకంగా ఓ పెళ్లి వేదికే మారిపోయింది. పెద్ద ఫంక్షన్ హాల్లో ఘనంగా జరగాల్సిన వివాహం.. ఓ గుడిలో నిరాడంబరంగా చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని అబిడ్స కట్టెలమండి ప్రాంతానికి చెందిన నంబి మహేందర్ పెద్ద కుమార్తె పావని వివాహం ఆదివారం (4వ తేదీన) జరిగింది. ఈ వివాహం కోసం తొలుత మెహిదీపట్నంలోని రూబీ గార్డెన్స ఫంక్షన్‌హాల్‌ను బుక్ చేసుకున్నారు. కానీ కరెన్సీ కష్టాలతో ఏర్పాట్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అదే ముహూర్తానికి ఎంజే మార్కెట్‌రోడ్‌లోని కాశీ విశ్వనాథుని ఆలయంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. మహిళను బలి తీసుకున్న నోట్ల కొరత దోమకొండ: నోట్ల సమస్య కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేటకు చెందిన పులబోయిన లక్ష్మి (32) అనే మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. లక్ష్మి(32)కి గ్రామంలోని సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది. రెండు నెలల క్రితం ఆమెకు గుండె ఆపరేషన్ జరిగింది. మందుల కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు శుక్రవారం ఆమె బ్యాంకుకు వెళ్లగా.. సిబ్బంది రూ.2 వేలే ఇచ్చారు. మరికొంత సొమ్ము ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో శనివారం కూడా బ్యాంకుకు వెళ్లిన ఆమె... క్యూలైన్లోనే అస్వస్థతకు గురైంది. స్థానికంగా చికిత్స చేయించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండ డంతో లక్ష్మిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. లక్ష్మి భర్త నర్సింహులు ఉపాధి కోసం 3 నెలల క్రితం దుబాయి వెళ్లాడు. వారికిద్దరు కుమార్తెలు. పేదలు కావడంతో అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో.. స్థానికులే ఆర్థిక సాయం అందించారు. వ్యాపారం పడిపోయింది నోట్ల సమస్యతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. నవం బర్ 8కి ముందు ఆది వారం వచ్చిందంటే చాలు.. ఉదయం నుంచే వినియోగదారుల రద్దీ ఉండేది. కానీ ఈ ఆదివారం వ్యాపారం సగానికి తగ్గింది. వచ్చిన వినియోగదారుల్లో కొందరు రూ.2 వేల నోట్లు తీసుకురావడంతో చిల్లర ఇవ్వలేక తిప్పి పంపేయాల్సి వచ్చింది.. - సంతోష్‌కుమార్, చికెన్ వ్యాపారి, ఉప్పుగూడ నగదు పరిమితితో అవస్థలు నగదు ఉపసంహరణ పరిమితులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూపార్క్‌లోని జంతువులకు ఆహరం కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేవు. మాంసాహార జంతువుల కోసం మాంసం సరఫరా చేయడం కష్టంగా ఉంది.. - ఫరీద్, ఆహార సరఫరా కాంట్రాక్టర్, జూపార్క్ -
వృద్ధి అంచనాలు కట్
• 7.3 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ • 7.1 శాతానికి కుదించిన బీవోఎఫ్ఎ • నోట్ల రద్దు ప్రభావమే కారణం ముంబై: నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్లు (బీవోఎఫ్ఎ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను కుదించారుు. పెద్ద నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను మోర్గాన్ స్టాన్లీ.. 7.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. అలాగే, 2017-18 అంచనాలను కూడా 7.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. 2018-19లో 7.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా డిసెంబర్ ఆఖరు దాకా నగదు లావాదేవీలు అస్తవ్యస్తమై, దేశీయంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని తెలిపింది. నల్లధనంపై పోరు పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా గృహస్తులు.. సమీప భవిష్యత్‌లో భారీ కొనుగోళ్లను నిలిపివేయొచ్చని, మధ్యకాలికంగా ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేయడం తగ్గవచ్చని వివరించింది. ’మొత్తం మీద దేశం వృద్ధి బాటలోనే ఉన్నా, పెద్ద నోట్ల రద్దు పరిణామం సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వృద్ధి రికవరీ మందకొడిగా ఉండవచ్చు’ అని తెలిపింది. మరోవైపు, విదేశాల్లో డిమాండ్ మెరుగుపడి, కమోడిటీయేతర ఉత్పత్తుల సారథ్యంలో గడిచిన నాలుగు నెలలుగా ఎగుమతులు పెరుగుతుండటం సానుకూల అంశమని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2016లో 3 శాతంగా ఉన్న ప్రపంచ దేశాల వృద్ధి 2017లో 3.4 శాతానికి పెరగవచ్చని, భారత్ నుంచి ఎగుమతులు కూడా దీనికి తోడ్పడగలవని తెలిపింది. 