కర్ణాటక: ఆర్‌బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించడంతో ప్రజలు తమ వద్దనున్న నోట్లను ఖర్చు చేయడం, లేదా బ్యాంకుల్లో మార్పిడి చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను ఇస్తుంటే కండక్టర్లు తీసుకోవడం లేదు.
దీంతో అనేకచోట్ల వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను తీసుకోవాలని ఆ కండక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. బస్సుల్లో ఈ నోట్లను తీసుకుంటారని ఆదివారం స్పష్టం చేశారు. 2 వేల నోట్లను తీసుకోరాదని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. హోసకోటేలో మాత్రమే ఇటువంటి తప్పుడు ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఆందోళన వద్దని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment