పేటీఎం టు చిల్లర్‌.. | The e-commerce revolution | Sakshi
Sakshi News home page

పేటీఎం టు చిల్లర్‌..

Published Thu, Feb 2 2017 4:52 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

The e-commerce revolution

ఈకామర్స్‌ విప్లవంతో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ మొబైల్‌ వ్యాలెట్ల వినియోగం మొదలైనప్పటికీ.. ఇటీవల పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వాటి వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో టాప్‌ టెన్  మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌లు ఇవీ...

పేటీఎం
2010లో ఆరంభించిన పేటీఎం సెమీక్లోజ్డ్‌ వ్యాలెట్‌ ద్వారా.. ఈకామర్స్‌ లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, నగదు బదిలీలతో పాటు.. ప్రయాణం, వినోదం, రిటైల్‌ పరిశ్రమలోనూ దీని సేవలను వినియోగించుకోవచ్చు. ఇటీవలే ప్రీమియం విద్యా సంస్థలతో కూడా.. ఫీజు చెల్లింపుల కోసం పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మొబిక్విక్‌
అగ్రస్థాయి స్వతంత్ర మొబైల్‌ చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటి మొబిక్విక్‌. ఈకామర్స్‌ వెబ్‌సైట్లు, టెల్కోలు, బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ స్టోర్లు, మొబైల్‌ కామర్స్‌ అప్లికేషన్లు, బిల్లర్లు తదితర రిటైలర్ల సమాచారం కూడా ఉంటుంది.

ఫ్రీచార్జ్‌
ఈ యాప్‌ ద్వారా డీటీహెచ్, ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్, వినియోగ బిల్లులు చెల్లించవచ్చు. ప్రముఖ ఆన్ లైన్, ఆఫ్‌ లైన్  వేదికల్లోనూ చెల్లింపులు జరపవచ్చు.

పేయుమనీ
నాస్పర్స్‌ గ్రూప్‌ సంస్థ పేయు ఇండియా. బుక్‌ మై షో, ట్రేడస్, గోఐబిబో, జొమాటో, స్నాప్‌ డీల్, ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్, జబాంగ్‌ తదితర నాలుగు వేలకు పైగా వాణిజ్య సంస్థలు, ఈకామర్స్‌ సంస్థలతో అనుసంధానం ఉంది.

స్టేట్‌బ్యాంక్‌ బడ్డీ
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభించిన మొబైల్‌ వ్యాలెట్‌ ఇది. దీనిద్వారా మీ నగదును ఇతర బ్యాంకు ఖాతాలకు సులువుగా బదిలీ చేయవచ్చు. బిల్లుల చెల్లింపులు, సినిమా, హోటల్, ప్రయాణాల బుకింగ్‌ చేయవచ్చు. 13 భాషలలో సేవలు అందిస్తుంది.

ఎం పెసా
వేగవంతమైన, సౌకర్యవంతమైన, భద్రతమైన మొబైల్‌ లావాదేవీల కోసం దీనిని ఉపయోగించవచ్చు. వొడాఫోన్‌ ఎం పెసా లిమిటెడ్‌ సంస్థ.. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి పనిచేస్తోంది.

ఆక్సిజెన్‌
ఆక్సిజెన్ సర్వీసెస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన మొబైల్‌ వ్యాలెట్‌. ఐఎంపీఎస్‌ పద్ధతిలో 50కి పైగా బ్యాంకులకు, ఆ బ్యాంకుల నుంచి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేయవచ్చు.

సిటీ మాస్టర్‌ పాస్‌
మాస్టర్‌ కార్డ్, సిటీ బ్యాంక్‌ ఇండియా కలిసి ప్రారంభించిన డిజిటల్‌ వ్యాలెట్‌ ఇది. దేశంలో తొలి అంతర్జాతీయ వ్యాలెట్‌. వినియోగదారుల షిప్పింగ్, క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్, లాయల్టీ కార్డులు, చెల్లింపుల సమాచారాన్ని ఒకే చోట స్టోర్‌ చేస్తుంది.

ఐసీఐసీఐ పాకెట్స్‌
ఏ బ్యాంకు ఖాతా నుంచైనా ఈ వ్యాలెట్‌లోకి నగదు పంపించవచ్చు. ఏ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ అప్లికేషన్ లో అయినా లావాదేవీలు నిర్వహించవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ చిల్లర్‌
దీనిని నగదు బదిలీ యాప్‌గా అభివర్ణించవచ్చు. నగదు బదిలీలు, చెల్లింపుల ప్రక్రియలను చాలా సులభం చేస్తుంది. దీని ద్వారా మిత్రుల స్మార్ట్‌ఫోన్లకు నగదు బదిలీ చేయవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement