mobile wallet
-
మెట్రో, ఓలా.. ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు మెట్రో జర్నీతోపాటు చివరి గమ్యం చేర్చేందుకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్, ఓలా సంస్థల మధ్య బుధవారం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక యాప్ ‘టీ–సవారీ’ ద్వారా ఓలా క్యాబ్‌లు, ఆటో లు బుక్ చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్, ఓలా మనీ సేవలనూ వినియోగించుకోవచ్చు. ఇక మియాపూర్, అమీర్‌పేట్, నాగోల్, కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ల వద్ద ఓలా ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర స్టేషన్లలోనూ త్వర లో ఈ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓలా జోన్లు ఏర్పాటు చేయనుండటంతో క్యాబ్‌ల కోసం మెట్రో ప్రయాణికులు నిరీక్షించే అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో మెట్రో స్మార్ట్‌కార్డులను నేరుగా ఓలా మనీ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక యాప్ సౌకర్యం లేని మెట్రో ప్రయాణికులు స్టేషన్ల వద్దనున్న ఓలా కియోస్క్‌లను సంప్రదించి అక్కడ ఉండే ప్రతినిధుల సహకారంతో క్యాబ్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక ఓలా జోన్స్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్యకూ పరిష్కారం చూపుతాయన్నారు. ప్రయాణికుల జర్నీ సమయం కూడా గణనీయంగా తగ్గుందన్నారు. మెట్రో తో నగర రవాణా రంగ చరిత్రలో కొత్త శకం ప్రారంభమైందని ఓలా డైరెక్టర్ సౌరభ్ మిశ్రా తెలిపారు. ఓలా సేవలను ఆన్లైన్, ఆన్‌గ్రౌండ్ విధానంలో మెట్రో స్టేషన్ల సమీపంలో అందించడం ఆనందంగా ఉందన్నారు. ఓలా స్మార్ట్ మొబిలిటీ సేవలను రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. సులభమైన, సౌకర్యవంతమైన, క్లిష్టతలేని ప్రయాణాన్ని మెట్రో ప్రయాణికులకు అందించేందుకే ఈ భాగస్వామ్యం చేసుకున్నామన్నా రు. నాగోల్–మియాపూర్(30 కి.మీ.) మెట్రో మార్గం 2.4 లక్షల ప్రయాణికుల మార్కును అధిగమించడం ద్వారా విజయవంతమైనట్లు ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సైనీ తెలిపారు. ఓలాతో ఒప్పందం ద్వారా ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ తేలికవుతుందన్నారు. ఓలా భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మొబిలిటీ అనుభవాలను అందిస్తుందన్నారు. ఓలా సంస్థ ఇటీవలే గుర్గావ్, బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు మెట్రోస్టేషన్లలో ఓలా కియోస్క్‌లు ఏర్పాటు చేసిందన్నారు. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంస్థ ఓ మొబైల్ వాలెట్‌ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా సాధనలోభాగంగా డిజిటల్ చెల్లింపులు సంస్థ మొబిక్విక్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా 100మిలియన్లకు పైగా ఉన్న తన చందాదారులకు వన్ ట్యాప్ బిల్లు పేమెంట్‌ను పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల కేంద్రాల ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా అర్ధ పట్టణ, గ్రామీణ భారతదేశానికి చెందిన కస్టమర్ల డిజిటల్ చెల్లింపుల నిమిత్తం తమ కొత్త డిజిటల్ వాలెట్‌ను ఆవిష్కరించినట్టు బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు ఆన్లైన్ రీఛార్జ్, బిల్లు చెల్లింపులు, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌తోపాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చని చెప్పింది. అలాగే ఇది స్మార్ట్‌ఫోన్ , ఫీచర్ ఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది. టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ డిజిటల్ వాలెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ తరచూ నిర్లక్ష్యానికి గురి అవుతున్న గ్రామీణ ప్రాంతాలకు సులభ చెల్లింపుల విధానాన్ని బలోపేతం చేయనున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్, మోబిక్విక్ తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియాని సాధించే దిశగా మరొక ముఖ్యమైన మైలురాయి అని బిఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రొ-బ్రాండెడ్ మోబిక్విక్ వాలెట్ ద్వారా మొబైల్ మరియు ఇతర ఆర్ధిక చెల్లింపులను చేసుకోవచ్చని చెప్పారు. ఈ కొత్త వాలెట్ ద్వారా భారతదేశంలో విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం లభిస్తుందని మొబీ క్విక్ స్థాపకుడు, సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. -
పేటీఎం టు చిల్లర్..
ఈకామర్స్ విప్లవంతో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ మొబైల్ వ్యాలెట్ల వినియోగం మొదలైనప్పటికీ.. ఇటీవల పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వాటి వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో టాప్ టెన్ మొబైల్ వ్యాలెట్ యాప్‌లు ఇవీ... పేటీఎం 2010లో ఆరంభించిన పేటీఎం సెమీక్లోజ్డ్ వ్యాలెట్ ద్వారా.. ఈకామర్స్ లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, నగదు బదిలీలతో పాటు.. ప్రయాణం, వినోదం, రిటైల్ పరిశ్రమలోనూ దీని సేవలను వినియోగించుకోవచ్చు. ఇటీవలే ప్రీమియం విద్యా సంస్థలతో కూడా.. ఫీజు చెల్లింపుల కోసం పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొబిక్విక్ అగ్రస్థాయి స్వతంత్ర మొబైల్ చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటి మొబిక్విక్. ఈకామర్స్ వెబ్సైట్లు, టెల్కోలు, బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లు, మొబైల్ కామర్స్ అప్లికేషన్లు, బిల్లర్లు తదితర రిటైలర్ల సమాచారం కూడా ఉంటుంది. ఫ్రీచార్జ్ ఈ యాప్ ద్వారా డీటీహెచ్, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, వినియోగ బిల్లులు చెల్లించవచ్చు. ప్రముఖ ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికల్లోనూ చెల్లింపులు జరపవచ్చు. పేయుమనీ నాస్పర్స్ గ్రూప్ సంస్థ పేయు ఇండియా. బుక్ మై షో, ట్రేడస్, గోఐబిబో, జొమాటో, స్నాప్ డీల్, ఫెర్న్స్ అండ్ పెటల్స్, జబాంగ్ తదితర నాలుగు వేలకు పైగా వాణిజ్య సంస్థలు, ఈకామర్స్ సంస్థలతో అనుసంధానం ఉంది. స్టేట్‌బ్యాంక్ బడ్డీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మొబైల్ వ్యాలెట్ ఇది. దీనిద్వారా మీ నగదును ఇతర బ్యాంకు ఖాతాలకు సులువుగా బదిలీ చేయవచ్చు. బిల్లుల చెల్లింపులు, సినిమా, హోటల్, ప్రయాణాల బుకింగ్ చేయవచ్చు. 13 భాషలలో సేవలు అందిస్తుంది. ఎం పెసా వేగవంతమైన, సౌకర్యవంతమైన, భద్రతమైన మొబైల్ లావాదేవీల కోసం దీనిని ఉపయోగించవచ్చు. వొడాఫోన్ ఎం పెసా లిమిటెడ్ సంస్థ.. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి పనిచేస్తోంది. ఆక్సిజెన్ ఆక్సిజెన్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన మొబైల్ వ్యాలెట్. ఐఎంపీఎస్ పద్ధతిలో 50కి పైగా బ్యాంకులకు, ఆ బ్యాంకుల నుంచి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేయవచ్చు. సిటీ మాస్టర్ పాస్ మాస్టర్ కార్డ్, సిటీ బ్యాంక్ ఇండియా కలిసి ప్రారంభించిన డిజిటల్ వ్యాలెట్ ఇది. దేశంలో తొలి అంతర్జాతీయ వ్యాలెట్. వినియోగదారుల షిప్పింగ్, క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్, లాయల్టీ కార్డులు, చెల్లింపుల సమాచారాన్ని ఒకే చోట స్టోర్ చేస్తుంది. ఐసీఐసీఐ పాకెట్స్ ఏ బ్యాంకు ఖాతా నుంచైనా ఈ వ్యాలెట్లోకి నగదు పంపించవచ్చు. ఏ వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ లో అయినా లావాదేవీలు నిర్వహించవచ్చు. హెచ్డీఎఫ్సీ చిల్లర్ దీనిని నగదు బదిలీ యాప్‌గా అభివర్ణించవచ్చు. నగదు బదిలీలు, చెల్లింపుల ప్రక్రియలను చాలా సులభం చేస్తుంది. దీని ద్వారా మిత్రుల స్మార్ట్ఫోన్లకు నగదు బదిలీ చేయవచ్చు. -
పెట్రోల్ బంకుల్లో ఈ–చెల్లింపులతో జాగ్రత్త!
పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన తీవ్ర నగదు కొరత కారణంగా ఆన్లైన్ లావాదేవీలు తప్పని సరయ్యాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్‌తో పాటు మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) సూచిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ వ్యాలెట్లు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈ–పాస్) యంత్రాలు వినియోగించే సమయంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ పెట్రోల్ బంకుల్లో మొబైల్ వినియోగం నిషిద్ధమన్న విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత కారణంగా పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు ఈ– పాస్ యంత్రాలు, మొబైల్ వ్యాలెట్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మొబైల్ ఎక్కువగా వాడాల్సి రావడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికమయ్యాయని పీఈఎస్వో హెచ్చరించింది. పీఈఎస్వో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ పీటీ సాహూ స్వయంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని ఇటీవల వివరించారు. ఇందుకు సంబంధించిన ఉత్తరం పెట్రోలు బంకులు నిర్వహించే పలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీని ప్రకారం.. పెట్రోల్ బంకుల్లోని జోన్–1, జోన్–2 ప్రాంతాలలో ఈ– పాస్ మెషీన్లు, మొబైల్ వ్యాలెట్లు అనుమతించరాదని పెట్రోలియం మంత్రిత్వశాఖకు పీఈఎస్వో సూచించింది. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఈఎస్వో సిఫార్సు మేరకు నిర్దిష్ట కాల వ్యవధిలో తగిన చర్యలు చేపట్టేలా అన్ని రాష్ట్రాల పెట్రోలియం మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఆయన కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఇది అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. బంకుల్లో ఇవి చేయకూడదు.. 1. మొబైల్ బ్యాటరీలు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది పెట్రోలియం వేపర్ను తాకితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్రోల్ నింపేటప్పుడు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు. 2.పెట్రోల్ నింపేటప్పుడు వాహన ఇంజిన్ని ఆఫ్ చేయాలి. 3.బంక్ పరిసరాల్లో ధూమపానం చేయరాదు. 4.పెట్రోల్ నింపిన తరువాత ఫిల్లింగ్ నాజిల్ బయటకు తీసేవరకు ఇంజిన్ స్టాట్ చేయకూడదు. 5.పెట్రోల్ బంకుల్లో మంటలను ఆర్పే కిట్లు తప్పనిసరిగా ఉండాలి. 6.పెట్రోల్ పంప్‌కు చిన్నారులను దూరంగా ఉంచాలి. -
వాలెట్లకూ చార్జీలుంటాయ్!!
• దుకాణాల్లో లావాదేవీలకు రుసుముల బాధ లేదు... • బ్యాంకులోంచి వాలెట్‌లోకి వేస్తే బ్యాంకు చార్జీలు • వాలెట్లోంచి బ్యాంకు ఖాతాలోకి వేస్తే 1-4 శాతం ఫీజు • అలాగని వాలెట్‌లోనే డబ్బులుంచితే పైసా వడ్డీ రాదు • పెద్ద నోట్ల రద్దుతో ఊపందుకుంటున్న వాలెట్ లావాదేవీలు డెబిట్, క్రెడిట్ కార్డులే కాదు. ఇపుడు మొబైల్ వాలెట్లూ జోరందుకున్నారుు. నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు చేశాక... వాలెట్ దిగ్గజం పేటీఎం ద్వారానే కేవలం ఆరు రోజుల్లో రూ.150 కోట్ల లావాదేవీలు నమోదయ్యారుు. దీన్నిబట్టే వాలెట్ల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. అసలింతకీ వాలెట్ అంటే ఏంటి? మొబైల్ వాలెట్ అంటే ఒక అప్లికేషన్. ఏ సంస్థ అందిస్తే ఆ సంస్థ తాలూకు యాప్ అన్నమాట. దీనిద్వారా ఎలాంటి చెల్లింపులైనా చేసుకోవచ్చు. అంటే మీరు మీ స్నేహితుడికి డబ్బులివ్వాలి అనుకోండి. తన మొబైల్లోని వాలెట్‌కి మీ మొబైల్ వాలెట్ నుంచి కేవలం ఫోన్ నెంబరుతో డబ్బు పంపించేయొచ్చన్న మాట. క్లోజ్డ్ వాలెట్స్‌తో ఏ చెల్లింపులైనా చేయగలం. అదే ఓపెన్ వాలెట్లరుుతే నగదు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. క్లోజ్డ్ వాలెట్ విభాగంలో పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఆక్సిజన్ వంటివి సేవలందిస్తుండగా... ఓపెన్ వాలెట్ విభాగంలో హెచ్డీఎఫ్సీ పే జాప్, ఐసీఐసీఐ పాకెట్స్, ఎస్బీఐ బడ్డీ, ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటివి సేవలు అందిస్తున్నారుు. అరుుతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ వాలెట్ల ద్వారా నెలకు రూ.లక్ష మేర మాత్రమే లావాదేవీలు జరిపే వీలుంటుంది. చార్జీలు కూడా ఉంటాయండోయ్.. నిజానికిపుడు చాలా వాలెట్లకు విదేశాల నుంచి విపరీతమైన నిధులు పెట్టుబడుల రూపంలో వస్తున్నారుు. దీంతో అవి ప్రస్తుతం సాధ్యమైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారుు. అందుకని అవి లావాదేవీలపై క్యాష్బ్యాక్లంటూ విపరీతమైన ఆఫర్లు ఇస్తున్నారుు. ప్రస్తుతం చాలా లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు కూడా విధించటం లేదు. కాకపోతే ఈ వాలెట్లలోకి డబ్బులు వేసేటపుడు బ్యాంకులు ఎంతో కొంత ఛార్జీలు వసూలు చేస్తున్నారుు. ఎందుకంటే డబ్బులు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వాలెట్ వ్యవస్థలోకి పోతారుు కనక. అలాగే మనం వాలెట్ నుంచి మన బ్యాంకు ఖాతాలోకి నగదు వెనక్కి తీసుకున్నపుడు వాలెట్లు కూడా 1 నుంచి 3 శాతం వరకూ ఛార్జీలు వసూలు చేస్తున్నారుు. ఎందుకంటే డబ్బు వాలెట్ వ్యవస్థ నుంచి బ్యాంకుల్లోకి పోతోంది కనక. కాకపోతే ప్రధాన మంత్రి మోదీ ప్రకటన కారణంగా డిసెంబరు 31 వరకూ తాత్కాలికంగా ఇవి ఛార్జీలు వసూలు చేయటం లేదు. ‘‘పేటీఎంకు పేమెంట్ బ్యాంకు లెసైన్సు వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మేం డిసెంబరు 31లోగానే బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెడతాం. అప్పుడు మా బ్యాంకు కస్టమర్లు కనక డబ్బులు బ్యాంకు ఖాతా నుంచి పేటీఎం వాలెట్లో వేసినా, పేటీఎం వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయం. మా బ్యాంకు ఖాతాదారులు కాని వారి విషయంలో మాత్రం ఛార్జీలు వసూలు చేస్తాం’’ అని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి ‘సాక్షి’ బిసినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పటం గమనార్హం. పెద్ద వర్తకుల నుంచి వసూలు.. ఇపుడు చాలా దుకాణాలు వాలెట్లను అంగీకరిస్తున్నారుు. దీనిపై కిరణ్ మాట్లాడుతూ... ‘‘లావాదేవీలకు సంబంధించి మేం మా వాలెట్ కస్టమర్ల నుంచి గానీ, చిన్న చిన్న వర్తకుల నుంచి కానీ ఛార్జీలు వసూలు చేయటం లేదు. అయితే, పెద్ద పెద్ద వర్తకుల వద్ద మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాం’’ అని కిరణ్ తెలియజేశారు. నిజానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అమల్లోకి వచ్చాక బ్యాంకింగ్ లావాదేవీల చిత్రమే మారిపోరుుంది. బ్యాంకు నుంచి వాలెట్‌కు, వాలెట్ నుంచి వాలెట్‌కు కేవలం ఎస్సెమ్మెస్ పంపినంత ఈజీగా డబ్బులు బదలారుుంచటం వీలవుతోంది. వాలెట్లలో మరో ముఖ్యమైన విషయమేంటంటే వీటిలో మనం ఉంచే డబ్బుకు ఎలాంటి వడ్డీ రాదు. అందుకని వాలెట్లోని డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుందామనుకుంటే... ఛార్జీలబాధ తప్పదు. అదీ కథ. -
వాలెట్ వాడుతుంటే!