2017 తొలి త్రైమాసికం అనంతరం పరిస్థితులు కాస్త చక్కబడి.. ప్రైవేట్ పెట్టుబడులు మొదలైతే 2018 నుంచి ఎకానమీ పూర్తి స్థారుులో దూసుకుపోతుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 30 బేసిస్ పారుుంట్లు కట్: బీవోఎఫ్ఎ డీమానిటైజేషన్ దరిమిలా 2016-17లో భారత్ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 30 బేసిస్ పారుుంట్లు తక్కువగా 7.1 శాతం స్థారుులో మాత్రమే ఉండగలదని బీవోఎఫ్‌ఏ పేర్కొంది. అటు 2017-18లో కూడా జీడీపీ వృద్ధి 30 బేసిస్ పారుుంట్ల తగ్గుదలతో 7.3 శాతంగా ఉండగలదని వివరించింది. 2016-17లో 7.4 శాతంగాను, 2017-18లో 7.6 శాతంగాను భారత్ వృద్ధి ఉండొచ్చని బీవోఎఫ్ఎ గతంలో అంచనా వేసింది. మరోవైపు డిసెంబర్ 7న జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను 25 బేసిస్ పారుుంట్ల మేర తగ్గించవచ్చని పేర్కొంది. అరుుతే, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) అంశం ద్వారా వడ్డీ ఆదాయమేదీ రాదు కనుక ఒకవేళ ఆర్బీఐ పాలసీ రేట్లు 25 బేసిస్ పారుుంట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించలేకపోవచ్చని బీవోఎఫ్ఎ తెలిపింది. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) బాండ్లను తగు పరిమాణంలో జారీ చేసిన తర్వాత సీఆర్ఆర్ పెంపు నిర్ణయాన్ని సమీక్షిస్తామంటూ ఆర్బీఐ వెల్లడించడం సానుకూలాంశమని బీవోఎఫ్ఎ తెలిపింది. -
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు
రామడుగు: పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ దాచుకున్న రూ. 500, వెరుు్య నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేశారు. తిరిగి విత్‌డ్రా చేసేప్పుడు సమస్యలు ఎదురవుతున్నారుు. బ్యాంకు అధికారులు చిన్న నోట్లు ఇవ్వకుండా రూ.రెండు వేల నోట్లు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఈ నోట్లు తీసుకోవడం లేదని వాపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవీ.. ఇంటర్నెట్కు రావడం లేదు ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రకటించనప్పటి నుండి నెట్ పనుల కోసం జనాలు రావడం మానేశారు. దీనితో నెట్ బిల్లు కూడా రాని పరిస్థితి వచ్చింది. చిన్న పని కోసం వచ్చేవాళ్లు రూ.రెండు వేల నోటు పట్టుకొని వస్తున్నారు. -అమర్, ఇంటర్నెట్ నిర్వాహకుడు, వెదిర పనులు నిలిపివేశాం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం శుభ పరిణామం. రద్దు చేసిన ప్రభుత్వం అవసరమైన నోట్లు అందజేయడంతో విఫలమైంది. దీంతో కాంట్రాక్ట్ పనులు నిలిపివేయాల్సి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. -నాగుల రాజశేఖర్‌గౌడ్, కాంట్రాక్టర్, వెదిర పొలం దున్నుకోలేకపోతున్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది, పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఉన్న వాటిని బ్యాంకులో వేశాం. తిరిగి తీసుకుంటే రూ.రెండు వేల నోట్ ఇస్తున్నారు. ట్రాక్టర్ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో దున్నేందుకు రావడంలేదు. -ద్యావ భూంరెడ్డి, రైతు, వెదిర -
రద్దు నోట్ల నిల్వకు ‘హామీ పథకం’
బ్యాంకుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆర్బీఐ ముంబై: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై కరెన్సీ నిల్వల భారం తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ‘హామీ పథకం’ (గ్యారెంటీ స్కీమ్)ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. దీని కింద బ్యాంకులు తమ వద్ద భారీగా పేరుకుపోరుున రూ.500, రూ.1000 నోట్ల కట్టలను సంబంధింత ఆర్బీఐ ఖజానాలో నేరుగా డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు గాను బ్యాంకులకు సంబంధిత నిల్వ గది తాళం చెవి ఇస్తారు. బ్యాంకుల్లో సామర్థ్యానికి మించి రద్దయిన కరెన్సీ నిల్వల వల్ల డిపాజిట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి బ్యాంకుల కరెంట్ ఖాతాకు ఆర్బీఐ క్రెడిట్ ఇచ్చి, తర్వాత నోట్లు లెక్కిస్తుంది. -
గిరిగిరి దందా..ఇక మూతేనా!
► పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ► అక్రమ వడ్డీ వ్యాపారంపై ఐటీ నిఘా ► భయాందోళనలో వడ్డీవ్యాపారులు ►చిరువ్యాపారుల్లో గందరగోళం. జమ్మికుంట : పెద్ద నోట్ల రద్దు ప్రభావం గిరిగిరి దందాపై పడింది. వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక..కొత్తగా ఇవ్వకుండా అయోమయంలో పడ్డారు. ఈ వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం..ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో పెద్ద నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు చిరువ్యాపారులు, దుకాణదారులకు వడ్డీలకిచ్చి ముక్కుపిండి వసూలు చేసిన వడ్డీ వ్యాపారుల చేష్టలు ఇక ముందు సాగడం కష్టమే అనిపిస్తోంది. అక్రమవడ్డీ వ్యాపారం ఇలా.. చేతిలో లెక్కకు మించి డబ్బులున్న వారు చిరువ్యాపారులు, దుకాణదారులకు గిరిగిరి పేరుతో వడ్డీకి డబ్బులిస్తుంటారు. రూ.10వేల నుంచి మొదలుకొని రూ.2లక్షలు వరకు అందిస్తుంటారు. రూ.3 చొప్పున వడ్డీతో డబ్బులు ముట్టేలా వంద రోజులు గడువు పెడతారు. రూ.లక్ష అప్పుగా ఇస్తే మొదటనే రూ.10వేలు తీసుకుని రూ.90వేలు అప్పగిస్తారు. ఇచ్చిన డబ్బుకు రోజుకు రూ.వంద చొప్పున వంద రోజుల వరకు వసూలు చేస్తారు. ఇలా జమ్మికుంటలో దాదాపు వందల మంది వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది రూ.10 లక్షలు మొదలుకొని రూ.కోటి వరకు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఏటా వంద కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పెద్ద మొత్తంలో ఇంట్లో ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల చివరి వరకు నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉండడంతో డిపాజిట్ చేయాలా? వద్దా? అనే సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తుంది. చిట్టీలు ఇలా జమ్మికుంటలో చిట్టీల దందా జోరుగా సాగుతోంది. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు నెలవారీ చిట్టీల దందా సాగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేకుం డానే చిట్టీల దందా నడుస్తోంది. జమ్మికుంట వ్యాపార కేంద్రంలో వంద కోట్లకు పైగా ఈ చిట్టీల దందా కొనసాగుతున్నట్లు ప్రచారం ఉంది. అక్రమ ఫైనాన్సలు, పలువురు బడా వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. అరుుతే చిట్టీలు వేసేవారు... చిట్టీలు ఎత్తుకునే వారికి క్యాష్..టు క్యాష్ ఇచ్చేందుకు ప్రధాని నిర్ణయంతో అడ్డుకట్ట పడినట్లరుుంది. ప్రస్తుతం చిట్టీలు ఇవ్వడం.. నెలవారీ డబ్బులు వసూలు చేయడం నిలిచినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు అవసరాల కోసం డబ్బులు కూడపెట్టి చిట్టీలు వేస్తే నోట్ల రద్దుతో చేతికి డబ్బులు వస్తాయో.. రావోననే అయోమయంలో పడ్డారు. అదే విధంగా ఫైనాల్స్‌లో లక్షల్లో డబ్బులు దాచిన వారు ఎలా గట్టెక్కుతామోనని భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లోనే అక్రమ ఫైనాన్సలతో పాటు వడ్డీవ్యాపారులు బోర్డులు తిప్పేసే పరిస్థితులు కనిపిస్తున్నారుు. చిరువ్యాపారుల విలవిల పెద్ద నోట్ల రద్దుతో బడాబాబులు, వడ్డీవ్యాపారులు నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటే చిరువ్యాపారులు మాత్రం అప్పు దొరక్క బిక్కమొహం వేస్తున్నారు. బడా వ్యాపారులకు కోట్లలో రుణాలు ఇచ్చేందుకు క్యూలు కట్టే బ్యాంకర్లు చిరువ్యాపారులకు రూ.10వేల రుణం ఇవ్వలేకపోతుంటారు. దీంతో కుటుంబ పోషణ, వ్యాపారం కొనసాగించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో వడ్డీవ్యాపారులు దందా చేయకపోవడంతో రుణం లభించక చిరువ్యాపారులు దుకాణాలు మూసేస్తున్నారు. బ్యాంకర్లు స్పందించి ఎలాంటి తిరకాసు లేకుండా రుణాలు ఇవ్వాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. వడ్డీ వద్దు ! వడ్డీ వ్యాపారులు తమ వద్ద ఉన్న రూ.500, రూ.వెరుు్య నోట్లను వడ్డీ లేకుండా ఇస్తామంటూ పలువురు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిత్యం చెల్లించే డబ్బులు రూ.వంద నోట్లు ఇస్తే సరిపోతుందని వ్యాపారులను బతిమిలాడుతున్నట్లు తెలిసింది. రద్దరుున నోట్లను తీసుకుంటే చిక్కుల్లో పడిపోతామనే భయంతో ఎవరూ ముందుకురావడం లేదని సమాచారం. ఐటీ నిఘా జమ్మికుంటలో వడ్డీ వ్యాపారుల గిరిగిరి దందాతోపాటు అక్రమ ఫైనాన్సలు, నెలవారీ చిట్టీలు నిర్వహించే వారిపై ఐటీ శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల పేర్లు సేకరించినట్లు సమాచారం. ఆదాయం, ఆస్తుల వివరాలు, ఫైనాన్సల టర్నోవర్ తదితర వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. -
కరెన్సీ ఎమర్జెన్సీ..!
-
మొబైల్ వాలెట్ లావాదేవీల జోరు
-
ఎనీటైం మూతే!
-
మొబైల్ వాలెట్ లావాదేవీల జోరు
• కస్టమర్ల కోసం వినూత్న ఆఫర్లు • డిజిటల్ పేమెంట్స్‌కు జోష్ న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం అష్టకష్టాలు పడుతుంటే.. మొబైల్ వాలెట్ సంస్థలు మాత్రం పండుగ చేసుకుంటున్నారుు. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి నమోదరుు్యందని ప్రకటించేశారుు కూడా. అలాగే పనిలోపనిగా కస్టమర్లను మరింత ఆకర్షించడానికి వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారుు. మరొకవైపు మొబైల్ వాలెట్ల లావాదేవాల్లో బలమైన వృద్ధి నమోదవుతుందని అసోచామ్ పేర్కొంటోంది. డబ్బు ట్రాన్సఫర్‌కు ఫీజులు మినహారుుంపు తమ యూజర్లు ఏ బ్యాంక్ అకౌంట్కై నా వెంటనే డబ్బును ట్రాన్సఫర్ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి ఫీజలు ఉండవని మోబిక్విక్ ప్రకటించేసింది. తాజా చర్యతో రిటైలర్లు, షాప్కీపర్లు, యూజర్లు వారి వారి దైనందిన సమస్యలను ఎదుర్కొనడానికి మొబైల్ వాలెట్లను ఉపయోగిస్తారని మోబిక్విక్ అంచనా వేస్తోంది. ‘కేంద్ర ప్రభుత్వపు సాహసోపేత నిర్ణయం దీర్ఘకాలంలో దేశంలో నల్లధన నియంత్రణకు, అవినీతి నిర్మూలనకు దోహదపడుతుంది. దీనికి మేం పూర్తి మద్దతునిస్తున్నాం. ఇక సామాన్య ప్రజలు దీని వల్ల కొంత కాలం సమస్యలను ఎదుర్కోక తప్పదు. అందుకే వీరి కోసం బ్యాంక్ ట్రాన్సఫర్స్పై ఎలాంటి ఫీజును తీసుకోవడం లేదు’ అని మోబిక్విక్ సహ వ్యవస్థాపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఒక మొబైల్ వాలెట్ నుంచి బ్యాంక్‌కు డబ్బు ట్రాన్సఫర్ చేస్తే నాన్-కేవైసీ యూజర్‌కి 4 శాతం, కేవైసీ యూజర్‌కు 1 శాతం ఫీజు ఉండేదని గుర్తు చేశారు. లావాదేవీలు జూమ్: నోట్ల రద్దు ప్రకటన రోజు నుంచి చూస్తే తమ లావాదేవీల్లో 18 రెట్ల వృద్ధి నమోదరుు్యందని మోబిక్విక్ తెలిపింది. ఇక తమ పేమెంట్ ట్రాన్సాక్షన్లు 50 లక్షలకు చేరాయని పేటీఎం పేర్కొంది. దేశంలోని ఇతర పేమెంట్ నెట్వర్క్ కన్నా ఇవి అధికమని తెలిపింది. వాలెట్లకు మనీని యాడ్ చేసుకోవడంలో 1,000 శాతం వృద్ధి, మొత్తం లావాదేవీల్లో 700 శాతం వృద్ధి నమోదరుు్యందని వివరించింది. యాప్ డౌన్‌లోడింగ్‌లో కూడా 300 శాతం వృద్ధి నమోదరుు్యందని పేర్కొంది. వారంలో ఒక వ్యక్తి చేసే లావాదేవీల సంఖ్య కూడా 3 నుంచి 18కి పెరిగిందని తెలిపింది. కాగా యూజర్లు వారి క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎం-వాలెట్లకు డబ్బును ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. 153 బిలియన్లకు మొబైల్ పేమెంట్స్: అసోచామ్ మొబైల్ పేమెంట్స్ చెల్లింపులు 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 90 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 153 బిలియన్లకు చేరుతాయని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా కార్యక్రమం వంటి అంశాలు వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తాయని తన నివేదికలో పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ పేమెంట్ చెల్లింపులు 3 బిలియన్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక మొబైల్ పేమెంట్స్ చెల్లింపుల విలువ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 150 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో రూ.2,000 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.8 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. -
ఎనీటైం మూతే!
పని చేయని ఏటీఎంలు.. బ్యాంకుల వద్ద భారీ క్యూలు కొనసాగిన కరెన్సీ కష్టాలు ఎక్కడ చూసినా చిల్లర సమస్యలు భారీగా పడిపోరుున వ్యాపారాలు సిటీబ్యూరో: కరెన్సీ రద్దు/మార్పిడి అమలులోకి వచ్చి వారం రోజులైనా సామాన్యుడికి తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికీ ఏటీఎంలు పూర్తిస్థారుులో పని చేయట్లేదు. మంగళవారమూ నగరంలోని అనేక ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించారుు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘అతి పెద్దనోటు’తో సాధారణ ప్రజలకు చిల్లర తిప్పలు ఎక్కువయ్యారుు. గత మంగళవారం రాత్రి ప్రకటించినట్లు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచే ఏటీఎంలు పని చేయాల్సి ఉండగా అది అమలులోకి రాలేదు. ప్రతి పది ఏటీఎంలకు ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. నిర్ణీత సమయాని కంటే ఐదు రోజుల ఆలస్యమైనా మంగళవారం సైతం ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థారుులో పని చేయకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అవస్థలు పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని పలుచోట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ రంగం బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలే ఎక్కువగా పని చేశారుు. ఏటీఎం కేంద్రాలు పూర్తిస్థారుులో చేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఏటీఎం మిషన్లలో నింపే స్థారుులో కొత్త కరెన్సీ రాకపోవడం, రూ.2000 నోటును గుర్తించేలా బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో పాటు ట్రే సమస్య కూడా ఉందని తెలుస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటు ‘పాత కరెన్సీ’ కంటే పొగుడు, వెడల్పుల్లో వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని ఏటీఎం మిషన్లలో పెట్టేందుకు అవసరమైన ట్రేలు సైతం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఒకటి కంటే ఎక్కువ కార్డులతో... సోమవారం నుంచి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే పరిమితిని కేంద్రం రూ.2,500కు పెంచింది. అరుుతే అనేక మందికి ఈ మొత్తం కూడా సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కొందరు వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ కార్డులు తీసుకువస్తున్నారు. తనది, తన కుంటుంబంలోని వారి డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులు సైతం తీసుకువచ్చి క్యాష్ డ్రా చేసుకుంటున్నారు. దీంతో కొందరు వినియోగదారులు ఒక దఫాలో వివిధ కార్డుల్ని వినియోగించి రూ.10 వేల వరకు డ్రా చేసుకుని వెళ్తున్నారు. ఈ కారణంగానే ఏటీఎంల్లో నగదు నింపిన కొన్ని గంటలకే అవి ఖాళీ అవుతున్నారు. ఈ ‘బహుడ్రా’ విధానాలను క్యూలో ఉన్న అనేక మంది వినియోగదారులు వ్యతిరేకిస్తూ అభ్యంతరం తెలుపుతున్నారు. రూ.2500 ఇస్తున్న బ్యాంకులు... ‘కరెన్సీ ఓపెన్’ అరుున తర్వాత వరుసగా ఆరో రోజైన మంగళవారం సైతం బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించారుు. కేంద్రం సవరించిన ప్రకటించిన దాని ప్రకారం సోమవారం నుంచి విత్‌డ్రా, ఎక్స్ఛేంజ్లకు సంబంధించి ఒక్కోక్కరికీ రూ.4.5 వేలు ఇవ్వాల్సి ఉంది. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో మంగళవారం వాటివద్ద రద్దీ మరింత పెరిగింది. ఈ రద్దీతో పాటు కరెన్సీ కొరత నేపథ్యంలో అనేక బ్యాంకులకు చెందిన అధికారులు కేవలం రూ.2.5 వేలు ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులు రూ.100 నోట్లు ఇస్తుండగా, మరికొన్ని కొత్త రూ.2 వేల నోటు ఇస్తున్నారుు. దీంతో ఈ ‘అతి పెద్ద నోటు’ తీసుకున్న వారికి చిల్లర సమస్య తప్పట్లేదు. ఎక్స్ఛేంజ్ చేసే వారి కంటే డిపాజిట్, విత్‌డ్రా వారికే బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నారుు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద చిరువ్యాపారాలు... కరెన్సీ మార్పిడి, విత్‌డ్రాల కోసం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలతో పాటు పోస్టాఫీసుల వద్దా భారీ క్యూలు ఉంటున్నారుు. కొంతమంది ఏకంగా గంటకు పైగా నిల్చుకోవాల్సి వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ‘కొత్త చిరువ్యాపారాలు’ వెలుస్తున్నారుు. చాయ్‌తో పాటు పల్లీలు తదితర చిరుతిళ్ళు విక్రరుుంచే ‘మెబైల్ దుకాణాలు’ కనిపిస్తున్నారుు. వీరికి నగదు చెల్లించడానికి చిల్లర సమస్య వచ్చిపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గుర్తింపు కార్డుల ప్రతులు, ఇతర పత్రాల జిరాక్సుల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఉన్న జిరాక్సు సెంటర్లకూ రద్దీ పెరిగింది. మరికొన్ని రోజులు ఈ ఇబ్బందులు తప్పేలాలేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారం ఢమాల్ నగరవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నారుు. నోట్ల మార్పిడికే రోజంతా సరిపోతుండడంతో జనాలు కనీస కొనుగోళ్లకు కూడా సమయం ఉండడం లేదు. ఇక డబ్బుల సంగతి సరేసరి. దీంతో చిరువ్యాపారాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు దివాళా తీస్తున్నారుు. హోటళ్లు, సినిమా హాళ్లు, టిఫిన్‌సెంటర్లు జనం లేక బోసిపోతున్నారుు. వస్త్రదుకాణాల్లో సిబ్బంది తప్ప ఎవరూ కన్పించడం లేదు. ఇక పెట్రోల్ బంకుల్లోనూ చిల్లర కొరత కారణంగా వివాదాలు తలెత్తుతున్నారుు. పూలు, పండ్లు, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్లు పూట గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. -
ఐదు రోజులగా భారత దేశం మండిపోతుంది
-
ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నరు