పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై కరెన్సీ నిల్వల భారం తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ‘హామీ పథకం’ (గ్యారెంటీ స్కీమ్)
బ్యాంకుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆర్‌బీఐ
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై కరెన్సీ నిల్వల భారం తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ‘హామీ పథకం’ (గ్యారెంటీ స్కీమ్)ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. దీని కింద బ్యాంకులు తమ వద్ద భారీగా పేరుకుపోరుున రూ.500, రూ.1000 నోట్ల కట్టలను సంబంధింత ఆర్‌బీఐ ఖజానాలో నేరుగా డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు గాను బ్యాంకులకు సంబంధిత నిల్వ గది తాళం చెవి ఇస్తారు.
బ్యాంకుల్లో సామర్థ్యానికి మించి రద్దయిన కరెన్సీ నిల్వల వల్ల డిపాజిట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి బ్యాంకుల కరెంట్ ఖాతాకు ఆర్‌బీఐ క్రెడిట్ ఇచ్చి, తర్వాత నోట్లు లెక్కిస్తుంది.