ప్రస్తుతం దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాల ప్యాకెట్ల మొదలు పప్పు దినుసుల వరకు.. మంచి నీళ్లు మొదలు.. మెడికల్ షాపు, ఆసుపత్రుల వరకు.. ఎక్కడికెళ్లినా అందరిదీ ఒకటే సమస్య. అందరూ నగదు కోసం తిరుగుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో.. డిజిటల్ వాలెట్/మొబైల్ వాలెట్/ఈ-వాలెట్ కంపెనీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పనిలో పనిగా వినియోగదారులను ఆకర్షించడానికి విన్నూతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ వాలెట్ లావాదేవీల గురించి తెలుసుకుందాం... సర్వం జేబులో..! డబ్బులు పాకెట్లో కాకుండా మొబైల్ వాలెట్లో ఉంచుకోవడం నేటి ట్రెండ్. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, హోటల్ బిల్లులు కట్టడానికి డిజిటల్ వాలెట్లు ఒక సులభమైన మార్గం. మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే చాలు.. పేటీఎం, మొబిక్విక్ లాంటి మొబైల్ వాలెట్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం బేస్డ్ మొబైల్ వాలెట్లలో నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లోని అమౌంట్‌ని మొబైల్ వాలెట్స్ ద్వారా వేర్వేరు అవసరాలకు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా యువత షాపింగ్, హోటల్స్, సినిమాలు, క్యాబ్ బుకింగ్ ఇలా అన్నీ వాలెట్స్ నుంచే కానిచ్చేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి మొబైల్ వాలెట్‌లోకి సులభంగా నగదు బదిలీ చేసుకునే సదుపాయం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు 1. CLOSED క్లోజ్డ్ వాలెట్స్ అంటే.. కంపెనీలు సొంతంగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబర్ వంటి చాలా ఆన్లైన్ సంస్థలు సొంత వాలెట్లను అందిస్తున్నాయి. వీటిలో డబ్బు వేసుకుని సదరు సంస్థ అందించే సేవలు, ఉత్పత్తులను మాత్రమే కొనాలి/వినియోగించాలి. ఇవి పూర్తిగా ఆయా సంస్థల పరిధిలో ఉంటాయి కాబట్టి వీటికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. ఆయా సంస్థలు తమ వాలెట్ల ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటాయి. వీటిలో వేసుకునే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు. ఒకసారి డిపాజిట్ చేసిన డబ్బును విత్ డ్రా చేయడానికి వీలుండదు. దీనిపై ఎలాంటి వడ్డీ రాదు. 2. SEMI CLOSED ఈ వాలెట్లలో డబ్బులు వేస్తే ఇతర ఆన్లైన్ సైట్లలోనూ వినియోగించవచ్చు. అయితే ఈ వాలెట్ నిర్వహిస్తున్న కంపెనీకి ఏయే సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయో వాటిలో మాత్రమే లావాదేవీలు జరపాలి. పేటీఎం, మొబిక్విక్, పేయూ, సిట్రస్ క్యాష్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఈ కోవకు చెందినవే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఈ వాలెట్ల ద్వారా అత్యవసర చెల్లింపులు చేయొచ్చు. అయితే ఈ వాలెట్లలో బిల్లు చెల్లింపులు, డిపాజిట్ల పరిమితి గరిష్టంగా పది వేలు మాత్రమే. పదివేలకు మించి లావాదేవీలు వీటి ద్వారా నిర్వహించలేం. వీటిలోనూ ఒకసారి డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోలేం. వీటిపై ఎలాంటి వడ్డీ రాదు. 3. OPEN VALLETS ఇవి ఓ రకంగా బ్యాంక్ ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్ డ్రా, చెల్లింపులు చేయొచ్చు. వీటిలో డిపాజిట్ చేసిన సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వోడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి వోడాఫోన్ నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ మనీ, టాటా టెలీ ఎం రూపీ కూడా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నవే. అయితే వీటి ద్వారా నిర్వహించే లావాదేవీల విలువ రూ.50 వేలకు మించకూడదు. -
మొబైల్ వాలెట్ లావాదేవీల జోరు
-
మొబైల్ వాలెట్ లావాదేవీల జోరు
• కస్టమర్ల కోసం వినూత్న ఆఫర్లు • డిజిటల్ పేమెంట్స్‌కు జోష్ న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం అష్టకష్టాలు పడుతుంటే.. మొబైల్ వాలెట్ సంస్థలు మాత్రం పండుగ చేసుకుంటున్నారుు. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి నమోదరుు్యందని ప్రకటించేశారుు కూడా. అలాగే పనిలోపనిగా కస్టమర్లను మరింత ఆకర్షించడానికి వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారుు. మరొకవైపు మొబైల్ వాలెట్ల లావాదేవాల్లో బలమైన వృద్ధి నమోదవుతుందని అసోచామ్ పేర్కొంటోంది. డబ్బు ట్రాన్సఫర్‌కు ఫీజులు మినహారుుంపు తమ యూజర్లు ఏ బ్యాంక్ అకౌంట్కై నా వెంటనే డబ్బును ట్రాన్సఫర్ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి ఫీజలు ఉండవని మోబిక్విక్ ప్రకటించేసింది. తాజా చర్యతో రిటైలర్లు, షాప్కీపర్లు, యూజర్లు వారి వారి దైనందిన సమస్యలను ఎదుర్కొనడానికి మొబైల్ వాలెట్లను ఉపయోగిస్తారని మోబిక్విక్ అంచనా వేస్తోంది. ‘కేంద్ర ప్రభుత్వపు సాహసోపేత నిర్ణయం దీర్ఘకాలంలో దేశంలో నల్లధన నియంత్రణకు, అవినీతి నిర్మూలనకు దోహదపడుతుంది. దీనికి మేం పూర్తి మద్దతునిస్తున్నాం. ఇక సామాన్య ప్రజలు దీని వల్ల కొంత కాలం సమస్యలను ఎదుర్కోక తప్పదు. అందుకే వీరి కోసం బ్యాంక్ ట్రాన్సఫర్స్పై ఎలాంటి ఫీజును తీసుకోవడం లేదు’ అని మోబిక్విక్ సహ వ్యవస్థాపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఒక మొబైల్ వాలెట్ నుంచి బ్యాంక్‌కు డబ్బు ట్రాన్సఫర్ చేస్తే నాన్-కేవైసీ యూజర్‌కి 4 శాతం, కేవైసీ యూజర్‌కు 1 శాతం ఫీజు ఉండేదని గుర్తు చేశారు. లావాదేవీలు జూమ్: నోట్ల రద్దు ప్రకటన రోజు నుంచి చూస్తే తమ లావాదేవీల్లో 18 రెట్ల వృద్ధి నమోదరుు్యందని మోబిక్విక్ తెలిపింది. ఇక తమ పేమెంట్ ట్రాన్సాక్షన్లు 50 లక్షలకు చేరాయని పేటీఎం పేర్కొంది. దేశంలోని ఇతర పేమెంట్ నెట్వర్క్ కన్నా ఇవి అధికమని తెలిపింది. వాలెట్లకు మనీని యాడ్ చేసుకోవడంలో 1,000 శాతం వృద్ధి, మొత్తం లావాదేవీల్లో 700 శాతం వృద్ధి నమోదరుు్యందని వివరించింది. యాప్ డౌన్‌లోడింగ్‌లో కూడా 300 శాతం వృద్ధి నమోదరుు్యందని పేర్కొంది. వారంలో ఒక వ్యక్తి చేసే లావాదేవీల సంఖ్య కూడా 3 నుంచి 18కి పెరిగిందని తెలిపింది. కాగా యూజర్లు వారి క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎం-వాలెట్లకు డబ్బును ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. 153 బిలియన్లకు మొబైల్ పేమెంట్స్: అసోచామ్ మొబైల్ పేమెంట్స్ చెల్లింపులు 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 90 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 153 బిలియన్లకు చేరుతాయని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా కార్యక్రమం వంటి అంశాలు వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తాయని తన నివేదికలో పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ పేమెంట్ చెల్లింపులు 3 బిలియన్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక మొబైల్ పేమెంట్స్ చెల్లింపుల విలువ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 150 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో రూ.2,000 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.8 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. -
ఇక మొబైల్ వాలెట్ల హవా
2020 నాటికి మొబైల్ వాలెట్ మార్కెట్ @ 6.6 బిలియన్ డాలర్లు స్మార్ట్ఫోన్లతో పేమెంట్ల విధానంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కొత్త తరహా పేమెంట్ వాలెట్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో వాటి వాడకం కూడా మెల్లగా పెరుగుతూ వస్తోంది. ప్రతి లావాదేవీకి నగదును వెంట తీసుకెళ్లే బదులు ఈ వాలెట్లు ఉపయోగిద్దాంలే... అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలే దీనికి నిదర్శనం. ఏసీఐ వరల్డ్‌వైడ్ సంస్థ ఇటీవల ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో డిజిటల్ పేమెంట్ విధానం వినియోగంపై విడుదల చేసిన నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్ వాలెట్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్యాపరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఇండియా మొబైల్ వాలెట్ మార్కెట్ భవిష్యత్ అంచనాలు, అవకాశాల నివేదిక ప్రకారం... 2020 నాటికల్లా భారత మొబైల్ వాలెట్ మార్కెట్ 6.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. పెరుగుదలకు కారణాలేంటంటే.. డిజిటల్ పేమెంట్ల విధానం ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం స్మార్ట్ఫోన్లే. భారత్‌లో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ద్వితీయ.. తృతీయ శ్రేణి నగరాల్లో నివసించే వారికి ఇంటర్నెట్ను పరిచయం చేసే సాధనాల్లో ఈ ఫోన్లే ముందుండటం వంటివి దీనికి కలిసొస్తున్నాయి. యువ జనాభాలో చాలా మంది మొబైల్ వాలెట్ల వినియోగంవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా తదితర కార్యక్రమాలతో వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ సానుకూల అంశాలతో మొబైల్ వాలెట్ కంపెనీలు డిజిటల్ చెల్లింపు విధానాల మెరుగుపై మరింత దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు పేటీఎం విషయాన్నే తీసుకుంటే.. మొబైల్ రీఛార్జి, కరెంటు బిల్లుల చెల్లింపులతో యూజర్లకు చేరువయ్యింది. తర్వాత వివిధ వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేటీఎం వెబ్సైట్ ద్వారా యూజర్లకు భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఒక పేటీఎం ఖాతా నుంచి మరో పేటీఎం ఖాతాలోకి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిమిషాల వ్యవధిలో నగదు బదిలీ చేయటానికి వెలుసుబాటు కల్పిస్తోంది. పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటు చేసే దిశగా పేటీఎంకు ఇప్పటికే ఆర్బీఐ లెసైన్సు కూడా ఇచ్చింది. షాపింగ్ నుంచి ట్యాక్సీ బుకింగ్ దాకా.. భారీ డిస్కౌంట్లు లభించే సమయంలో షాపింగ్ చేయాలనుకున్నా .. ట్యాక్సీని బుక్ చేసుకోవాలనుకున్నా లేదా హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకోవాలనుకున్నా.. డిజిటల్ వాలెట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం వీటిని ఎక్కువగా ఎలక్ట్రానిక్ లావాదేవీలకే ఉపయోగిస్తున్నా.. రాబోయే రోజుల్లో సాధారణ రిటైల్ స్టోర్స్‌లో కూడా ఈ వాలెట్ల ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది. మొబైల్ వాలెట్ సంస్థలు ఇప్పటికే ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. అదే జరిగితే ప్లాస్టిక్ మనీ (డెబిట్ కార్డులు మొదలైనవి) వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఎం-వాలెట్లకు నమోదు చేసుకోవడం చాలా సులభం. ఇక సాధారణ రిటైల్ స్టోర్స్‌లో ఈ తరహా చెల్లింపులతో రిస్కూ తక్కువే.. అలాగే చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. - నితిన్ మిశ్రా వైస్ ప్రెసిడెంట్, పేటీఎం