మొబైల్ వాలెట్ లావాదేవీల జోరు
• కస్టమర్ల కోసం వినూత్న ఆఫర్లు
• డిజిటల్ పేమెంట్స్‌కు జోష్
న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం అష్టకష్టాలు పడుతుంటే.. మొబైల్ వాలెట్ సంస్థలు మాత్రం పండుగ చేసుకుంటున్నారుు. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి నమోదరుు్యందని ప్రకటించేశారుు కూడా. అలాగే పనిలోపనిగా కస్టమర్లను మరింత ఆకర్షించడానికి వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారుు. మరొకవైపు మొబైల్ వాలెట్ల లావాదేవాల్లో బలమైన వృద్ధి నమోదవుతుందని అసోచామ్ పేర్కొంటోంది.
డబ్బు ట్రాన్‌సఫర్‌కు ఫీజులు మినహారుుంపు
తమ యూజర్లు ఏ బ్యాంక్ అకౌంట్‌కై నా వెంటనే డబ్బును ట్రాన్‌సఫర్ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి ఫీజలు ఉండవని మోబిక్విక్ ప్రకటించేసింది. తాజా చర్యతో రిటైలర్లు, షాప్‌కీపర్లు, యూజర్లు వారి వారి దైనందిన సమస్యలను ఎదుర్కొనడానికి మొబైల్ వాలెట్లను ఉపయోగిస్తారని మోబిక్విక్ అంచనా వేస్తోంది. ‘కేంద్ర ప్రభుత్వపు సాహసోపేత నిర్ణయం దీర్ఘకాలంలో దేశంలో నల్లధన నియంత్రణకు, అవినీతి నిర్మూలనకు దోహదపడుతుంది. దీనికి మేం పూర్తి మద్దతునిస్తున్నాం. ఇక సామాన్య ప్రజలు దీని వల్ల కొంత కాలం సమస్యలను ఎదుర్కోక తప్పదు. అందుకే వీరి కోసం బ్యాంక్ ట్రాన్‌సఫర్స్‌పై ఎలాంటి ఫీజును తీసుకోవడం లేదు’ అని మోబిక్విక్ సహ వ్యవస్థాపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఒక మొబైల్ వాలెట్ నుంచి బ్యాంక్‌కు డబ్బు ట్రాన్‌సఫర్ చేస్తే నాన్-కేవైసీ యూజర్‌కి 4 శాతం, కేవైసీ యూజర్‌కు 1 శాతం ఫీజు ఉండేదని గుర్తు చేశారు.
లావాదేవీలు జూమ్: నోట్ల రద్దు ప్రకటన రోజు నుంచి చూస్తే తమ లావాదేవీల్లో 18 రెట్ల వృద్ధి నమోదరుు్యందని మోబిక్విక్ తెలిపింది. ఇక తమ పేమెంట్ ట్రాన్సాక్షన్లు 50 లక్షలకు చేరాయని పేటీఎం పేర్కొంది. దేశంలోని ఇతర పేమెంట్ నెట్‌వర్క్ కన్నా ఇవి అధికమని తెలిపింది. వాలెట్లకు మనీని యాడ్ చేసుకోవడంలో 1,000 శాతం వృద్ధి, మొత్తం లావాదేవీల్లో 700 శాతం వృద్ధి నమోదరుు్యందని వివరించింది. యాప్ డౌన్‌లోడింగ్‌లో కూడా 300 శాతం వృద్ధి నమోదరుు్యందని పేర్కొంది. వారంలో ఒక వ్యక్తి చేసే లావాదేవీల సంఖ్య కూడా 3 నుంచి 18కి పెరిగిందని తెలిపింది. కాగా యూజర్లు వారి క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎం-వాలెట్లకు డబ్బును ట్రాన్‌సఫర్ చేసుకోవచ్చు.
153 బిలియన్లకు మొబైల్ పేమెంట్స్: అసోచామ్
మొబైల్ పేమెంట్స్ చెల్లింపులు 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 90 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 153 బిలియన్లకు చేరుతాయని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా కార్యక్రమం వంటి అంశాలు వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తాయని తన నివేదికలో పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ పేమెంట్ చెల్లింపులు 3 బిలియన్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక మొబైల్ పేమెంట్స్ చెల్లింపుల విలువ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 150 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో రూ.2,000 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.8 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది.