వాలెట్లకూ చార్జీలుంటాయ్!!
• దుకాణాల్లో లావాదేవీలకు రుసుముల బాధ లేదు...
• బ్యాంకులోంచి వాలెట్లోకి వేస్తే బ్యాంకు చార్జీలు
• వాలెట్లోంచి బ్యాంకు ఖాతాలోకి వేస్తే 1-4 శాతం ఫీజు
• అలాగని వాలెట్లోనే డబ్బులుంచితే పైసా వడ్డీ రాదు
• పెద్ద నోట్ల రద్దుతో ఊపందుకుంటున్న వాలెట్ లావాదేవీలు
డెబిట్, క్రెడిట్ కార్డులే కాదు. ఇపుడు మొబైల్ వాలెట్లూ జోరందుకున్నారుు. నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు చేశాక... వాలెట్ దిగ్గజం పేటీఎం ద్వారానే కేవలం ఆరు రోజుల్లో రూ.150 కోట్ల లావాదేవీలు నమోదయ్యారుు. దీన్నిబట్టే వాలెట్ల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.
అసలింతకీ వాలెట్ అంటే ఏంటి?
మొబైల్ వాలెట్ అంటే ఒక అప్లికేషన్. ఏ సంస్థ అందిస్తే ఆ సంస్థ తాలూకు యాప్ అన్నమాట. దీనిద్వారా ఎలాంటి చెల్లింపులైనా చేసుకోవచ్చు. అంటే మీరు మీ స్నేహితుడికి డబ్బులివ్వాలి అనుకోండి. తన మొబైల్‌లోని వాలెట్‌కి మీ మొబైల్ వాలెట్ నుంచి కేవలం ఫోన్ నెంబరుతో డబ్బు పంపించేయొచ్చన్న మాట. క్లోజ్డ్ వాలెట్స్‌తో ఏ చెల్లింపులైనా చేయగలం. అదే ఓపెన్ వాలెట్లరుుతే నగదు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. క్లోజ్డ్ వాలెట్ విభాగంలో పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఆక్సిజన్ వంటివి సేవలందిస్తుండగా... ఓపెన్ వాలెట్ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ పే జాప్, ఐసీఐసీఐ పాకెట్స్, ఎస్‌బీఐ బడ్డీ, ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటివి సేవలు అందిస్తున్నారుు. అరుుతే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఈ వాలెట్ల ద్వారా నెలకు రూ.లక్ష మేర మాత్రమే లావాదేవీలు జరిపే వీలుంటుంది.
చార్జీలు కూడా ఉంటాయండోయ్..
నిజానికిపుడు చాలా వాలెట్లకు విదేశాల నుంచి విపరీతమైన నిధులు పెట్టుబడుల రూపంలో వస్తున్నారుు. దీంతో అవి ప్రస్తుతం సాధ్యమైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారుు. అందుకని అవి లావాదేవీలపై క్యాష్‌బ్యాక్‌లంటూ విపరీతమైన ఆఫర్లు ఇస్తున్నారుు. ప్రస్తుతం చాలా లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు కూడా విధించటం లేదు. కాకపోతే ఈ వాలెట్లలోకి డబ్బులు వేసేటపుడు బ్యాంకులు ఎంతో కొంత ఛార్జీలు వసూలు చేస్తున్నారుు. ఎందుకంటే డబ్బులు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వాలెట్ వ్యవస్థలోకి పోతారుు కనక. అలాగే మనం వాలెట్ నుంచి మన బ్యాంకు ఖాతాలోకి నగదు వెనక్కి తీసుకున్నపుడు వాలెట్లు కూడా 1 నుంచి 3 శాతం వరకూ ఛార్జీలు వసూలు చేస్తున్నారుు.
ఎందుకంటే డబ్బు వాలెట్ వ్యవస్థ నుంచి బ్యాంకుల్లోకి పోతోంది కనక. కాకపోతే ప్రధాన మంత్రి మోదీ ప్రకటన కారణంగా డిసెంబరు 31 వరకూ తాత్కాలికంగా ఇవి ఛార్జీలు వసూలు చేయటం లేదు. ‘‘పేటీఎంకు పేమెంట్ బ్యాంకు లెసైన్సు వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మేం డిసెంబరు 31లోగానే బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెడతాం. అప్పుడు మా బ్యాంకు కస్టమర్లు కనక డబ్బులు బ్యాంకు ఖాతా నుంచి పేటీఎం వాలెట్‌లో వేసినా, పేటీఎం వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయం. మా బ్యాంకు ఖాతాదారులు కాని వారి విషయంలో మాత్రం ఛార్జీలు వసూలు చేస్తాం’’ అని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి ‘సాక్షి’ బిసినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పటం గమనార్హం.
పెద్ద వర్తకుల నుంచి వసూలు..
ఇపుడు చాలా దుకాణాలు వాలెట్లను అంగీకరిస్తున్నారుు. దీనిపై కిరణ్ మాట్లాడుతూ... ‘‘లావాదేవీలకు సంబంధించి మేం మా వాలెట్ కస్టమర్ల నుంచి గానీ, చిన్న చిన్న వర్తకుల నుంచి కానీ ఛార్జీలు వసూలు చేయటం లేదు. అయితే, పెద్ద పెద్ద వర్తకుల వద్ద మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాం’’ అని కిరణ్ తెలియజేశారు. నిజానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అమల్లోకి వచ్చాక బ్యాంకింగ్ లావాదేవీల చిత్రమే మారిపోరుుంది. బ్యాంకు నుంచి వాలెట్‌కు, వాలెట్ నుంచి వాలెట్‌కు కేవలం ఎస్సెమ్మెస్ పంపినంత ఈజీగా డబ్బులు బదలారుుంచటం వీలవుతోంది. వాలెట్లలో మరో ముఖ్యమైన విషయమేంటంటే వీటిలో మనం ఉంచే డబ్బుకు ఎలాంటి వడ్డీ రాదు. అందుకని వాలెట్లోని డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుందామనుకుంటే... ఛార్జీలబాధ తప్పదు. అదీ కథ.